కరెంట్ అఫైర్స్ (మే 16 - 23) బిట్ బ్యాంక్
1. భారత్, ఫ్రాన్స్ మధ్య ఏ రంగంలో కుదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది ?
1) రైల్వే
2) మెడిసిన్
3) వ్యవసాయం
4) మెటరాలజీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండియన్ రైల్వేలో సాంకేతికత అభివృద్ధికిసంబంధించి ఫ్రాన్స్‌లోని ఎస్ఎన్సీఎఫ్ సంస్థతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఈ ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హై స్పీడ్ రైల్, సెమీ స్పీడ్ రైల్, స్టేషన్ల అభివృద్ధి తదితర అంశాల్లో ఆ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది.
-
2. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల సమావేశమైన కేబినెట్.. డియోఘర్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డియోఘర్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) ఛత్తీస్‌గఢ్
2) జార్ఖండ్
3) అస్సాం
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల సమావేశమైన కేంద్ర కేబినెట్.. జార్ఖండ్ లోని డియోఘర్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్ష యోజన (PMSSY) కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
-
3. తొలి అంతర్జాతీయ రైల్ కోచ్ ఎక్స్ పో ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) చెన్నై
2) విజయవాడ
3) హైదరాబాద్
4) రాయ్ పూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తొలి అంతర్జాతీయ రైల్ కోచ్ ఎక్స్ పో మే 17 నుంచి 19 వరకు చెన్నైలో జరిగింది. రైల్ కోచ్ తయారీ సంస్థలు, పంపిణీదారులను ఒకే వేదికపై తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌ను అభివృద్ధిచేయడం కోసం ఈ ప్రదర్శన నిర్వహించారు.
-
4. భారత్‌లో తొలి సోలార్ రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందిన స్టేషన్ ఏది ?
1) సికింద్రాబాద్
2) గౌహతి
3) విజయవాడ
4) భోపాల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్ లో తొలి సోలార్ రైల్వే స్టేషన్ గా అస్సాంలోని గౌహతి స్టేషన్ గుర్తింపు పొందింది. స్టేషన్ విద్యుత్ అవసరాల కోసం 2353 సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.6.7 కోట్లు వెచ్చించారు. విద్యుత్ ఖర్చులు, కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
-
5. కింది వాటిలోని ఏ సంస్థ పెద్దల్లో జబ్బులను ముందే గుర్తించేందుకు అవసరమైన వైద్య పరీక్షల జాబితా(EDL)ను విడుదల చేసింది ?
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ
2) యునిసెఫ్
3) యునెస్కో
4) యూఎన్డీపీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ.. పెద్దల్లో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఇటీవల పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అవసరమైన వైద్య పరీక్షల జాబితాను విడుదల చేసింది. రక్త, మూత్ర పరీక్షలు ఉంటాయి. ఎయిడ్స, మలేరియా, టీబీ, హెపటైటిస్ బీ, సీ, సిఫిలిస్ వంటి వ్యాధులను గుర్తించేందుకు 55 రకాల పరీక్షలు నిర్వహించాలన్నది డబ్ల్యూహెచ్ఓ సూచన. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం 46 శాతం మంది పెద్దల్లో మధుమేహాన్ని ముందే గుర్తించకపోవడం వల్ల తీవ్ర ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈఎల్డీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
-
6. అంతర్జాతీయ క్రికెట్ మండలికి వరుసగా రెండోసారి స్వతంత్ర చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు?
1) శ్రీనివాసన్
2) మార్క్ వా
3) శశాంక్ మనోహర్
4) షాన్ పొలాక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ కు చెందిన శశాంక్ మనోహర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి స్వతంత్ర చైర్మన్‌గా రెండోసారి ఎన్నికయ్యారు. శశాంక్ 2016లో తొలిసారి ఐసీసీ స్వతంత్ర చైర్మన్ గా ఎన్నికయ్యారు.
