కరెంట్ అఫైర్స్ (మే 24 - 31, 2017) బిట్ బ్యాంక్
1. ఇటీవల ఏ విశ్వవిద్యాలయం మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌లపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది ?
1) ఉస్మానియా విశ్వవిద్యాలయం
2) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
3) కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
4) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్‌తో పాటు ఆసియాలోని పలు చారిత్రక అంశాలతో కూడిన చరిత్ర పేపర్‌ను తప్పనిసరి చేస్తూ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గాంధీతో పాటు 1960లో అమెరికా నల్ల జాతీయుల హక్కుల కోసం ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ గురించి పాఠ్యాంశాలను రూపొందించనున్నారు.
- సమాధానం: 2
2. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నూతన డెరైక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) టెడ్రోస్ అదనోమ్ గీర్బ్రేస్సస్
2) విక్టర్ డి ఇమ్మాన్యుయిల్
3) బొరిస్ సి నిక్సన్
4) మార్గరెట్ చాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రస్తుత డెరైక్టర్ మార్గరెట్ చాన్ స్థానంలో ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ ఆదనోమ్ గీర్బ్రేస్సస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆఫ్రికా ఖండం నుంచి ఈ పదవి చేపట్టనున్న మొదటి వ్యక్తి ఈయనే.
- సమాధానం: 1
3. 3వ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య వాణిజ్య మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) సింగపూర్
2) బ్యాంకాక్
3) హనోయ్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: వియత్నాంలోని హనోయ్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో 10 ఆసియాన్ సభ్య దేశాలు, 6 ఆసియాన్ స్వేచ్ఛ వర్తక ఒప్పంద భాగస్వామ్య దేశాలు పాల్గొన్నాయి. అవి.. ఆస్ట్రేలియా, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్.
- సమాధానం: 3
4. ఇటీవల ఏ దేశంలో తొలిసారిగా రోబో పోలీస్‌ను ప్రవేశపెట్టారు ?
1) ఇంగ్లండ్
2) ఫ్రాన్స్
3) కెనడా
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 4
5. సోలార్ అలయెన్స్ సంధిపై ఇటీవల సంతకం చేసిన దేశం ఏది ?
1) వనౌటు
2) తువాలు
3) మారిషస్
4) నౌరు
- View Answer
- సమాధానం: 4
వివరణ: నౌరు సముద్రమట్టానికి కేవలం 65 మీటర్ల ఎత్తులో ఉంది. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో సముద్ర జలాలు పెరిగితే మునిగిపోయే మొదటి దేశం ఇదే. ఆ దేశంలో ప్రస్తుతం 30 శాతంగా ఉన్న సౌర శక్తి ఉత్పత్తిని 50 శాతానికి పెంచి.. కాలుష్యాన్ని తగ్గించాలని ఇటీవల నిర్ణయించారు.
ఆఫ్రికా దేశాలైన కొమురొస్, ఘనా, కోట్ డి ఐవరి, సొమాలియా, జీబౌటి కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
- సమాధానం: 4
6. అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2016కు ఎంపికైన ప్లేయర్ ఎవరు ?
1) రవిచంద్రన్ అశ్విన్
2) రవీంద్ర జడేజా
3) శిఖర్ ధావన్
4) విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 1
7. ప్రపంచంలో అతిపెద్ద విమానం ఏది ?
1) బోయింగ్ 747
2) తియాన్ హై ix
3) పరమ్ x
4) ఎయిర్ ల్యాండర్ 10
- View Answer
- సమాధానం: 4
వివరణ: విమానం, హెలికాప్టర్, ఎయిర్‌షిప్‌లలో వాడే సాంకేతిక పరిజ్ఞానంతో బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ సంస్థ ఎయిర్‌ల్యాండర్ 10 అనే అతిపెద్ద విమానాన్ని రూపొందించింది. దీని పొడవు 92 మీటర్లు. వెడల్పు 43.5 మీటర్లు. ఇది 6,100 మీటర్ల ఎత్తులో గంటకు 148 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు.
