కరెంట్ అఫైర్స్ (మే 1 - 7) బిట్ బ్యాంక్
1. ప్రపంచ వ్యాధినిరోధక టీకాల వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ మూడో వారం
2) మే మొదటి వారం
3) ఏప్రిల్ ఆఖరి వారం
4) మే రెండో వారం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ వ్యాధినిరోధక టీకాల వారోత్సవాన్ని ఏటా ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు. 2018 వారోత్సవాన్ని ఇటీవల ఏప్రిల్ 24 నుంచి 30 వరకు నిర్వహించారు. వ్యాధి నిరోధక టీకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా ఈ వారోత్సవాలను నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో అన్ని దేశాలు ఈ వారోత్సవాలను నిర్వహిస్తాయి.
Theme: ""Protected Together, #VaccinesWork''
- సమాధానం: 3
2. దేశంలోని ఎన్ని లక్షల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉందని కేంద్రం ఇటీవల ప్రకటించింది?
1) 5,97,464
2) రెండు లక్షలు
3) మూడు లక్షలు
4) ఒక లక్ష
- View Answer
- సమాధానం: 1
వివరణ: జనాభా లెక్కల్లో ఉన్న 5,97,464 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. నాలుగేళ్ల క్రితం మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల సంఖ్య 18,452 గా ఉంది. ఈ నేపథ్యంలో 2015 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెయ్యి రోజుల్లో దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు. అందుకు అనుగుణంగా 2018 ఏప్రిల్ 28 నాటికి ఆ పనిని పూర్తి చేశారు.
- సమాధానం: 1
3. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన ‘‘గోవర్ధన్ పథకాన్ని’’ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) తెలంగాణ
2) హర్యానా
3) గుజరాత్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వ్యర్థాలను జీవ ఇంధనం, గ్యాస్, కాంపోస్ట్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గోవర్ధన పథకాన్ని (GOBARDHAN -Galvanizing Organic Bio Agro Resources Dhan) ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా తొలుత హర్యానాలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 2
4. భారతహాకీ చీఫ్ కోచ్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) హరేంద్ర సింగ్
2) ధన్ రాజ్ పిళ్లై
3) భైచుంగ్ భూటియా
4) జీఈ శ్రీధరన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ గా ఉన్న హరేంద్ర సింగ్ భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ గా నియమితులయ్యారు. పురుషుల హాకీ జట్టు ఇంచార్జ్ కోచ్ గా ఉన్న జోర్డ్ మారిజైన్ మహిళల హాకీ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. ఇటీవల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ జట్లు విఫలమైన నేపథ్యంలో ఈ మార్పులు జరిగాయి.
- సమాధానం: 1
5. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఐ. వెంకట్
2) దేవులపల్లి అమర్
3) సితాన్షు రంజన్ కౌర్
4) గజేంద్ర చౌహాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 1983 బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి సితాన్షు రంజన్ కర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన కన్నా ముందు ఫ్రాంక్ నోరోన్హా ఈ పదవిలో ఉన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని 1919లో స్థాపించారు.
- సమాధానం: 3
6. 9వ భారత్, జపాన్ ఎనర్జీ డైలాగ్ ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) టోక్యో
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) హిరోషిమా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 9వ భారత్, జపాన్ ఎనర్జీ డైలాగ్ మే 1న న్యూఢిల్లీలో జరిగింది. విశ్వసనీయ, స్వచ్ఛ, ఆర్థిక భారం లేని ఇంధన విధానం దేశాల ఆర్థిక పురోగతికి కీలకమని ఈ tసందర్భంగా రెండు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇంధనం అంశంలో రెండు దేశాల మధ్య సహాయ సహకారాలను మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై రెండు దేశాల ప్రతినిధులు చర్చించారు.
- సమాధానం: 2
7. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) టీఎస్ విజయన్
2) సుభాష్ చంద్ర ఖుంతియా
3) ఆనంద్ మహీంద్రా
4) రాజీవ్ మీనన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుభాష్ చంద్ర ఖుంతియా నియామకానికి ఇటీవల ఆమోదం తెలిపింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.
- సమాధానం: 2
8. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మే 1
2) మే 2
3) మే 3
4) మే 4
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐరాస జనరల్ అసెంబ్లీ 1993లో ఏటా మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. పత్రికా స్వేఛ్చపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పాటిస్తారు.
