కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి (22 - 28) బిట్ బ్యాంక్
1. తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఎన్ని అంతస్తులతో నిర్మించనున్నారు ?
1) ఏడు అంతస్తులు
2) పది అంతస్తులు
3) 31 అంతస్తులు
4) 69 అంతస్తులు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను శాశ్వతంగా గుర్తుచేసుకునేందుకు ప్రమిద ఆకారంలో ఏడు అంతస్తులతో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన నమూనా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతకం చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద ఈ స్తూపాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు.
- సమాధానం: 1
2. కార్ల కంపెనీ కియో.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది ?
1) కృష్ణా
2) అనంతపురం
3) కర్నూలు
4) చిత్తూరు
- View Answer
- సమాధానం: 2
వివరణ: అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఏర్పాటు చేస్తోన్న కియో మోటార్స్ ఫ్రేమ్ వర్క్ ఇన్స్టలేషన్ విభాగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తోన్న కియో ప్లాంట్ భారత్‌లో 15వది.
- సమాధానం: 2
3. ఇటీవల ఏ రాష్ట్రం మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం ‘‘అమ్మ టూవీలర్’’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) తమిళనాడు
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం ‘అమ్మ టూవీలర్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెన్నైలో ప్రారంభించారు. దీని ప్రకారం.. స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగినికి మొత్తం వ్యయంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.
- సమాధానం: 3
4. సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు-2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) హైదరాబాద్
2) చెన్నై
3) ముంబై
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో వరుసగా మూడవ ఏడాది సీఐఐ భాగస్వామ్య సదస్సు ఫిబ్రవరి 24 - 26 వరకు జరిగింది. ముగింపు సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది భాగస్వామ్య సదస్సులో 4,253 మంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా రూ. 4.39 లక్షల కోట్ల విలువైన 734 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు.
- సమాధానం: 4
5. భారతీయ సినీ పితామహుడిగా గుర్తింపు పొందిన బి.నాగిరెడ్డి 105వ వర్ధంతిని పురస్కరించుకొని ఇటీవల ఆయన పేరిట తపాలా బిళ్లను ఎవరు ఆవిష్కరించారు ?
1) చంద్రబాబు నాయుడు
2) కే చంద్రశేఖర్ రావు
3) వెంకయ్య నాయుడు
4) ఈఎస్ఎల్ నరసింహన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారతీయ సినీ పితామహుడు, దివంగత సినీ దర్శక, నిర్మాత.. వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు చెన్నైలో ఆవిష్కరించారు. నాగిరెడ్డి 105వ వర్ధంతి (ఫిబ్రవరి 25) పురస్కరించుకుని ఐదు రూపాయల విలువతో కూడిన తపాలా బిళ్లను ఆవిష్కరించారు. అనంతరం.. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ ‘బి.నాగిరెడ్డి ది లెజెండ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
- సమాధానం: 3
6. ఈ - గవర్నెన్స్ జాతీయ సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) విశాఖపట్నం
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) పూణె
- View Answer
- సమాధానం: 2
వివరణ: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఫిబ్రవరి 26న ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు జరిగింది. సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 180 రకాల పౌర సేవలను మొబైల్ ద్వారా అందించేందుకు ‘టీ యాప్ ఫోలియో’ పేరుతో త్వరలో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇది మీ-సేవ ప్రాజెక్టుకు 2.0 (ఆధునిక వెర్షన్) అని చెప్పారు.
- సమాధానం: 2
7. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న రక్షణ కారిడార్లలో ఒకటి చెన్నై- బెంగళూరులో ఏర్పాటు కానుండగా.. రెండోది ఎక్కడ ఏర్పాటు కానుంది ?