- సమాధానం: 4
8. భారత దేశంలో నీటి అడుగున తొలి రైల్వే సొరంగాన్ని ఏ నదిలో నిర్మించారు ?
1) గంగానది
2) హుగ్లీనది
3) మహానది
4) గోదావరి నది
- View Answer
- సమాధానం: 2
వివరణ: కోల్కత్తా మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, Afcons Transtonnelstroy సంస్థలు సంయుక్తంగా హుగ్లీ నది కింద దేశంలోనే తొలి రైల్వే సొరంగాన్ని నిర్మించాయి. రూ.5 వేల కోట్లతో చేపట్టిన ఈ రైల్వే లైన్ పొడవు 16.6 కి.మీ.
- సమాధానం: 2
9. ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన యూఎన్ నివాస నివేదిక ప్రకారం అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది ?
1) కోట
2) ముంబయి
3) మెడెలిన్
4) ఢాకా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ నివేదిక ప్రకారం జనసాంద్రతలో తొలి స్థానంలో ఢాకా(44,500 మంది) ఉంది. రెండవ స్థానంలో ముంబయి (31,700 మంది), మూడవ స్థానంలో మెడెలిన్(19,700 మంది) ఉంది.
- సమాధానం: 4
10. ఇటీవల ఏ దేశ అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కుల వివాహాల కోసం ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ?
1) చైనా
2) తైవాన్
3) సింగపూర్
4) భారత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తైవాన్ రాజ్యాంగ న్యాయస్థానం స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- సమాధానం: 2
11. ఇటీవల FSSAI.. ఆహారంలో ఎంత శాతం శాఖాహార కొవ్వులు ఉండవచ్చని ప్రకటించింది ?
1) 15 శాతం
2) 13 శాతం
3) 5 శాతం
4) 2 శాతం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం - 2006 ప్రకారం 2011లోFSSAIని ఏర్పాటు చేశారు.
FSSAI - Food safety and standards authority of india
- సమాధానం: 3
12. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో స్థానం సంపాదించిన భారత్ కంపెనీలు ఎన్ని ?
1) 58
2) 78
3) 108
4) 128
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను తయారు చేసింది. ఇందులో భారత్ నుంచి రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ 106వ ర్యాంకులో ఉంది. తర్వాత ఎస్బీఐ (244వ ర్యాంకు), ఓన్జీసీ(246వ ర్యాంకు) ఉన్నాయి.
- సమాధానం: 1
13. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) సత్యం రాజు
2) రాజేంద్ర ప్రసాద్
3) రాధా కృష్ణ
4) రాజన్ ఆనందన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్‌కు ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.
- సమాధానం: 4
14. ఈక్వెడార్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) జార్జ్ గ్లాస్
2) లెనిన్ మొరెనో
3) రాఫెల్ కొర్రియా
4) ఆల్ఫ్రెడ్ పాలిసియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: PAIS అలయెన్స్ పార్టీకి చెందిన సోషలిస్ట్ నాయకుడు లెనిన్ మొరెనో ఈక్వెడార్‌కు నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
- సమాధానం: 2
15. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ సభ్యుడు/సభ్యురాలిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) గోపీచంద్
2) లియాండర్ పేస్
3) పీవీ సింధు
4) సానియా మీర్జా
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ నుంచి ఈ కమిషన్‌కు ఎంపికైన రెండో వ్యక్తి పీవీ సింధు. ఆమెతో పాటు మార్క్ జ్విబ్లర్(జర్మనీ), క్రిస్టిగిల్ మోర్(స్కాట్లాండ్) ఎంపికయ్యారు. వీరు 4 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.
- సమాధానం: 3
16. అత్యంత అరుదైన కోబ్రా లిల్లి పుష్పాన్ని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు ?
1) నీలగిరి పర్వాతాలు
2) నల్లమల అడవులు
3) పశ్చిమ కనుమలు
4) సుందర్ బన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 84 ఏళ్ల తర్వాత కోబ్రాలిల్లి (arisaema translucens) పుష్పాన్ని నీలగిరి పర్వతాలలో కనుగొన్నారు.