Theme : "Keeping Power in Check: Media, Justice and The Rule of Law'
- సమాధానం: 3
9. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) జస్టిన్ లాంగర్
2) రికీ పాంటింగ్
3) వీవీఎస్ లక్ష్మణ్
4) స్టీవ్ వా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆస్ట్రేలియామాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఇటీవల ఆ దేశ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. ఇటీవల వెలుగు చూసిన బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో కోచ్ గా ఉన్న డేరెన్ లెహమన్ పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో లాంగర్‌ను నియమించారు.ఆస్ట్రేలియా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు నాలుగేళ్ల పాటు ఆయన ప్రధాన కోచ్ గా కొనసాగుతారు.
- సమాధానం: 1
10. ఏటీ కెర్నే (AT Kearney) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విశ్వాస సూచీ - 2018లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 15
2) 25
3) 30
4) 11
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ మేనేజింగ్ కన్సల్టింగ్ కంపెనీ ఏటీ కెర్నే (AT Kearney) ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విశ్వాస సూచీ - 2018ను విడుదల చేసింది. ఇందులో భారత్ 11వ ర్యాంకులో నిలిచింది. అమెరికా తొలి స్థానంలో, కెనడా రెండో స్థానంలో, జర్మనీ మూడో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 4
11. హైదరాబాద్‌కు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది ?
1) రూ.10 వేల కోట్లు
2) రూ.5,500 కోట్లు
3) రూ. 2 వేల కోట్లు
4) రూ. 8 వేల కోట్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: హైదరాబాద్‌కు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ.5,500 కోట్లు కేంద్ర నిధుల నుంచి ఇవ్వనున్నట్టు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు.
- సమాధానం: 2
12. దక్షిణ కొరియా టైమ్ జోన్‌తో సమన్వయం కోసం ఉత్తర కొరియా తమ టైమ్ జోన్‌ను ఎన్ని నిమిషాలు ముందుకు జరిపింది ?
1) 60 నిమిషాలు
2) 45 నిమిషాలు
3) 15 నిమిషాలు
4) 30 నిమిషాలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య ఇటీవల సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా టైమ్ జోన్‌తో సమన్వయం కోసం ఉత్తరకొరియా తమ టైమ్ జోన్‌ను 30 నిమిషాలు ముందుకు జరిపింది. ఇది రెండు దేశాల మధ్య ఐక్యతకు సూచన అని వెల్లడించింది.
- సమాధానం: 4
13. ప్రతిష్టాత్మక ఓఎన్వీ సాహిత్య ప్రైజ్ - 2018కి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎం.టి. వాసుదేవన్ నాయర్
2) గౌరీ లంకేశ్
3) అమితాబ్ చౌదరి
4) చేతన్ భగత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఎం.టి. వాసుదేవన్ నాయర్ ఇటీవల ఓ ఎన్ వీ లిటరరీ ప్రైజ్ - 2018కు ఎంపికయ్యారు. ప్రసిద్ధ కవి ఓ ఎన్ వీ కురుప్ మలయాళ సాహిత్యానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన స్మారకార్థం ఈ అవార్డుని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
14. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) ఇటీవల విడుదల చేసిన డోపింగ్ నిబంధనల ఉల్లంఘన జాబితాలో భారత్ ఎన్నో స్థానంలోఉంది?
1) 16
2) 14
3) 6
4) 5
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016లో పరిశీలించిన శాంపిల్స్ ఆధారంగా ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిబంధనలను ఉల్లంఘిస్తున్న దేశాల జాబితాను ఇటీవల విడుదల చేసింది. మొత్తం 69 కేసులలో భారత్ 6వ స్థానంలో నిలిచింది. రష్యా కూడా భారత్ తో పాటు ఆరో స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స లో ఇటలీ మొదటి స్థానంలో నిలువగా, ఫ్రాన్స రెండో స్థానం, అమెరికా మూడో స్థానం, ఆస్ట్రేలియా నాలుగో స్థానం, బెల్జియం ఐదో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 3
15. ఆసియా అభివృద్ధి బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక నివేదిక ప్రకారం 2018-19లో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కానుంది ?
