కరెంట్ అఫైర్స్ (జూన్ 1 - 7) బిట్ బ్యాంక్
1. మెనాకో గ్రాండ్ ప్రి ఫార్ములావన్ టైటిల్ విజేత ఎవరు?
1) కిమిరైక్కొనెన్
2) డేనియల్ రిక్కియార్డొ
3) లేవిస్ హమిల్టన్
4) సెబాస్టియన్ వెటల్
- View Answer
- సమాధానం: 4
2. అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నమెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) భవానిదేవి
2) పూర్ణిమదేవి
3) లక్ష్మీ సింఘాల్
4) రాధ రమణి
- View Answer
- సమాధానం: 1
3. ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాయిలెట్ల వాడకం కోసం ప్రారంభించిన ప్రచార కార్యక్రమం పేరు ఏమిటి?
1) క్లీన్ టాయిలేట్
2) దర్వాజా బంద్
3) శుభ్ర్ ఇండియా
4) హెల్త్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో టాయిలెట్ల వాడకాన్ని ప్రోత్సహించి, బహిరంగ మల విసర్జనను నిర్మూలించటం కోసం కేంద్ర ప్రభుత్వము దర్వాజా బంద్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి ప్రచారకర్తగా ‘‘అమితాబ్ బచ్చన్’’ వ్యవహరిస్తున్నారు.
- సమాధానం: 2
4. ఇటివల ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ‘‘మహిళ శ్రామికుల’’ రిపోర్టులో భారత్ స్థానం ఎంత?
1) 120
2) 125
3) 129
4) 131
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ బ్యాంకు మొత్తం 131 దేశాల గణాంకాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను తయారు చేసింది. 131 దేశాలలో భారత్ 120వ స్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం 2005 నుంచి మహిళల శ్రామిక శక్తి తగ్గుతుంది.
- సమాధానం: 1
5. ఆఫ్గనిస్థాన్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన టి.వి. ఛానల్ పేరు ఏమిటి?
1) రోష్ని టి.వి
2) జనానా టి.వి
3) జాన్ టి.వి
4) హమిదా టి.వి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆఫ్గనిస్తాన్‌లో మహిళల హక్కులు మరియు సాధికారత కోసం ప్రత్యేకం జాన్ టి.వి (Zan TV) ఛానల్‌ను ప్రారంభించారు.
- సమాధానం: 3
6. ‘‘యురోపియన్ గొల్డెన్ షూ’’ అవార్డుకు ఎంపికైంది ఎవరు?
1) హ్యారి కానే
2) రాబర్ట లెవన్డొస్కి
3) లియోనెల్ మెస్సి
4) బాస్ దోస్త్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బార్సిలొనా జట్టుకు చెందిన లైయోనల్ మెస్సి 4వ సారి ‘‘యురోపియన్ గొల్డెన్ షూ’’ అవార్డుకు ఎంపికయ్యాడు.
- సమాధానం: 3
7. ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ కొత్తగా ప్రవేశపెట్టిన అంతర్జాతీయ నటి కేటగిరీ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) రణవీర్‌సింగ్
2) ఐశ్వర్యారాయ్
3) ప్రియంకా చోప్రా
4) దీపికా పదుకోన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన అంతర్జాతీయ నటి కేటగిరిలో దాదాసాహెబ్ ఫాల్కే అకాడామి పురస్కారానికి ప్రియాంకా చోప్రా ఎంపికయ్యారు.
- సమాధానం: 3
8. భారత్ అభివృద్ధి చేసిన స్వదేశి జీపీఎస్ ‘‘నావిక్’’ ఏ సంవత్సరంలోపు అందుబాటులోకి వస్తుంది.?
1) 2024
2) 2022
3) 2020
4) 2018
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్ అభివృద్ధి చేసిన జీపీఎస్ వ్యవస్థ ‘‘నావిక్’’ (Navic) 2018 లోపు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నావిక్ వ్యవస్థ 7 ఉపగ్రహాల ద్వారా సమాచారం పొందుతుంది. భారతదేశం, సరిహద్దు ప్రాంతాల నావీగేషన్ అందిస్తుంది.
- సమాధానం: 4
9. ఇంగ్లండ్ టి 20 లీగ్ క్రికెట్లో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు ?