- సమాధానం: 1
17. భారత్‌లో అతిపెద్ద వంతెనను ఏ ప్రాంతాల మధ్య నిర్మించారు ?
1) దోహ్లా - సాదియా
2) రాజమండ్రి - కొవ్వూరు
3) బాంద్రా - వర్లీ
4) హౌరా - కోల్కత్తా
- View Answer
- సమాధానం: 1
వివరణ: అసోంలోని దోహ్లా - సాదియాలను కలుపుతూ లోహిత నదిపై 9.15 కిలోమీటర్ల పొడవైన మూడు లైన్ల వంతెనను నిర్మించారు. దీనికి భూపెన్ హజారికా పేరు పెట్టారు.
- సమాధానం: 1
18. ట్రావెల్ చాయిస్ "10 అత్యత్తమ ప్రపంచ ప్రసిద్ధ స్థలాల" జాబితాలో తొలి స్థానంలో ఉన్న ప్రాంతం ఏది ?
1) తాజ్ మహల్
2) జాయద్ గ్రాండ్ మాస్క్ సెంటర్
3) అంగ్కోర్ వాట్
4) సెయింట్ పీటర్ బాసిలికా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కంబోడియాలోని అంగ్కోర్ వాట్ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో జాయద్ గ్రాండ్ మాస్క్ సెంటర్ (యూఏఈ), సెయింట్ పీటర్ బాసిలికా(వాటికన్ సిటీ), తాజ్‌మహల్ (భారత్) ఉన్నాయి.
- సమాధానం: 3
19. ప్రపంచంలో అతి ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్న దేశం ఏది ?
1) చైనా
2) జపాన్
3) అమెరికా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2016 సంవత్సరంలో భారత్‌లోకి 62.3 బిలియన్ డాలర్ల గ్రీన్ ఫీల్డ్ ఎఫ్‌డీఐలు వచ్చాయి.
- సమాధానం: 4
20. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన వినియోగదారుల ఆర్థిక సేవల కంపెనీల టాప్ - 10 జాబితాలో చోటు సంపాదించిన భారతీయ సంస్థ ఏది ?
1) హెచ్డీఎఫ్సీ
2) ఎస్బీఐ
3) ఆంధ్రాబ్యాంకు
4) విజయ బ్యాంకు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఉంది. తర్వాతి స్థానంలో క్యాపిటల్ వన్, వీసా ఉన్నాయి.
- సమాధానం: 1
21. భారత్ - పసిఫిక్ సస్టెనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) బెంగళూరు
2) సిడ్నీ
3) సువా
4) మనీలా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫిజి రాజధాని సువాలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- సమాధానం: 3
22. ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని 21 సార్లు అధిరోహించి రికార్డు నెలకొల్పింది ఎవరు ?
1) మలావత్ పూర్ణ
2) కామి రీతా షెర్పా
3) శేఖర్ బాబు
4) సురేష్ చంద్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: గతంలో అప్పా షెర్పా, పూర్బ తాషి షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని 21 సార్లు అధిరోహించారు. ఈ శిఖరాన్ని 21 సార్లు అధిరోహించిన మూడో వ్యక్తిగా కామి రీతా షెర్పా గుర్తింపు పొందారు.
- సమాధానం: 2
23. 52వ ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) నైరోబి
2) ప్రిటోరియా
3) ఆడిస్ అబాబా
4) గాంధీనగర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనే 5 ఆఫ్రికన్ దేశాలు సోలార్ అలయెన్స్‌పై సంతకం చేశాయి.
- సమాధానం: 4
24. అంతర్జాతీయ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్‌కు ఛైర్మన్‌గా ఎవరు ఎంపికయ్యారు ?
1) రిమా ముఖర్జీ
2) ఆది గోద్రెజ్
3) రాకేష్ కపూర్
4) రాజేంద్ర సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్‌లో 68 దేశాలకు చెందిన 500 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్‌లో ఉంది.
