కరెంట్ అఫైర్స్ ( జూలై 17 - 24) బిట్ బ్యాంక్
1. 8వ కార్నివాల్ ఆఫ్ థియేటర్‌ను నిర్వహించనున్న దేశం ఏది?
1) జపాన్
2) భారత్
3) కెనడా
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కార్నివాల్ ఆఫ్ థియేటర్‌ను "థియేటర్ ఒలింపిక్స్" అని కూడా పిలుస్తారు. 2018 ఫిబ్రవరిలో భారత్ తొలిసారిగా కార్నివాల్ ఆఫ్ థియేటర్‌ను నిర్వహించే అవకాశం పొందింది.
- సమాధానం: 2
2. అమెరికా ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి ?
1) THAAD
2)AREANA
3)MALOS
4) ROTERM
- View Answer
- సమాధానం: 1
వివరణ: THAAD - Terminal High Altitude Area Defence.
ఈ వ్యవస్థ ద్వారా చిన్న, మధ్య తరహా, దీర్ఘశ్రేణి క్షిపణులను నాశనం చేయవచ్చు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో అమెరికా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించింది.
- సమాధానం: 1
3. "Dalhousie.. Through My Eyes", పుస్తక రచయిత ఎవరు ?
1) కిరణ్ చద్దా
2) అమిర్ పటౌడీ
3) రాజేంద్ర కుమార్
4) కమీలుద్దీన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ పుస్తకాన్ని రచించిన కిరణ్ చద్దా.. విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ హిల్ స్టేషన్ డల్హౌసి గురించి ఈ పుస్తకంలో వివరించారు.
- సమాధానం: 1
4. ఇటీవల ఏ ప్రాంతంలో దేశంలో తొలి సోలార్ రైలుని ప్రారంభించారు ?
1) గాంధీనగర్
2) గోరఖ్‌పూర్
3) ఖరగ్‌పూర్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ:1,600 హెచ్‌పీ సోలార్ పవర్ వ్యవస్థతో కూడిన దేశంలోని తొలి సోలార్ రైలుని న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూ.13.54 కోట్ల వ్యయంతో ఈ రైలుని తయారు చేశారు. దీని జీవితకాలం 25 ఏళ్లు.
- సమాధానం: 4
5. దేశంలోని ఏ రాష్ట్రం తొలిసారిగా సూపర్ కాప్ బెల్ట్‌ను పోలీసులకు అందజేసింది ?
1) గోవా
2) సిక్కిం
3) న్యూఢిల్లీ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: యూకే, అమెరికా, రష్యాలలో పోలీసులు సూపర్ కాప్ బెల్ట్‌ను ఉపయోగిస్తారు. దేశంలో తొలిసారిగా ఢిల్లీ రాష్ట్రం పోలీసులకు ఈ తరహా బెల్ట్‌లను ప్రవేశపెట్టింది.
- సమాధానం: 3
6. కొనసాగించగలిగిన అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్‌లో భారత్ స్థానం ఎంత ?
1) 99
2) 116
3) 128
4) 140
- View Answer
- సమాధానం: 2
వివరణ: కొనసాగించగలిగిన అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్‌ను Sustainable development solutions network, BertelsMann కలిసి సంయుక్తంగా తయారు చేశాయి. 157 దేశాలలో భారత్ 116వ ర్యాంకు దక్కించుకుంది.
- సమాధానం: 2
7. గ్లోబల్ మైగ్రేషన్ 2010-2015 నివేదిక ప్రకారం ఏ దేశానికి చెందిన ప్రజలు ఎక్కువగా వలస వెళ్లటానికి ఆసక్తి చూపిస్తున్నారు ?
1) నైజీరియా
2) భారత్
3) కాంగో
4) సుడాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐక్యారాజ్య సమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ తయారు చేసిన గ్లోబల్ మైగ్రేషన్ 2010 - 2015 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక ప్రజలు అమెరికా, యూకే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, దక్షిణాఫ్రికాకు వలస వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ దేశాలకు వెళ్లేందుకు అత్యధికంగా నైజీరియా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భారత్ రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో కాంగో, సుడాన్, బంగ్లాదేశ్, చైనా ఉన్నాయి.