1) 7.3 శాతం
2) 8 శాతం
3) 9 శాతం
4) 7.8 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆసియా అభివృద్ధి బ్యాంక్ తాజా ఆర్థిక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2018-19లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం నమోదు చేయనుంది. ఆ తర్వాత సంవత్సరంలో 7.6 శాతంగా నమోదు కానుంది.
- సమాధానం: 1
16. ఇటీవల "Apstar-6C'' ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన దేశం ఏది ?
1) భారత్
2) రష్యా
3) అమెరికా
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: చైనా ఇటీవల లాంగ్ మార్చ్ 3బీ రాకెట్ ద్వారా "Apstar-6C" అనే సమాచార ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది. 15 ఏళ్ల పాటు పనిచేసే ఈ ఉపగ్రహం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు టీవీ ట్రాన్సమిషన్, సమాచార, ఇంటర్నెట్, మల్టీ మీడియా సేవలు అందిస్తుంది.
- సమాధానం: 4
17. టిరోడా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
1) తెలంగాణ
2) మహారాష్ట్ర
3) ఒడిశా
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహారాష్ట్రలోని గోండియా జిల్లా టిరోరాలో టిరోడా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. అదానీ పవర్ లిమిటెడ్ ఈ ప్లాంట్ ని నిర్వహిస్తోంది. దీని సామర్థ్యం 3,300 మెగావాట్లు.
- సమాధానం: 2
18. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత 20 కాలుష్య నగరాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న నగరం ఏది ?
1) న్యూఢిల్లీ
2) కై రో
3) కాన్పూర్
4) ఢాకా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రపంచంలో 20 అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ మొదటిస్థానంలో నిలవగా ఈజిప్టు రాజధాని కైరో రెండు, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మూడోస్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో ముంబయి, ఐదో స్థానంలో చైనా రాజధాని బీజింగ్ ఉన్నాయి. అలాగే కాలష్యపూరిత నగరాల్లో 14 భారత్ లోనే ఉన్నాయి. 14 మిలియన్ల కంటే అధిక జనాభా ఉన్న నగరాల్లోని కాలుష్యంపై డబ్ల్యూహెచ్ఓ సర్వే చేసింది.
- సమాధానం: 3
19. 2019 జనవరిలో ప్రవాసీ భారతీయ దివాస్ ఏ నగరంలో జరగనుంది ?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) వారణాసి
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం:
వివరణ: ప్రవాసీ భారతీయ దివాస్ 2019, జనవరి 21 నుంచి 23 వరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాన మంత్రి జగన్నాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు.
Theme: Role of Indian Diaspora in building a New India' (నవభారత నిర్మాణంలో ప్రవాస భారతీయుల పాత్ర)
- సమాధానం:
20. కేంద్రం అమలు చేస్తున్న 11 వ్యవసాయ పథకాలను ఒకే గొడుగు కిందకు తెస్తూగతేడాది ప్రారంభించిన ‘హరిత విప్లవం- కృషి ఉన్నతి యోజన’పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది ?
1) 2018 డిసెంబర్ 31
2) 2019 డిసెంబర్ 31
3) 2020 మార్చి 31
4) 2022 జనవరి 1
- View Answer
- సమాధానం: 3
వివరణ: వ్యవసాయ రంగంలో కేంద్రం అమలు చేస్తున్న 11 పథకాలను ఒకే గొడుగు కిందకి తెస్తూ కేంద్రం చేపట్టిన కార్యక్రమానికి హరిత విప్లవం - కృషి ఉన్నతి యోజనగా నామకరణం చేసింది. రూ.33,269 కోట్లతో చేపడుతున్న ఈ పథకాన్ని 2020 మార్చి 31 వరకు పొడిగించింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
- సమాధానం: 3
21. ఇటీవల బ్రిటన్ హోంమంత్రిగా నియమితులైన సాజిద్ జావెద్ ఏ దేశానికి చెందిన వారు ?
1) భారత్
2) పాకిస్థాన్
3) ఆఫ్గనిస్థాన్
4) సిరియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్రిటన్ చరిత్రలో తొలిసారి పాకిస్థాన్ కు చెందిన సాజిద్ జావెద్ ఇటీవల హోంమంత్రిగా నియమితులయ్యారు. ఆయన 2010 నుంచి కన్జర్వేటివ్ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. కాగా బ్రిటన్ చరిత్రలో కీలకమైన మంత్రిత్వశాఖను నిర్వహించే మొదటి దక్షిణాసియా వ్యక్తి కూడా సాజిదే కావడం విశేషం.