1) బుందేల్ ఖండ్, యూపీ
2) అహ్మదాబాద్, గుజరాత్
3) భోపాల్, మధ్యప్రదేశ్
4) కోల్ కత్తా, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం:1
వివరణ: దేశంలో రెండు రక్షణ ఉత్పత్తుల కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు 2018-19 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో ఒకటి చెన్నై- బెంగళూరు మధ్య ఏర్పాటు చేయనున్నారు. రెండో రక్షణ కారిడార్‌ను ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటు చేయనున్నట్ల్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. లఖ్‌నవ్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ ప్రకటన చేశారు.
- సమాధానం:1
8. ఇటీవల ఏ సంస్థ తెలుగులో ఈ- మెయిల్ అడ్రస్‌లను అందుబాటులోకి తెచ్చింది ?
1) మైక్రోసాఫ్ట్
2) గూగుల్
3) యాహూ
4) హాట్ మెయిల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ.. తెలుగులోను ఈ-మెయిల్ అడ్రస్‌లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మణిపురి, నేపాలీ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్‌లను అందుబాటులోకి తెచ్చింది.
- సమాధానం: 1
9. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈ-నామ్ వెబ్‌సైట్‌ను ఇటీవల అదనంగా ఎన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు ?
1) పది భాషలు
2) నాలుగు భాషలు
3) ఆరు భాషలు
4) పదిహేను భాషలు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈ - నామ్(ఎలక్టాన్రిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) వెబ్‌సైట్‌ను తెలుగుతో పాటు గుజరాతీ, మరాఠీ, తమిళ్, బెంగాలీ, ఒడియా వంటి ఆరు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ఫిబ్రవరి 21న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశంలో 479 మార్కెట్లు ఈ-నామ్ పరిధిలో ఉన్నాయి.
- సమాధానం: 3
10. 2017-18 సంవత్సరానికి ఈపీఎఫ్‌వో వడ్డీ రేటుని ఎంత శాతానికి తగ్గించింది ?
1) 8.55 శాతం
2) 8 శాతం
3) 7 శాతం
4) 6 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేటుని 2017-18 సంవత్సరానికి ఈపీఎఫ్‌వో 8.55 శాతానికి తగ్గించింది. వడ్డీ రేటుని తగ్గించడం వరుసగా ఇది మూడోసారి. 2015-16లో ఈ వడ్డీ రేటుని 8.80 శాతం, 2016-17లో 8.65 శాతంగా ఉంది.
- సమాధానం: 1
11. టెలికమ్ ఎక్విప్మెంట్ల తయారీ సంస్థ హువే.. ఇటీవల ఏ సంస్థతో కలిసి భారత్‌లో తొలిసారి 5జీ నెట్వర్క్ని పరీక్షించింది ?
1) వొడాఫోన్
2) బీఎస్ఎన్ఎల్
3) ఎయిర్టెల్
4) రిలయెన్స్ జియో
- View Answer
- సమాధానం: 3
వివరణ: టెలికం సంస్థ ఎయిర్టెల్, ఎక్విప్మెంట్ల తయారీ సంస్థ హువేలు.. దేశంలోనే తొలిసారిగా 5జీ నెట్‌వర్క్‌ను ఇటీవల పరీక్షించాయి. ఇందులో భాగంగా సెకనుకు గిగా బిట్లకు పైగా వేగం నమోదైంది. ఈ ట్రయల్‌ను మనేసర్‌లోని ఎయిర్టెల్ నెట్వర్క్ ఎక్స్పీరీయెన్స్ సెంటర్లో నిర్వహించారు.
- సమాధానం: 3
12. ఎన్ని ఏళ్లు దాటిన మహిళలందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ?
1) 30 ఏళ్లు
2) 40 ఏళ్లు
3) 50 ఏళ్లు
4) 60 ఏళ్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో 30 ఏళ్లు దాటిన మహిళలందిరకీ కేన్సర్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 22న ఢిల్లీలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని 8 ప్రాంతీయ కేన్సర్ కేంద్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది.
- సమాధానం: 1
13. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు ఏ రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోనే మొదటిసారిగా హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం, చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టులో ఒక ఇంజిన్‌తో పాటు రెండు భోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 65 మంది ప్రయాణించే సదుపాయం ఉంటుంది.