-
7. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేసిన ఆసియాలోనే అతిపెద్దదైన భూగర్భ రోడ్డుమార్గం జోజిల్లా అండర్ పాస్ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) గుజరాత్
2) ఉత్తరాఖండ్
3) హిమాచల్ ప్రదేశ్
4) జమ్ము అండ్ కశ్మీర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జమ్ము అండ్ కశ్మీర్ లో ఆసియాలోనే అతి పెద్దదయిన భూగర్భ రోడ్డుమార్గం జోజిల్లా అండర్ పాస్ ని నిర్మిస్తున్నారు. 14.2 కిలోమీటర్ల మేర 11 వేల అడుగుల ఎత్తులో ఈ భూగర్భ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనగర్ తో లెహ్, కార్గిల్ ప్రాంతానికి దీని ద్వారా అనుసంధానం ఏర్పడుతుంది. ఇటీవల ఈ ప్రాజెక్టుకి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
-
8. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై 11వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసింది. కాగా స్వరాష్ట్రంలో ఇది ఎన్నో పీఆర్సీ ?
1) మొదటిది
2) రెండవది
3) మూడవది
4) నాలుగోది
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిది అయిన ఈ పీఆర్సీకి సారథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ నియమితులయ్యారు. మరో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సి.ఉమామహేశ్వరరావు, మహ్మద్ అలీ రఫత్‌లను సభ్యులుగా నియమించారు. ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడు నెలల్లోగా తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
-
9. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(SCO)- 2018 సమావేశం ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) బీజింగ్
3) సాన్యా
4) వుహాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ - 2018 సమావేశం ఇటీవల చైనాలోని సాన్యా నగరంలో జరిగింది. 2017 జూన్ 9న భారత్ ఈ సంఘంలో శాశ్వత సభ్య దేశంగా గుర్తింపు పొందింది. ఇందులో భారత విదేశాంగ శాఖలో SCO శాశ్వత ప్రతినిధినిగా బండారు విల్సన్ బాబుని నియమించింది.
-
10. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన UEFA యురోపా ఫుట్ బాల్ లీగ్ లో టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది ?
1) అట్లెటికో మాడ్రిడ్
2) మార్సిల్లే
3) న్యూయార్క్ జయంట్స్
4) చికాగో బియర్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన యూఈఎఫ్ఏ యురోపా ఫుట్ బాల్ లీగ్ ఫైనల్లో అట్లెటికో మాడ్రిడ్ 3 - 0 తేడాతో మార్సిల్లే జట్టుని ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. ఆ జట్టుకి ఇది మూడో టైటిల్. 2010, 2012లో అట్లెటికో మాడ్రిడ్ టైటిల్ విజేతగా నిలిచింది.
-
11. ప్రపంచ హైపర్ టెన్షన్ డే ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మే 15
2) మే 17
3) మే 19
4) మే 21
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ హైపర్ టెన్షన్ డేని తొలుత 2005 మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ లీగ్ నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా ఈ డేని పాటిస్తున్నారు. అధిక రక్తపోటుపై ప్రజల్లో అవగాహన పెంచి తద్వారా దీనిని నియంత్రించేందుకు ఈ డేని నిర్వహిస్తారు.
2018 Theme : Know Your Numbers
-
12. జాతీయ లలితా కళా అకాడమీ పూర్తిస్థాయి చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) రవి శంకర్
2) ఉత్తమ్ పచర్నే
3) యువరాజ్ సింగ్
4) మాలిక్ కులకర్ణి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ చిత్రకారుడు ఉత్తమ్ పచర్నే..లలిత కళా అకాడమీ పూర్తిస్థాయి చైర్మన్ గా ఇటీవల నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఉత్తమ్ 1985లో లలిత కళా అకాడమీ అవార్డ్, అదే సంవత్సరంలో మహారాష్ట్ర గౌరవ్ పురస్కారం అందుకున్నారు.
-
13. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ(NHAI) కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
1) దీపక్ కుమార్
2) అనంత్ సైనా
3) యుధ్ వీర్ సింగ్ మాలిక్
4) ప్రీతమ్ సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ గా యుద్ధ వీర్ సింగ్ మాలిక్ ఇటీవల నియమితులయ్యారు. ఈయనకు ముందు ఈ పదవిలో ఉన్న దీపక్ కుమార్.. తన కేడర్ రాష్ట్రమైన బిహార్ తిరిగి బదిలీపై వెళ్లారు.
