కరెంట్ అఫైర్స్ (జనవరి 9 - 16) బిట్ బ్యాంక్
1. నేషనల్ ఈ గవర్నెన్స్ నుంచి స్వర్ణ పురస్కారం గెలుచుకున్న హాక్ ఐ మొబైల్ ఆప్‌ని ఏ నగర పోలీసులు రూపొందించారు ?
1) బెంగళూరు
2) ముంబై
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 30 మహానగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో హోచిమిన్ సిటీ (వియత్నాం), సిలిక్యాన్ వ్యాలీ(అమెరికా), షాంఘై (చైనా) నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో హైదరాబాద్ ఐదవ స్థానం దక్కించుకోగా భారత్‌లోని ఇతర నగరాలైన పుణె 13, చెన్నై 17, ఢిల్లీ 23, ముంబై 25 స్థానాల్లో నిలిచాయి.
- సమాధానం: 3
2. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జేఎల్ఎల్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్‌లో హైదరాబాద్ ఏ స్థానంలో నిలిచింది ?
1) ఒకటో స్థానం
2) రెండో స్థానం
3) నాల్గో స్థానం
4) ఐదవ స్థానం
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 30 మహానగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో హోచిమిన్ సిటీ (వియత్నాం), సిలిక్యాన్ వ్యాలీ(అమెరికా), షాంఘై (చైనా) నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో హైదరాబాద్ ఐదవ స్థానం దక్కించుకోగా భారత్‌లోని ఇతర నగరాలైన పుణె 13, చెన్నై 17, ఢిల్లీ 23, ముంబై 25 స్థానాల్లో నిలిచాయి.
- సమాధానం: 4
3. 20వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) విశాఖపట్నం
3) హైదరాబాద్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
వివరణ: జనవరి 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు జరిగింది.
- సమాధానం: 2
4. జాతీయ విపత్తుల నివారణ సంస్థ పదో బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1) కృష్ణా
2) పశ్చిమ గోదావరి
3) తూర్పు గోదావరి
4) శ్రీకాకుళం
- View Answer
- సమాధానం: 2
వివరణ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ-NDRF10వ బెటాలియన్ కేంద్ర కార్యాలయాన్ని కృష్ణా జిల్లా కొండపావులూరులో 50 ఎకరాల్లో నిర్మించనున్నారు. విపత్తుల సమయంలో నష్టాన్ని పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో 2006లో NDRFని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 2
5. బెంగళూరులో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు?
1) మైఖేల్ అశ్విన్
2) డేవిడ్ శర్మ
3) సునితా విలియమ్స్
4) వి.రామకృష్ణన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహాత్మాగాంధీ స్వదేశానికి తిరిగివచ్చిన రోజుని పురస్కరించుకొని ఏటా జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది కార్యక్రమానికి సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మైఖేల్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- సమాధానం: 1
6. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అత్యాధునిక క్షిపణి బాబర్-3 ని తయారు చేసిన దేశం ఏది ?
1) ఇరాన్
2) సిరియా
3) పాకిస్తాన్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: జనవరి 9న బాబర్-3 క్షిపణిని పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. దీన్ని హిందూ మహాసముద్ర జలాల నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించారు. ఇది 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు.
- సమాధానం: 3
7. అఖాడా పుస్తక రచయిత ఎవరు ?
1) మేరీకోమ్
2) సౌరభ్ దుగ్గల్
3) విక్రమ్ సేథ్
4) రవి బానోత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మాజీ రెజ్లర్, కోచ్ మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా క్రీడా పాత్రికేయుడు సౌరభ దుగ్గల్ అఖాడా పుస్తకాన్ని రచించారు. ఇందులో ఫోగట్ తన కూతుర్లు గీతా, బబితలను ఒలింపిక్ చాంపియన్లుగా తీర్చిదిద్దిన క్రమాన్ని రచయిత వివరించారు.
