కరెంట్ అఫైర్స్ ( ఏప్రిల్ 9 - 15 ) బిట్ బ్యాంక్
1. పలు దేశాల్లో వ్యాపారంలో అవినీతి చర్యలపై యర్నెస్ట్ అండ్ యంగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో భారత్ స్థానం ఎంత ?
1) 5
2) 9
3) 15
4) 19
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూరోప్, మధ్య ఆసియా, భారత్ మరియు ఆఫ్రికా దేశాలను పరిగణలోకి తీసుకొని యర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఫ్రాడ్ సర్వే - 2017ను రూపొందించింది. మొత్తం 41 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఉక్రెయిన్, రెండో స్థానంలో సైప్రస్, మూడో స్థానంలో గ్రీస్ ఉన్నాయి.
- సమాధానం: 2
2. గ్లోబెల్ ట్రావెల్ మరియు టూరిజం కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ - 2017లో భారత్ ర్యాంకు ఎంత ?
1) 10
2) 15
3) 30
4) 40
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది. 136 దేశాలతో కూడిన ఈ నివేదికలో భారత్ 40వ స్థానంలో నిలిచింది. స్పెయిన్ తొలి స్థానం దక్కించుకోగా ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ దేశాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 4
3. ఇటీవల భారత్ ఇజ్రాయెల్‌తో ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ?
1) 2 బిలియన్ డాలర్లు
2) 3 బిలియన్ డాలర్లు
3) 5 బిలియన్ డాలర్లు
4) 6 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇజ్రాయెల్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఆయుధ ఒప్పందం. ఇందులో భాగంగా 1.6 బిలియన్ డాలర్ల విలువ గల మధ్య శ్రేణి ఉపరితల నుంచి గగనతల మిసైల్ వ్యవస్థ, 400 బిలియన్ డాలర్ల విలువ గల దీర్ఘ శ్రేణి ఉపరితలం నుంచి గగనతల క్షి పణి రక్షణ వ్యవస్థలను భారత్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటుంది.
- సమాధానం: 1
4. 64వ జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారానికి ఎంపికైన సినిమా ఏది ?
1) శతమానం భవతి
2) కాసవ్
3) రుస్తుం
4) దశక్రియ
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2016 సంవత్సరానికి గాను ప్రకటించిన 64వ జాతీయ చలన చిత్రోత్సవంలో కాసవ్ (మరాఠీ చిత్రం) ఉత్తమ చిత్రం పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కేటగిరీలో శతమానం భవతి, ఉత్తమ సాంఘిక సమస్య చిత్రం కేటగిరీలో పింక్ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. రుస్తుం చిత్రంలో నటనకు గాను అక్షయ కుమార్ ఉత్తమ నటుడు పుర స్కారానికి ఎంపిక అయ్యారు.
- సమాధానం: 2
5. ఈ కింది వారిలో చనిపోయిన తర్వాత కీర్తి చక్ర పురస్కారం పొందిన వారు ఎవరు ?
1) ప్రేమ్ బహదూర్ రేసిమ్ మగర్
2) ఫజల్ దిన్
3) మోహన్ సింగ్ బహదూర్
4) నాంద్సింగ్ రజాయి
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో రెండో అత్యున్నత శాంతి పురస్కారం కీర్తిచక్ర. గుర్ఖా రైఫిల్స్‌కు చెందిన లాన్స్ హవల్దార్ ప్రేమ్ బహదూర్ రేసమ్ మగర్‌కు చనిపోయిన తర్వాత ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
- సమాధానం: 1
6. దేశంలో తొలి వన్యప్రాణి డీఎన్ఏ బ్యాంక్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1) రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్
2) కన్హ నేషనల్ పార్క్
3) ఇండియన్ వెటర్నరీ రిసోర్స్ ఇన్సిస్టిట్యూట్
4) ఐఐఎస్సీ బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలోని తొలి వన్యప్రాణి డీఎన్ఏ బ్యాంక్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ఇండియన్ వెటర్నరీ రిసోర్స్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 3
7. దేశంలో తొలి బాస్కెట్ బాల్ స్కూల్‌ను ఎక్కడ ప్రారంభించారు ?