-
14. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) జస్టిస్ రామలింగం సుధాకర్
2) జస్టిస్ రోహిణి
3) జస్టిస్ ఎన్వీ రమణ
4) జస్టిస్ ఫర్హాన్ అహ్మద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ రామలింగం సుధాకర్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. యాక్టింగ్ గవర్నర్ జగదీశ్ ముఖి సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ రామలింగం సుధాకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
-
15. స్వచ్ఛమైన నీటి అధిక వినియోగం ద్వారా భూమిపై మంచి నీరు తగ్గిపోవడానికి కారణమవుతున్న దేశాల్లో భారత్ ఒకటని ఈ కింది వాటిలో ఏ సంస్థ తెలిపింది ?
1) నాసా
2) ఇస్రో
3) సీఎన్ఎస్ఏ
4) రాస్ కాస్మోస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నాసా ఇటీవల మ్యాప్స్ లొకేటింగ్ ద్వారా భూమిపై మంచి నీరు వేగంగా తగ్గిపోతున్న ప్రాంతాలను గుర్తించింది. నాసా ఉపగ్రహం ద్వారా ఈ డేటాని విశ్లేషించింది. తద్వారా స్వచ్ఛమైన నీటి అధిక వినియోగం ద్వారా భూమిపై మంచి నీరు తగ్గిపోవడానికి కారణమవుతున్న దేశాల్లో భారత్ ఒకటని నాసా తెలిపింది. భారత్ లోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాలతో పాటు కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలో నీటి వనరులు వేగంగా తగ్గిపోయి పొడి నేలలుగా తయారవుతున్నాయని తెలిపింది.
-
16. నీటిలో ఆర్సెనిక్ ని గుర్తించి తొలగించే యంత్రాన్ని కనుగొన్నట్లు భారత్ లోని ఏ సంస్థ ప్రకటించింది ?
1)IITM
2)IISER
3)IISC
4)IIWS
- View Answer
- సమాధానం: 1
వివరణ: Arsenic sensor and removal media పేరుతో నీటిలో ఆర్సెనిక్ ని గుర్తించి తొలగించే పరికరాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ (IISER) రూపొందించింది. ఈ పరికరం నీటిలో ఆర్సెనిక్ ని గుర్తించిన వెంటనే రంగు మారుతుంది. నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్లో 8 జిల్లాలోని 83 బ్లాకుల్లో ఆర్సెనిక్ అధికంగా ఉంది.
-
17. హాకీ ఇండియా ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు ఎంపికయ్యరు ?
1) రాజిందర్ సింగ్
2) రాజేంద్ర ప్రసాద్
3) మైఖేల్ డిసౌజా
4) ఆండ్యూఈస్టర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హాకీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న రాజిందర్ సింగ్.. ఇటీవల హాకీ ఇండియా ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. ఆయనకు ముందు ముందు మరియమ్మా కోషైఈ పదవిలో ఉన్నారు.
-
18. 2018 మే 19న డబ్ల్యూటీఏ ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స లో తొలి స్థానంలో నిలిచిన క్రీడాకారిణి ఎవరు ?
1) కరోలినా వొజ్నియాకి
2) గార్బినె ముగురుజా
3) ఎలినా విటోలినా
4) సిమోనా హాలెప్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2018 మే 19న డబ్ల్యూటీఏ ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స లో రోమేనియాకు చెందిన క్రీడాకారిణి సిమోనా హాలెప్ తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కరోలినా వొజ్నియాకి, మూడో స్థానంలో గార్బినె ముగురుజా నిలిచారు.
-
19. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన 71వ కేన్స్ వార్షిక ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్మ్ డీ ఓర్ అవార్డు గెలుచుకున్న వారు ఎవరు ?
1) అలైస్ రోవాచర్
2) పావెల్ పాలికొస్కీ
3) హిరోకాజు కొరే ఎడా
4) స్పైక్ లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన 71వ కేన్స్ వార్షిక ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్మ్ డీ ఓర్ అవార్డుని హిరోకాజు కొరే ఎడా గెలుచుకున్నారు. జపాన్ లో రూపొందించిన షాప్ లిఫ్టర్స్ చిత్రానికి గాను ఈ అవార్డు దక్కింది.