- సమాధానం: 2
8. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జనవరి 14
2) జనవరి 19
3) జనవరి 10
4) జనవరి 8
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2006 నుంచి ఏటా జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జాతీయ హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14న జరుపుతారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీ 4వ స్థానంలో ఉంది.
- సమాధానం: 3
9. వస్తు సేవల పన్ను-GST ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
1) ఏప్రిల్ 1, 2017
2) మే 1, 2017
3) జూన్ 1, 2017
4) జూలై 1, 2017
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం GSTని ప్రవేశపెట్టారు. రాజకీయ పార్టీలతో అనేక సంప్రదింపుల తర్వాత 2016 ఆగస్టు 3న జీఎస్టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఆగస్ట 8న లోక్‌సభలో పాసైంది. అనంతరం సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు దీనికి అంగీకారం తెలపటంతో 2016 సెప్టెంబర్ 8న జీఎస్టీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఇది 2017 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది.
- సమాధానం: 4
10. 62వ ఫిలింఫేర్ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి దక్కింది ?
1) అభిషేక్ చౌబే
2) నితీష్ తివారి
3) ఆలి అబ్బాస్ జాఫర్
4) కరణ్ జోహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 62వ ఫిలింఫేర్ పురస్కారాలను జనవరి 14న ముంబైలో ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రం-దంగల్, ఉత్తమ నటుడు-అమీర్ ఖాన్(దంగల్), ఉత్తమనటి-ఆలియా భట్(ఉడ్తా పంజాబ్), ఉత్తమ దర్శకుడు-నితీష్ తివారి ( దంగల్).
- సమాధానం: 2
11. జాతీయ బాలశ్రీ పురస్కారం-2015కు ఎవరు ఎంపికయ్యారు ?
1) పూజాశ్రీ మిశ్రా
2) కవితా ముఖర్జీ
3) సిమ్రాన్
4) శతరూప బట్టాచార్య
- View Answer
- సమాధానం: 3
వివరణ: పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు 1995లో బాల శ్రీ పురస్కారాన్ని ప్రారంభించారు. 2015లో అవార్డు విధి విధానాల్లో కొన్ని మార్పులు చేసిన ప్రభుత్వం జాతీయ బాల భవన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఒడిస్సీ నృత్యంలో ప్రతిభ చూపిన సిమ్రాన్ 2015 బాలశ్రీ పురస్కారాన్ని అందుకుంది. పిల్లల అవార్డుల్లో అత్యున్నత పురస్కారం బాల శ్రీ.
- సమాధానం: 3
12. గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్-GTCI2017 నివేదికలో భారత్ స్థానం ?
1) 92
2) 90
3) 88
4) 86
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇన్సీడ్ అనే సంస్థ 2013 నుంచి గ్లోబల్ టాలెంట్ కాంపిటిటివ్ ఇండెక్స్‌ను రూపొందిస్తోంది.2017 సంవత్సరానికి 118 దేశాల గణాంకాలతో నివేదిక రూపొందించింది. ఇందులో భారత్ 92వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ తొలిస్థానంలో ఉండగా సింగపూర్, యూకే, అమెరికా, స్వీడన్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 1
13. ప్రతిష్ఠాత్మక ది హిందీ లిటరసీ పురస్కారం-2016కు ఎంపికైంది ఎవరు ?
1) అనిల్ మీనన్
2) కునాల్ బసు
3) కిరణ్ దోశి
4) మంజుల పద్మనాభన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: గుజరాత్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, దౌత్యవేత్త కిరణ్ దోశి రాసిన "Jinnah Often Came to Our House " పుస్తకానికి ఈ అవార్డు లభించింది.
- సమాధానం: 3
14. డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు "డిజిటల్ డాకియా" (Digital Dakiya) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) పంజాబ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రం జనవరి 14న ఇండోర్‌లో డిజిటల్ డాకియాఅనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పోస్ట్‌మాన్ గ్రామం లేదా పట్టణంలో ఇంటింటికీ వెళ్లి డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు.