1) బెంగళూరు
2) ముంబయి
3) హైదరాబాద్
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాకు చెందిన జాతీయ బాస్కెట్ బాల్ అసోసియేషన్ భారత్‌లో తొలి బాస్కెట్ బాల్ స్కూల్‌ను ముంబయిలో ఏర్పాటు చేసింది.
- సమాధానం: 2
8. ప్రస్తుతం హర్యానాలో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు ఎంత మంది ఆడపిల్లలు ఉన్నారు ?
1) 950
2) 930
3) 910
4) 890
- View Answer
- సమాధానం: 1
వివరణ: హర్యానాలో ఇటీవల లింగ నిష్పత్తి మెరుగుపడింది. గతంలో హర్యానాలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 879 మంది ఆడపిల్లలే ఉండేవారు. 2016లో ఈ నిష్పత్తి 900కు చేరింది. 2017 గణాంకాల ప్రకారం 950గా నమోదైంది.
- సమాధానం: 1
9. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు పీడిత రాష్ట్రాలు ఎన్ని ?
1) 2
2) 5
3) 7
4) 9
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తించింది. ఈ రాష్ట్రాలకు కరువు భత్యంగా రూ.24,000 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది.
- సమాధానం: 3
10. అతి తక్కువ వయసులో ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపికైంది ఎవరు ?
1) నరేష్ వర్మ
2) మలాల యూసఫ్ జాయ్
3) విక్టోరియా
4) రోజాలిన్ డేవిస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటరెస్ పాకిస్తాన్‌కు చెందిన మలాల యూసఫ్ జాయ్‌ను శాంతి దూతగా నియమించారు. పాకిస్తాన్లో బాలిక విద్య కోసం పాటుపడిన మలాల 2012లో తాలిబన్ల దాడిలో గాయపడింది. 2013 నుంచి తన తండ్రి జియావుద్దీన్ ఏర్పాటు చేసిన మలాల ఫండ్ ద్వారా బాలిక విద్య కోసం ప్రచారం ప్రారంభించింది. 2014లో నోబెల్ అందుకున్న మలాల.. అతి చిన్న వయసులో ఈ పురస్కారం పొందిన వ్యక్తిగాను గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
11. నేషనల్ టీబీ కాన్ఫరెన్స్ - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) పాట్నా
2) గోవా
3) ముంబయి
4) ధర్మశాల
- View Answer
- సమాధానం: 4
వివరణ: క్షయ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 7, 8 తేదీల్లో జాతీయ క్షయ సమావేశాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటులు, పార్లమెంట్ సభ్యులు స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆడారు.
- సమాధానం: 4
12. ప్రపంచంలో ''మరిజువానా'' (డ్రగ్స్) అమ్మకాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఏది ?
1) కెన్యా
2) ఉరుగ్వే
3) పరాగ్వే
4) సెనెగల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 18 ఏళ్లకు పైబడి, రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులకు నెలకు 40 గ్రాముల మరిజువాను మందుల దుకాణంలో కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ ఉరుగ్వే దేశం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజల ఇళ్లలో మరిజువా చెట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
- సమాధానం: 2
13. థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ బాక్సింగ్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది ఎవరు ?
1) హసన్ బోయ్ దుస్మతోన్
2) రోహిత్ టొకాస్
3) కె. శ్యామ్‌కుమార్
4) మొహమద్ హుసాముద్దీన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ టోర్నీలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన హసన్ బోయ్ దుస్మతోన్ను ఓడించి శ్యామ్‌కుమార్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 64 కేజీల విభాగంలో రోహిత్ టొకాస్ కాంస్య పతాకాన్ని గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
14. '' flaming tresses of draupadi '' పుస్తక రచయిత ఎవరు ?
1) వీరప్ప మొయిలీ
2) నితిన్ గడ్కరీ
3) రాజ సుందరమ్
4) సోర్బనంద సోనవాల్
- View Answer
- సమాధానం: 1
15. జాతీయ పిల్లల చిత్రోత్సవం - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) పూణె
2) ముంబయి
3) విశాఖపట్నం
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 3
16. థెస్పిస్ (Thespis) పేరుతో దేశంలో తొలి మైక్రో డ్రామా ఉత్సవాలను ఎక్కడ నిర్వహించారు ?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) పూణె
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: వ్రీక్ష్ అనే సంస్థ న్యూఢిల్లీలో థెస్పిస్ పేరుతో మైక్రోడ్రామా ఉత్సవాలు నిర్వహించింది. క్రీ.పూ. 6వ శతబ్దానికి చెందిన ప్రముఖ గ్రీకు నాటకకారుడు థెస్పిస్ పేరుమీద ఈ నాటకాలు నిర్వహించారు.