- సమాధానం: 1
8. బీఎండబ్ల్యూ కంపెనీ జర్మనీకి వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి శాఖను ఎక్కడ ఏర్పాటు చే సింది ?
1) భారత్
2) కెనడా
3) అమెరికా
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: జర్మనీకి చెందిన కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ.. ఆ దేశం వెలుపల అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రాన్ని చైనాలో ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ వాహనాలకు అతిపెద్ద మార్కెట్ కూడా చైనానే.
- సమాధానం: 4
9. సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
1) ప్రొ. ఆండర్సన్
2) ప్రొ. సుబ్ర సురేష్
3) ప్రొ. పొదిలి అప్పారావు
4) ప్రొ. సుబ్రమణ్య అయ్యర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐఐటీ - మద్రాస్‌కు చెందిన పూర్వ విద్యార్థి ప్రొ. సుబ్ర సురేష్ సింగపూర్‌లోని నాన్ యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి 4వ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
- సమాధానం: 1
10. భారతీయ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న గెలాక్సీకి ఏ పేరు పెట్టారు ?
1) సరస్వతి
2) గోదావరి
3) గంగా
4) దామోదర
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐఐఎస్ఈ - పూణెకు చెందిన పీహెచ్డీ విద్యార్థి శిశిర్ సారఖ్యయన్.. సూర్యుని కంటే 20 మిలియన్ల పెద్దదైన గెలాక్సీల గుంపును కనుగొన్నారు. దీనికి సరస్వతి అని పేరు పెట్టారు.
- సమాధానం: 1
11. 212వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించటం జరిగింది ?
1) లక్నో
2) భువనేశ్వర్
3) ఉదయ్‌పూర్
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ.. ఉదయ్‌పూర్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాలను ప్రారంభించారు.
- సమాధానం: 3
12. ప్రపంచంలో తొలి సఓలా (జింక) సంతానోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన దేశం ఏది ?
1) భారత్
2) నార్వే
3) రష్యా
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆసియాలో కన్పించే సఓలా(Saola) అనే జింక అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉంది. ఈ జాతిని కాపాడేందుకు వియత్నాం ఒక సంతానోత్పత్తి కేంద్రాన్ని "బచ్ మా జాతీయ పార్కు" లో 2018లోపు ప్రారంభించనుంది. సఓలా ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద క్షీరదము.
- సమాధానం: 4
13. దేశంలో అత్యంత ప్రభావితం చేసే బ్రాండ్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న బ్రాండ్ ఏది ?
1) పతంజలి
2) గూగుల్
3) మైక్రోసాఫ్ట్
4) ఫేస్బుక్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పారిస్‌కు చెందిన ప్రముఖ మార్కెట్ పరిశోధన కంపెనీ "IPSOS" ఇండియాలోని 10 అత్యంత ప్రభావితం చేసే బ్రాండ్ల జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో తొలి స్థానంలో గూగుల్, తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, పతంజలి ఉన్నాయి.
- సమాధానం: 2
14. వినియోగదారుల సంతృప్తి ఇండెక్స్‌లో తొలి స్థానంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏది ?
1) రాయ్‌పూర్ విమానాశ్రయం
2) శంషాబాద్ విమానాశ్రయం
3) బాంబే విమానాశ్రయం
4) భువనేశ్వర్ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ నివేదికను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఇందులో రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయం తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో ఉదయ్‌పూర్, అమృత్సర్, డెహ్రాడూన్ విమానాశ్రయాలు ఉన్నాయి.
- సమాధానం: 1
15. సార్క్ దేశాల శాంతి భద్రతల మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) కరాచీ
3) ఖాట్మాండు
4) కొలంబో
- View Answer
- సమాధానం: 4
వివరణ: 8వ సార్క్ దేశాల శాంతి భద్రతల (హోంమంత్రుల) సమావేశాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలో నిర్వహించారు.
- సమాధానం: 4
16. యూనిసెఫ్ ఇటీవల ఎవరిని గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్‌గా నియమించింది ?