- సమాధానం: 2
14. ఇటీవల ఏ దేశ ప్రభుత్వం 21 ఏళ్లు వయసు దాటిన తమ పౌరులకు మిగులు బడ్జెట్ నుంచి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది ?
1) సింగపూర్
2) జపాన్
3) అమెరికా
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 1
వివరణ: సింగపూర్ ప్రభుత్వం 21 ఏళ్లు దాటిన ఆ దేశ ప్రజలకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2017లో 7.60 బిలియన్ డాలర్ల మిగులు బడ్జెట్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఒక్కొక్కరి ఖాతాలో 300 సింగపూర్ డాలర్లు(దాదాపు రూ.14 వేలు) జమ చేయనున్నారు.
- సమాధానం: 1
15. దేశంలోని ఏ రెండు నగరాల మధ్య 2021 నాటికి హైపర్‌లూప్ రైలు అందుబాటులోకి రానుంది ?
1) హైదరాబాద్ - విజయవాడ
2) చెన్నై - బెంగళూరు
3) ముంబై - పూణె
4) ఢిల్లీ - నోయిడా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ముంబై - పూణె మధ్య హైపర్‌లూప్ రైలు నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం.. అమెరికాకు చెందిన వర్జిన్ హైపర్‌లూప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం దాదాపు రూ.20 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. 2021 నాటికి ఈ ప్రాజెక్టుని అందుబాటులోకి తేనున్నారు.
- సమాధానం: 3
16. తెలంగాణలోని ఏ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఫైబర్‌గ్రిడ్ ఇంటర్నెట్ సేవలను ఇటీవల ప్రారంభించారు ?
1) వరంగల్
2) రంగారెడ్డి
3) ఆదిలాబాద్
4) నల్గొండ
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఫైబర్‌గ్రిడ్ ఇంటర్నెట్ సేవలను కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పాల్గొన్నారు.
- సమాధానం: 2
17. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఇటీవల ప్రకటించిన వార్షిక అవార్డుల్లో ఉమెన్స బ్యాటింగ్ పర్ఫామెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు ?
1) మిథాలీ రాజ్
2) హర్మన్ ప్రీత్ కౌర్
3) వేదా కృష్ణమూర్తి
4) స్మృతి మంధన
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఇటీవల ప్రకటించిన వార్షిక అవార్డుల్లో మొత్తం పదింటిలో మూడు అవార్డులని భారత ప్లేయర్లు దక్కించుకున్నారు. భారత మహిళల క్రికెట్ ప్లేయర్ హర్మన్ ప్రీత్‌కౌర్ ఉమెన్స బ్యాటింగ్ పర్ఫామెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికైంది. పురుషుల విభాగంలో కుల్దీప్ యాదవ్ డెప్యూటెంట్ ఆఫ్ ది ఇయర్, యజ్వేంద్ర చాహల్ టీ20 బౌలింగ్ పర్ఫామెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్దుకి ఎంపికయ్యారు.
- సమాధానం: 2
18. గ్రామ పంచాయతీలు, మారుమూల గ్రామాల్లో వై-ఫై సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) మైక్రోసాఫ్ట్
2) హాత్ వే
3) గూగుల్
4) యాక్ట్ ఫైబర్ నెట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: వై-ఫై సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ స్టేషన్ పేరుతో ఈ ప్రాజెక్టు కింద గ్రామ పంచాయతీలతో పాటు మారుమూల గ్రామాలకు సైతం వై-ఫై సౌకర్యం కల్పిస్తారు.
- సమాధానం: 3
19. పట్టణ ప్రాంతాల్లో నివసింతే పేదలందరికీ 2022 నాటికి పక్కా ఇళ్లు నిర్మించేందుకు జాతీయ పట్టణ గృహ నిధికి కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది ?