1) మిథాలిరాజ్
2) హర్మన్ ప్రీత్‌కౌర్
3) వేదకృష్ణమూర్తి
4) పూనమ్‌రౌత్
- View Answer
- సమాధానం: 1
10. తెలంగాణలో ఇటీవల సొలార్ పవర్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) మెదక్
2) కరీంనగర్
3) వరంగల్
4) నల్లొండ
- View Answer
- సమాధానం: 1
వివరణ: మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన 16 మెగావాట్ల సామర్థ్యం కల సోలార్ పవర్ ప్లాంట్‌ను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌ను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ రూ. 105 కోట్ల వ్యయంతో నిర్మించింది.
- సమాధానం: 1
11. ‘‘భారత మొబైల్ కాంగ్రెస్’’ ను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) గోవా
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ
4) కొల్కత్తా
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 సెప్టెంబర్ 27 - 29 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత మొబైల్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తారు.
- సమాధానం: 3
1) న్యూయార్క్
2) జెనీవా
3) పారిస్
4) ఫ్రాంక్ఫర్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 70వ ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని జెనీవాలో నిర్వహించారు.
- సమాధానం: 2
13. భారత్‌లో సోలార్ పై కప్పుల నిర్మాణం కోసం ఏ బ్యాంకు 100 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది?
1) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
2) ఎస్బీఐ
3) ప్రపంచ బ్యాంకు
4) ఆసియా అభివృద్ధి బ్యాంకు
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్‌లోని పరిశ్రమలు, ఇతర వాణిజ్య భవనాల పైకప్పులపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు 100 మిలియన్ డాలర్ల రుణం ఇస్తుంది. ఈ నిధులకు భారత ప్రభుత్వం హామీదారుగా వ్యవహరిస్తుంది.
- సమాధానం: 4
14. రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టనున్న నూతన రూపాయినోటు ఏ రంగులో ఉంటుంది ?
1) పింక్ - గ్రీన్
2) పసుపు - ఎరుపు
3) ముదురు గోధుమ - పసుపు
4) తెలుపు - నీలం
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత నాణేల చట్టం 2011 ప్రకారం నూతన రూపాయి విలువగల నోటును పింక్-గ్రీన్ రంగులో విడుదల చేయనుంది. ఈ నోటు మీద ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ సంతకం హిందీ, ఆంగ్లంలో ఉంటుంది.
- సమాధానం: 1
15. ప్రతిష్టాత్మక పెన్/మాలముద్ పురస్కారం-2017నకు ఎంపికైన రచయిత ఎవరు?
1) అరుంధతిరాయ్
2) మేధా పాట్కర్
3) ఝుంపా లాహిరి
4) అరవింద్ అడిగా
- View Answer
- సమాధానం: 3
వివరణ: పెన్ పురస్కారాలనే మాలముద్ పురస్కారం అని కూడ అంటారు. ఫాల్కనర్ ఫౌండేషన్ బెర్నాండ్ మాలముద్ గౌరవార్థం ఈ పురస్కారాలను ప్రారంభించింది. ఝుంపా లాహిరివ్రాసిన చిన్న కథ Knopf (2016) గాను ఆమెకు ఈ పురస్కారం లభించింది.
- సమాధానం: 3
16. ఆసియా - పసిఫిక్ ఎక్సలెన్స పురస్కారాలలో ‘‘హెచ్ ఆర్ ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్’’ పురస్కారమునకు ఎంపికైన సంస్థ?
1) హ్యుండాయ్
2) సామ్సంగ్
3) జియోమ
4) టాటామోటార్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ పురస్కారాల ప్రదానోత్సవాన్ని హంకాంగ్‌లో నిర్వహించారు. భారత్‌లో నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేసినందుకు గాను టాటా మోటార్సకు ఈ పురస్కారం లభించింది.
- సమాధానం: 4
17. ప్రతిష్టాత్మక ESPN ప్రపంచ ప్రఖ్యాత 100 వ్యక్తుల జాబితాలో తొలిస్థానంలో ఉంది ఎవరు?