- సమాధానం: 2
17. ఏ సంగీత కారుని పేరు మీద ఓ గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ?
1) ఏఆర్ రహమాన్
2) ఇళయరాజా
3) లతామంగేష్కర్
4) ఉస్తాద్ బిస్మిల్లాఖాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సంగీతాన్ని అభివృద్ధి చేసేందుకు వారణాసి వద్ద ఒక ప్రత్యేక సంగీత గ్రామాన్ని ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ పేరుమీద ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
- సమాధానం: 4
18. 5వ ఆసియాన్ బిజినెస్ పురస్కారాలలో '' ఆసియాన్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ '' అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
1) ఆశా ఖేమ్కా
2) చందాకొచ్చర్
3) ఇంద్రనూయి
4) విజయలతా గోయల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత సంతతికి చెందిన ఆశాఖేమ్కా 5వ వార్షిక ఆసియా బిజినెస్ పురస్కారాలలో ఆసియాన్ బిజినెస్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమె ప్రస్తుతం వెస్ట్ నట్టింగ్హమ్ షైర్ కాలేజీకి సీఈవో అండ్ ప్రిన్సిపల్‌గా ఉన్నారు.
ఎంట్రపెన్యూర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి కైలాష్ సూరి, కమ్యూనిటీ చాంపియన్ పురస్కారానికి నిష్టి ఇస్మాయిల్, ఆసియాన్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి మార్నింగ్ సైడ్ ఫార్మసూటికల్స్ను ఎంపిక చేశారు.
- సమాధానం: 1
19. శుక్రగ్రహాన్ని పోలిన మరొక గ్రహాన్ని కనుగొన్నది ఎవరు ?
1) ఇస్రో
2) జాక్సా
3) నాసా
4) చెక్సో
- View Answer
- సమాధానం: 3
వివరణ: నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా శుక్ర గ్రహాన్ని పోలిన మరొక గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమికి 219 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
- సమాధానం: 3
20. ఆసియా యూత్ చాంపియన్‌షిప్ - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) తాష్కెంట్
2) బెలారస్
3) బాకు
4) సనా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించారు.
- సమాధానం: 1
21. ప్రతిష్టాత్మక చైనిస్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ టైటిల్ విజేత ఎవరు ?
1) సెబాస్టియన్ వెటల్
2) లేవిస్ హామిల్టన్
3) అలైన్ ప్రోస్ట్
4) బిల్ ఆస్టిన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మెర్సిడెస్ జట్టుకు చెందిన ఫార్ములా వన్ డ్రైవర్ లేవిస్ హామిల్టన్‌కు షాంఘై (చైనిస్ గ్రాండ్ ప్రీ)లో ఇది 5వ టైటిల్.
- సమాధానం: 2
22. మలేషియన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ 2017లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?
1) లిన్‌డాన్
2) లీ చాంగ్ వై
3) మర్కస్ ఫెర్నాల్డీ గిడియాగ్
4) జెంగ్ సివై
- View Answer
- సమాధానం: 1
వివరణ: మలేషియన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చాంగ్ వీ ను ఓడించి లిన్ డాన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ పోటీలను 1937లో ప్రారంభించారు. టైటిల్ విజేతకు ఇచ్చే నగదదు బహుమతి 6,00,000 డాలర్లు.
- సమాధానం: 1
23. చంపారన్ సత్యాగ్రహం నిర్వహించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) హైదరాబాద్
2) అహ్మదాబాద్
3) న్యూఢిల్లీ
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ''స్వచ్ఛాగ్రహ - బాపుకో కార్యాంజలి - ఏక్ అభియాన్ - ఏక్ ప్రదర్శిని'' పేరుతో న్యూఢిల్లీలోని జాతీయ ఆర్కైవ్స్‌లో డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ''గాందీఇన్ చంపారన్'', '' రోమన్ రొలాండ్ అండ్ గాంధీ'', '' కరస్పాండెన్స్ అండ్ గాంధీ'' పుస్తకాలను విడుదల చేశారు.
