కరెంట్ అఫైర్స్ జనవరి (24 -31) బిట్ బ్యాంక్
1. అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ తొలి సమ్మిట్ ఏ దేశంలో జరగనుంది ?
1) భారత్
2) చైనా
3) ఫ్రాన్స్
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత రాజధాని న్యూఢిల్లీ వేదికగా 2018 మార్చిలో అంతర్జాతీయ సోలార్ అలయెన్స తొలి సమ్మిట్ జరగనుంది. వాతావారణ మార్పులను ఎదుర్కునే లక్ష్యంతో ఈ అలయెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 121కిపైగా దేశాలకు సభ్యత్వం ఉంది.
- సమాధానం: 1
2. 2018 సంవత్సరానికిగాను పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?
1) ఇళయరాజా
2) పి పరమేశ్వరన్
3) గులాం ముస్తఫా ఖాన్
4) పై ముగ్గురు
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2018 సంవత్సరానికిగాను భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, హిందూస్తానీ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్, వివేకానంద కేంద్రం అధ్యక్షుడు పి పరమేశ్వరన్‌లకు ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను మొత్తం 85 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఇందులో 9 మందికి పద్మ భూషణ్, 73 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. క్రీడ రంగానికి సంబంధించి మహేంద్ర సింగ్ ధోని(క్రికెట్), పంకజ్ అద్వానీ(బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్) పద్మ భూషణ్‌లకు ఎంపికయ్యారు. 2018లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికై న ఏకై క తెలుగు వ్యక్తి కిదాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్-ఆంధ్రప్రదేశ్).
- సమాధానం: 4
3. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వార్షిక సదస్సులో భాగంగా 24వ క్రిస్టల్ అవార్డుని అందుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు ?
1) అమితాబ్ బచ్చన్
2) అక్షయ్ కుమార్
3) షారుక్ ఖాన్
4) అమిర్ ఖాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సదస్సులో క్రిస్టల్ అవార్డుని అందుకున్నారు. పిల్లలు, మహిళల హక్కుల రక్షణ కోసం కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డుని అందజేశారు.
- సమాధానం: 3
4. ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా అమెరికా ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమించింది ? 1) జెరోమ్ హెచ్ పావెల్
2) మార్విన్ గుడ్ ఫ్రెండ్
3) జెన్నెట్ ఎల్లెన్
4) ఎలిజబెత్ వార్రెన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్‌గా జెరోమ్ పావెల్‌ను నియమించారు. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా 2013లో జానెట్ యెలెన్‌ను ఫెడ్ రిజర్వ్ చైర్ పర్సన్‌గా నియమించారు. ఫెడ్ రిజర్వ్‌కు తొలి మహిళా సారథి అయిన 71 ఏండ్ల యెలెన్ పదవీకాలం 2018 ఫిబ్రవరిలో ముగియనుంది. ఆమె తర్వాత 64 ఏండ్ల పావెల్ ఫెడ్ రిజర్వ్‌కు చీఫ్‌గా వ్యవహరిస్తారు.
- సమాధానం: 1
5. ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీ - 2018లో భారత్ ఏ ర్యాంకులో నిలిచింది ?
1) 120
2) 58
3) 81
4) 60
- View Answer
- సమాధానం: 3
వివరణ: గ్లోబల్ టాలెంట్ కాంపెటేటివ్ ఇండెక్స్ - 2018 ప్రకారం భారత్ 81వ స్థానంలో నిలిచింది. ఇన్సీడ్, అడెక్కో గ్రూప్, టాటా కమ్యూనికేషన్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. స్విట్జర్లాండ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలిచింది.
- సమాధానం: 3
6. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో 51.11 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయనున్న ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ ఏది ?
1) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
2) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
3) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
4) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రభుత్వ రంగ ఆయిల్ తవ్వకాల సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్.. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో 51.11 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని విలువ రూ.36,915 కోట్లు.