- సమాధానం: 2
22. ఇటీవల ఏ సంస్థ అంగారక గ్రహంపై అన్వేషణ కోసం ‘‘ఇన్ సైట్’’ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ?
1) నాసా
2) ఇస్రో
3) రాస్ కాస్మోస్
4) జాక్సా
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంగారక గ్రహ నేల లోతుల్లో చోటుచేసుకునే ప్రకంపనలను వినడం కోసం ఇటీవల అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా అట్లాస్ - 5 అనే రాకెట్ ద్వారా ఇన్ సైట్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది 30 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించి అంగారక గ్రహం చేరుకుంటుంది.
- సమాధానం: 1
23. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ డిజిటల్ కమ్యునికేషన్ విధానం - 2018 ప్రకారం 2022 నాటికి ఈ రంగంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించింది?
1) 10 లక్షలు
2) 75 లక్షలు
3) కోటి
4) 40 లక్షలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ డిజిటల్ కమ్యునికేషన్ విధానం - 2018ని రూపొందించింది. దీని ప్రకారం 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాలు కల్పించడం, డిజిటిల్ కమ్యూనికేషన్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం.
- సమాధానం: 4
24. ఇటీవల వార్తల్లో నిలిచిన కేంబ్రిడ్‌జ అనలిటికా ఏ దేశానికి చెందిన సంస్థ ?
1) అమెరికా
2) జపాన్
3) బ్రిటన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫేస్బుక్ యూజర్ల డేటా దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్‌జ అనలిటికా మూతపడింది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే మూసివేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వాడినట్టు అనలిటికాపై ఆరోపణలు వచ్చాయి. భారత్‌కు చెందిన సుమారు 5 లక్షల మంది యూజర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
- సమాధానం: 3
25. 2018లో భారత్ వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుందని ఐక్యరాజ్యసమితి ఇటీవల అంచనా వేసింది ?
1) 7.2 శాతం
2) 6.2 శాతం
3) 5.2 శాతం
4) 8.2 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2019లో దీనిని 7.4 శాతంగా పేర్కొంది. భారత్ ఇన్ఫ్రాపై వ్యయాలు పెరగడంతోపాటు కార్పొరేట్, బ్యాంకు బ్యాలన్స్ షీట్లు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
- సమాధానం: 1
26. ఇటీవల పి. సి. చంద్ర పురస్కారం - 2018ని పొందిన గాయని ఎవరు ?
1) లతా మంగేష్కర్
2) ఆశా భోంస్లే
3) కేజే జేసుదాసు
4) ఉన్నీ మీనన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారికి ఏటా పి.సి. చంద్ర పురస్కారం ప్రదానం చేస్తారు. 2018 సంవత్సరానికి గాను ప్రముఖ గాయని అశా భోంస్లే ఈ అవార్డు పొందారు. ఆశా 1943లో గాయనిగా అరంగేట్రం చేశారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు పొందారు.
- సమాధానం: 2
27. వాట్సాప్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన దాని సహ వ్యవస్థాపకుడు ఎవరు ?
1) విలియమ్ బ్రియాన్
2) జాన్ కోమ్
3) విల్ మారియన్
4) రాబర్ట్ ఎల్ రిచ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాన్ కోమ్ ఆ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. వాట్సాప్‌ని 2014లో 19 బిలియన్ డాలర్లకు ఫేస్ బుక్ టేకోవర్ చేసుకుంది. ఇటీవల ఫేస్బుక్ పై డాటా దుర్వినియోగం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థతో జాన్ కోమ్కు వివాదాలు రేగాయి. దీంతో వాట్సప్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.
- సమాధానం: 2
28. 2018 సంవత్సరానికి సంబంధించి నాథూ లా సరిహద్దు ద్వారా భారత వ్యాపారులు ఇటీవల ఏ దేశంతో వ్యాపార కలాపాలు ప్రారంభించారు ?