1) రూ.50,000 కోట్లు
2) రూ.60,000 కోట్లు
3) రూ.80,000 కోట్లు
4) రూ.లక్ష కోట్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: రూ.60 వేల కోట్లతో జాతీయ పట్టణ గృహ నిధి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రధాన మంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద పేదలందరికీ 2022 నాటికి పక్కా ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం.
- సమాధానం: 2
20. భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అణ్వాయుధ క్షిపణి ధనుష్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు ?
1) గగనతలం నుంచి గగనతలం
2) ఉపరితలం నుంచి ఉపరితలం
3) గగనతం నుంచి ఉపరితలం
4) ఉపరితలం నుంచి గగనతలం
- View Answer
- సమాధానం: 2
వివరణ: అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్‌ను భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని భారత నావికా దళానికి చెందిన ఓ నౌక ద్వారా ధనుష్‌ను పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించగలదు. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణిని నావికా దళ అవసరాల కోసం అభివృద్ధి పరిచి.. ధనుష్ క్షిపణిగా రూపొందించారు.
- సమాధానం: 2
21. భారత్ ఇటీవల ఏ దేశంతో కలిసి లామిత్యే పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించింది ?
1) సింగపూర్
2) సేచెల్లెస్
3) కజఖస్తాన్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్ - సేచెల్లెస్ మధ్య లామిత్యే పేరుతో 8వ సంయుక్త సైనిక్య విన్యాసాలు సేచెల్లెస్లో జరిగాయి. లామిత్యే అంటే స్నేహం అని అర్థం.
- సమాధానం: 2
22. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డుని ఏ రంగులో జారీ చేయనున్నట్లు యూఐడీఏఐ ఇటీవల వెల్లడించింది ?
1) గులాబి
2) నీలం
3) ఎరుపు
4) పసుపు
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూఐడీఏఐ ఇటీవల ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం నీలి రంగులో బాల్ ఆధార్ కార్డుని ప్రవేశపెట్టింది. ఐదేళ్ల లోపు చిన్నారులు ఆధార్ నమోదు సమయంలో బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఐదేళ్లు దాటిన తర్వాత వేలి ముద్రలను ఇవ్వొచ్చని తెలిపింది.
- సమాధానం: 2
23. ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ - 2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) కోచి
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ
4) బెంగళూరు
Theme : New Economy -New Rules
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూఢిల్లీలో నిర్వహించిన ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2018ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
- సమాధానం: 3
24. రాజ్యసభ టీవీ ఛానల్ ఎడిటర్ ఇన్‌చీఫ్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) స్వప్న దాస్ గుప్తా
2) గుర్దీప్ సింగ్ సప్పాల్
3) సూర్య ప్రకాశ్
4) రాహుల్ మహాజన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సీనియర్ పాత్రికేయులు రాహుల్ మహాజన్.. రాజ్యసభ టీవీ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఇటీవల నియమితులయ్యారు.
- సమాధానం: 4
25. కింది వారిలో ఎవరు.. నీరవ్ మోదీ వజ్రా సంస్థ ఫైర్‌స్టార్ బ్రాండ్‌తో ఉన్న బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేసుకున్నారు ?
1) ప్రియాంకా చోప్రా
2) ఐశ్వర్యా రాయ్
3) అనుష్క శర్మ
4) శిల్పా శెట్టి
- View Answer
- సమాధానం: 1
వివరణ: నీరవ్ మోదీ వజ్రాల సంస్థ ఫైర్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవల ఆ కంపెనీతో తన కాంట్రాక్టును వదులుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోదీ సంస్థ సుమారు 1200 కోట్లు ఎగ్గొట్టింది. అలాగే నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంకా ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 1
26. ప్రముఖ నటి శ్రీదేవి.. సినిమా రంగానికి అందించిన సేవలకు గాను కింది వాటిలో ఏ అవార్డుని అందుకున్నారు ?