-
20. కోల్ ఇండియా సీఎండీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) పరినీత్ గుప్తా
2) అరుణ్ గుప్తా
3) అనిల్ కుమార్ ఝా
4) రంజన్ చౌదరి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రభుత్వ రంగ సంస్థ మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సీఎండీగా ఉన్న అనిల్ కుమార్ ఝా... కోల్ ఇండియా సీఎండీగా నియమితులయ్యారు. 2020 జనవరి 31 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
-
21. భారత తర్వాత తరం రక్షణ ఎయిర్ క్రాఫ్ట్ ‘‘అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA)’’ను ఎక్కడ తయారు చేస్తున్నారు ?
1) హైదరాబాద్, తెలంగాణ
2) సూలూరు, తమిళనాడు
3) బెంగళూరు, కర్ణాటక
4) ఇండోర్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత తర్వాత తరం రక్షణ ఎయిర్ క్రాఫ్ట్ ‘‘అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA)’’ ను తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని సూలురులో అభివృద్ధిచేస్తున్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలను తయారు చేసి అసెంబ్లింగ్ యూనిట్ కు పంపిస్తారు.
-
22. డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకారం జాతీయ నో ఫ్లై జాబితా లో చేరిన తొలి వ్యక్తి ఎవరు ?
1) మదన్ సుధాకర్
2) బిర్జు కిశోర్ సల్లా
3) అమన్ ఖురేషి
4) జేసీ దివాకర్ రెడ్డి
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర పౌర విమానయాన శాఖ 2017లో నో ఫ్లై జాబితా మార్గదర్శకాలను విడుదల చేసింది. విమాన ప్రయాణంలో సత్పవ్రర్తన లేని వారిని ఈ జాబితాలో చేరుస్తామని ప్రకటించింది. ముంబైకి చెందిన నగల వ్యాపారి బిర్జు కిశోర్ సల్లా.. విమానంలో హైజాక్ పుకార్లను పుట్టించి ప్రయాణికులను భయాందోళనలకు గురి చేసినందుకు గాను ఆయనని ఈ జాబితాలో చేర్చారు. తద్వారా నో ఫ్లై జాబితాలో చేరిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు.
-
23. కిషన్ గంగా జలవిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
1) పంజాబ్
2) గుజరాత్
3) జమ్ము అండ్ కశ్మీర్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కిషన్ గంగా జల విద్యుత్ కేంద్రం జమ్ము అండ్ కశ్మీర్ రాష్ట్రంలో ఉంది. బందిపోరా జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టుని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 330 మెగావాట్లు. ఏడాదికి 1712.96 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిఅవుతుంది. రూ.5,882 కోట్ల వ్యయంతో ఈ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు.
-
24. భారత నావికాదళానికి చెందిన ఆరుగురు సిబ్బంది ఇటీవల ఏ నౌకలో దిగ్విజయంగా ప్రపంచ యాత్ర ముగించుకొని తిరిగి వచ్చారు ?
1) ఐఎన్ఎస్వి తరిణి
2) ఐఎన్ఎస్వీ తేజాస్
3) ఐఎన్ఎస్వీ మాన్సి
4) ఐఎన్ఎస్వీ నారి
- View Answer
- సమాధానం: 1
వివరణ: లెఫ్టినెంట్ కమాండర్స్ వర్తికా జోషి, ప్రతిభా జమ్వాల్, పి.స్వాతి, లెఫ్టినెంట్లు ఐశ్వర్య బొడ్డపాటి, ఎస్ విజయా దేవి, పాయల్ గుప్తాలతో కూడిన భారత మహిళా నావికా సిబ్బంది.. ఐఎన్ఎస్వీ తరిణిలో ప్రపంచ యాత్రను దిగ్విజయంగా ముగించుకొని ఇటీవల తిరిగి వచ్చారు. మొత్తం 254 రోజుల పాటు ఈ యాత్ర సాగింది.
-
25. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి బంగా విభూషణ్ పురస్కారాన్ని పొందినవారు?
