కరెంట్ అఫైర్స్(2018, డిసెంబర్ 1 - 6) బిట్ బ్యాంక్
1. డిసెంబర్ 1 నుంచి 10 వరకు 19వ హార్నబిల్ ఫెస్టివల్-2018 (ఒక పక్షి పేరుతో చేసే ఉత్సవం)ను జరుపుకొన్న రాష్ట్రం ఏది?
1) మణిపూర్
2) నాగాలాండ్
3) మేఘాలయ
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
2. భారత మొట్టమొదటి అంతర్జాతీయ స్వదేశీ చలన చిత్రోత్సవాన్ని 2019 ఫిబ్రవరిలో ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?
1) అసోం
2) కర్ణాటక
3) తెలంగాణ
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
3. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకంలో భాగంగా సబ్సిడీతో కూడిన రుణాలు పొందిన లబ్ధిదారులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
4. భారత ప్రభుత్వం, ఎఫ్ఐసీసీఐ సయుక్తంగా రెండు రోజుల గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌ను 2019 జనవరి 15, 16వ తేదీల్లో ఏ నగరంలో నిర్వహించనున్నాయి?
1) కోల్‌కతా
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
5. ప్రత్యేకంగా మహిళల కోసం ‘112 ఇండియా’ మొబైల్ యాప్‌లో ‘షౌట్’ (SHOUT) అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
1) హరియాణా
2) కేరళ
3) మణిపూర్
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 4
6. భారత్‌లో డ్రోన్ ఆపరేటర్ల ఆన్లైన్ నమోదు కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించిన నూతన పోర్టల్ పేరేమిటి?
1) డ్రోన్ క్లౌడ్
2) డిజిటల్ స్కై
3) డిజిటల్ ఫ్లై
4) డ్రోన్ బుక్
- View Answer
- సమాధానం: 2
7. కోటా - సవాయ్ మధోపూర్ సెక్షన్లో టెస్ట్ రన్లో భాగంగా 180 కి.మీ./గం వేగాన్ని అధిగమించిన భారత తొలి ఇంజన్ రహిత రైలు పేరేమిటి?
1) ట్రైన్ 18
2) తేజాస్ 18
3) ట్రైన్ 98
4) ట్రైన్ ఎఫ్ఎక్స్
- View Answer
- సమాధానం: 1
8. ప్రజా రవాణాలో భాగంగా సులభ ప్రయాణానికి ‘వన్’ పేరుతో కామన్ మొబిలిటీ కార్డును ప్రవేశపెట్టిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
1) గుజరాత్
2) ఢిల్లీ
3) చండీగఢ్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 2
9. సెంట్రల్ బోర్డ ఆఫ్ ట్రస్టీస్, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ల 223వ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) ముంబై
3) కోల్‌కతా
4) ఇండోర్
- View Answer
- సమాధానం: 1
10. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలను ఆధునికీకరించడానికి 2019, 2020 ఆర్థిక సంవత్సరాలకుగానూ ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది?
1) రూ. 850 కోట్లు
2) రూ. 670 కోట్లు
3) రూ. 450 కోట్లు
4) రూ. 980 కోట్లు
- View Answer
- సమాధానం: 1
11. వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, పారదర్శకత కోసం PEETHA (పీపుల్స్ ఎంపవర్మెంట్ ఎనబ్లింగ్ ట్రాన్సపరెన్సీ అండ్ అకౌంటబిలిటీ) పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) గుజరాత్
3) అసోం
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
12. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ పాలసీ కమిషన్ ఎన్నో సమావేశాన్ని ముంబైలో 2018 డిసెంబర్ 3 నుంచి 5 వరకు నిర్వహించారు?
1) 80
2) 75
3) 69
4) 91
- View Answer
- సమాధానం: 1
13. నూతనంగా నియమించిన ‘నీతీ ఫోరం ఫర్ నార్త ఈస్ట్’ రెండో సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) గువాహటి, అసోం
2) ఇంపాల్, మణిపూర్
3) షిల్లాంగ్, మేఘాలయ
4) ఇటా నగర్, అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
14. స్వీడన్‌కు చెందిన స్పౌడీ (Spowdi), భారత్‌లోని ఎమ్వీ (EMVEE) అనే సంస్థలు ఏ నగరంలో యంత్ర పరికరాల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి?
1) బెంగళూరు
2) చెన్నై
3) ముంబై
4) కోల్‌కత
- View Answer
- సమాధానం: 1
15. ఢిల్లీ రాజధాని ప్రాంత పర్యాటకుల కోసం రాయితీని అందించడానికి ఢిల్లీలోని మేడం టుస్సాడ్స వ్యాక్స్ మ్యూజియంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మ్యూజియం ఏది?
1) ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియం
2) జాతీయ రైల్ మ్యూజియం
3) జాతీయ హస్తకళల మ్యూజియం
4) జాతీయ సైన్స్ మ్యూజియం
- View Answer
- సమాధానం: 2
16. 2018 డిసెంబర్ 3 నుంచి 14 వరకు పశ్చిమ బెంగాల్లో భారత వైమానిక దళం ఏ దేశ వాయుసేనతో కలిసి ‘కాప్ ఇండియా 2019’ పేరుతో సంయుక్త వైమానిక విన్యాసంలో పాల్గొంటోంది?