1) రాధాసింగ్
2) లిల్లీసింగ్
3) డేవిడ్ హ్యారీ
4) లూథరన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: లిల్లీసింగ్ భారత సంతతికి చెందిన కెనడా పౌరురాలు. యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమెని యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్‌గా నియమించింది. యూనిసెఫ్ ప్రారంభించిన యూత్ అండ్ చేంజ్ కార్యక్రమానికి ఆమె ప్రచారం చేస్తుంది.
- సమాధానం: 2
17. ఇటీవల మార్లీబోన్ క్రికెట్ క్లబ్లో గౌరవ జీవితకాల సభ్యత్వం పొందినది ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) రవీంద్ర జడేజా
3) మిస్బా ఉల్ హక్
4) మహమ్మద్ సమీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఇటీవల మార్లీబోన్ క్రికెట్ క్లబ్లో గౌరవ జీవితకాల సభ్యత్వం పొందాడు.
- సమాధానం: 3
18. ఇటీవల ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ నింగిలోకి 73 ఉపగ్రహాలను పంపింది ?
1) రాస్ కాస్మోస్
2) ఇస్రో
3) నాసా
4) జాక్సా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్మోస్ సోయెజ్ రాకెట్ ద్వారా బైకనూర్ నుంచి 73 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.
- సమాధానం: 1
19. ఇటీవల ఏ రైల్వే స్టేషన్లో పూర్తిగా మహిళా సిబ్బందిని నియమించారు ?
1) నల్గొండ రైల్వే స్టేషన్
2) శ్రీకాకుళం రైల్వే స్టేషన్
3) మాతుంగ రైల్వే స్టేషన్
4) నాగర్ కోయిల్ రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మహిళా సాధికారత సాధించేందుకు సెంట్రల్ రైల్వే పరిధిలోని మాతుంగ రైల్వే స్టేషన్లో పూర్తిగా మహిళా ఉద్యోగులను నియమించారు.
- సమాధానం: 3
20. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కిలోమీటర్లకు ఒక పాస్ పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రతిపాదించింది ?
1) 25 కి.మీ.
2) 50 కి.మీ.
3) 75 కి.మీ.
4) 1,100 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
వివరణ: విదేశీ వ్యవహారాల సహాయమంత్రి ఎమ్ జే అక్బర్ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్ల ప్రకటించారు.
- సమాధానం: 2
21. చైనా నిషేధించిన ఏ ఉత్సవాలను ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించటం జరిగింది ?
1) ఫాలున్ గోంగ్
2) లాట్నర్ ఉత్సవం
3) క్వింగ్ ఉత్సవం
4) రోమెట్టి ఉత్సవం
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనా నిషేధించిన ఈ ఉత్సవాలను న్యూఢిల్లీలో ఫాలున్ దాఫా అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఈ ఉత్సవాల ద్వారా శాంతి, సహనం, సామరస్యం అనే సందేశాలను తెలియజేయడం జరిగింది.
- సమాధానం: 1
22. ఇటీవల ఏ దేశం దక్షిణ చైనా సముద్రం పేరుని ఉత్తర నాటున సముద్రం అని మార్చింది ?
1) ఫిలిప్పీన్స్
2) మలేషియా
3) ఇండోనేషియా
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండోనేషియా ప్రత్యేక ఆర్థిక జోన్ ప్రాంతంలోని దక్షిణ చైనా సముద్రం పేరుని ఉత్తర నాటున అని మార్చింది. 2011లో ఫిలిప్పీన్స్ కూడా దక్షిణ చైనా సముద్రంలో తన పరిధిలోని జలాలకు పశ్చిమ ఫిలిప్పిన్స్ సముద్రంగా మార్చింది.
- సమాధానం: 3
23. శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ఎవరిని రాయబారిగా నియమించింది ?
1) మహమ్మద్ సమీ
2) నవాజుద్దీన్ సిద్ధిఖీ
3) రాజ్ హింద్రా
4) బిలాల్ దార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఊలర్ సరస్సులో చెత్త ఏరుకుని జీవనం సాగించే బిలాల్ దార్ స్వచ్ఛ శ్రీనగర్ రాయబారిగా నియమితులయ్యారు. ఇతనికి ఒక వాహనం, యూనిఫాం ఇస్తారు. చెత్త నిర్వహణ, వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
- సమాధానం: 4
24. 18వ అంతర్జాతీయ భారతీయ చిత్రాల అకాడమీ పురస్కారాలలో ఉత్తమ నటుడి అవార్డుకి ఎంపికైంది ఎవరు ?
