కరెంట్ అఫైర్స్ డిసెంబర్ (8 - 15) బిట్ బ్యాంక్
1. భారత్‌లోని ఏ పవిత్ర వేడుకను యునెస్కో ఇటీవల మానవాళి సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది ?
1) శబరిమలై
2) కుంభమేళ
3) పూరి రథ యాత్ర
4) తిరుమల బ్రహ్మోత్సవాలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: హిందువుల పవిత్ర వేడుక కుంభమేళాను.. ‘మానవాళి సాంస్కృతిక వారసత్వ సంపద’గా యునెస్కో గుర్తించింది. దక్షిణకొరియాలో జరిగిన యునెస్కో సమావేశాల్లో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు బోట్స్వానా, కొలంబియా, వెనెజులా, మంగోలియా, మొరాకో, టర్కీ, యూఏఈలో జరిగే వేడుకలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. కుంభమేళ వేడుక అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో జరుగుతుంది.
- సమాధానం: 2
2. దేశంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 7
2) డిసెంబర్ 9
3) డిసెంబర్ 11
4) డిసెంబర్ 13
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1949 నుంచి ఏటా డిసెంబర్ 7వ తేదీన దేశ వ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ఈ సందర్భంగా ప్రజలు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించి.. ఆ నిధులను త్రివిధ సైనిక దళాల మాజీ సైనికుల మరియు అమర సైనికుల కుటుంబాల సంక్షేమార్థం వినియోగిస్తారు.
- సమాధానం: 1
3. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎప్పటి వరకు పొడగించింది ?
1) 2018, మార్చి 31
2) 2018, ఏప్రిల్ 30
3) 2018, మే 31
4) 2018, జూన్ 30
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం గడువుని 2018 మార్చి 31 వరకు పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టుకి తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మొబైల్ నంబర్‌తో ఆధార్ అనుసంధానం గడువు 2018, ఫిబ్రవరి 6.
- సమాధానం: 1
4. ఎలక్టాన్రిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(E-NAM) ద్వారా జరిగే కొనుగోళ్లు, సేవల చెల్లింపులను నగదు రహిత పద్ధతిలో జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఎస్బీఐ
2) ఆంధ్రాబ్యాంక్
3) విజయ బ్యాంక్
4) ఐసీఐసీఐ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎలక్టాన్రిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(E-NAM) ద్వారా జరిగే కొనుగోళ్లు, సేవల చెల్లింపులను నగదు రహిత పద్ధతిలో జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 470 మార్కెట్లలో ఈ - నామ్ లైవ్ ట్రేడింగ్ అమలవుతోంది. ఈ - నామ్ విధానాన్ని 2016 ఏప్రిల్ లో ప్రారంభించారు.
- సమాధానం: 4
5. వధువు లేదా వరుడిలో ఎవరో ఒకరు దళితులై ఉండి కులాంతర వివాహాం చేసుకున్న వారికి ఎన్ని లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది ?
1) రూ. 2 లక్షలు
2) రూ. 2.5 లక్షలు
3) రూ. 3 లక్షలు
4) రూ. 3.5 లక్షలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: వధువు లేదా వరుడిలో ఎవరో ఒకరు దళితులై ఉండి కులాంతర వివాహాం చేసుకున్న వారికి 2 లక్షలా 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. దేశంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 2
6. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ నగరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను ప్రారంభించారు ?
1) హైదరాబాద్
2) ముంబై
3) న్యూఢిల్లీ
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 7న ప్రారంభించారు. పరిశోధన, ఆర్థిక అంశాల్లో అధ్యయనానికి ఈ కేంద్రం ముఖ్య వేదికగా నిలుస్తుందని మోదీ చెప్పారు.
- సమాధానం: 3
7. భారత్‌లో తొలి గ్లోబల్ పార్టనర్షిప్ సమ్మిట్ - 2017 ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌లో తొలి గ్లోబల్ పార్టనర్షిప్ సమ్మిట్ - 2017 డిసెంబర్ 11 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో జరిగింది. 20 ఏళ్లుగా భారత ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఇండియా సెంటర్ ఫౌండేషన్(ICF) ఈ సమ్మిట్‌ను నిర్వహించింది.
- సమాధానం: 1
8. ఐరాస పర్యావరణ ప్రోగ్రామ్(UNEP) ఇటీవల భారత్‌లోని ఏ నగర వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను కాలష్యాన్ని తగ్గించేందుకుపపంచంలో అవలంబిస్తున్న ఐదు ఉత్తమ విధానాల్లో ఒకటిగా గుర్తించింది ?