1) జపాన్
2) యూఎస్ఏ
3) రష్యా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 2
17. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగవంతంగా 200 వికెట్లు తీసి, 82 ఏళ్ల రికార్డు చెరిపేసిన క్రికెటర్ ఎవరు?
1) రోహిత్ శర్మ
2) యాసిర్ షా
3) రషీద్ ఖాన్
4) విల్ సోమర్‌విల్లీ
- View Answer
- సమాధానం: 2
18.భారత్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 1
2) డిసెంబర్ 3
3) డిసెంబర్ 5
4) డిసెంబర్ 7
- View Answer
- సమాధానం: 4
19. తెలుగు కవిత్వ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2018కు ఎంపికైన కవి ఎవరు?
1) సనంత తంతి
2) పరేశ్ నరేంద్ర కామత్
3) కొలకలూరి ఇనాక్
4) డాక్టర్ రమాకాంత్ శుక్లా
- View Answer
- సమాధానం: 3
20. జెనీవాలో విపో (డబ్ల్యూఐపీవో) రూపొందించిన ‘వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండికేటర్స్-2018’ నివేదిక ప్రకారం భారత్ మంజూరు చేసే పేటేంట్ల సంఖ్య 2017లో ఎంత శాతం పెరిగింది?
1) 50%
2) 25%
3) 40%
4) 30%
- View Answer
- సమాధానం: 1
21. ఫ్రెంచ్ గయానోలోని స్పేస్పోర్ట నుంచి విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు చెందిన అత్యంత బరువైన, అధునాతన కమ్యూనికేషన శాటిలైట్ పేరేమిటి?
1) జీ శాట్ 11
2) జీ శాట్ 29
3) జీ శాట్ 14
4) జీ శాట్ 40
- View Answer
- సమాధానం: 1
22. జైపూర్‌లో నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసం వజ్ర ప్రహర్-2018లో భాగంగా భారత్ ఏ దేశంతో కలిసి ‘వజ్ర కాయ’ పేరుతో మూడు రోజుల యుద్ధ వ్యూహ విన్యాసంలో పాల్గొంది?
1) అమెరికా
2) బంగ్లాదేశ్
3) ఫ్రాన్స్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
23. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) ఎగుమతిపై దృష్టి కేంద్రీకరించడం కోసం పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ నుంచి 2019 జనవరిలో వైదొలగనున్నట్లు ప్రకటించిన దేశం ఏది?
1) సౌదీ అరేబియా
2) యూఎస్ఏ
3) ఇరాక్
4) ఖతార్
- View Answer
- సమాధానం: 4
24. భారత్, సుడాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్ 8వ సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించారు?
1) ముంబై
2) కోల్‌కతా
3) న్యూఢిల్లీ
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
25.ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ‘షిన్యూ మైత్రి -18’ పేరుతో ప్రారంభించిన మొట్టమొదటి 5 రోజుల ద్వైపాక్షిక వాయు విన్యాసంలో భారత్ ఏ దేశంతో కలిసి పాల్గొంది?
1) చైనా
2) మలేషియా
3) సింగపూర్
4) జపాన్
- View Answer
- సమాధానం: 4
26. 2022లో జీ-20 దేశాల 17వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనుంది?
1) ఖతార్
2) జపాన్
3) సౌదీ అరేబియా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
27. 2019లో బ్రిక్స్ దేశాల 11వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనుంది?
1) దక్షిణాఫ్రికా
2) బ్రెజిల్
3) భారత్
4) చైనా
- View Answer
- సమాధానం: 2
28. అర్టాన్ కేపిటల్ విడుదల చేసిన గ్లోబల్ పాస్పోర్ట పవర్ ర్యాంక్ - 2018 ప్రకారం ప్రపంచంలో ఏ దేశ పాస్పోర్ట అత్యంత శక్తిమంతమైంది?
1) యూఎస్ఏ
2) సింగపూర్
3) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
4) యునెటైడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 3
29. నికర స్థిర నిధుల నిష్పత్తి నియమాలను (నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో) ఏ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది?
1) 2020 ఏప్రిల్ 1
2) 2020 జూలై 1
3) 2020 ఫిబ్రవరి 1
4) 2020 జూన్ 1
- View Answer
- సమాధానం: 1
30. కేంద్ర గణాంక సంస్థ నివేదిక ప్రకారం 2018 -19 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో భారత ఆర్థిక వృద్ధి ఎంత శాతం?
1) 7.6 %
2) 7.4 %
3) 7.1%
4) 7.0 %
- View Answer
- సమాధానం: 3
31. ఆస్ట్రేలియాలోని బ్రాడ్‌మన్ మ్యూజియంలో ఏ భారత క్రికెటర్ సంతకం చేసిన జెర్సీని సచిన్ టెండూల్కర్ చిత్రం పక్కన ఉంచారు?