1) షారుఖ్ ఖాన్
2) షాహిద్ కపూర్
3) అక్షయ కుమార్
4) అభిషేక్ బచ్చన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాలోని న్యూజెర్సీలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉడ్తా పంజాబ్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డుని షాహిద్ కపూర్, ఉత్తమ నటి అవార్డుని ఆలియా భట్ అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా "నీరజా" ఎంపికైంది. ఉత్తమ దర్శకుడి అవార్డుని పింక్ చిత్రానికి గాను అనిరుద్ద రాయ్ చౌదరి అందుకున్నారు.
- సమాధానం: 2
25. ప్రపంచ ఉత్తమ 15 నగరాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న నగరం ఏది ?
1) ఉదయ్‌పూర్
2) క్యోటా
3) సాన్ మిగ్యుల్ అలెండే
4) చార్లెస్టన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ ఉత్తమ 15 నగరాల జాబితాను ప్రముఖ ట్రావెల్ మరియు లీజర్ మ్యాగజైన్ ప్రకటించింది. పర్యాటకులు ఇచ్చిన రేటింగ్ ద్వారా వీటిని ఎంపిక చేసింది. ఇందులో మెక్సికోలోని సాన్ మిగ్యుల్ అలెండే నగరం తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో చార్లెస్టన్ (అమెరికా), చియాంగ్మాయి (థాయిలాండ్), క్యోటో (జపాన్) ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ నగరం ఉదయ్‌పూర్ (14వ స్థానం).
- సమాధానం: 3
26. ప్రతిష్టాత్మక విక్టోరియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) హరిందర్ పాల్ సంధు
2) పిడ్రో స్చ్యూర్ట్మాన్
3) పీటర్ నికోల్
4) సైమన్ పార్క్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మెల్బోర్న్లో జరిగిన విక్టోరియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్నును నెదర్లాండ్స్‌కు చెందిన పిడ్రో స్చ్యూర్ట్మాన్ ను ఓడించి హరిందర్ పాల్ సంధు గెలుచుకున్నాడు.
- సమాధానం: 1
27. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) జూలై 15
2) జూలై 17
3) జూలై 19
4) జూలై 21
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1998లో రోమ్ లిఖిత చట్టం ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇది 2002 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ప్రజలలో న్యాయం, మరియు కోర్టుల పనితీరుపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఏటా జూలై 17న నిర్వహిస్తారు.
- సమాధానం: 2
28. అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూలై 14
2) జూలై 16
3) జూలై 18
4) జూలై 20
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రముఖ దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర యోధుడు, మానవ హక్కుల నేత నెల్సన్ మండేలా గౌరవవార్థం జూలై 18ని అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి2009లో ప్రకటించింది.
- సమాధానం: 3
29. ఇటీవల ఏ ఆటోమోబైల్ సంస్థ తొలి బయో - మీథేన్ బస్సుని తయారు చేసింది ?
1) మహింద్రా అండ్ మహింద్రా
2)విప్రో
3)రిలయన్స ఇండస్ట్రీస్
4) టాటా మోటార్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: టాటా మోటార్స్ దేశంలోనే తొలిసారిగా బయో - మీథేన్ బస్సుని అభివృద్ధి చేసింది. ఈ బస్సుకి వాడే ఇంధనాన్ని చెత్త నుంచి అభివృద్ధి చేస్తారు. తద్వారా నగరాల్లో వ్యర్థాల సమస్య తగ్గుతుంది.
- సమాధానం: 4
30. 131వ వింబుల్డన్ చాంపియన్‌షిప్ - 2017 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?
1) మారిన్ సిలిక్
2) జామి ముర్రే
3) హెన్రీ కొన్టిన్నై
4) రోజర్ ఫెదరర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ టోర్నీ సింగిల్స్ ఫైనల్లో మారిన్ సిలిక్ను ఓడించి రోజర్ ఫెదరర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తద్వారా ఈ టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. (35 ఏళ్ల 11 నెలలు).