1) పద్మ భూషణ్
2) భారత రత్న
3) పద్మ శ్రీ
4) పద్మ విభూషణ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐదు దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన శ్రీదేవి ఇటీవల కన్నుమూశారు. ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు మృతి చెందారు. తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి అసలు పేరు అమ్మయంగార్ అయ్యప్పన్. నాలుగేళ్ల వయసులోనే 1967లో ‘కందన్ కరుణై’ చిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. 11వ ఏటనే మలయాళంలో హీరోయిన్గా నటించినా 13వ ఏట తెలుగులో ‘అనురాగాలు’ (1976), 14వ ఏట ‘మా బంగారక్క’ (1977) సినిమాలతో తెలుగు హీరోయిన్గా మారారు. ‘పదహారేళ్ల వయసు’ (1978) ఘన విజయంతో ఆమె దశ తిరిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇటు దక్షిణాదిని, అటు ఉత్తరాదిని ఏలారు.
- సమాధానం: 3
27. ఆస్టియ్రాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాలెంజ్ -2018 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) ఛేతన్ ఆనంద్
2) హెచ్ ఎస్ ప్రణయ్
3) పారుపల్లి కశ్యప్
4) అజయ్ జయరామ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆస్టియ్రాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాలెంజ్ - 2018 పురుషుల సింగిల్స్ ఫైనల్లో మలేషియాకు చెందిన జూన్ వే చేమ్ను ఓడించి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 3
28. ఎనర్జీ ఎఫీషియెంట్ భవనాల నిర్మాణం కోసం ఇటీవల ఏ రాష్ట్రం ద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషీఝెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) హర్యానా
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA) ఇటీవల ది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ECBC) -2017 ప్రకారం రాజధాని ప్రాంతంలో ఎనర్జీ ఎఫీషియెన్సీ భవనాల నిర్మాణం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 1
29. 2018-19లో వ్యవసాయానికి బ్యాంకుల ద్వారా ఎన్ని కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) రూ.5 లక్షల కోట్లు
2) రూ. 11 లక్షల కోట్లు
3) రూ. లక్ష కోట్లు
4) రూ. 8 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2018-19 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి బ్యాంకుల ద్వారా రూ.11 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని అందుకుంటామని ఆయన తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.
- సమాధానం: 2
30. 2018 స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) అభిషేక్ ఝెలెగర్
2) గురుసాయి దత్
3) సమీర్ వర్మా
4) అనురా ప్రభుదేశాయ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - 2018 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీర్ వర్మా గెలుచుకున్నాడు. ఫైనల్లో జాన్ ఓ జార్గెన్న్స్ను ఓడించి వర్మా టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 3
31. అంతర్జాతీయ క్రికెట్ లో అతి చిన్న వయసులో కెప్టెన్ గా ఎంపికై న రషీద్ ఖాన్.. ఏ దేశ జట్టు ఆటగాడు ?
1) ఆఫ్గనిస్తాన్
2) శ్రీలంక
3) బంగ్లాదేశ్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రెగ్యులర్ కెప్టెన్ అస్గర్ స్టనిక్జయ్ అనారోగ్యం పాలవడంతో స్కాట్లాండ్తో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో రషీద్ ఖాన్ అఫ్గనిస్తాన్ జట్టుకి నాయకత్వం వహించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో ఎన్నికై న కెప్టెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. రషీద్ 19 ఏళ్ల 165 రోజుల వయసులో ఆఫ్గన్‌కు నాయకత్వం వహించాడు. గతంలో ఈ రికార్డు బంగ్లాదేశ్ ఆటగాడు రజిన్ సలేహ్ పేరిట ఉంది.
- సమాధానం: 1
32. ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స యూనిట్ ఇటీవల విడుదల చేసిన ఇన్ క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్‌లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?
1) 25
2) 39
3) 47
4) 54
- View Answer
- సమాధానం: 3
వివరణ: ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్.. 86 దేశాలతో ది ఇన్ క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్‌ను రూపొందించింది. ఇందులో భారత్ 47వ స్థానంలో నిలిచింది. స్వీడన్, సింగపూర్, అమెరికా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
- సమాధానం: 3
33. ఇటీవల భారత్‌లో పర్యటించిన జోర్డాన్ రాజు ఎవరు ?