- సమాధానం: 4
15. Asia-Pacific Broadcasting Union-ABU మొదటి ఇంటర్నేషనల్ టెలివిజన్ డ్యాన్స్ ఫెస్టివల్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) ముంబై
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2017 జనవరి 15న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ABU మొదటి ఇంటర్నేషనల్ టెలివిజన్ డ్యాన్స్ ఫెస్టివల్ జరిగింది.
- సమాధానం: 2
16. 62వ ఫిలింఫేర్ పురస్కారాల్లో జీవిత సాఫల్య పురస్కారం ఎవరు అందుకున్నారు ?
1) యశ్ చోప్రా
2) కామిని కేశల్
3) మౌషిమి చటర్జీ
4) శతృఘ్న సిన్హా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 5 దశాబ్దాలుగా సినిమా రంగంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా శతృఘ్న సిన్హాకు ఈ పురస్కారం దక్కింది.
- సమాధానం: 4
17. ఇటీవల ఏ రాష్ట్రం ప్రముఖ యాత్రా స్థలాలకు సంబంధించి పినాకిని అనే మొబైల్ ఆప్‌ని ప్రారంభించింది ?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) గోవా
- View Answer
- సమాధానం: 1
18. స్టూడెంట్ స్టార్టప్, ఇన్నో వేషన్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ?
1) గోవా
2) కేరళ
3) గుజరాత్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
వివరణ: విద్యార్థుల ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరి 11న దేశంలోనే తొలిసారిగా స్టూడెంట్ స్టార్టప్, ఇన్నో వేషన్ పాలసీని ప్రారంభించింది. దీనికి రూ.200 కోట్లు కేటాయించింది.
- సమాధానం: 3
19. దేశంలో అతిపెద్ద వై-ఫై సేవల ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) రాజస్థాన్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 9న దేశంలోనే అతిపెద్ద వైఫై ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా ముంబై నగరంలో 500 వైఫై పరికరాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే 1 తర్వాత మరో 1200 వైఫై హాట్స్పాట్లను అందుబాటులోకి తేనుంది.
- సమాధానం: 1
20. IRDAI జీవిత బీమా పాలసీల నియమాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ అధ్యక్షుడు ఎవరు ?
1) కె ఎస్ గోపాలకృష్ణన్
2) సాయి శ్రీనివాస్
3) సందీప్ బక్షి
4) అమితాబ్ చౌదరి
- View Answer
- సమాధానం: 4
వివరణ: జీవిత బీమా పాలసీల నియమాలను విశ్లేషించేందుకు అమితాబ్ చౌదరి అధ్యక్షతన 8 మంది సభ్యుల కమిటీనిIRDAI ఏర్పాటు చేసింది. ఈయన ఇంతకముందు హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో సీఈవోగా పనిచేశారు. IRDAI ప్రస్తుత ఛైర్మన్టీ ఎస్ విజయన్.
- సమాధానం: 4
21. బరాక్ ఒబామా ఏ రోజును మతస్వేచ్ఛా దినోత్సవంగా ప్రకటించారు ?
1) జనవరి 14
2) జనవరి 15
3) జనవరి 16
4) జనవరి 17
- View Answer
- సమాధానం: 3
వివరణ: మత ప్రాతిపదికన ప్రజల్ని వేరు చేసే రాజకీయాలను తిరస్కరించాలంటూ బరాక్ ఒబామా జనవరి 16ను మత స్వేచ్ఛా దినోత్సవంగా ప్రకటించారు.
- సమాధానం: 3
22. ప్రెసిడెన్షియల్ ఎర్లీ కెరీర్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్ అండ్ ఇంజినీర్స్ (PECASE) పురస్కారం-2017కు ఎంపికైన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు ఎవరు ?