- సమాధానం: 4
31. కార్గిల్ అంతర్జాతీయ మారథాన్‌ను ఏ పేరుతో నిర్వహించారు ?
1) రన్ ఫర్ స్నో
2) రన్ ఫర్ సర్హద్
3) రన్ ఫర్ రివర్స్
4) రన్ ఫర్ లైఫ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర్జాతీయ కార్గిల్ మారథాన్‌లో 800 మంది పాల్గొన్నారు. కార్గిల్‌లోని టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి ప్రారంభమై.. ద్రాస్ వార్ మెమోరియల్ మీదుగా సాగి మళ్లీ అదే ప్రాంతంలో మారథాన్‌ను ముగించారు. జహీర్ అబ్బాస్ 6 గంటల్లో 60 కిలోమీటర్లు పరుగెత్తి మార థాన్‌లో విజయం సాధించారు.
- సమాధానం: 2
32. IAAF ప్రపంచ అండర్ - 18 హమర్ త్రో లో వెండి పతకాన్ని సాధించింది ఎవరు ?
1) దామ్మీత్ సింగ్
2) రాఫల్ వినెకెల్వోస్స్
3) మైఖాయిలో కోఖన్
4) సెర్గి లిటినోవ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నైరోబిలో జరిగిన IAAF ప్రపంచ అండర్ - 18 హమర్ త్రోలో ఉక్రెయిన్‌కు చెందిన మైఖాయిలా కోఖన్ బంగారు పతకాన్ని సాధించారు. భారత్‌కు చెందిన దామ్మీత్ సింగ్‌కు వెండి పతకం దక్కింది.
- సమాధానం: 1
33. ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ప్రపంచ ఉత్తమ ఎయిర్‌లైన్స్‌లలో తొలి స్థానంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏది ?
1) ఎమిరేట్స్
2) ఖతార్ ఎయిర్వేస్
3) సింగపూర్ ఎయిర్‌లైన్స్
4) కాథి పసిఫిక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ ప్రయాణికుల ఫీడ్‌బేక్ ద్వారా ఉత్తమ ఎయిర్‌లైన్స్‌లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో తొలి స్థానంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్, తర్వాతి స్థానాల్లో ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, కాథి పసిఫిక్ ఉన్నాయి.
- సమాధానం: 3
34. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యంత శక్తిమంతమైన అరబ్ మహిళ ఎవరు ?
1) సహర్ నాసర్
2) షిఖా లుబ్న, అల్ ఖాసిమి
3) గదావలి
4) ఆలియా షేక్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫోర్బ్స్ మ్యాగజైన్ అరబ్‌లో అత్యంత శక్తిమంతైన మహిళగా యూఏఈ హోంమంత్రి షిఖా లుబ్న ఆల్ ఖాసిమ ఎంపికైంది. ఈజిప్ట్‌కు చెందిన సహర్ నాసర్‌ను రెండో అత్యంత శక్తిమంతమైన మహిళగా ప్రకటించింది. ఈజిప్టుకు చెందిన సామాజిక సాలిడాటరీ మంత్రి గదవాలి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.
- సమాధానం: 2
35. తొలి గ్లోబల్ రోబోటిక్స్ ఒలంపియాడ్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) ముంబయి జట్టు
2) అఫ్గనిస్తాన్ జట్టు
3) ఇరాన్ జట్టు
4) కెనడా జట్టు
- View Answer
- సమాధానం: 1
వివరణ: వాషింగ్టన్ డీసీలో జరిగిన తొలి గ్లోబల్ రోబోటిక్స్ ఒలంపియాడ్లో ముంబయికి చెందిన ఏడుగురు విద్యార్థులు తయారు చేసిన Zhang Heng Engineering Designకు బంగారు పతకం లభించింది. గ్లోబల్ చాలెంజ్ మ్యాచ్‌కు భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అఫ్గనిస్తాన్‌కు చెందిన బాలికల జట్టు Rajaa Cherkaoui E1 Moursli awards కు ఎంపికైంది.