- సమాధానం: 3
24. ప్రపంచ హోమియోపతి దినోత్సవంపై అంతర్జాతీయ సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
1) బీజింగ్
2) లండన్
3) బాకు
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్ న్యూఢిల్లీలో సమావేశాన్ని ఈ సమావేశాన్ని ప్రారంభించారు. హోమియోపతి సృష్టికర్త డా. క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్స్ హనిమన్.
- సమాధానం: 4
25. భారత్ - మంగోలియా ద్వైపాక్షిక విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు ?
1) విశాఖపట్నం
2) వెరైంజె
3) పూణె
4) ఐజ్వాల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: Exercise Nomatic Elephant XII పేరుతో ఈ విన్యాసాలను నిర్వహించారు.
- సమాధానం: 2
26. ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) చైనా
2) భారత్
3) అమెరికా
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్టీల్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో భారత్ ఉంది.
- సమాధానం: 1
27. అతి తక్కువ కాలంలో ఎక్కువ కేసులు పరిష్కరించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన న్యాయమూర్తి ఎవరు ?
1) జస్టిస్ రాజేంద్రసింగ్ తోమర్
2) జస్టిస్ నాగేంద్ర సింగ్
3) జస్టిస్ తేజ్ బహదూర్ సింగ్
4) జస్టిస్ నాగార్జున రెడ్డి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కుటుంబ న్యాయస్థానంలో న్యాయమూర్తి జస్టిస్ తేజ్ బహదూర్ సింగ్ 327 పని దినాలలో 6005 కేసులు పరిష్కరించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు.
- సమాధానం: 3
28. లోక్‌సభ ఇటీవల ఆమోదించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లు - 2017 ముఖ్య ఉద్దేశం ఏంటి ?
1) బ్రహ్మణ హక్కుల కోసం
2) సాంఘిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు
3) ఆవుల సంరక్షణ కోసం
4) హిందూ సనాతన ధర్మం కాపాడటం కోసం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 123 రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్‌సభ ఆమోదించింది. దీని ప్రకారం రాజ్యాంగంలో 338(బి) ఆర్టికల్‌ను చేర్చుతారు. ఈ ఆర్టికల్ ప్రకారం సాంఘిక మరియు వెనుకబడిన వర్గాల వారి కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 2
29. ఇటీవల 250 ఏళ్లు పూర్తి చేసుకున్న సంస్థ ఏది ?
1) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
2)రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
3)ఉస్మానియా జనరల్ ఆస్పత్రి
4) సర్వే జనరల్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశ భౌగోళిక చిత్రాలను రూపొందించేందుకు 1767లో సర్వే జనరల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. భారత దేశ అధికారిక చిత్రాలను (MAP) ఈ సంస్థ రూపొందిస్తుంది.
- సమాధానం: 4
30. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే పథకాలలో కేంద్రం వాటాను ఎంతకు తగ్గించారు ?
1) 66
2) 46
3) 38
4) 28
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న పథకాలను 66 నుంచి 28కి తగ్గించింది. ఈ పథకాల నిర్వహణ కోసం రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.
- సమాధానం: 4
31. గ్రూప్-7 (G - 7) దేశాల విదేశాంగ మంత్రుల వార్షిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) అంకారా
2) ఫ్రాంక్ఫర్ట్
3) లూక
4) లియోన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జీ - 7 దేశాలు - అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. ఇటీవల ఇటలీలోని లూకాలో జరిగిన ఈ దేశాల సమావేశానికి యూరోపియన్ యూనియన్ కూడా హాజరైంది. ప్రస్తుత జీ - 7 దేశాలకు ఇటలీ అధ్యక్షత వహిస్తోంది.
- సమాధానం: 3
32. ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం - 2017 ఫిక్షన్ విభాగంలో అవార్డుకు ఎంపికైంది ఎవరు ?
1) కొల్సన్ వైట్ హెడ్
2) జెమ్స్ పీటర్సన్
3) జాన్ రోడ్ కలమ్
4) డేనిల్ల స్టీల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కొల్సన్ వైట్ హెడ్ రాసిన ఊహాత్మక చారిత్రక పుస్తకం ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ఫిక్షన్ విభాగంలో పులిట్జర్ పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారాన్ని జర్నలిజం, సాహిత్యం, సంగీతంలో ప్రదానం చేస్తారు.