1) పంకజ్లాల్
2) కౌశిక్ చౌదరి
3) మనిష్ అరోర
4) పై వారందరు
- View Answer
- సమాధానం: 4
వివరణ: PECASE పురస్కారాలను 1996లో బిల్ క్లింటన్ ప్రారంభించారు. ఇవి అమెరికాలో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నిపుణులకి ఇచ్చే అత్యున్నత పురస్కారాలు. భారత సంతతికి చెందిన పంకజ్లాల్, కౌశిక్ చౌదరి, మనిష్ అరోరతో పాటు ఆరాధన త్రిపాఠి ఈ అవార్డు దక్కించుకున్నారు.
- సమాధానం: 4
23. ఇటీవల మరణించిన ఓలీవర్ స్మితిస్ ఏ రంగంలో నోబెల్ బహుమతి పొందారు ?
1) సాహిత్యం
2) రసాయన శాస్త్రం
3) వైద్య రంగం
4) ఆర్థిక శాస్త్రం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఓలివర్ స్మితిస్ నార్త్ కరొలినా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. జీన్ టార్గెటింగ్పై చేసిన పరిశోధనలకు గాను 2007లో వైద్య రంగంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
- సమాధానం: 3
24. ఏ రాష్ట్ర ప్రజలు థాయ్ పొంగల్ పండుగను జరుపుకుంటారు ?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: తమిళనాడు ప్రజలు పంటలు చేతికొచ్చిన తర్వాత సూర్య భగవానుడికి కృతజ్ఞతతో థాయ్ పొంగల్ పండుగను జరుపుకుంటారు.
- సమాధానం: 2
25. ప్రపంచంలో మొదటిసారిగా జెండర్ లిటరేచర్ ఫెస్టివల్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు ?
1) పట్నా
2) బెంగళూరు
3) జైపూర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 ఏప్రిల్ రెండోవారంలో పట్నాలో జెండర్ లిటరేచర్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు.
- సమాధానం: 1
26. 21వ నేషనల్ యూత్ ఫెస్టివల్ థీమ్ ఏంటి ?
1) వరల్డ్ పీస్ అండ్ ఎన్విరాన్మెంట్
2) ఇండియా యూత్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్
3) యూత్ ఫర్ డిజిటల్ ఇండియా
4) డైవర్సిటీ ఇన్ యూనిటీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏటా ఆ రోజున జాతీయ యువత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 21వ నేషనల్ యూత్ ఫెస్టివల్ హర్యానాలోని రోహతక్‌లో జరిగింది.
- సమాధానం: 3
27. సౌరశక్తితో నడిచే తొలి పడవను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) గోవా
2) ఒడిశా
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
వివరణ: రూ.1.5 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలి సౌరశక్తి పడవను కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇది గంటకు 14 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
- సమాధానం: 4
28. కాటస్ రాజ్ హిందూ దేవాలయం ఏ దేశంలో ఉంది ?
1) శ్రీలంక
2) పాకిస్తాన్
3) నేపాల్
4) భూటాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కాటస్ రాజ్ హిందూ దేవాలయం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న చక్బాల్ జిల్లాలో ఉంది. ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఇటీవల ఈ గుడి పునరద్ధరణను ప్రారంభించారు. షరియత్ పండితుడు ఆల్-బెరూని ఈ దేవాలయం చుట్టు కొలతను గణించాడు.
- సమాధానం: 2
29. దేశంలో తొలి అంతర్జాతీయ స్టాక్ ఎక్సేంజ్‌ను ఎక్కడ ప్రారంభించారు ?
1) ముంబయి
2) జైపూర్
3) గాంధీనగర్
4) పూణె
- View Answer
- సమాధానం: 3
వివరణ: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల గిఫ్ట్ సిటిలో భారత అంతర్జాతీయ స్టాక్ ఎక్సేంజ్‌ను నెలకొల్పారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ఇన్స్టిట్యూట్ దీన్ని ప్రారంభించింది.