1) రోజర్ ఫెదరర్
2) లైయోనిల్ మెస్సి
3) లెబ్రొన్ జెమ్స్
4) క్రిస్టియనో రొనాల్డ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ESPN ప్రపంచ ప్రఖ్యాత 100 వ్యక్తుల జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో తొలిస్థానంలో క్రిస్టియనో రొనాల్డొ ఉన్నారు. తరువాత స్థానాలలో లెబ్రొన్ జెమ్స్, లైయోనల్ మెస్సి, రొజర్ ఫెదరర్ ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లీ 13వ స్థానంలో, మహేంద్రసింగ్ ధోని 15వ స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 4
18. ఏ వ్యక్తి ముఖ చిత్రంతో ఇటివలపొస్టల్ స్టాంప్ విడుదల చేశారు?
1) ప్రణబ్ ముఖర్జీ
2) బల్వంత్ గార్గి
3) ప్రోహరి ప్రసాద్
4) ప్రోహర గోహల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్‌లో తొలిసారి ‘‘థియెటర్ డిపార్టమెంట్’’ను బల్వంత్ గార్గి ఏర్పాటు చేశారు. ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.
- సమాధానం: 2
19. ఇటీవల ఏ రాష్ట్రం ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సును పెంచింది ?
1) పశ్చిమ బెంగాల్
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ర్టంలో డాక్టర్ల కొరత తగ్గించటానికి ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 63 ఏళ్లకు పెంచింది. కేంద్ర ప్రభుత్వం క్రింద పని చేసే డాక్టర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ రాష్ర్టం కూడా డాక్టర్ల పదవీ విరమణను 60 నుంచి 62కు పెంచింది.
- సమాధానం: 2
20. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ పేరుతో డిజిటల్ వ్యాలెట్‌ను ప్రారంభించింది?
1) చార్మినార్ ఇ-వ్యాలెట్
2) పోరు ఇ - వ్యాలెట్
3) టి - వ్యాలెట్
4) ఎమ్ - వ్యాలెట్
- View Answer
- సమాధానం: 3
21. ప్రపంచ శాంతి ఇండెక్స్ 2017లో తొలిస్థానం లో ఉన్న దేశం ఏది?
1) ఆస్ట్రియా
2) పోర్చుగల్
3) న్యూజిల్యాండ్
4) ఐస్‌ల్యాండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పీస్ సంస్థ 163 దేశాల సమాచారం సేకరించిప్రపంచ శాంతి ఇండెక్స్ 2017ను తయారు చేసింది. ఈ ఇండెక్స్‌లో తొలిస్థానంలో ఐస్‌ల్యాండ్ ఉంది. తరువాత స్థానాలలో న్యూజిల్యాండ్, పోర్చుగల్, ఆస్ట్రియా ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 137వ ర్యాంకులో ఉంది.
- సమాధానం: 4
22. ప్రయాణికుల సంఖ్య ప్రకారం ప్రపంచంలో మూడో అతి పెద్ద విమానయాన మార్కెట్ ఏది?
1) చైనా
2) ఇండియా
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: పౌర విమానయాన స్వతంత్ర మంత్రి జయంత్ సిన్హా.. ‘‘2016-17’’ ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల ప్రయాణికులను విమానాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చినట్లు ప్రకటించారు. ఈ సంవత్సరంలో భారత్ మూడో అతి పెద్ద విమానయాన మార్కెట్‌గా అవరించింది.
- సమాధానం: 2
23. ప్రతిష్టాత్మక ఆసియా - పసిఫిక్ క్యాలిటీ నెట్వర్క అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది?
1) TSPSC
2) NAAC
3) UPSC
4) IGNOU
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉన్నత విద్యా ప్రమాణాలు కాపాడుతున్నందుకుగాను NAAC సంస్థ ఆసియా-పసిఫిక్ క్వాలిటీ నెట్వర్క అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 2
24. బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్(సీఓఏ) పదవికి ఇటీవల రాజీనామా చేసింది ఎవరు ?
1) వినోద్ రాయ్
2) డయనా ఎడుల్జ్
3) విక్రమ్ లీమాయే
4) రామ చంద్ర గుహ
- View Answer
- సమాధానం: 4
వివరణ: బీసీసీఐలో అవినీతి నిర్మూలనకు నలుగురు సభ్యులతో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా వినోద్ రాయ్, మాజీ క్రికెటర్ డయనా ఎడుల్జ్, విక్రమ్ లిమామే, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ నియమితులయ్యారు. అయితే వ్యక్తిగత కారణాలతో రామచంద్ర గుహ ఇటీవల ఈ పదవికి రాజీనామా చేశారు.