1) చైనా
2) మయన్మార్
3) బంగ్లాదేశ్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: డోక్లామ్ వివాదం కారణంగా 2017లో భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వ్యాపారం నిలిచిపోయింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో సినో-ఇండియా సరిహద్దు, నాథూ లా సరిహద్దు ద్వారా 3.54 కోట్ల విలువైన వస్తువుల వ్యాపారం జరిగింది. ఇటీవల తిరిగి ఈ ద్వైపాక్షిక వ్యాపారం మళ్లీ ప్రారంభమైంది.
- సమాధానం: 1
29. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IPRI) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం సైనిక వ్యయంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 1
2) 2
3) 3
4) 5
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2017లో భారత సైనిక వ్యయం 63.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది.2016 తో పోలిస్తే ఇది 5.5 శాతం అధికమని సిప్రీ వెల్లడించింది. సైనిక వ్యయంలో 610 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో (228 బిలియన్ డాలర్లు) చైనా ఉనాయి.
- సమాధానం: 4
30. భారత్ - దక్షిణాఫ్రికా బిజినెస్ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగింది ?
1) జోహన్నెస్ బర్గ్, దక్షిణాఫ్రికా
2) న్యూఢిల్లీ, భారత్
3) హైదరాబాద్, భారత్
4) కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, దక్షిణాఫ్రికా బిజినెస్ సమ్మిట్ 2018 ఏప్రిల్ 29, 30వ తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్‌లో జరిగింది. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్టార్ట్ అప్స్, వాహనరంగం, వైద్యం, ఫార్మా, మైనింగ్, ఆగ్రో ప్రాసెసింగ్, మహిళా పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై ఈ సమ్మిట్ లో చర్చించారు.
Theme : United by legacy, Unified by prosperity
- సమాధానం: 1
31. ‘ప్రధాన మంత్రి వయ వందన యోజన’కింద ప్రస్తుతం ఉన్న పెట్టుబడి పరిమితిని కేంద్రం ఎంతకు పెంచింది ?
1) రూ.12 లక్షలు
2) రూ.15 లక్షలు
3) రూ.20 లక్షలు
4) రూ.7.5 లక్షలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: వృద్ధులకు ఆదాయ భరోసాని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద60 ఏళ్లకు పైబడిన వారు రూ.15,00,000 ల వరకు డిపాజిట్ చేయవచ్చు. వీటికి ఏడాదికి 8 శాతం వడ్డీ వస్తుంది. అలాగే నెలకి రూ.10,000 పింఛన్ లభిస్తుంది.
ప్రారంభంలో ఈ పథకం డిపాజిట్ పరిమితి రూ.7.5 లక్షలు, దీనికి పెన్షన్ నెలకి రూ.5 వేలుగా కేంద్రం తెల్పింది. అయితే ఇటీవల ఈ డిపాజిట్ మొత్తాన్ని రెండింతలు చేసి పరిమితిని రూ.15 లక్షలకు పెంచడంతో ఏడాదికి 8 శాతం వడ్డీతో పాటు నెలకి రూ.10,000 పింఛన్ లభిస్తుంది.
- సమాధానం: 2
32. 2017-18 సంవత్సరానికి గాను ఫుట్‌బాల్ రైటర్స్ అసోసియేషన్ నుంచి ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికై న ప్లేయర్ ఎవరు ?
1) క్రిస్టియానో రొనాల్డో
2) లియోనెల్ మెస్సీ
3) మొహమ్మద్ సలాహ్
4) కేవిన్ డి బ్య్రూన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆఫ్రికాకు చెందిన మొహమ్మద్ సలాహ్ 2017-18 సంవత్సరానికి గాను ఫుట్ బాల్ రైటర్స్ అసోసియేషన్ నుంచి ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికయ్యాడు. మాంచెస్టర్ టీమ్ కి చెందిన కెవిన్ డి బ్య్రూన్ రెండో స్థానంలో, టొట్టెన్ హామ్ కి చెందిన హ్యారీ కానే మూడో స్థానంలో నిలిచారు.
- సమాధానం: 3
33. 2018 మే 2న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) మొదటి స్థానం
2) రెండో స్థానం
3) నాలుగో స్థానం
4) 8వ స్థానం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇటీవల మే 2న ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్‌సలో భారత జట్టు 122 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 125 పాయింట్లతో ఇంగ్లండ్ మొదటి స్థానంలో, 113 పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచారుు.