1) లతా మంగేష్కర్
2) ఆశా భోంస్లే
3) శ్రేయా గోషల్
4) చిత్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల సీనియర్ గాయని ఆశా భోంస్లేకు బంగా విభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. రచయిత సమరేష్ మజుందార్, బెంగాల్ నటుడు ప్రొసేంజిత్ ఛటర్జీ, జస్టిస్ ష్యామల్ కుమార్ సేన్ లకు బంగా విభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. పశ్చిమ బెంగాల్ లో బంగా విభూషణ్ పురస్కారం అత్యున్నత పౌర పురస్కారం.
-
26. చంద్రుడి చీకటి ప్రాంతంపై అధ్యయనం చేసేందుకు చైనా ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం ఏది ?
1) క్యూకియో
2) క్వాంటికో
3) ఆర్కియేగిల్
4) మిషన్ గీగ
- View Answer
- సమాధానం: 1
వివరణ: చంద్రుడి చీకటి ప్రాంతంపై అధ్యయనం చేసేందుకు చైనా ఇటీవల క్యూకియో ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది భూమి, చంద్రుడి మధ్య సమాచార వాహకంగా పనిచేస్తుంది. లాంగ్ మార్చ్ 4 సీ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఈ ఉపగ్రహాన్ని మాగ్పి బ్రిడ్జ గాను పిలుస్తున్నారు.
-
27. యూరోపియన్ గోల్డెన్ షూ - 2018 ని పొందిన ఫుట్‌బాల్ ప్లేయర్ ఎవరు ?
1) క్రిస్టియానో రొనాల్డో
2) లియోనెల్ మెస్సీ
3) నెయ్ మార్
4) మొహమ్మద్ సలాహ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇటీవల యూరోపియన్ గోల్డెన్ షూ - 2018ని పొందారు. మెస్సీ ఈ అవార్డు పొందడం ఇది ఐదోసారి. 2017-18 సీజన్ లో మెస్సీ మొత్తం 34 గోల్స్ సాధించి తొలి స్థానంలో నిల్వడం ద్వారా ఈ పురస్కారం పొందాడు.
-
28. ఇటాలియన్ ఓపెన్ - 2018ని గెలుపొందిన టెన్నిస్ ప్లేయర్ ఎవరు ?
1) రాఫెల్ నాదల్
2) రోజర్ ఫెడరర్
3) అలెగ్జాండర్ జ్వెరెవ్
4) నోవాక్ జకోవిచ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల రోమ్ లో జరిగిన ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్.. అలెగ్జాండర్ జ్వెరెవ్ ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచాడు. నాదల్ కు ఇది 8వ ఇటాలియన్ ఓపెన్ టైటిల్.
-
29. 5వ మహిళల ఆసియాన్ ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ - 2018 టైటిల్ ను ఏ దేశ జట్టు గెలుచుకుంది ?
1) భారత్
2) దక్షిణ కొరియా
3) చైనా
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 5వ మహిళల ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీ ఫైనల్లో భారత్ ను ఓడించి దక్షిణ కొరియా విజేతగా నిలిచింది. ఆ దేశ జట్టు ఈ టైటిల్ ను గెలవడం ఇది మూడోసారి.
-
30. భారత్ లో తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మే 21
2) మే 23
3) మే 19
4) మే 17
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1991 మే 21న తమిళనాడులో ఆత్మాహుతి దళం చేసిన బాంబు దాడిలో మరణించారు. ఈ ఉదంతంలో మరో 14 మంది చనిపోయారు. ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ ఏటా మే 21న తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
-
31. బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (NDB) అమెరికా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ?
1) ఉత్తర కొరియా
2) ఇజ్రాయెల్
3) బ్రెజిల్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బ్రిక్స్ (Brazil, Russia, India, China, South Africa - BRICS) న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (NDB) అమెరికా ప్రాంతీయ కార్యాలయాన్ని బ్రెజిల్ లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఆఫ్రికన్ ప్రాంతీయ కేంద్రాన్ని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో ఏర్పాటు చేయనుంది.