- సమాధానం: 4
25. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 1
2) జూన్ 3
3) జూన్ 5
4) జూన్ 7
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2001 సంవత్సరం నుంచి ఏటా జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రకటించింది.
- సమాధానం: 1
26. భారత్‌లో తొలి ఆటోమెటిక్ విపత్తుల సమాచార వ్యవస్థ కలిగిన రాష్ర్టం ఏది ?
1) ఒడిశా
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: తీరప్రాంతంలో రాబోయే విపత్తులను ముందుగానే గుర్తించి, సమాచారం అందించే వ్యవస్థ కలిగిన ఏకైక రాష్ర్టం ఒడిశా.
- సమాధానం: 1
27. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన దేశం ఏది?
1) చైనా
2) జర్మనీ
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2015 పారిస్ వాతవరణ ఒప్పందం మీద 195 దేశాలు సంతకాలు చేశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటం కోసం వాతవరణ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
- సమాధానం: 3
28. 13వ స్క్రిప్స్ జాతీయ స్పెల్ బీ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) రోహన్ రాజీవ్
2) అనన్య వినయ్
3) నుపుర్లాల
4) లక్ష్మీసంయుక్త
- View Answer
- సమాధానం: 2
వివరణ: కాలిఫోర్నియాకు చెందిన ఇండో - అమెరికన్ అమ్మాయి అనన్య వినయ్.. రోహన్ రాజీవ్‌ను ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ పురస్కారం క్రింద 40,000 అమెరికన్ డాలర్లు నగదు బహుమతి, ఒక ట్రోఫీ ప్రదానం చేస్తారు.
- సమాధానం: 2
29. ఆక్స్ఫొర్డ ‘‘పేదరికం మరియు మానవాభివృద్ధి నివేదిక’’ ప్రకారం ‘‘మల్టి డెమైన్షనల్’’ పేదరికం లోని చిన్నారులు అధికంగా ఉన్న దేశం ఏది?
1) పాకిస్థాన్
2) ఇథియోపియా
3) నైజీరియా
4) ఇండియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ‘‘మల్టి డెమైన్షనల్’’ అనగా జీవన ప్రమాణం, విద్య మరియు ఆరోగ్యం పొందలేనివారు. ఈ నివేదిక ప్రకారం 689 మిలియన్లు (31%) పిల్లలు మల్టి డెమైన్షనల్ పేదరికంలో ఉన్నారు. నైజీరియా 8%, ఇథియోపియా 7% మరియు పాకిస్థాన్‌లో 6% శాతంగా ఉన్నారు.
- సమాధానం: 4
30. ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఎంపికైన దేశాలు ఏవి ?
1) కువైట్
2) పోలాండ్
3) పెరూ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 5 తాత్కాలిక సభ్య దేశాలను భద్రతా మండలికి ఎంపిక చేసింది. 2018 జనవరి 1న వాటి పదవీ కాలం ప్రారంభమవుతుంది. అవి ఐవరీకోస్ట్, ఈక్వటొరియల్ గినియా, కువైట్, పొలాండ్, పెరు. వీటి పదవీ కాలం 2 సంవత్సరాలు. నెదర్లాండ్స, ఇటలీ ఒక సంవత్సర కాలానికి ఎంపికయ్యాయి.
- సమాధానం: 4
31. HCL ఆసియన్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
1) నితిన్ కుమార్ సిన్హా
2) క్రిస్టియన్ డిడైర్చిన్
3) కైనిషికొరి
4) పావాడ్రోన్ శ్రీ చాప్ప
- View Answer
- సమాధానం: 1
వివరణ: పూణెలో జరిగిన HCL ఆసియన్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సింగిల్స్ టైటిల్‌ను మలేషియాకు చెందిన క్రిస్టియన్ డిడైర్చిన్ను ఓడించి నితిన్ కుమార్ సిన్హా గెలుచుకున్నారు.
- సమాధానం: 1
32. ఇటివల భారతీయ రైల్వే 2030లోపు ఎంత కాలుష్య ఉదార్గాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) 5%
2) 15%
3) 21%
4) 33%
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతీయ రైల్వే ఈ సంవత్సరం 1.2 కోట్ల మొక్కలు నాటింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే 1000 మె.వా. సౌర విద్యుత్‌ను, 170 మె.వా. పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా 2030 లోపు 33% ఉదార్గాలను తగ్గించేందుకు కృషి చేస్తుంది.