- సమాధానం: 3
25. ప్రతిష్టాత్మక డా.బీ.ఆర్ అంబేడ్కర్ జాతీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎస్.కే. థోరాట్
2) శ్రీ బాబు లాల్ నిర్మల్
3) అమర్ సేవా సంగ్రామ్
4) పై వారందరు
- View Answer
- సమాధానం: 4
వివరణ: సమాజంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. అంబేడ్కర్ నేషనల్ అవార్డ్ కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది.
- సమాధానం: 4
26. జాతీయ మైనారిటీ కమిషన్‌కు చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) సయ్యద్ గయోరుల్ హసన్ రిజ్వి
2) జస్టిస్ హెచ్.ఎల్.దత్తు
3) అచల్ కుమార్ జ్యోతి
4) జార్జ్ కురియన్
- View Answer
- సమాధానం: 1
27. ప్రపంచంలో అత్యధిక సామర్థ్యం గల లేజర్ ఆంప్లిఫైయర్‌ను అభివృద్ధి చేసిన దేశం ఏది ?
1) భారత్
2) కెనడా
3) యూకే
4) చైనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాథ్క్లైడ్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ లేజర్ ఆంప్లిఫైయర్‌ను అభివృద్ధి చేశారు. ఇది కాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతుంది.
- సమాధానం: 3
28. ఇటీవల భారత్‌ను సందర్శించిన మారిషస్ ప్రధానమంత్రి ఎవరు ?
1) డా.నరేష్ అగర్వాల్
2) అబ్దుల్ లతీఫ్‌ఖాన్
3) రుక్యా బేగమ్
4) ప్రవింద్ జుగ్నౌద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ పర్యటనలో భాగంగా మారిషస్‌లో సివిల్ సర్వీసుల కాలేజీల ఏర్పాటు, 500 మిలియన్ డాలర్ల రుణం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వంటి అంశాలపై భారత్-మారిషస్ మధ్య ఒప్పందాలు కుదిరాయి.
- సమాధానం: 4
29. ఇటీవల పాత్రికేయులకు పింఛన్ విధానాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) మధ్యప్రదేశ్
3) బిహార్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్వర్ణ జయంతి జర్నలిస్ట్ మీట్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాత్రికేయులకు ప్రత్యేక పథకాలు ప్రకటించారు. పాత్రికేయులకు నెలకు రూ.10 వేల పింఛన్ (పాత్రికేయ వృత్తిలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న 60 ఏళ్లు పైబడినవారికి), రూ. 10 లక్షల జీవిత బీమా, రూ. 5 లక్షల నగదు రహిత మెడ్క్లెయిమ్ పాలసీ ప్రకటించారు.
- సమాధానం: 4
30. ఇటీవల ప్రకటించిన బయోడైవర్సిటీ హెరిటేజ్ ప్రాంతం ఏది ?
1) నాసిక్
2) డైలాంగ్
3) మైసూర్
4) షిరిడి
- View Answer
- సమాధానం: 2
వివరణ: మణిపూర్ తామెంగ్ జిల్లాలోని డైలాంగ్ గ్రామాన్ని జీవ వైవిధ్య హెరిటేజ్ సైట్‌గా (జీవవైవిధ్య చట్టం 2002, 37(1) ప్రకారం) ప్రకటించారు.
- సమాధానం: 2
31. 5వ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గ్లోబల్ ఫోరమ్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) కాన్‌కూన్
2) జెనిరా
3) పారిస్
4) లండన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 5వ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గ్లోబల్ ఫోరం సమావేశాన్ని మెక్సికోలోని కాన్‌కూన్ నగరంలో నిర్వహించారు. 18 దేశాల నుంచి 4 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్విట్జర్లాండ్ కాకుండా మరో దేశంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి.
- సమాధానం: 1
32. ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్‌ను ఎక్కడ నిర్మించనున్నారు ?
1) లిబియా
2) చిలి
3) పెరూ
4) బల్గేరియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: చిలిలోని అటకామా ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్‌ను నిర్మిస్తున్నారు. యూరోపియన్ సథరన్ అబ్జర్వేటరీ(ఈఎస్ఓ) దీనిని నిర్మిస్తుంది.