-
32. ఇటీవల ONGC నాగాయలంకలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాల వెలికితీతను ప్రారంభించింది. ఈ నాగాయలంక బ్లాక్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో ఉన్న నాగాయలంకలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాల వెలికితీతను ఓఎన్జీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శశి శంకర్ ఇటీవల ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో 49 శాతం వాటాతో వేదాంత భాగస్వామిగా ఉంది. ప్రాజెక్టు వ్యయం 400 మిలియన్ డాలర్లు. రోజుకు 400 టన్నుల గ్యాస్, రెండు లక్షల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల ఆయిల్ నిక్షేపాలను వెలికి తీయనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది.
-
33. వెనెజులా అధ్యక్షుడిగా ఇటీవల రెండోసారి ఎవరు ఎన్నికయ్యారు ?
1) నికోలాస్ మదురో
2) జూలియస్ కారియో
3) ఆండ్రూ సిమ్సన్
4) హ్యూగో చావెజ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల జరిగిన వెనెజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలాస్ మదురో 67 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. తద్వారా రెండోసారి ఆ దేశ అధ్యక్ష పదవి చేపట్టారు. ఆయన మరో ఆరేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉంటారు. 2013లో మదురో తొలిసారి హ్యూగో చావెజ్ తర్వాత వెనెజులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
-
34.అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మే 18
2) మే 19
3) మే 20
4) మే 22
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐరాస సాధారణ సభ 2000 సంవత్సరంలో ఏటా మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. జీవ వైవిధ్య ఒడంబడిక అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జీవుల రక్షణ, సముద్ర కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
2018 Theme : Celebrating 25 years of Action for Biodiversity.
-
35. ఇటీవల కేరళలో బయటపడ్డ ఓ వైరస్ దేశవ్యాప్తంగా ప్రజలని భయాందోళనలకు గురి చేసింది. ఆ వైరస్ ఏది ?
1) నిఫా
2) ఎబోలా
3) నిమాహ్
4) జికా
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆ రాష్ట్రంలో పలువులు చనిపోయారు. ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్న నర్స్ లినీ కూడా వైరస్ బారిన పడి చనిపోయారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. కేరళకు అందించాల్సిన వైద్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థని సంప్రదించి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన వైద్య సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
-
36. దేశంలో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ?
1) తెలంగాణ
2) మణిపూర్
3) ఆంధ్రప్రదేశ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో భారత తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ మే 23న ఆమోదం తెలిపింది. ఈ విశ్వవిద్యాలయంలో క్రీడా శాస్త్రం, క్రీడా సాంకేతికత, అత్యుత్తమ శిక్షణ తదితర అంశాలపై కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం మణిపూర్ ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించింది. కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది.
-
37. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగ్నేయాసియాలో ట్రకోమాను పూర్తిగా నిర్మూలించిన దేశం ఏది ?
1) నేపాల్
2) చైనా
3) భారత్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నేపాల్ ను ట్రకోమాను పూర్తిగా నిర్మూలించిన దేశంగా ప్రకటించింది. 1980ల్లో నేపాల్ లో కంటి చూపు కోల్పోవడానికి కారణమయ్యే వ్యాధుల్లో ట్రకోమా రెండవదిగా నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేపాల్ కలిసి చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పుడు పూర్తిగా నిర్మూలించగలిగింది. ట్రకోమా కారణంగా 41 దేశాల్లో 190 మిలియన్ల మందికి పైగా కంటి చూపు పూర్తిగా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు.
-
38. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇటీవల వెల్లడించిన ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?
1) 54
2) 89
3) 44
4) 96
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇటీవల ప్రపంచ పోటీతత్వ సూచీని విడుదల చేసింది. ఇందులో భారత్ 44వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స లో అమెరికా తొలి స్థానంలో, హాంగ్‌కాంగ్ రెండో స్థానంలో, సింగపూర్ మూడో స్థానంలో నిలిచాయి. 2017 ర్యాంకింగ్స లో భారత్ 45వ స్థానంలో ఉంది.
-
39. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ఇటీవల ఈ కింది వారిలో ఎవరికి నారీ శక్తి పురస్కార్ - 2017 ని ప్రదానం చేశారు ?