1) వరంగల్
2) విశాఖపట్నం
3) అలప్పుజా
4) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: 3
వివరణ: కాలుష్యాన్ని తగ్గించేందుకు కేరళలోని అలప్పుజాలో అవలంబిస్తున్న వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ప్రపంచంలోని ఐదు ఉత్తమ విధానాల్లో ఒకటిగా యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల గుర్తించింది.
- సమాధానం: 3
9. ఫుట్‌బాల్ సీజన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే వారికి ఫిఫా ప్రకటించే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ - 2017 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు ?
1) హార్రి కానే
2) లియోనల్ మెస్సీ
3) క్రిస్టియానో రొనాల్డో
4) కెవిన్ డి బ్రూన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫుట్‌బాల్ సీజన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే వారికి ఫిఫా ప్రకటించే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ - 2017 అవార్డుని క్రిస్టియానో రొనాల్డోకి ప్రకటించారు. రొనాల్డో ఈ అవార్డు గెలుచుకోవడం ఇది ఐదోసారి. గతంలో 2008, 2013, 2014, 2016లో రొనాల్డో ఈ అవార్డు గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
10. ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందంలో భారత్ ఇటీవల ఎన్నో సభ్య దేశంగా చేరింది ?
1) 30
2) 42
3) 50
4) 60
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందం (Wassenaar)లో భారత్ 42వ సభ్య దేశంగా చేరింది. డిసెంబర్ 7న వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్ స్థాయి పెరగడంతో పాటు కీలక రక్షణ, అంతరిక్ష రంగాల్లో అధునాతన సాంకేతికతలను ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది.
- సమాధానం: 2
11. మెక్సికోలో జరిగిన ప్రపంచ పారా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ - 2017లో స్వర్ణాన్ని గెలుచుకున్న భారత స్విమ్మర్ ఎవరు ?
1) దీపా మాలిక్
2) కాంచనమాల పాండే
3) మరియప్పన్ తంగవేలు
4) అజయ్ మిశ్రా
- View Answer
- సమాధానం: 2
వివరణ: దివ్యాంగురాలైన కాంచనమాల పాండే మెక్సికోలో జరిగిన ప్రపంచ పారా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ - 2017లో స్వర్ణాన్ని గెలుచుకుంది. తద్వారా ఈ టోర్నమెంట్ చరిత్రలో పసిడి పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
12. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ యాక్సెస్ రిపోర్ట్ - 2017 ప్రకారం భారత్ ఎప్పటిలోగా దేశంలో అందరికీ విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యాన్ని చేరుకుంటుంది ?
1) 2020
2) 2021
3) 2022
4) 2023
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(IEA) ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ యాక్సెస్ రిపోర్ట్ - 2017 ప్రకారం భారత్ 2020 ప్రారంభంలో అందరికీ విద్యుత్ లక్ష్యాన్ని చేరుకుంటుంది.
- సమాధానం: 1
13. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఏ నగరంలో ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియంను ప్రారంభించారు ?
1) విశాఖపట్నం
2) విజయవాడ
3) కాకినాడ
4) నెల్లూరు
- View Answer
- సమాధానం: 1
వివరణ: విశాఖపట్నంలో కురుసుర జలాంతర్గామి ఎదురుగా ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధవిమాన మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 7న ప్రారంభించారు. అనంతరం ఐఎన్ఎస్ డేగాలో భారత తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరిస్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు.
- సమాధానం: 1
14. సీనియర్ ఉమెన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ - 2018కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ?
1) స్పెయిన్
2) భారత్
3) జర్మనీ
4) అర్జెంటీనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: సీనియర్ ఉమెన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ - 2018, సీనియర్ మెన్స్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2021 పోటీలకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్వవర్ధన్ సింగ్ రాథోడ్ ఇటీవల ప్రకటించారు.
- సమాధానం: 2
15. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 9
2) డిసెంబర్ 10
3) డిసెంబర్ 12
4) డిసెంబర్ 14
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి 2003 డిసెంబర్ 31న తీర్మానాన్ని ఆమోదించింది.
2017 Theme : United against corruption for development, peace and security
- సమాధానం: 1
16. ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం ‘‘వ్యాస్ సమ్మాన్ - 2017’’కు ఎవరు ఎంపికయ్యారు ?
1) గోపాల్ దాస్ నీరజ్
2) మృదులా గార్గ్
3) అశోక్ చక్రధర్
4) మమతా కాలియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ హిందీ రచరుుత్రి మమతా కాలియా ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం వ్యాస్ సమ్మాన్ - 2017కు ఎంపికయ్యారు. దు:ఖం సుఖం నవలకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. పురస్కారం కింద మమతాకు రూ.3.5 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.
- సమాధానం: 4
17. సమాజంలో మహిళల పాత్రపై అవగాహన పెంచేందుకు ఫేస్బుక్ సహాయంతో యూఎన్ ఉమెన్ సంస్థ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం ఏది ?