1) హని అల్ ముల్కి
2) అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్
3) అబ్దుల్లా అల్లాహ్ రాజ్
4) ఉమయ్యా టౌకాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇటీవల మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు సహా 12 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు చేశాయి.
- సమాధానం: 2
34. ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏ దేశంతో టెక్నాలజీ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది ?
1) శ్రీలంక
2) తైవాన్
3) జపాన్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సదస్సులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తైవాన్‌తో టెక్నాలజీ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం, వినియోగంపై పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం జరిగింది.
- సమాధానం: 2
35. సార్క్ బిజినెస్ లీడర్స్ 2018 సమావేశంలో ఏ దేశంలో జరగనుంది ?
1) నేపాల్
2) మయన్మార్
3) భారత్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 సార్క్ బిజినెస్ లీడర్స్ కాన్ క్లేవ్ నేపాల్ రాజధాని కాఠ్మాండులో మార్చి 16 - 18 వరకు జరగనుంది. సార్క్ ప్రాంతంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్ షిప్ లను ప్రోత్సహించడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
36. ప్రపంచ జిమ్నాస్టిక్స్ పోటీల్లో భారత తరపున ఇటీవల తొలి పతకం గెలుచుకున్న అరుణా బుద్ధారెడ్డి భారత్ లోని ఏ నగరానికి చెందిన వారు ?
1) విశాఖపట్నం
2) కర్నూలు
3) హైదరాబాద్
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
వివరణ: హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జిమ్నాస్ట్ అరుణా బుద్ధారెడ్డి మెల్బోర్న్లో జరిగిన 2018 ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఫైనల్ పోటీ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం కై వసం చేసుకుంది. తద్వారా ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 3
37. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) ఉపాధ్యక్ష పదవికి ఇటీవల ఏ దేశం ఎన్నికై ంది ?
1) భారత్
2) చైనా
3) జపాన్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) ఉపాధ్యక్ష పదవికి ఇటీవల చైనా ఎంపికైంది. పారిస్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు ఎన్నికైంది.మనీ లాండరింగ్ నిరోధకం, తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా అడ్డుకోవడంలో విఫలమైనందుకు గాను పాకిస్తాను ఈ సంస్థ గ్రే లిస్ట్‌లో చేర్చింది. 2018 జూన్ వరకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఆ లోగా ఈ అంశాల్లో చేపట్టిన చర్యలు వివరించాల్సిందిగా సూచించింది. ఎఫ్ఏటీఎప్ను 1989లో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 2
38. ప్రతిష్టాత్మక అరవిందన్ పురస్కారం - 2017కు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
1) సంజు సురేంద్రన్
2) పీఎస్ మను
3) సాగర్ ఛాయ వంచార్
4) అతను ఘోష్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మరాఠీ సినిమా రెడుకు గాను ఉత్తమ అరంగేట్రం దర్శకుడిగా సాగర్ ఛాయ వంచార్ ప్రతిష్టాత్మక అరవిందన్ పురస్కారం - 2017కు ఎంపికయ్యారు. అవార్డు కింద ఆయన రూ.25 వేల నగదు పురస్కారం అందుకుంటారు. ఛలచిత్ర ఫిల్మ్ సొసైటీ ఈ అవార్డుని ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3
39. జాతీయ సైన్స్ దినోత్సవం - 2018 ఇతివృత్తం ఏంటి ?
1) సైన్స్ ఫర్ నేషనల్ బిల్డింగ్
2) సైంటిఫిక్ ఇష్యూస్ ఫర్ డెవపల్‌మెంట్ ఆఫ్ ది నేషన్
3) సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టెనెయిబుల్ ఫ్యూచర్
4) సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సీవీ రామన్.. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజుని(1928, ఫిబ్రవరి 28) పురస్కరించుకొని ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 3
40. విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీ - 2018ని ఇటీవల ఏ రాష్ట్రం జట్టు గెలుచుకుంది ?