- సమాధానం: 2
7. పరస్పర సహకారం, అభివృద్ధి కోసం భారత్‌లోని ఏ రాష్ట్రం ఇటీవల జ్యూరిచ్‌తో సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదుర్చుకుంది ?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) ఉత్తరప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జ్యూరిచ్ ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో జ్యూరిచ్, ఏపీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీపై పరస్పర సహకారం కోసం ఒప్పందం చేసుకున్నారు. లైఫ్ సైన్స, అర్బన్ మరియు రీజనల్ డెవలప్మెంట్లో పరస్పర సహకారానికి ఒప్పందం చేసుకున్నారు.
- సమాధానం: 4
1) తిరుమల తిరుపతి దేవాలయం
2) యాదాద్రి దేవాలయం
3) తంజావూరు బ్రిహదీశ్వర దేవాలయం
4) శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం
- View Answer
- సమాధానం: 4
వివరణ: శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయానికి మెరిట్ విభాగంలో యునెస్కో ఆసియా పసిఫిక్ ప్రాంతానికిగాను ఈ అవార్డుని ప్రకటించింది. ఆలయ నిర్మాణం పునరుద్ధరణ, వాననీటి సంరక్షణ, మురుగు నీటి వ్యవస్థల అభివృద్ధికి చేపట్టిన చర్యలకుగాను ఈ దేవాలయానికి యునెస్కో ఈ సాంస్కృతిక వారసత్వ అవార్డుని ప్రకటించింది.
- సమాధానం: 4
9. ఇటీవల కన్నుమూసిన కృష్ణ కుమారి ఏ రంగంలో ప్రసిద్ధిగాంచారు ?
1) రాజకీయం
2) నటన
3) పాత్రికేయం
4) వ్యాపారం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ తెలుగు నటి కృష్ణకుమారి ఇటీవల బెంగళూరులో కన్నుమూశారు. 1951లో నవ్వితే నవరత్నాలు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చెసిన ఆమె 200కుపైగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు.
- సమాధానం: 2
10. మొండి బాకీలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయల అదనపు మూలధనాన్ని అందించనుంది ?
1) రూ. 88,139 కోట్లు
2) రూ.1,00000 కోట్లు
3) రూ. 65,000 కోట్లు
4) రూ. 50,000 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: మొండి బాకీలతో సతమతమవుతున్న 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 88,139 కోట్ల అదనపు మూలధనాన్ని అందించనుంది. ఇందులో అత్యధికంగా ఐడీబీఐ బ్యాంక్‌కి రూ. 10,610 కోట్లు, ఎస్బీఐకి రూ. 8,800 కోట్లు దక్కనున్నాయి. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా రూ.2.11 లక్షల కోట్లు అందించేలా కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రణాళిక ప్రకటించింది.
- సమాధానం: 1
11. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తొలి మహిళా చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అరుంధతి భట్టాచార్య
2) ఉషా అనంతసుభ్రమణియన్
3) చందా కొచ్చర్
4) శిఖా శర్మ
- View Answer
- సమాధానం: 2
వివరణ: అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఉషా అనంత సుభ్రమణియన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తొలి మహిళా చైర్మన్‌గా నియమితులయ్యారు.
- సమాధానం: 2
12. పర్యావరణ పనితీరు సూచీ - 2018లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?
1) 120
2) 140
3) 157
4) 177
- View Answer
- సమాధానం: 4
వివరణ: యాలె అండ్ కొలంబియా యూనివర్సిటీ, ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సంయుక్తంగా ఎన్విరాన్మెంటల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ - 2018ని రూపొందించాయి. ఇందులో భారత్ 177వ ర్యాంకులో నిలిచంది. ర్యాంకింగ్స్‌లో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలిచింది.
- సమాధానం: 4
13. భూ వాతావరణం, అంతరిక్షం కలిసే చోట వాతావరణ పొరల్లోని మార్పుల్ని అధ్యయనం చేసేందుకు నాసా చేపట్టిన మిషన్ ఏది ?