1) మహేంద్ర సింగ్ ధోని
2) విరాట్ కొహ్లీ
3) రోహిత్ శర్మ
4) శిఖర్ ధావన్
- View Answer
- సమాధానం: 2
32.మూడీస్ అంచనాల ప్రకారం 2019 మార్చి నాటికి భారత వాస్తవ జీడీపీ వృద్ధి ఎంత శాతంగా నమోదు కానుంది?
1) 7.2 %
2) 7.3 %
3) 7.5 %
4) 7.6 %
- View Answer
- సమాధానం: 1
33.భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన 5వ ద్వైమాసిక మానిటరీ పాలసీ ప్రకారం రెపో రేటు ఎంత?
1) 6%
2) 6.25%
3) 6.50%
4) 5.75%
- View Answer
- సమాధానం: 3
34. భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన 5వ ద్వైమాసిక మానిటరీ పాలసీ ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ ఎంత శాతానికి తగ్గింది?
1) 7.1 %
2) 7.4 %
3) 7.4 %
4) 7.2 %
- View Answer
- సమాధానం: 1
35. భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన 5వ ద్వైమాసిక మానిటరీ పాలసీ ప్రకారం 2018 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఎంత శాతానికి తగ్గింది?
1) 3.8 %
2) 4.5 %
3) 5.2 %
4) 2.75 %
- View Answer
- సమాధానం: 2
36. భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన 5వ ద్వైమాసిక మానిటరీ పాలసీ.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని ఎంత శాతంగా అంచనా వేసింది?
1) 7.6 %
2) 7.9 %
3) 7.4 %
4) 7.7 %
- View Answer
- సమాధానం: 3
37. యునెటైడ్ కింగ్డమ్కు చెందిన కేంబ్రిడ్‌జ డిక్షనరీ ప్రకారం ‘పీపుల్స్ వర్డ ఆఫ్ ది ఇయర్-2018’గా ఎంపికైన పదం ఏది?
1) జెండర్ పే
2) ఎకోసైడ్
3) నో-ప్లాట్‌ఫామింగ్
4) నోమోఫోబియా
- View Answer
- సమాధానం: 4
38. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ 18 దేశాలకు చెందిన 63 కృత్రిమ ఉపగ్రహాలతోపాటు భారత్‌లో తొలిసారి ప్రైవేట్‌గా రూపొందించిన శాటిలైట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. దాని పేరేమిటి?
1) ఎక్సీడ్ శాట్ 1
2) కలామ్ శాట్ 1
3) ఎక్స్‌ప్లోరర్ 2
4) రెయిన్ శాట్ 3
- View Answer
- సమాధానం: 1
39. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కొత్త పేరు ఏమిటి?
1) ఢిల్లీ పేట్రియాట్స్
2) ఢిల్లీ కేపిటల్స్
3) ఢిల్లీ రెబల్స్
4) ఢిల్లీ వారియర్స్
- View Answer
- సమాధానం: 2
40. జార్జియా తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వారెవరు?
1) సలోమీ జురాబిష్విలి
2) లెనైట్టీ బ్రెయిన్
3) సుసానే మేయర్
4) రుఫీనా థామస్
- View Answer
- సమాధానం: 1
41.2018 డిసెంబర్ 1న మెక్సికో నూతన అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన వారెవరు?
1) నికోలస్ ఆండ్రూస్
2) ఆండ్రూస్ మాన్యుయెల్ లోపేజ్ ఒబ్రేడర్
3) రెక్స్ వాన్ డీ క్యాంప్
4) ఆండ్రూ వైల్డ్రెడ్ మాథ్యూ
- View Answer
- సమాధానం: 2
42. మూడేళ్ల కాలానికి గానూ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీలో టెక్నికల్ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టిన వారెవరు?
1) సంతోష్ యాదవ్
2) హరీశ్ కుమార్
3) సందీప్ జైన్
4) రవీంద్ర కుమార్ వర్మ
- View Answer
- సమాధానం: 4
43. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరిని నియమించింది?
1) సుమిత్ సెహగల్
2) హస్ముక్ అధియా
3) అజయ్ నారాయణ్ ఝా
4) రాజీవ్ కపూర్
- View Answer
- సమాధానం: 3
44. దక్షిణాఫ్రికాలోని నేషనల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్‌కు నేషనల్ డైరక్టర్ (ఎన్డీపీపీ)గా నియమితురాలైన మొట్టమొదటి భారత సంతతి మహిళా న్యాయవాది ఎవరు?
1) ఊర్మిళా సింగ్
2) రూహి వాడియా
3) షామిలా బతోహి
4) అనితా గుప్త
- View Answer
- సమాధానం: 3
45. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో 2018 బలోన్ డి ఓర్ అవార్డు అందుకున్న ఫుట్‌బాల్ క్రీడాకారుడు?
1) క్రిస్టియానో రొనాల్డో
2) లూకా మోడ్రిక్
3) నేమర్
4) ఆంటొనీ గ్రీజ్మన్
- View Answer
- సమాధానం: 2