1) సౌరాష్ట్ర
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీ - 2018ని కర్ణాటక గెలుచుకుంది. ఢిల్లీలోని ఫిరాజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించి కప్‌ను సొంతం చేసుకుంది.
- సమాధానం: 2
41. ఇటీవల ఏ నగరం డ్రైవర్ రహిత కార్లను నగర రోడ్లపై పరీక్షించేందుకు అనుమతి ఇచ్చింది ?
1) లండన్
2) కాలిఫోర్నియా
3) న్యూఢిల్లీ
4) బీజింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాలోని కాలిఫోర్నియా నగరం డ్రైవర్ రహిత కార్లను తొలిసారి పూర్తిగా వాహనంలో ఎవరూ లేకుండానే పరీక్షించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి వాహన నియమావళిని కూడా సవరించింది. ప్రస్తుతం డ్రైవర్ రహిత కార్లను రోడ్లపైకి తెచ్చేందుకు టెల్సా, వైమో సంస్థలు పోటీ పడుతున్నారుు.
- సమాధానం: 2
42. కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక మహిళా పోలీసులు ఉన్నారు ?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో పోలీసు శాఖలో మహిళా సిబ్బందిపై కేంద్ర హోం శాఖ ఇటీవల నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా పోలీసు విభాగాల్లో మహిళలు కేవలం 7.28 శాతమే ఉన్నారు. ఇక దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులతో తమిళనాడు పోలీసు శాఖ తొలి స్థానంలో నిలిచింది. ఈ అంశంలో తెలంగాణ పోలీసు విభాగం చివరి స్థానంలో ఉంది. పోలీస్ విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2009, 2012, 2016ల్లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
- సమాధానం: 1
43. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం ఫ్యూనికల్ ట్రాలీ(ట్రామ్ తరహా ట్రాలీ)ని ఇటీవల అందుబాటులోకి తెచ్చింది ?
1) ఉత్తరాఖండ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) మహారాష్ట్ర
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్విట్జర్లాండ్, రష్యాలోని ఎత్తయిన కొండ ప్రాంతాల్లో మాత్రమే ఉండే తాళ్లతో లాగే (ట్రామ్ తరహా) ఫ్యునికులర్ ట్రాలీ సేవలను దేశంలోనే తొలిసారిగా మహరాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. పశ్చిమ కనుమల్లో 1,400 మీటర్ల ఎత్తులో కొలువైన సప్తశృంగి దేవిని దర్శించుకోవడానికి భక్తులు.. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. దీన్ని గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం రైల్వే ట్రాక్ తరహా మార్గాన్ని నిర్మించి, ట్రాలీలను తాళ్లతోలాగే అత్యాధునిక సదుపాయాన్ని భక్తులకు కల్పించింది.
- సమాధానం: 3
44. ఇటీవల ఏ రాష్ట్ర ఆర్టీసీ వాహన పొదుపు, వాహన ఉత్పాదకలో ఏఎస్ఆర్టీయూ నుంచి ఉత్తమ పురస్కారాలు పొందింది ?
1) టీఎస్ఆర్టీసీ
2) ఓస్ఆర్టీసీ
3) కేఎస్ఆర్టీసీ
4) టీఎన్ఎస్ టీసీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పలు విభాగాల్లో ఎంపిక చేసిన రవాణా సంస్థలకు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్సపోర్ట్ అండర్‌టేకింగ్‌స(ఏఎస్ఆర్టీయూ) ఇటీవల ఢిల్లీలో జరిగిన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో పురస్కారాలు ప్రదానం చేసింది. వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపు లో టీఎస్ఆర్టీసీ ఉత్తమ రవాణా సంస్థగా పురస్కారాలు దక్కించుకుంది.
- సమాధానం: 1
45. ఆక్స్‌ఫామ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత జీడీపీలో కుబేరాల సంపద ఎంత శాతానికి చేరింది ?