- సమాధానం: 2
33. ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు -2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) కాన్పూర్ సిటీ పోలీస్
2) ముంబయి సిటీ పోలీస్
3) పూణె సిటీ పోలీస్
4) సేలం సిటీ పోలీస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బడ్డీ కాప్, దామిని స్వ్కాడ్, లాస్ట్ అండ్ ఫౌండ్ పోర్టల్ అనే కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గాను పూణె సిటీ పోలీస్ ఈ అవార్డుకు ఎంపికైంది.
- సమాధానం: 3
34. రష్యాలో జరిగే గ్లోబల్ ఫుట్‌బాల్ ఫర్ ఫ్రెండ్షిప్ అనే సాంఘిక కార్యక్రమానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) లక్ష్మీ సంయుక్త
2) శారదా దేవి
3) అనన్య కాంబోజ్
4) స్వీటి సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మెహాలిలోని వివేక హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థిని అనన్య కాంబోజ్ ఈ కార్యక్రమానికి యువ జర్నలిస్ట్‌గా ఎంపికైంది. యువతను ఫుట్ బాల్ వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 3
35. ఇటీవల ప్రత్యేక ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ అండ్ పొజిషనింగ్ వ్యవస్థను ప్రారంభించిన దేశం ఏది?
1) భారత్
2) చైనా
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
36. ఇటీవల ఏ ప్రాంతంలో ఏరోనాటికల్ టెస్జ్ రేంజ్‌ను ప్రారంభించారు?
1) దుండిగల్
2) డొక్లామా
3) చిత్రదుర్గ్
4) గుల్బర్గా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో రూ.1300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇందులో మానవ రహిత, మానవ సహిత విమానాలను పరీక్షిస్తారు.
- సమాధానం: 3
37. సుదీర్మన్ బ్యాడ్మింటన్ కప్ - 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) దక్షిణకొరియా
2) చైనా
3) భారత్
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ టోర్నీలో చైనాను ఓడించి దక్షిణకొరియా టైటిల్‌ను గెలుచుకుంది. ఇండోనేషియా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు డిక్ సుదిర్మన్ గౌరవార్థం సుదిర్మన్ కప్‌ను ఏర్పాటు చేశారు. అత్యధికంగా 10 సార్లు చైనా ఈ కప్‌ను కైవసం చేసుకుంది.
- సమాధానం: 1
38. అంతర్జాతీయ మహిళల ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మే 21
2) మే 23
3) మే 25
4) మే 28
- View Answer
- సమాధానం: 4
వివరణ: లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు ఏటా మే 28న అంతర్జాతీయ మహిళల ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 4
39. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో అత్యంత సంక్లిష్ట పన్నుల విధానం కలిగి ఉన్న దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) జపాన్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆసియా - పసిఫిక్ పన్నుల సర్వే నిర్వహించిన డెలాయిట్ సంస్థ.. చైనా అత్యంత సంక్లిష్ట పన్నుల విధానం కలిగి ఉందని తేల్చింది. ఆ తర్వాతి స్థానంలో భారత్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఉన్నాయి.
- సమాధానం: 2
40. కాగ్ - 2017 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు ఎంత ?
1) 10 శాతం
2) 14.80 శాతం
3) 17.81 శాతం
4) 20.19 శాతం
- View Answer
- సమాధానం: 3
వివరణ: కాగ్ - 2017 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం 17.81 శాతంతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 17.16 శాతంతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది.
- సమాధానం: 3
41. ఇటీవల స్మార్ట్ పోలీస్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) మహేందర్ రెడ్డి
2) అప్పారావు
3) రవిందర్ సింగ్
4) ప్రకాశ్ సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ - 2017 పురస్కారాలలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి స్మార్ట్ పోలీస్ అవార్డుకు ఎంపికయ్యారు.
- సమాధానం: 1
42. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ?