- సమాధానం: 1
36. అమెరికా తీవ్రవాద వ్యతిరేక శాఖ నివేదిక ప్రకారం ఇటీవల అత్యధిక తీవ్రవాద దాడులను ఎదుర్కున్న దేశం ఏది ?
1) ఫిలిప్పీన్స్
2) పాకిస్తాన్
3) భారత్
4) ఇరాక్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికా తీవ్రవాద వ్యతిరేక శాఖ నివేదిక ప్రకారం 5 దేశాలు అత్యధికంగా తీవ్రవాద దాడులు ఎదుర్కొంటున్నాయి. అవి ఇరాక్, అఫ్గనిస్తాన్, భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్. ప్రపంచంలో జరుగుతున్న తీవ్రవాద దాడుల్లో 55 శాతం ఈ 5 దేశాల్లోనే జరుగుతున్నాయి.
- సమాధానం: 4
37. NCAER ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక పెట్టుబడులు పొందుతున్న రాష్ట్రం ఏది ?
1) గుజరాత్
2)ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) గోవా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రెండవ ఎన్సీఏఈఆర్ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక పెట్టుబడులు పొందుతున్న రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, తెలంగాణ ఉన్నాయి.
NCAER - National Council of Applied Economic Research
- సమాధానం: 1
38. ఇటీవల ఏ రాజకీయ నాయకుడు లోక్‌సభ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం పొందారు ?
1) శరద్ యాదవ్
2) అరుణ్ జైట్లీ
3) రాహుల్ గాంధీ
4) ఎల్ కే అద్వాని
- View Answer
- సమాధానం: 4
వివరణ: లోక్‌సభ ఎంపీగా అందించిన సేవలకు గుర్తింపు ఎల్ కే అద్వాని జీవితకాల సాఫల్య పురస్కారం పొందారు. రాజ్యసభ ఎంపీగా అందించిన సేవలకు గాను శరద్ యాదవ్ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. సీతారాం ఏచూరీ రాజ్యసభ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు.
- సమాధానం: 4
39. భారత దేశానికి రామ్‌నాథ్ కోవింద్ ఎన్నో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ?
1) 10
2) 12
3) 14
4) 16
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత దేశానికి 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. అంతకముందు ఆయన బిహార్ గవర్నర్‌గా సేవలందించారు. యూపీఏ తరపున లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
- సమాధానం: 4
40. దేశంలోనే తొలిసారిగా పర్యావరణహిత వంతెనలను నిర్మించనున్న రాష్ట్రం ఏది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అడవుల్లో ఉండే పులులకు ఇబ్బంది కలగకుండా పర్యావరణహిత వంతెనల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని తడోబా - అందారి టైగర్ రిజర్వ్‌లో వీటిని నిర్మించనున్నారు.
- సమాధానం: 2
41. భారత్ ఏ దేశంతో చేసుకున్న పౌర అణు ఒప్పందం ఇటీవల అమల్లోకి వచ్చింది ?
1) జపాన్
2) మాంటెనిగ్రో
3) బ్రెజిల్
4) ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, జపాన్ మధ్య కుదిరిన పౌర అణు ఇంధన ఒప్పందానికి ఇరు దేశాల పార్లమెంట్లు ఆమోదం తెలిపాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు న్యూక్లియర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ అందిస్తుంది. Nuclear Non-Proliferation Treaty పై సంతకం చేయకుండా జపాన్ నుంచి న్యూక్లియర్ పరిజ్ఞానం పొందుతున్న దేశం భారత్.
- సమాధానం: 1
42. పైకా తిరుగుబాటు జరిగి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎక్కడ ఉత్సవాలు నిర్వహించారు ?
1) భువనేశ్వర్
2) నాగ్‌పూర్
3) న్యూఢిల్లీ
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బ్రిటిష్‌కు వ్యతిరేకంగా ఒడిశాలోని పైకా తెగ ప్రజలు 1817లో తిరుగుబాటు చేశారు. ఇది బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తొలి ప్రణాళిక బద్దమైన తిరుగుబాటు అని చరిత్రకారులు పేర్కొన్నారు.