1) సిల్వర్ మిషన్
2) ప్లాటినమ్ మిషన్
3) గోల్డ్ మిషన్
4) డెమైండ్ మిషన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భూ వాతావరణం, అంతరిక్షం కలిసే చోట వాతావరణ పొరల్లోని మార్పుల్ని అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారి ప్రత్యేక మిషన్‌ను అంతరిక్షంలోకి పంపింది. ‘ద గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద లింబ్ అండ్ డిస్క్(గోల్డ్)’గా పిలిచే ఈ మిషన్‌ను ఫ్రెంచ్ గయనాలోని కౌరు నుంచి ‘ఎస్ఈఎస్-13’ సమాచార ఉపగ్రహానికి అనుసంధానించి ప్రయోగించింది.
- సమాధానం: 3
14. ఏ దేశాల్లో డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేసి గ్రామీణ అనుసంధానం కోసం కృషి చేస్తామని భారత్ ఇటీవల ప్రకటించింది ?
1) ఆసియాన్
2) సార్క్
3) బ్రిక్స్
4) బిమ్స్ స్టెక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆసియాన్ - ఇండియా స్మారక సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. Association of Southeast Asian Nations - ASEANలో గ్రామాల అనుసంధానం కోసం కృషి చేస్తామని ప్రకటించారు. తొలుత పెలైట్ ప్రాజెక్టుగా కంబోడియా, మయన్మార్, వియత్నాంలలో ఈ ప్రాజెక్టుని చేపడతామని వెల్లడించారు.
- సమాధానం: 1
15. చిన్న, మధ్య తరహా వ్యాపారాల అభివృద్ధి కోసం జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్(NSIC) ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) మలేషియా
2) బంగ్లాదేశ్
3) మయన్మార్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: చిన్న, మధ్య తరహా వ్యాపారాల అభివృద్ధికోసం జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్(NSIC) ఇటీవల ఎస్ఎంఈ కార్పొరేషన్ ఆఫ్ మలేషియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 1
16. Dilli Meri Dilli: Before and After 1998 పుస్తక రచయిత ఎవరు ?
1) సుష్మా స్వరాజ్
2) షీలా దీక్షిత్
3) సోనియా గాంధీ
4) అద్వానీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ Dilli Meri Dilli: Before and After 1998 పేరుతో పుస్తకం రాశారు. భారత రాజధాని ఢిల్లీ దశాబ్దాల చరిత్రను చిత్రాల రూపంలో వివరిస్తు ఆమె ఈ పుస్తకాన్ని రచించారు.
- సమాధానం: 2
17. భారత్ - వియత్నాం మధ్య స్నేహ పూర్వక ద్వైపాక్షిక సంబంధాల గుర్తుగా ఇటీవల వేటిని ఆవిష్కరించారు ?
1) స్మారక నాణేలు
2) ప్రత్యేక లోగో
3) స్మారక పోస్టల్ స్టాంపులు
4) ప్రత్యేక మ్యాగజైన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ - వియత్నాం మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న స్నేహ పూర్వక ద్వైపాక్షిక సంబంధాలకు గుర్తుగా ఇటీవల స్మారక నాణేలను విడుదల చేశారు. సంచి స్తూపా, తీన్ ము పగోడా చిత్రాలతో ఈ స్టాంపులను విడుదల చేశారు.
- సమాధానం: 3
18. ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2018 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) సిమోనా హాలెప్
2) ఫ్లావియా పెన్నెట్టా
3) జానా నొవోట్నా
4) కారోలిన్ వోజ్నియాకి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2018 మహిళల సింగిల్స్ పైనల్లో రొమేనియాకు చెందిన సిమోనా హాలెప్‌ను ఓడించి డెన్మార్కు చెందిన కరోలిన్ వోజ్నియాకి టైటిల్ గెలుచుకుంది.
- సమాధానం: 4
19. ఇటీవల ఏ రాష్ట్రం మహిళల భద్రత కోసం ‘‘శక్తి’’ యాప్‌ని ఆవిష్కరించింది ?
1) హిమాచల్ ప్రదేశ్
2) రాజస్తాన్
3) పంజాబ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఇటీవల శక్తి యాప్‌ని ప్రారంభించారు. ఆ రాష్ట్ర నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ని రూపొందించింది. ఇదిఓ అర్జెంట్ బటన్ని కలిగి ఉంటింది. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి సందేశం వెళుతుంది. అలాగే 20 సెకండ్ల తర్వాత ఆడియా, వీడియోను రికార్డు చేస్తుంది.