1) రూ.1,40,683
2) రూ.1,26,063
3) రూ.1,22,376
4) రూ.1,68,677
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016-17 రాష్ట్ర ఆర్థిక చిత్రంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.1,22,376గా ప్రకటించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,40,683.
- సమాధానం: 3
43. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఏది ?
1) శ్రీకాకుళం
2) కృష్ణా
3) విశాఖపట్నం
4)తూర్పు గోదావారి
- View Answer
- సమాధానం: 2
వివరణ: రూ.1,61,097 తలసరి ఆదాయంతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో విశాఖపట్నం(రూ.1,42,821), తూర్పు గోదావరి (రూ.1,18,249) జిల్లాలు ఉన్నాయి.
- సమాధానం: 2
44. ఆంధ్రప్రదేశ్ ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత శాతం ఎంత ?
1) 67.3 శాతం
2) 65.2 శాతం
3) 63.1 శాతం
4) 61 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా - 5,07,43,000.
- సమాధానం: 1
45. ఆంధ్రప్రదేశ్ సంతోష సూచీ 2016-17లో తొలి స్థానంలో ఉన్న జిల్లా ఏది ?
1) పశ్చిమ గోదావరి
2) కృష్ణా
3) శ్రీకాకుళం
4) నెల్లూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ సర్వే ప్రకారం 6.414 పాయింట్లతో శ్రీకాకుళం జిల్లా తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో పశ్చిమ గోదావరి (6.067), కృష్ణా(5.746), నెల్లూరు(5.720) జిల్లాలు ఉన్నాయి.
- సమాధానం: 3
46. దక్షిణ భారత దేశంలో థైరాయిడ్ బాధితులు ఎక్కువగా ఉన్న నగరం ఏది ?
1) మైసూర్
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ ప్రకారం దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధపడుతున్నారు. దేశంలో అత్యధికంగా కోల్కత్తా 21.6 శాతం, ఢిల్లీ 11.09 శాతం, అహ్మదాబాద్ 10.6 శాతం, ముంబయి 9.6 శాతం, హైదరాబాద్‌లో 8.88 శాతం మంది థైరాయిడ్ బాధితులు ఉన్నారు. ఈ అంశంలో జాతీయ స్థాయిలో 5వ స్థానంలో ఉన్న హైదరాబాద్.. దక్షిణ భారత్‌లో మొదటి స్థానంలో ఉంది.
- సమాధానం: 2
47. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారం - 2016కు ఎవరు ఎంపికయ్యారు ?
1) షేక్ బషిర్ అహమ్మద్
2) రహమ్మత్ ఉల్లాఖాన్
3) సత్యబ్రత రౌత్
4) వినయ్ చంద్ర
- View Answer
- సమాధానం: 3
వివరణ: పొ.సత్యబ్రత రౌత్‌తో పాటు ఒడిశాకు చెందిన గురు రతి కాంత్ మాహాపాత్ర, పాల సంగీతకారుడు లక్ష్మీధర్ రౌత్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
సంగీత నాటక అకాడమీని 1952లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, ఒక ప్రశంసా పత్రం ప్రదానం చేస్తారు.
- సమాధానం: 3
48. 70వ కేన్స్ చిత్రోత్సవం - 2017లో ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన సినిమా ఏది ?
1) ది స్క్వేర్
2) టెకెన్ - 3
3) ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
4) జంబో
- View Answer
- సమాధానం: 1
వివరణ: రూబెన్ ఓస్ట్ ల్యాండ్ తీసిన వ్యంగ్య చిత్రం ది స్క్వేర్ కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారం పొందింది.
- సమాధానం: 1
49. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మే 10
2) మే 16
3) మే 21
4) మే 23
- View Answer
- సమాధానం: 4
వివరణ: శాంతి పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఐరాస శాంతి పరిరక్షుకలను స్మరించుకునేందుకు ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
50. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మే 29
2) మే 31
3) జూన్ 1
4) జూన్ 2
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఏటా మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానం చేసింది.
- సమాధానం: 2