- సమాధానం: 1
33. హింది సేవి సమ్మాన్ పురస్కారానికి ఎంపికైన విదేశీయుడు ఎవరు ?
1) గాబ్రియేలా నిక్లియేవా
2) విక్టర్ ఇమాన్యుల్
3) రిచర్డ్ ఐడన్
4) రాజోలినా రొజానా
- View Answer
- సమాధానం: 1
వివరణ: హింది సేవా సమ్మాన్ పురస్కారాన్ని 1989లో ప్రారంభించారు. 2017 సంవత్సరానికి గాను అమెరికాకు చెందిన ప్రొఫెసర్ గాబ్రియేలా నిక్లియేవాకు ఈ అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారం కింద రూ.5 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.
- సమాధానం: 1
34. దేశంలో పరిశుభ్రతలో అత్యుత్తమ పోర్ట్‌గా ఎంపికైన ఓడరేవు ఏది ?
1) విశాఖపట్నం
2) చెన్నై పోర్టు
3) ముంబయి పోర్టు
4) హల్దియా పోర్టు
- View Answer
- సమాధానం: 4
వివరణ: క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలోని 13 పోర్టులలో పరిశుభ్రతపై పరిశీలన జరిపింది. ఇందులో అత్యుత్తమ పరిశుభ్రత విధానాలతో పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా పోర్టు తొలి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రెండో స్థానంలో ఉంది.
- సమాధానం: 4
35. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం అత్యధిక ఉరిశిక్షలు విధిస్తున్న దేశం ఏది ?
1) ఇరాన్
2) సౌదీ అరేబియా
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశం చైనా. తర్వాతి స్థానంలో (567 మంది), సౌదీ అరేబియా (154 మంది) ఉన్నాయి. చైనాలో ఉరితీసిన వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచినందువల్ల శిక్షలపై స్పష్టత లేదు.
- సమాధానం: 3
36. భారత్‌లో 5జీ నెట్వర్క్ సేవలు ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) గూగుల్
2) నోకియా
3) మైక్రోసాఫ్ట్
4) రెడ్ హట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2019లోపు 5జీ నెట్వర్క్ సేవలను వినియోగదారులకు అందించేందుకు నోకియా సంస్థతో బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
- సమాధానం: 2
37. స్కోప్ అవార్డులు - 2017 వ్యక్తిగత నాయకత్వ విభాగంలో పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) అనూప్ కుమార్ మిట్టల్
2) ఏకే జైన్
3) కేఎస్ పోప్‌ల
4) పూజా కపూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించిన వారికి స్కోప్ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డుల్లో వ్యక్తిగత నాయకత్వ విభాగం - 1 లో నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ అనూప్ కుమార్ మిట్టల్ ఎంపికయ్యారు.
- సమాధానం: 1
38. UNHCR రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఎమ్మాస్టోన్
2) ఎమ్మావాట్సన్
3) ప్రియాంకా చోప్రా
4) క్రిస్టిన్ డేవిస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికాకు చెందిన ప్రముఖ టీవీ నటి క్రిస్టిన్ డేవిస్ UNHCR రాయబారిగా నియమితులయ్యారు. ఈమె 3 సంవత్సరాలు శరణార్థుల కోసం పనిచేస్తారు.
UNHCR: United Nations High Commission For Refugees
- సమాధానం: 4
39. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) విరాట్ కోహ్లీ
2) హర్భజన్ సింగ్
3) రాహుల్ ద్రవిడ్
4) అనిల్ కుంబ్లే
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐసీసీ 8 మంది క్రీడాకారులను చాంపియన్ ట్రోఫీ రాయబారులుగా ఎంపిక చేసింది. ఇందులో భారత్ నుంచి హర్భజన్ సింగ్‌కు చోటుదక్కింది.
- సమాధానం: 2
40. అంతర్జాతీయ మానవ అంతరిక్ష వాహన నౌక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 12
2) ఏప్రిల్ 13
3) ఏప్రిల్ 14
4) ఏప్రిల్ 15
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1961 ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి విజయవంతంగా మొదటి రాకెట్‌ను పంపినందుకు గుర్తుగా ఏటా ఆ రోజున అంతర్జాతీయ మానవ అంతరిక్ష వాహకనౌక దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
41. మాతోశ్రీ పుస్తక రచయిత ఎవరు ?