- సమాధానం: 1
20. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ - 2018ని ఏ రాష్ట్ర జట్టు గెలుచుకుంది ?
1) గుజరాత్
2) రాజస్తాన్
3) హర్యానా
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో రాజస్తాన్‌ను ఓడించి ఢిల్లీ తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 4
21. 21వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో - 2018 ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) తమిళనాడు
2) పశ్చిమ బెంగాల్
3) గోవా
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 21వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో - 2018 ఇటీవల గోవాలో జరిగింది. భారత్‌లోని ఉత్తమమైన సముద్ర ఉత్పత్తలను ఇందులో ప్రదర్శించారు. ఈ రంగంలో 2022 నాటికి 10 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యాన్ని సాధించేందుకు అవలంబించాల్సిన ప్రణాళికలపై ప్రదర్శనలో చర్చించారు.
- సమాధానం: 3
22. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఇటీవల ప్రీ క్యాలిఫైడ్ గుర్తింపు పొందిన దేశీయంగా తయారైన తొలి వ్యాక్సిన్(టీకా) ఏది ?
1) రుబెవాక్ టీకా
2) నొరోవాక్ టీకా
3) న్యూమోవాక్ టీకా
4) రొటొవాక్ టీకా
- View Answer
- సమాధానం: 4
వివరణ: పూర్తి దేశీయ పరిజ్ఞానం, ఫార్ములాతో రూపొందించిన రొటొవాక్ వాక్సిన్.. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రీ క్యాలిఫైడ్ గుర్తింపు పొందింది. తద్వారా ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో ఈ వ్యాక్సిన అమ్మకాలు జరిపేందుకు అనుమతి లభించినట్లయింది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది.
- సమాధానం: 4
23. యాశ్ చోప్రా స్మారక అవార్డు - 2018కి ఎవరు ఎంపికయ్యారు ?
1) అక్షయ్ కుమార్
2) అనుష్క శర్మ
3) ఆశా భోంస్లే
4) రణ్ బీర్ కపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రముఖ గాయని ఆశా భోంస్లే యాశ్ చోప్రా స్మారక అవార్డు - 2018కి ఎంపికయ్యారు. ఆమె ఈ అవార్డుని అందుకోనున్న ఐదో వ్యక్తి. ఇంతకముందు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్లు ఈ అవార్డు అందుకున్నారు.
- సమాధానం: 3
24. సన్డేన్స ఫిల్మ్ ఫెస్టివల్ - 2018లో యూఎస్ గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌ని గెలుచుకున్న డాక్యుమెంటరీ ఏది ?
1) దిస్ ఈజ్ హోమ్
2) ఆఫ్ ఫాదర్స్ అండ్ సన్స్
3) ద సెంటెన్స్
4) కై లాశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి జీవితం ఆధారంగా తెరకెక్కించిన కైలాశ్ డాక్యుమెంటరీ.. సన్డేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో యూఎస్ గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌ని గెలుచుకుంది. ఈ డాక్యమెంటరీకి డెరెక్ డొనీన్ దర్శకత్వం వహించారు.
- సమాధానం: 4
25. 69వ గణతంత్ర దినోత్స పరేడ్‌లో ఏ రాష్ట్ర శకటం ఉత్తమ అవార్డు గెలుచుకుంది ?
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 23 రాష్ట్రాల శకటాలను ప్రదర్శించారు. ఛత్రపజి శివాజీ పట్టాభిషేకం సన్నివేశాన్ని ప్రదర్శిస్తు రూపొందించిన మహరాష్ట్ర శకటం ఉత్తమ అవార్డుని గెలుచుకుంది.