- సమాధానం: 3
30. ఇటీవల మరణించిన మారియో సోర్స్ ఏ దేశ మాజీ అధ్యక్షుడు ?
1) పోర్చుగల్
2) ఫిన్లాండ్
3) ఇరాన్
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పోర్చుగల్ మాజీ అధ్యక్షుడు మారియో సోర్స్ లిస్బన్లో మరణించాడు. ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, మానవహక్కులు, శాంతి పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారు.
- సమాధానం: 1
31. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2017 నివేదికను తయారు చేసిన సంస్థ ఏది ?
1) ఐక్యరాజ్యసమితి
2) వరల్డ్ బ్యాంక్
3) యూఎన్ఈపీ
4) వరల్డ్ ఎకనామిక్ ఫోరం
- View Answer
- సమాధానం: 4
వివరణ: గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2017ను విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచం ఎదుర్కొనే దీర్ఘకాలిక ప్రమాదాలను ఇందులో వివరించింది. ఇందుకు దారితీస్తున్న కారణాలను విశ్లేషించింది.
- సమాధానం: 4
32. My Odyssey: Memoirs of the Man behind the Mangalyaan Mission పుస్తక రచయిత ఎవరు ?
1) జి.మాధవన్ నాయర్
2) కె.రాధాకృష్ణన్
3) శైలేష్ నాయర్
4) ఎ.ఎస్.కిరణ్ కుమార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కె.రాధాకృష్ణన్ ఇస్రో మాజీ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుత ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్.
- సమాధానం: 2
33. నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా 2017ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) గుజరాత్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జనవరి 10న గాంధీనగర్‌లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ ప్రైజ్ సీరీస్ ఇండియా 2017ను ప్రారంభించారు. ఈ కార్యక్రమ లక్ష్యం వినూత్న ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందించడం.
- సమాధానం: 3
34. Bose: An Indian Samurai : Netaji and the INA : a Military Assessment పుస్తక రచయిత ఎవరు ?
1) జి.డి. బక్షి
2) కిష్పర్ దేశాయ్
3) కిరణ్ బేడీ
4) నట్వర్ సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని జి.డి.బక్షి ఈ పుస్తకంలో పేర్కొన్నారు. సోవియెట్ యూనియ్లోని జైళ్లలో బ్రిటిష్ వాళ్ల హింసకు నేతాజీ చనిపోయారని వివరించారు.
- సమాధానం: 1
35. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2017లో ఉత్తమ డ్రామా చలనచిత్ర పురస్కారం దేనికి దక్కింది ?
1) లయన్
2) లా లా ల్యాండ్
3) మూన్లైట్
4) టైగర్ అండ్ జంగల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1943 నుంచి ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ ఏటా గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అందిస్తోంది. లా లా ల్యాండ్ చిత్రం మొత్తం 7 పురస్కారాలు గెలుచుకుంది. ఉత్తమ నటుడు అవార్డు కాసే అఫ్లేక్ను వరించింది.
- సమాధానం: 3
36. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జల్ మంతన్ మూడో సమావేశం ఎక్కడ జరిగింది ?
1) బెంగళూరు
2) పూణె
3) న్యూఢిల్లీ
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 జనవరి 13న న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జల్ మంతన్ మూడో సమావేశం జరిగింది. ఇందులో నదీ జలాల పంపిణీ, నీటి విధానాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు.
- సమాధానం: 3
37. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్థానిక భాషలో ఈ-వాలెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
1) కేరళ
2) అసోం
3) మణిపూర్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 2
వివరణ: TOKAPAISA.IN పేరుతో అసోం ప్రభుత్వం స్థానిక భాషలో ఈ-వాలెట్‌ను ప్రారంభించింది. అసోం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించిన ఈ ఆప్ వర్చువల్ పేమెంట్స్ టెర్మినల్గానూ ఉపయోగపడుతుంది.