- సమాధానం: 4
33. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వార్షిక పురస్కారానికి ఎంపికైన జిల్లా ఏది?
1) విశాఖపట్నం
2) పశ్చిమ గోదావరి
3) శ్రీకాకుళం
4) విజయనగరం
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలో 17 జిల్లాలు MGNREGA వార్షిక పురస్కారానికి ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లా ఈ జాబితాలో ఉంది.
- సమాధానం: 4
34. థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేత ఎవరు?
1) సాయి ప్రణీత్
2) జోనాతన్ క్రిస్టి
3) పాన్నవిత్ తొంగానౌమ్
4) పారుపల్లి కాశ్యప్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండోనేషియాకు చెందిన జొనాతన్ క్రిస్టిని ఓడించి సాయి ప్రణీత్ థాయ్ లాండ్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు.
- సమాధానం: 1
35. ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స - 2017లో భారత్ స్థానం ఎంత?
1) 5
2) 25
3) 41
4) 45
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స 63 దేశాలను పరిగణనలోకి తీసుకుని తయారు చేశారు. తొలిస్థానంలో హంకాంగ్, తరువాత స్థానాలలో స్విట్జర్లాండ్, సింగపూర్ ఉన్నాయి. భారత్ 45వ ర్యాంకు (2016లో 41వ ర్యాంకు)లో ఉంది. వెనెజులా చివరి (63) స్థానంలో వుంది.
- సమాధానం: 4
36. ఇటీవల మోదీ (MODI) ఉత్సవాన్ని ఏ ప్రాంతంలో నిర్వహించారు?
1) కృష్ణా
2) కర్నూలు
3) విశాఖ పట్నం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: MODI - Making of Developed India
కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన ప్రాంతాలలో కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలలో మోదీ ఉత్సవాలు నిర్వహించారు.
- సమాధానం: 4
37. ఇటీవల భారత్ ఏ దేశంతో నేరస్తుల అప్పగింత ఒంప్పందం కుదుర్చుకుంది ?
1) జర్మనీ
2) స్పెయిన్
3) ఫ్రాన్స
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశంతో 7 ఒప్పందాలు కుదిరాయి. నేరస్తుల అప్పగింత, దౌత్య పాస్‌పోర్టులు, అవయవాల మార్పిడి, సైబర్ భద్రత, పారవిమానయానం, పునరుత్పాదక శక్తివనరులు, భారత విదేశీ సర్వీసు ఇనిస్టిట్యూట్ మరియు డిప్లమేటిక్ అకాడమి ఆఫ్ స్పెయిన్ ఈ ఒప్పందాల్లో ముఖ్యమైనవి.
- సమాధానం: 2
38. ఇటీవల ఏ రాష్ర్ట ప్రభుత్వం ఒంటరి మహిళలకు పింఛన్ పథకాన్ని ప్రారంభించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కేరళ
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోనే తొలిసారిగా ఒంటరి మహిళలకు ప్రతినెల వెయ్యి రూపాయల పింఛన్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అవివాహితలు, జోగిని మరియు విడాకులు తీసుకున్న స్త్రీలకు వర్తిస్తుంది. ఒంటరి మహిళల యొక్క పిల్లలకు తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆడ్మిషన్ ఇస్తారు.
- సమాధానం: 2
39. సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే పదవ తరగతి తప్పనిసరి అనే ప్రతిపాదన రాష్ర్టం ఏది?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్ర ప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు జడ్పీ చైర్మన్ తదితర పదవులకు పోటీ చేసేందుకు పదవ తరగతి విద్యార్హతను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.
- సమాధానం: 3
40. ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) జూన్ 8
2) జూన్ 10
3) జూన్ 12
4) జూన్ 20
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐక్య రాజ్యసమితి 2008లో అధికారకంగా తొలిసారి ప్రపంచ సముద్రాల దినోత్సవంను నిర్వహించింది.
2017 Theme : Third - our oceans, our future
- సమాధానం: 1
41. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది?
1) తెలంగాణ కిట్
2) శిశు రక్ష
3) అమ్మ లాలన
4) కేసీఆర్ కిట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించడం, సిజేరియన్లు తగ్గించేందుకు ‘‘కేసీఆర్ కిట్’’ పేరుతో ప్రత్యేక పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 3న హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ కిట్ విలువ రెండు వేలు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇస్తారు.