- సమాధానం: 1
26. ఫిన్లాండ్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) సౌలి నినిస్టో
2) స్టీఫెన్ లోఫ్ వెన్
3) ఎర్నా సోల్ బర్గ్
4) జార్జ్ బర్గ్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిన్లాండ్ అధ్యక్షుడిగా సౌలి నినిస్టో ఇటీవల తిరిగి ఎన్నికయ్యారు. ఫిన్లాండ్కు ఎన్నో ఏళ్లుగా మిత్రదేశంగా ఉన్న రష్యాతో సమతూకమైన స్నేహ బంధాన్ని కొనసాగించిన నేతగా సౌలి నినిస్టో గుర్తింపు పొందారు.
- సమాధానం: 1
27. 2017-18 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2018-19లో జీడీపీ వృద్ధి రేటు అంచనా ?
1) 6.5 - 7 శాతం
2) 6.50 - 6.75 శాతం
3) 6.75 - 7 శాతం
4) 7 - 7.5 శాతం
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2017-18 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2018-19లో జీడీపీ వృద్ధి రేటుని 7 నుంచి 7.5 శాతంగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
- సమాధానం: 4
28. ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) రోజర్ ఫెడరర్
2) మార్లిన్ సిలిక్
3) సెబాస్టియన్
4) రాఫెల్ నాదల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన మార్లిన్ సిలిక్ను ఓడించి స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
- సమాధానం: 1
29. 60వ వార్షిక గ్రామీ అవార్డుల్లో ఏ ఆల్బమ్ ఉత్తమ ఆల్బమ్ పురస్కారం గెలుచుకుంది ?
1) మెలోడ్రామా
2) సింగర్స్ చాయిస్
3) 24కే మాజిక్
4) రెడ్ కార్పెట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 60వ వార్షిక గ్రామీ అవార్డుల్లో 24కే మాజిక్ ఆల్బమ్ ఉత్తమ ఆల్బమ్ పురస్కారం గెలుచుకుంది. బ్రూనో మార్స్ - దట్స్ వాట్ ఐ లైక్ పాట ఉత్తమ సాంగ్ అవార్డుని గెలుచుకుంది. బ్రూనో మార్స్ - 24కే మాజిక్ రికార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్దుని దక్కించుకుంది.
- సమాధానం: 3
30. "The Tall Man Biju Patnaik" పుస్తక రచయిత ఎవరు ?
1) సుందర్ గణేశన్
2) సంపద్ పట్నాయక్
3) ప్రేమ్ నాథ్ పాండే
4) మహేంద్ర బహదూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ జీవితం ఆధారంగా "The Tall Man Biju Patnaik' పేరుతో సుందర్ గణేశన్ పుస్తకాన్ని రచించారు. ఇటీవల ఈ పుస్తకాన్ని నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు.
- సమాధానం: 1
31. అంతర్జాతీయ బర్డ్ఫెస్టివల్ - 2018 ఏ రాష్ట్రంలో జరగనుంది ?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 ఫిబ్రవరి 9 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని దుఢ్వా నేషనల్ పార్కులో ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ జరిగింది.
- సమాధానం: 1
32. కింది వాటిలోని ఏ పదం ఆక్సఫర్డ్ డిక్షనరీస్ నుంచి హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ - 2017గా ఎంపికైంది ?
1) యోజన
2) ఆధార్
3) స్వచ్ఛ్
4) వికాస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆధార్ పదాన్ని ఆక్సఫర్డ్ డిక్షనరీస్ హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ - 2017గా ఎంపిక చేసింది.
- సమాధానం: 2
33. బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం - 2018ని ఇటీవల ఎవరు అందుకున్నారు ?
1) ప్రకాశ్ పడుకొన్
2) సయ్యద్ మోడీ
3) దీపాంకర్ భట్టాచార్య
4) అర్వింద్ భట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉపరాష్ట్ర వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పడుకొన్ అందుకున్నారు.
- సమాధానం: 1
34. న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం అత్యంత సంపన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 5
2) 6
3) 10
4) 15
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 8,230 బిలియన్ డాలర్ల సంపదతతో ప్రపంచ సంపన్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో అమెరికా తొలి స్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం 2016లో 6,584 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్ సంపద 2017లో 8,230 బిలియన్ డాలర్లకు పెరిగింది.