- సమాధానం: 2
38. జిగ్మే డొర్జి జాతీయ పార్కు ఏ దేశంలో ఉంది ?
1) భారత్
2) నేపాల్
3) బంగ్లాదేశ్
4) భూటాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జిగ్మే డొర్జీ పార్కు భూటాన్‌లో రెండవ అతిపెద్ద జాతీయ పార్కు. భూటాన్ మూడవ రాజు డ్రక్ గ్యాల్పో జిగ్మే డోర్జి వాంగ్ చుక్ పేరు మీద ఈ పార్కుని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
39. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెట్ కమిటీలో సభ్యత్వం పొందిన భారత ఆటగాడు ?
1) పి.ఆర్. శ్రీజేష్
2) ఆకాశ్ దీప్ సింగ్
3) నిక్కిన్ తిమ్మయ్య
4) వీ.ఆర్. రఘునాథ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పి.ఆర్ శ్రీజేష్ ప్రస్తుతం భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. మొత్తం 8 మంది ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో అథ్లెట్ కమిటీ ఏర్పాటైంది.
- సమాధానం: 1
40. ఐఐటీల్లో బాలికలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించిన కమిటీ ఏది ?
1) తిమోతీ గాన్ సాల్వేస్
2) ముకుల్ రోహత్గీ
3) జస్టిస్ మార్కండేయ కట్జు
4) శ్రీ కృష్ణ కమిటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐఐటీల్లో బాలికల ప్రవేశాల పెంచేందుకు 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని తిమోతీ గాన్ సాల్వేస్ కమిటీ సూచించింది. బాలుర రిజర్వేషన్ తగ్గించకుండా బాలికల కోసం సూపర్ న్యూమరీ సీట్లు సృష్టించాలని పేర్కొంది.
- సమాధానం: 1
41. పెట్రోలియం పరిరక్షణ ప్రచారోద్యమం Saksham - 2017 ను ఎక్కడ ప్రారంభించారు ?
1) గౌహతి
2) భువనేశ్వర్
3) దిమాపూర్
4) ఐజ్వాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంధన పరిరక్షణ, ఇంధన వ్యర్థాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 16న సాక్షం ఉద్యమాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 3
42. ప్రపంచ ఆర్థిక ఫోరం ఇటీవల విడుదల చేసిన సమ్మిళిత అభివృద్ధి ఇండెక్స్‌లో భారత స్థానం ?
1) 10
2) 30
3) 50
4) 60
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆర్థిక ఫోరం అభివృద్ధి చెందుతున్న 79 దేశాల గణాంకాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది. ఇందులో తొలి స్థానంలో లిత్వేనియా, తర్వాతి స్థానాల్లో ఆజర్ బైజాన్, హంగేరీ, పోలాండ్, రుమేనియా దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 60వ స్థానంలో ఉంది.
- సమాధానం: 4
43. ప్రపంచ ఆర్థిక ఫోరం ఇటీవల విడుదల చేసిన అభివృద్ధి చెందిన దేశాల సమ్మిళిత వృద్ధి ఇండెక్స్‌లో తొలిస్థానంలో నిలిచిన దేశం ఏది ?
1) నార్వే
2) లక్సంబర్గ్
3) స్విట్జర్లాండ్
4) ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ నివేదికలో తొలిస్థానంలో నార్వే నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో లక్సంబర్గ్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్ దేశాలు నిలిచాయి.
- సమాధానం: 1
44. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం భారత్‌లో 58 శాతం సంపద ఎంత మంది చేతుల్లో కేంద్రీకృతమైంది ?