1) ఐఎన్ఎస్వీ తరిణి టీమ్
2) ఐఎన్ఎస్వీ తేజాస్ టీమ్
3) ఐఎన్ఎస్వీ మన్సి టీమ్
4) ఐఎన్ఎస్వీ కార్లా టీమ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: లెఫ్టినెంట్ కమాండర్స్ వర్తికా జోషి, ప్రతిభా జమ్వాల్, పి.స్వాతి, లెఫ్టినెంట్లు ఐశ్వర్య బొడ్డపాటి, ఎస్ విజయా దేవి, పాయల్ గుప్తాలతో కూడిన భారత మహిళా నావికా సిబ్బంది.. ఐఎన్ఎస్వీ తరిణిలో ప్రపంచ యాత్రను దిగ్విజయంగా ముగించుకొని ఇటీవల తిరిగివచ్చింది. మొత్తం 254 రోజుల పాటు ఈ యాత్ర సాగింది. ఇటీవల కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ఐఎన్ఎస్వీ తరిణి సిబ్బందికి నారీ శక్తి పురస్కార్ - 2017 ను ప్రదానం చేశారు.
-
40. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) వివేక్ కుమార్ సింగ్
2) అనుబ్రాతా బిశ్వాస్
3) సునీల్ కుమార్ మిట్టల్
4) రాజేశ్ సైనీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐసీఐసీఐ బ్యాంక్ జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేసిన అనుబ్రాతా బిశ్వాస్.. ఇటీవల ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవోగా నియమితులయ్యారు. ఇంతకముందు శశి అరోరా ఈ పదవిలో ఉన్నారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ - కేవైసీ వివాదం నేపథ్యంలో ఆయన బాధ్యతలకు రాజీనామా చేశారు.
-
41. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డీసీజ్ స్టడీ - 2018 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవల అందుబాటు, నాణ్యత విషయంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 123
2) 145
3) 190
4) 100
- View Answer
- సమాధానం: 2
వివరణ: గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వైద్యసేవల అందుబాటు, నాణ్యత అంశానికి సంబంధించి ఆయా దేశాల ర్యాంకులు వెల్లడించింది. ఇందులో భారత్‌కు 145వ స్థానం దక్కింది. ఈ జాబితాలో చైనా 48, శ్రీలంక 71, బంగ్లాదేశ్ 133, భూటాన్ 134 ర్యాంకులను పొందగా నేపాల్ 149, పాకిస్థాన్ 154, అఫ్గానిస్థాన్ 191 ర్యాంకుల్లో ఉన్నాయి.
-
42. కర్ణాటక ముఖ్యమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి ఏ పార్టీకి చెందినవారు ?
1) జనతాదళ్ సెక్యూలర్
2) కాంగ్రెస్
3) భారతీయ జనతా పార్టీ
4) రాష్ట్రీయ్ర జనతా దళ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ నేత హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి మే 23న ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. విధానసౌధ ఆవరణలో కుమారస్వామి, పరమేశ్వరతో గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. కుమారస్వామి 2006 ఫిబ్రవరి 4 నుంచి 2007 అక్టోబర్ 9 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు.
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవగా.. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
-
43. తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాలో హైదరాబాద్ ఔషధ నగరి ప్రాజెక్టుని చేపట్టింది ?
1) రంగారెడ్డి జిల్లా
2) కరీంనగర్ జిల్లా
3) నల్గొండ జిల్లా
4) మహబూబ్ నగర్ జిల్లా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రంగారెడ్డి జిల్లా యాచారం, కందూరు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఔషధ నగరి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ నిపుణుల సమీక్షా కమిటీ సిఫార్సు మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
-
44. భారత్ సూపర్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ జీవిత కాలాన్ని 10 ఏళ్ల నుంచి ఎన్నేళ్లకు పొడగించింది ?
1) 12 ఏళ్లు
2) 15 ఏళ్లు
3) 20 ఏళ్లు
4) 25 ఏళ్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ మరోసారి విజయవంతంగా ప్రయోగించింది. క్షిపణి జీవిత కాలాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపొందించేలా భారతీయ శాస్త్రవేత్తలు తొలిసారిగా అభివృద్ధి చేసి నూతన సాంకేతికతను జోడించి ఈ ప్రయోగం చేపట్టారు. ఇప్పటికే సైనిక, నౌకాదళ రంగాల్లో బ్రహ్మోస్ సేవలందిస్తుండగా.. తాజా ప్రయోగంతో వైమానిక రంగంలోకీ అడుగుపెట్టినట్టయింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా పేరొందిన బ్రహ్మోస్‌ను భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా రూపొందించాయి.