- సమాధానం: 2
35. హాకీ ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ - 2018 ఏ దేశంలో జరగనుంది ?
1) ఖతార్
2) ఒమన్
3) సౌదీ అరేబియా
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 అక్టోబర్ 18 నుంచి 28 వరకు ఖతార్‌లో హాకీ ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మేరకు ఆసియన్ హాకీ ఫెడరేషన్ ప్రకటించింది.
- సమాధానం: 1
36. జాతీయ బాలిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జనవరి 24
2) జనవరి 25
3) జనవరి 27
4) జనవరి 30
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ బాలిక దినోత్సవాన్ని ఏటా జనవరి 24న నిర్వహిస్తారు. బాలికా సాధికారత సాధించడం సహా లింగ నిష్పత్తిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
37. ఇటీవల జరిగిన 8వ జాతీయ ఓటరు దినోత్సవం థీమ్ ఏంటి ?
1) Ethical Voting
2) Empowering young and future events
3) Accessible Elections
4) Authentic Elections & Voting
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2011 నుంచి ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2018 జాతీయ ఓటరు దినోత్సవాన్ని Accessible Elections ఇతివృత్తంతోనిర్వహించారు. భారత ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25న ఏర్పాటు చేశారు.
- సమాధానం: 3
38. ఇండియా-ఆసియాన్ 2018 సమ్మిట్ ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) భువనేశ్వర్
4) కోల్ కత్తా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండియా-ఆసియాన్ 2018 సమ్మిట్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. భారత్-ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్మారక స్టాంపులు విడుదల చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆసియాన్ దేశాధినేతలతో సముద్ర తీర రక్షణ, అనుసంధానత, వాణిజ్యం తదితరాలపై మోదీ చర్చలు జరిపారు.
- సమాధానం: 2
39. శాంతి సమయాల్లో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం ‘‘అశోక చక్ర’’ను ఇటీవల ఎవరికి ప్రకటించారు ?
1) జ్యోతి ప్రకాశ్ నిరాలా
2) దేవేంద్ర మెహతా
3) నిలేశ్ కుమార్ నారాయణ్
4) ఖైర్నార్ మిలింద్ కిశోర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడైన వైమానిక దళం గరుడ్ కమాండో జ్యోతి ప్రకాశ్ నిరాలాకు కేంద్రం ‘అశోక్ చక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మందికి రాష్ట్రపతి సాహస పురస్కారాలను ప్రకటించారు. కీర్తి చక్ర పురస్కారాన్ని మేజర్ విజయంత్ బిస్త్‌కు ప్రకటించారు.
- సమాధానం: 1
40. భారత్ తొలి ఖాదీ హాత్ ప్రదర్శనను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు ?
1) లక్నో
2) పట్నా
3) అహ్మదాబాద్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. న్యూఢిల్లీలో ఖాదీ హాత్ ప్రదర్శనను ప్రారంభించాయి. ప్రధానమంత్రి ఉపాధి జనరేషన్ కార్యక్రమం కింద వ్యాపారులు తమ ఖాదీ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో విక్రయించే అవకాశం కలుగుతుంది.
- సమాధానం: 4
41. VINBAX-2018 పేరుతో భారత్ - వియత్నాం తొలి సైనిక విన్యాసాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి ?
1) మధ్యప్రదేశ్
2) కర్ణాటక
3) కేరళ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: VINBAX-2018 పేరుతో భారత్-వియత్నాం తొలి సైనిక విన్యాసాలు జనవరి 29న మధ్యప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగిన విన్యాసాల్లో యూఎన్ శాంతి దళాల్లో పనిచేస్తున్న వియత్నాం సైనికులకు శిక్షణ ఇచ్చారు.
- సమాధానం: 1
42. యూరోపియన్ కాపిటల్ ఆఫ్ కల్చర్ - 2018గా ఇటీవల ఏ నగరాన్ని ఎంపిక చేశారు ?