- సమాధానం: 2
34. 2018, మే 4న ఎవరి అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 27వ సమావేశం జరిగింది ?
1) అరుణ్ జైట్లీ
2) ఉర్జిత్ పటేల్
3) రాజీవ్ కుమార్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 మే 4న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 27వ సమావేశం జరిగింది. చక్కెర కంపెనీలు అమ్మే ప్రతి కేజీ చక్కెరపై రూ.3 చక్కెర సెస్ విధించాలనే అంశంపై ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. దీని ద్వారా వచ్చే రూ.1540 కోట్లను చక్కెర మిల్లుల తరపున రైతులకు అందజేయాలన్నది కేంద్రం ఆలోచన.
- సమాధానం: 1
35. "Go to Village'' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) మిజోరాం
2) తెలంగాణ
3) మణిపూర్
4) బిహార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఇటీవల "Go to Village'' కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి వెళ్లి సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం.
- సమాధానం: 3
36. జీఐఎస్ వ్యవస్థ ద్వారా గంగా ప్రక్షాళనని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ’నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా’ఏ సంస్థతో కలిసి పనిచేస్తుంది ?
1) సర్వే ఆఫ్ ఇండియా
2) ఇస్రో
3) ఎన్ఐసీ
4) బీహెచ్ఈఎల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల జరిగిన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా సమావేశంలో రూ.531 కోట్లతో మరో నాలుగు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సహాయంతో గంగా ప్రక్షాళనను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేయాలని నిర్ణరుుంచారు. సర్వే ఆఫ్ ఇండియా భారత అతి పురాతన సైంటిఫిక్ డిపార్ట్మెంట్. దీన్ని 1767లో స్థాపించారు.
- సమాధానం: 1
37. అమెరికాలోని న్యూయార్క్ సివిల్ కోర్టు ఇంటెరిమ్ జడ్జిగా ఇటీవల నియమితులైన ఇండో అమెరికన్ ఎవరు ?
1) దీపా అంబేకర్
2) మీనా రవిచంద్రన్
3) రాజ రాజేశ్వరి
4) తేజస్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండో అమెరికన్ దీపా అంబేకర్ ఇటీవల న్యూయార్క్ సివిల్ కోర్టు ఇంటెరిమ్ జడ్జిగా నియమితులయ్యారు. దీనితో ఈ కోర్టులో మహిళా న్యాయమూర్తిగా నియమితులైన రెండో ఇండో అమెరికన్‌గా ఆమె గుర్తింపు పొందారు. రాజరాజేశ్వరి మొదటి మహిళా న్యాయమూర్తి.
- సమాధానం: 1
38. దశాబ్దాల తర్వాత తొలిసారి మహిళలకు డ్రైవింగ్ లెసెన్సులు జారీ చేసిన దేశం ఏది ?
1) పాకిస్థాన్
2) టర్కీ
3) ఇజ్రాయెల్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సౌదీ అరేబియా ఈ ఏడాది ప్రారంభంలోనే ఆ దేశంలో మహిళలపై ఉన్న డ్రైవింగ్ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. 2018, జూన్ 24 నుంచి మహిళలు డ్రైవింగ్ చేయవచ్చని తెలిపింది. అందుకు అనుగుణంగా తొలి బ్యాచ్ మహిళలకు ఇటీవల డ్రైవింగ్ లెసైన్సులను జారీ చేసింది.
- సమాధానం: 4
39. ’ది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’నుంచి ఇటీవల ఎంగెస్ట్ ఆథర్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని పొందిన నాలుగేళ్ల బాలుడు ఆయాన్ గోగోయ్ గోహెయిన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు ?
1) అస్సాం
2) సిక్కిం
3) నాగాలాండ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 1
వివరణ: అస్సాంకు చెందిన నాలుగేళ్ల బాలుడు ఆయాన్ గోగోయ్ గోహెయిన్ ఇటీవల ది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఎంగెస్ట్ ఆథర్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని పొందాడు. పిట్టకథలతో కూడిన హనికాంబ్ అనే పుస్తకానికి గాను అతడికి ఈ గౌరవం దక్కింది. ఈ పుస్తకానికి కవర్ పేజీని కూడా ఈ బాలుడే రూపొందించడం విశేషం.