- సమాధానం: 4
42. ఇటీవల ‘‘జియో స్పేషియల్ టెక్నాలజీ సెంటర్’’ను ఎక్కడ ప్రారంభించారు ?
1) విజయవాడ
2) గుంటూరు
3) కాకినాడు
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 2
వివరణ: గుంటూరు సమీపంలోని లాంఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జియో స్పేషియల్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ సెంటర్ ఏర్పాటు చేశాయి.
- సమాధానం: 2
43. ఆంధ్రప్రదేశ్‌లో బాబా అటామిక్ రీసెర్చ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) కొవ్వూరు
2) సర్పవరం
3) అచుత్యపురం
4) కావలి
- View Answer
- సమాధానం: 3
వివరణ: విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అచుత్యాపురం, బిల్లి మండలాల్లో సుమారు 2,884.66 ఎకరాల భూమిని కేటాయించారు.
- సమాధానం: 3
44. ప్రతిష్ఠాత్మక స్కొచ్ ిసీఎస్సీ పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) వర ప్రసాద్ రెడ్డి
2) సత్య సుందరం
3) శ్రీజన్ సందిప్
4) మానాల రవి
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా బెజ్జంకిలోని ‘‘కామన్ సర్వీసు సెంటర్’’లో డిజిటల్ సేవకుడిగా పని చేస్తున్న మానాల రవి స్కోచ్ సీఎస్సీ పురస్కారంనకు ఎంపికయ్యారు.
- సమాధానం: 4
45. గోపాల రత్న పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) రామ చంద్రా రెడ్డి
2) అనిల్ వర్మ
3) సుధీర్ చంద్రా రెడ్డి
4) వెంకట చలపతి రావు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భూదాన్ పొచంపల్లికి చెందిన వెదిరె సుధీర్ చంద్రా రెడ్డి గోపాలరత్న పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 3
46. ‘‘మిషన్ అంత్యోదయ’’ కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన గ్రామాలు ఎన్ని?
1) 1854
2) 2584
3) 3249
4) 4967
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహాత్మగాంధీ 150వ జయంతి నాటికి దేశవ్యాప్తంగా కనీసం 50 వేల గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ అంత్యోదయ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
- సమాధానం: 2
47. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) జూన్ 1
2) జూన్ 3
3) జూన్ 5
4) జూన్ 7
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 థీమ్ - connecting people to nature
- సమాధానం: 3
48. ‘‘ది మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యపినెస్’’ పుస్తక రచయిత ఎవరు?
1) ఝుంపా లాహిరి
2) చెతన్ భగత్
3) తస్లిమా నస్రీన్
4) అరుంధతి రాయ్
- View Answer
- సమాధానం: 4
49. 16వ వార్షిక గ్లోబల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2017లో తొలిస్థానంలో ఉన్న దేశం ఏది?
1) భారత్
2) చైనా
3) మలేషియా
4) టర్కీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాకు చెందిన A.T. Kearney అనే మేనేజ్మెంట్ కంపెని గ్లొబల్ ఇండెక్స్‌ను 30 అభివృద్ధి చెందుతున్న దేశాలను పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది. ఈ ఇండెక్స్‌లో తొలిస్థానంలో భారత్.. ఆ తర్వాతి స్థానాలలో చైనా, మలేషియా మరియు టర్కీ ఉన్నాయి. గత సంవత్సరం తొలిస్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారత్ ఈ సంవత్సరం తొలి స్థానంలోకి వచ్చింది.
- సమాధానం: 1
50. ఇటివల ఇస్రో అంతరిక్షంలోకి పంపిన సమాచార ఉపగ్రహం పేరు ఏమిటి?
1) GSAT - D1
2) GSAT - 19
3) GSAT - 25D
4) GSAT - E2C
- View Answer
- సమాధానం: 2
వివరణ: GSLV Mk-III అంతరిక్ష వాహక నౌక నుండి GSAT 19 (3,136 kg) సమాచార ఉపగ్రహంను అంతరిక్షంలోకి పంపారు. GSAT-19 జీవిత కాలం 10 సంవత్సరాలు.
- సమాధానం: 2