1) 20 శాతం
2) 10 శాతం
3) 5 శాతం
4) 1 శాతం
- View Answer
- సమాధానం: 4
వివరణ: పేదరిక నిర్మూలన కోసం పనిచేసే ఆక్స్‌ఫామ్ సంస్థ యాన్ ఎకనామి ఫర్ ది 99 పర్సంట్ పేరుతో భారత్‌లో సంపద అసమానతలపై ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని 57 మంది బిలియనీర్ల సంపద 216 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది దేశంలోని 70 శాతం మంది ప్రజల ఆదాయంతో సమానం.
- సమాధానం: 4
45. యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఇటీవల చోటు దక్కించుకున్న వస్తువు ఏది ?
1) పోచంపల్లి చీరలు
2) సీతల్పతి చాపలు
3) ఉట్నూరు గొంగడి
4) సేలం పంచెలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బేహర్ జిల్లాలో సీతల్ పతి చాపలు ఉత్పత్తి అయ్యేవి. అయితే కాలానుగుణంగా వీటి ఉత్పత్తి తగ్గిపోయి పూర్తి అంతరించే పరిస్థితి ఏర్పడటంతో యునెస్కో వీటిని ప్రపంచ సాంస్కృతి వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ చాపల ఉత్పత్తి కోసం రూరల్ క్రాఫ్ట్ హబ్‌ను ప్రారంభించింది.
- సమాధానం: 2
46. ప్రతిష్టాత్మక టి ఎస్ ఎలియట్ పద్య పురస్కారం -2016కు ఎంపికైంది ఎవరు ?
1) లాంటన్షా
2) ఆర్.ఎమ్.పటేల్
3) జాకబ్ పోలే
4) ఎమ్.టి. డేవిడ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జాకబ్ పోలే రచించిన జాక్ సెల్ఫ్ పద్య సంకలనం 2016 టీ ఎస్ ఎలియట్ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు కింది 24 వేల అమెరికన్ డాలర్ల నగదు బహుమతి అందజేస్తారు.
- సమాధానం: 3
47. ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు భూ కేంద్రకంలో ఏ లోహం ఉన్నట్లు గుర్తించారు ?
1) యురేనియం
2) సిలికాన్
3) మెర్క్యూరీ
4) లెడ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భూ కేంద్రకంలో ఇనుము (85 శాతం), నికెల్(10 శాతం),సిలికాన్(5 శాతం) ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
- సమాధానం: 2
48. సెర్బియాలో జరిగిన 6వ బాక్సింగ్ నేషన్స్ కప్ 61 కేజీల విభాగంలో బంగారు పతకం ఎవరికి దక్కింది ?
1) నీరజ్
2) జైనా షెకెర్బకొవ
3) లైలాఆలి
4) యసికా బొప్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ టోర్నీలో కజకిస్తాన్‌కు చెందిన జైనా షెకెర్బకొవను ఓడించి నీరజ్ (హర్యానా) బంగారు పతకాన్ని సాధించింది. ఈ క్రీడల్లో భారత్ మొత్తం ఆరు పతకాలు గెలుచుకుంది.
- సమాధానం: 1
49. వొడాఫోన్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ టైటిల్ విజేత ఎవరు ?
1) ఢిల్లీ ఏసర్స్
2) హైదరాబాద్ హంటర్స్
3) చెన్నై స్మాషర్స్
4) ముంబయి రాకెట్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: వొడాఫోన్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ఫైనల్లో ముంబయి రాకెట్స్‌ను ఓడించి చెన్నై స్మాషర్స్ టైటిల్‌ను దక్కించుకుంది.
- సమాధానం: 3
50. 15వ పార్శ్వనాథ ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ టైటిల్ విజేత ఎవరు ?
1) దిప్తాయన్ ఘోష్
2) ఫరూఖ్ అమోనాతోవ్
3) ద్జెహుయేవ్ మరాత్
4) బైకూర్ ఇమ్మ
- View Answer
- సమాధానం: 2
వివరణ: తజకిస్తాన్‌కు చెందిన ఫరూఖ్ అమెనాతోవ్ దిప్తాయన్ ఘోష్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 2