- సమాధానం: 1
40. ఇటీవల ఏ రాష్ట్రంలో ఇండస్ డాల్ఫిన్ల సంఖ్య తెలుసుకునేందుకు సెన్సెస్ నిర్వహించారు ?
1) పశ్చిమ బెంగాల్
2) గోవా
3) పంజాబ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పంజాబ్ లోని తల్వారా, హారికె బ్యారేజ్ మధ్య బియాస్ నదిలో 185 కిలోమీటర్ల మేర ఇండస్ డాల్ఫిన్లు ఉన్నాయి. దేశంలో కేవలం ఈ ప్రాంతంలోనే ఇవి ఉన్నాయి. డబ్ల్యూబ్ల్యూఎఫ్ ఇండియా, పంజాబ్ అటవీ, జంతు సంరక్షణ శాఖ సంయుక్తంగా ఈ సెన్సెస్ నిర్వహించాయి.
- సమాధానం: 3
41. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మే 1
2) మే 3
3) మే 5
4) మే 7
- View Answer
- సమాధానం: 2
వివరణ: డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) ని 1971 మే 3న స్థాపించారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలు, విధానాలను గుర్తించి, వాటిని దేశ అవసరాలకు అనుగుణంగా వినియోగంలోకి తెచ్చేందుకు ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది.
- సమాధానం: 2
42. సౌర విద్యుత్ ను నిలువ చేసే జలాధార బ్యాటరీని ఇటీవల ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ?
1) కేంబ్రిడ్‌జ
2) స్టాన్ఫోర్డ్
3) అహ్మదాబాద్- ఐఐటీ
4) ఉస్మానియా విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
వివరణ: పవన, సౌర విద్యుత్‌ను నిల్వచేసే జలాధార బ్యాటరీని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. 3 అంగుళాల ఎత్తుండే ‘మాంగనీస్ హైడ్రోజన్ నమూనా బ్యాటరీ’ గ్రిడ్‌కు అవసరమైనప్పుడు విద్యుత్‌ను సరఫరా చేయగలదు. ఎల్ఈడీ కాంతులకు సమానంగా 20 మిల్లీవాట్ గంటల విద్యుత్‌ను ఇది నిక్షిప్తం చేయగలదు.
- సమాధానం: 2
43. కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రస్తుత చైర్మన్ ఎవరు ?
1) హెచ్ కే సాహూ
2) వై కే శర్మ
3) ఎం.ఎస్ అగర్వాల్
4) రాజీవ్ శర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ వై.కె. శర్మ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర జలసంఘం సభ్యునిగా నియమిస్తూ జలవనరుల మంత్రిత్వశాఖ 2018, మే 1న ఆదేశాలు జారీ చేసింది. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఉన్న హెచ్ కే సాహూకు కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
- సమాధానం: 1
44. ’ఫేస్బుక్లో ప్రపంచ నాయకులు’ పేరిట బర్సన్ కోన్ అండ్ వోల్ఫ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వారు ఎవరు ?
1) నరేంద్ర మోదీ
2) డొనాల్డ్ ట్రంప్
3) వ్లాదిమిర్ పుతిన్
4) షీ జిన్ పింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘ఫేస్బుక్లో ప్రపంచ నాయకులు’ పేరిట బర్సన్ కోన్ అండ్ వోల్ఫ్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. 650 మంది దేశాధిపతులు, ప్రభుత్వాధినేతలు, విదేశాంగ మంత్రులకు చెందిన ఫేస్బుక్ పేజీలను సంస్థ విశ్లేషించి ఈ జాబితా తయారు చేసింది. ఇందులో 4.32 కోట్ల మంది ఫాలోవర్లతో ప్రధాని నరేంద్ర మోదీ తొలి స్థానంలో ఉండగా, 2.31 కోట్ల మంది ఫాలోవర్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు.
- సమాధానం: 1
45. వేడుకల్లో రంగురంగుల పేపర్లు, ప్లాస్టిక్ ముక్కలను వెదజల్లేందుకు ఉపయోగించే స్వల్పస్థాయి విస్ఫోటక పరికరాలను నిషేధించిన సంస్థ ఏది ?