-
45. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్ ఏ దేశ జట్టు ప్లేయర్ ?
1) దక్షిణాఫ్రికా
2) ఇంగ్లండ్
3) న్యూజిలాండ్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. డివిలియర్స్ అంతర్జాతీయంగా 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.
-
46. ఇటీవల కన్నుమూసిన యుద్ధనపూడి సులోచనా రాణి ఏ రంగంలో గుర్తింపు పొందారు ?
1) నాటకం
2) పాత్రికేయం
3) సాహిత్యం
4) వైద్యం
- View Answer
- సమాధానం: 3
వివరణ: సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఇటీవల అమెరికాలో కన్నుమూశారు. 1940 సంవత్సరంలో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో నెమలికంటి వెంకట చలపతిరావు, మహాలక్ష్మి దంపతులకు సులోచనారాణి జన్మించారు. చిత్ర నళినీయం అనే కథతో సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె సుమారు ఐదు దశాబ్దాల పాటు దాదాపు 80 నవలలను రచించారు. 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు హంస పురస్కారాన్ని ప్రదానం చేసింది.
-
47. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పైబడిన మత్స్యకారులకు ఎన్టీఆర్ భరోసా కింద నెలకు వెయి్య రూపాయల పింఛన్ మంజూరు చేసింది ?
1) 50 ఏళ్లు
2) 55 ఏళ్లు
3) 60 ఏళ్లు
4) 65 ఏళ్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: పేద మత్స్యకారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 33,122 పింఛన్లు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 65 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు ఈ పథకం కింద చేయూతనిస్తుండగా తాజాగా వయసు సడలింపు ఇచ్చి 50 ఏళ్లకు పైబడిన వారికి వర్తింపజేసింది. ఇప్పటికే చేనేత, కల్లుగీత కార్మికులకు 50 ఏళ్ల నుంచి పింఛను ఇస్తుంది.
-
48. బిజినెస్ వరల్డ్ నుంచి ఇటీవల డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ - 2018 పురస్కారం అందుకున్న వారు ఎవరు ?
1) కె. తారకరామారావు
2) అఖిలేశ్ యాదవ్
3) యోగి ఆదిత్యనాథ్
4) నారా లోకేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందుకున్నారు. చంద్రన్న సంచార చికిత్స, ఎఎన్ఎండీజీ యాప్స్‌కు బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్ అవార్డులు దక్కాయి. వీటిని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తరఫున ప్రజా ఆరోగ్యశాఖ నిర్దేశకులు డాక్టర్ అరుణ అందుకున్నారు.
-
49. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రిన్స్ హ్యారీ ఏ దేశ రాజకుమారుడు ?
1) ఇండోనేషియా
2) సౌదీ అరేబియా
3) బ్రిటన్
4) ఫిలిప్పైన్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36) వివాహం 2018 మే 19న ఘనంగా జరిగింది. బ్రిటన్‌లోని బెర్క్షైర్కౌంటీ విండ్సర్లోని సెయింట్‌జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా ఉన్నారు.
-
50. ఆఫ్ర ఆసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం ప్రపంచ సంపన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 2వ స్థానంలో
2) 6వ స్థానంలో
3) 10వ స్థానంలో
4) తొలి స్థానంలో
- View Answer
- సమాధానం: 2
వివరణ: మారిషస్ లోని ఆఫ్ర ఆసియా బ్యాంక్ ఇటీవల అంతర్జాతీయ సంపద వలస సమీక్ష పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ సంపన్న దేశాల జాబితాలో భారత్ 8,230 బిలియన్ డాలర్లతో 6వ స్థానంలో నిలిచింది. 62,584 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికా మొదటి స్థానంలో, 24,803 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 19,522 బిలియన్ డాలర్ల సంపదతో జపాన్ మూడో స్థానంలో నిలిచాయి.
-