- సమాధానం: 3
43. దేశానికి క్షిపణ వ్యవస్థ ఏర్పాటు కోసం డీఆర్డీవో ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఇజ్రాయెల్
2) కెనడా
3) చైనా
4) ర ష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత దేశ పరిరక్షణ కోసం అత్యాధునిక మధ్య తరహా ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ ఏర్పాటు కోసం డీఆర్డీవో ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డీఆర్డీవో, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ క్షిపణులను అభివృద్ధి చేస్తాయి.
- సమాధానం: 1
44. 2022లో జరిగే ప్రపంచ షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది ?
1) బీజింగ్
2) ప్రిటోరియా
3) లాస్ వేగాస్
4) కజన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: రష్యాలోని కజన్‌లో 2022 ప్రపంచ షార్టు కోర్సు స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నారు.
- సమాధానం: 4
45. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రారంభించిన "అజీవక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన" లక్ష్యం ఏమిటి ?
1)గామాలకు రోడ్ల ఏర్పాటు
2) గ్రామాలకు 24 గంటల విద్యుత్
3) గ్రామాలకు మంచినీటి సదుపాయం కల్పించడం
4) స్వయం సహాయక బృందాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన
- View Answer
- సమాధానం: 4
వివరణ: దీన్ దయాళ్ అంత్యోదయ యోజనలో ఉప పథకంగా జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. దీనికి అజీవక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన అని పేరు పెట్టింది.
- సమాధానం: 4
46. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ - 2017ను నిర్వహించనున్న దేశం ఏది ?
1) చైనా
2) భారత్
3) కెనడా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 5వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ - 2017ను భారత్ నిర్వహించనుంది. Theme : An inclusive, sustainable development, safe and secure cyber space. 4వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ ది హేగ్‌లో జరిగింది.
- సమాధానం: 2
47. ఐక్యరాజ్య సమితి ఏ ప్రాంతంలో మధ్య ప్రాచ్యమునకు చెందిన డేటా హబ్‌ను ఏర్పాటు చేయనుంది ?
1) దుబాయి
2) భారత్
3) ఈజిప్ట్
4) భూటాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మధ్య ప్రాచ్యం - Middle East North Africa and South Asia (MENASA)
- సమాధానం: 1
48. ఆముదం చెట్ల పెంపకం ద్వారా నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చని పరిశోధనల ద్వారా తెలియజేసినది ఎవరు ?
1) హెచ్‌సీయూ ప్లాంట్ సైన్స్ పరిశోధకులు
2) జేఎన్‌యూ ప్లాంట్ సైన్స్ పరిశోధకులు
3) కటక్ విశ్వవిద్యాలయం ప్లాంట్ సైన్స్ పరిశోధకులు
4) ఐఐఎస్సీ బెంగళూరు పరిశోధకులు
- View Answer
- సమాధానం: 4
వివరణ: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్లాంట్ సైన్స్‌కు చెందిన పరిశోధకులు కాలుష్య కారకాల్లో ఉండే లోహాలు భూ వాతావరణాన్ని పాడు చేస్తాయని వెల్లడించారు. ఆముదం చెట్లకు ఈ కాలుష్యాన్ని తగ్గించే శక్తి ఉంటుందని కనుగొన్నారు.
- సమాధానం: 4
49. తెలంగాణ ప్రభుత్వం ఏటా అందించే డాక్టర్ దాశరథి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) ఆచార్య ఎన్. గోపి
2) నరేశ్ ఉత్తమ్
3) రవిందర్
4) ఆకారపు మల్లేశం
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రముఖ కవి ఆచార్య ఎన్. గోపి డాక్టర్ దాశరథి పురస్కారానికి ఎంపికయ్యారు. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా జూలై 22న ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు.
- సమాధానం: 1
50. ఐసీసీ ప్రపంచ మహిళల వన్డే కప్ - 2017 విజేత ఎవరు ?
1) భారత్
2) ఇంగ్లండ్
3) పాకిస్తాన్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఐసీసీ ప్రపంచ మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఇంగ్లండ్ టైటిల్ విజేతగా నిలిచింది.
- సమాధానం: 2