1) హెల్సింకి
2) వియన్నా
3) నికొసియా
4) వాల్లెట్టా
- View Answer
- సమాధానం: 4
వివరణ: మాల్టా దేశ రాజధాని వాల్లెట్టాను యూరోపియన్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్-2018గా ఎంపిక చేశారు. దీంతో పాటు నెదర్లాండ్స్‌లోని లీయూవార్డెన్ నగరాన్ని కూడా ఇందుకు ఎంపిక చేశారు. యూరోపియన్ సంస్కృతిని ఆ ప్రాంత ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ టైటిల్‌ను ఏటా నగరాలకు ఇస్తారు.
- సమాధానం: 4
43. ఇటీవల ఏ రాష్ట్రం తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో సూర్యారాధన కార్యక్రమం నిర్వహించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) అరుణాచల్ ప్రదేశ్
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న సూర్యారాధన కార్యక్రమం నిర్వహించింది.
- సమాధానం: 1
44. ఇటీవల ఏ బ్యాంక్ రైతులకు క్రెడిట్ కార్డులు అందించనున్నట్లు ప్రకటించింది ?
1) ఐసీఐసీఐ
2) ఆంధ్రాబ్యాంక్
3) ఎస్బీఐ
4) అలహాబాద్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రైతులకు క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ ఇటీవల ప్రకటించారు. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పైలట్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. దీని ఫలితాల ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరించనున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
- సమాధానం: 3
45. ఇండోనేషియా బ్యాడ్మింటన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) పీవీ సింధు
2) తై జు యింగ్
3) సైనా నెహ్వాల్
4) కరోలినా మారిన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చైనీస్ తైపీ ప్లేయర్, ప్రపంచ నంబర్ వన్ తై జు యింగ్ గెలుచుకుంది. ఫైనల్లో తై జు యింగ్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
- సమాధానం: 2
46. కేంద్ర ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 1
2) 3
3) 5
4) 9
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం తెలంగాణ రాష్ట్రం వస్తు, సేవల ఎగుముతల్లో ఐదో స్థానంలో నిలిచింది. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 3
47. ఐపీఎల్ సీజన్ - 11 వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్ ఎవరు ?
1) బెన్ స్టోక్స్
2) జయదేవ్ ఉనద్కత్
3) కేఎల్ రాహుల్
4) మనీష్ పాండే
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐపీఎల్ సీజన్ - 11 వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అందరికంటే ఎక్కువ మొత్తం దక్కించుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు స్టోక్స్‌ని 12.50 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఇదే జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనాద్కత్‌ను రూ.11.5 కోట్లకు సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీశ్ పాండేను రూ.11 కోట్లకు, కింగ్స ఎలవెన్ పంజాబ్ కేఎల్ రాహుల్‌ను రూ.11 కోట్లకు దక్కించుకున్నాయి.
- సమాధానం: 1
48. భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) ప్రియదర్శన్
2) అరవింద్ సుబ్రమణియన్
3) ఎస్ జయశంకర్
4) విజయ్ కేశవ్ గోఖలే
- View Answer
- సమాధానం: 4
వివరణ: విదేశాంగ కార్యదర్శిగా ఎస్ జయశంకర్ పదవి కాలం 2018 జనవరి 28తో ముగియడంతో.. ఆయన స్థానంలో విజయ్ కేశవ్ గోఖలేని జనవరి 29న నూతన విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 4
49. ‘‘స్త్రీ స్వాభిమాన్’’ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది ?
1) ఎలక్టాన్రిక్స్ అండ్ ఐటీ శాఖ
2) సామాజిక న్యాయ శాఖ
3) మహిళా, శిశు అభివృద్ధి శాఖ
4) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ.. ఇటీవల ‘‘స్త్రీ స్వాభిమాన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బాలికల, మహిళలకు సానిటరీ ఉత్పత్తులను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
- సమాధానం: 1
50. హాండరస్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) సాల్వడార్ నసరల్లా
2) జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్
3) లూయిస్ జాకబ్ టోని
4) జియోమారా కాస్ట్రో
- View Answer
- సమాధానం: 2
వివరణ: హాండరస్ అధ్యక్షుడిగా జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయన 2013లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- సమాధానం: 2