1) సుమిత్రా మహాజన్
2) వీరప్ప మొయిలీ
3) వీనితా కులకర్ణి
4) రామ్‌సుందర్ జైన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ''మాతోశ్రీ'' పేరుతో దేవి అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను ( 1767-1795) రచించారు.
- సమాధానం: 1
42. చేతి వృత్తుల అభివృద్ధి కోసం ఆదరణ పేరుతో పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహాత్మా జ్యోతిరావ్ పూలే 191వ జయంతి (ఏప్రిల్ 11) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రారంభించింది. మధ్యతరగతి వర్గాల వారి అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
- సమాధానం: 2
43. అమ్మకు వందనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) రాజస్థాన్
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017-18 విద్యా సంవత్సరంలో 5 వేల పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రత్యేక సందర్భాల్లో పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాల కు తల్లులను ఆహ్వానించి వారిని గౌరవించటం ఈ పథకం ఉద్దేశం.
- సమాధానం: 3
44. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఎవరు ?
1) డొనాల్డ్ ట్రంప్
2) పోప్ ఫ్రాన్సిస్
3) నరేంద్రమోదీ
4) బరాక్ ఒబామా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇన్‌స్ట్రాగ్రామ్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీకి 6.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ( ఏప్రిల్ 12, 2017 నాటికి). రెండో స్థానంలో ఉన్న ట్రంప్‌కు 6.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
- సమాధానం: 3
45. పంజాబ్ అసోసియేషన్ నుంచి ఇటీవల జీవితకాల సాఫల్య పురస్కారం పొందినవారు ఎవరు ?
1) అమితాబ్ బచ్చన్
2) వినోద్ ఖన్నా
3) రాజేష్ వర్మ
4) దిలీప్ కుమార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పంజాబ్ అసోసియేషన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్‌కు లివింగ్ లెజెండ్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది.
- సమాధానం: 4
46. క్రిషి కర్మాన్ (Krishi Karman) పురస్కారం 2015-16కు ఎంపికైన రాష్ట్రం ఏది ?
1) హిమాచల్ ప్రదేశ్
2) హర్యానా
3) పంజాబ్
4) ఉత్తరాంచల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించినందుకు గాను హిమాచల్‌ప్రదేశ్ ఈ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 1
47. యూఎన్డీపీ నూతన అడ్మినిస్ట్రేటర్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) అఖిలేష్ దాస్ గుప్తా
2) ఆకిమ్ స్టీనర్
3) స్టీవెన్ స్మిత్
4) లిసా బాటె
- View Answer
- సమాధానం: 2
వివరణ: అకిమ్ స్టీనర్ (Achiem Steiner) 2006 - 2016 వరకుయూఎన్ఈపీలో పనిచేశారు.
- సమాధానం: 2
48. ఇటీవల ఏ రాష్ట్రంలో తారే జమీన్ పర్ అనే పథకాన్ని ప్రారంభించారు ?
1) ఛత్తీస్‌గఢ్
2) ఉత్తరాఖండ్
3) జార్ఖండ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
వివరణ: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు సంతోషకర జీవితాలు అందించేందుకు జార్ఖండ్ పోలీసులు తారే జమీన్ పర్ అనే పథకాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 3
49. ఫోర్బ్స్-30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు సంపాదించిన భారతీయ నటి ఎవరు ?
1) అనుష్క శర్మ
2) సమంతా
3) దీపికా పదుకొన్
4) ఆలియా భట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆసియాలో అత్యంత ధనవంతురాలైన అతి పిన్న వయస్కురాలు ఆలియా భట్.
- సమాధానం: 4
50. దేశంలో తొలి నది మార్గ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత రుణం మంజూరు చేసింది ?
1) 375 మిలియన్ డాలర్లు
2) 500 మిలియన్ డాలర్లు
3) 630 మిలియన్ డాలర్లు
4) 780 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో తొలి జల రవాణా మార్గం (వారణాసి - హల్దియా) అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుంచి భారత్ 375 మిలియన్ డాలర్ల రుణం పొందింది.
- సమాధానం: 1