1) 5 శాతం
2) 10 శాతం
3) 15 శాతం
4) 20 శాతం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆక్స్‌ఫామ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం అయిదేళ్ల క్రితం భారత జీడీపీలో పది శాతానికే పరిమితమైన దేశంలోని కుబేరుల సంపద.. 2017 చివరి నాటికి 15 శాతానికి పెరిగింది. వారసత్వ ఆస్తులతోను, క్రోనీ క్యాపిటలిజం మార్గంలోనూ దేశీయంగా సంపన్నులు భారీ ఎత్తున సంపదను పోగేసుకుంటున్నట్లు ఆక్స్‌ఫామ్ వివరించింది. 2017లో భారత్‌లో 101 మంది బిలియనీర్స్ ఉన్నారు.
- సమాధానం: 3
46. ఏ సంస్థ అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ పర్వతాల్లో 10 వేల సంవత్సరాల వరకు పనిచేసే భారీ గడియారాన్ని రూపొందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ?
1) అమెజాన్
2) గూగుల్
3) మైక్రోసాఫ్ట్
4) ఆపిల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ పర్వతాల్లో 10,000 సంవత్సరాల వరకూ పనిచేసే భారీ గడియారాన్ని(క్లాక్‌ఆఫ్ లాంగ్ నౌ) అమెజాన్ సంస్థ రూపొందిస్తుంది. దాదాపు 500 అడుగులు ఎత్తుండే ఈ గడియారానికి భూమి థర్మో సైకిల్స్ ఆధారంగా శక్తి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుపై గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నామనీ, ప్రస్తుతం టెక్సాస్ కొండల్లో ఈ గడియారాన్ని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు.
- సమాధానం: 1
47. హైదరాబాద్‌లో డేటా సైన్స్ కేంద్రం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఫిక్కీ
2) నాస్కామ్
3) సీఐఐ
4) సెబీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స(ఏఐ) విభాగాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 2
48. ఇటీవల బల్గేరియాలో జరిగిన ్ట్రాండ్ జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ - 2018లో బెస్ట్ బాక్సర్ పురస్కారాన్ని పొందిన భారత బాక్సర్ ఎవరు ?
1) విజేందర్ సింగ్
2) శివ తాపా
3) అఖిల్ కుమార్
4) వికాస్ క్రిషన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సోఫియాలోని బల్గేరియాలో జరిగిన ్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ బాక్సర్ వికాస్ క్రిషన్ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారాన్ని పొందాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత బాక్సర్‌కు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. పురుషుల 75 కేజీల విభాగంలో వికాస్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో వికాస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత ట్రాయ్ ఇస్లే (అమెరికా)ను ఓడించాడు.
- సమాధానం: 4
49. వందేళ్లకు పైగా వయసులో ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకొని ప్రధాని నరేంద్ర మోదీ సత్కారాన్ని పొందిన కున్వర్ బాయ్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
1) ఛత్తీస్‌గఢ్
2) బిహార్
3) ఉత్తరప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్వచ్ఛభారత్ అభియాన్ చిహ్నంగా పేరొందిన 106 ఏళ్ల వృద్ధురాలు కున్వర్ బాయ్ ఫిబ్రవరి 23న ఛత్తీసగఢ్లో మరణించారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో 2016లో తనకున్న కొన్ని మేకలను అమ్మేసి..ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో కున్వర్ బాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు.
- సమాధానం: 1
50. ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారం - 2018ని ఇటీవల ఎవరు అందుకున్నారు ?
1) రాజ్ దీప్ సర్దేశాయ్
2) అర్నబ్ గోస్వామి
3) నరిశెట్టి రాజు
4) శేఖర్ గుప్తా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఉన్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగు వ్యక్తి, ప్రముఖ జర్నలిస్టు, అమెరికాకు చెందిన గిజ్మోడో మీడియా గ్రూప్ సీఈవో నరిశెట్టి రాజు 2018 సంవత్సరానికి గాను ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఎన్ఆర్ చందూర్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఏటా ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.
- సమాధానం: 3