1) సుప్రీం కోర్టు
2) జాతీయ హరిత ట్రైబ్యునల్
3) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి
4) కేంద్ర హోంశాఖ
- View Answer
- సమాధానం: 3
వివరణ: వేడుకల్లో రంగురంగుల పేపర్లు, ప్లాస్టిక్ ముక్కలను వెదజల్లేందుకు ఉపయోగించే స్వల్పస్థాయి విస్ఫోటక పరికరాలైన పార్టీ పాపర్లపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిషేధం విధించింది. వాటి వినియోగంతో ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టువెల్లడించింది.
- సమాధానం: 3
46. 212 మీటర్ల ఎత్తు గల భారీ శివాజీ విగ్రహాన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు ?
1) అహ్మదాబాద్
2) వారణాసి
3) భోపాల్
4) ముంబాయి
- View Answer
- సమాధానం: 4
వివరణ: మహారాష్ట్ర రాజధాని ముంబాయి తీరంలో అరేబియా సముద్రంలో 212 మీటర్ల ఎత్తుతో ఛత్రపతి శివాజీ విగ్రహం నిర్మించనున్నట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నిర్మాణం పూర్తయ్యేనాటికి ప్రపంచంలోనే ఎత్తెన విగ్రహంగా రికార్డు సాధించేలా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.
- సమాధానం: 4
47. ప్రముఖ శాస్త్రవేత్త మానస్ విహారీ వర్మ ఇటీవల ఏ సంస్థ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు ?
1) ఏఎండీ
2) డీఆర్డీవో
3) ఇస్రో
4) ఎన్ఐసీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: అణు ఖనిజ అన్వేషణ, పరిశోధన సంస్థ (AMD- Atomic Minerals Directorate for Exploration and Research) డెరైక్టర్‌గా నియమితులైన ఎం.బి.వర్మ 2018 మే 1న బాధ్యతలు స్వీకరించారు. అణు ఇంధన సంస్థ (డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ) పరిధిలో ఎఎండీ పని చేస్తుంది.
- సమాధానం: 1
48. కింది వాటిలోని ఏ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం కుప్టి సాగునీటి ప్రాజెక్టుని చేపడుతోంది ?
1) కరీంనగర్
2) నిజామాబాద్
3) ఆదిలాబాద్
4) నల్గొండ
- View Answer
- సమాధానం: 3
వివరణ: కుప్టి బహుళార్థసాధక ప్రాజెక్టుని ఆదిలాబాద్ జిల్లా కుప్టి మండలం నేరడిగొండ గ్రామ సమీపంలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.794 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కడెం ప్రాజెక్టుకి అనుబంధంగా 5.30 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు.
- సమాధానం: 3
49. అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) క్రిష్ ఐయ్యర్
2) ప్రత్యూష్ కుమార్
3) కెన్నెత్ జస్టర్
4) అరుణ్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త చైర్‌పర్సన్‌గా వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ ఐయ్యర్ నియమితులయ్యారు. బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ స్థానంలో క్రిష్ ఎంపికయ్యారు. గౌరవ ప్రెసిడెంట్‌గా యూఎస్ అంబాసిడర్ టు ఇండియా కెన్నెత్ జెస్టర్, వైస్ చైర్మన్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కంట్రీ హెడ్ (ఇండియా) కాకు నఖాటే, కేపీఎంజీ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అరుణ్ కుమార్, సెక్రటరీ అండ్ ట్రెజరీగా అతుల్ధావన్ ఎంపికయ్యారు.
- సమాధానం: 1
50. మానవ చరిత్రలోనే తొలిసారిగా వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల స్థాయి ఇటీవల ఎంతగా నమోదైంది ?
1) 300 పీపీఎం
2) 410 పీపీఎం
3) 500 పీపీఎం
4) 250 పీపీఎం
- View Answer
- సమాధానం: 2
వివరణ: భూతాపానికి కారణమయ్యే కర్బన ఉద్గారాలు మానవ చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో పేరుకుపోయాయి. హవాయ్‌లోని మౌనా లోవా అబ్జర్వేటరీ అందించిన డేటా ప్రకారం 2018 ఏప్రిల్ లో 410 పీపీఎం స్థాయిని దాటాయి. 2017లోనూ కొంతకాలం పాటు ఈ వాయు పరిమాణం 410 PPM నుదాటింది.
- సమాధానం: 2