1) ఉమెన్ పవర్
2) వి ద ఉమెన్
3) ఉమెన్ ఈజ్ ద ఫ్యూచర్
4) ఉమెన్ డిజర్వ్ బెటర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సమాజంలో మహిళల పాత్రపై అవగాహన పెంచేందుకు ఫేస్బుక్ సహాయంతో యూఎన్ ఉమెన్ సంస్థ ఇటీవల ఢిల్లీలో ‘‘వి ద ఉమెన్’’ పేరుతో రెండో రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది.
- సమాధానం: 2
18. నగదు బహుమతి గెలిచారంటు మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా జరిగే మోసాలపై ప్రజలను జాగృతం చేసేందుకు ఎస్ఎంఎస్, మిస్డ్‌కాల్ క్యాంపెయిన్ ప్రారంభించిన సంస్థ ఏది ?
1) ఆర్బీఐ
2) నీతి ఆయోగ్
3) ఓఈసీడీ
4) ఎన్ ఫోర్స్ మెంట్ డెరైక్టరేట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నగదు బహుమతి గెలిచారంటు మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా జరిగే మోసాలపై ప్రజలను జాగృతం చేసేందుకు ఆర్బీఐ ఎస్ఎంఎస్, మిస్డ్‌కాల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇందుకు సంబంధించి (8691960000) నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చిన వారికి ఆర్బీఐ తిరిగి ఫోన్ చేసి ఈ తరహా మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తుంది.
- సమాధానం: 1
19. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) మీనా హేమచంద్ర
2) ఉమా శంకర్
3) దీపాలి పంత్ జోషి
4) గణేశ్ సిన్హా
- View Answer
- సమాధానం: 2
వివరణ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉమా శంకర్ ఇటీవల నియమితులయ్యారు.
- సమాధానం: 2
20. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 6
2) డిసెంబర్ 8
3) డిసెంబర్ 10
4) డిసెంబర్ 12
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948 డిసెంబర్ 10న విశ్వమాన హక్కుల తీర్మాన్ని ఆమోదించింది. దీంతో.. అప్పటి నుంచి ఏటా ఆ రోజున ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
2017 Theme : Let's stand up for equality, justice and human dignity
- సమాధానం: 3
21. ఈ కింది వారిలో ఎవరు భారత డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడిగా గుర్తింపు పొందారు ?
1) లాల్జీ సింగ్
2) జయంత్ నర్లీకర్
3) రఘునాథ్ మషేల్కర్
4) అనిల్ కకోద్కర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ శాస్త్రవేత్త, భారత డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ డిసెంబర్ 10న కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని కేంద్ర డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఓఎస్డీగా (1995-99) సేవలందించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుల్లో లాల్జీ ఒకరు. దేశంలో డీఎన్ఏ ఆధారంగా పితృత్వాన్ని నిర్థారించేపరీక్షలను లాల్జీ సింగ్ అభివృద్ధి చేశారు.
- సమాధానం: 1
22. ప్రభుత్వ వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడం, అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక సాంకేతిక కేంద్రం పేరు ఏమిటి ?
1) CGG - INTER
2) NIC - CERT
3) NIC -CGG
4) CAT -CCA
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రభుత్వ వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడం, అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం NIC-CERT పేరుతో సాంకేతిక కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత ఎన్ఐసీ డెరైక్టర్ జనరల్ నీతా వర్మ.
- సమాధానం: 2
23. యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ఏ పర్వత శిఖరాన్ని ఇటీవల ఆ దేశ ప్రభుత్వం దేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా ప్రకటించింది ?
1) మౌంట్ పాగెట్
2) మౌంట్ విన్సన్
3) మౌంట్ జాక్సన్
4) మౌంట్ హోప్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంటార్కిటక్లోని కొంత భాగాన్ని యూకే తమదిగా పేర్కొంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న మౌంట్ హోప్ ఎత్తుని ఇటీవల మరోసారి లెక్కించిన బ్రిటన్ అధికారులు.. దేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా ప్రకటించారు. ఇంతకముందు ఈ గుర్తింపు మౌంట్ జాక్సన్‌కు ఉండేది.
- సమాధానం: 4
24. జోబర్గ్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ - 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) రాహిల్ గంగ్జీ
2) శుభాంకర్ శర్మ
3) అశోక్ కుమార్
4) శివ కపూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన జోబర్గ్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ - 2017 టైటిల్‌ను భారత్‌కు చెందిన గోల్ఫర్ శుభాంకర్ శర్మ గెలుచుకున్నాడు. ఈ విజయం ద్వారా శర్మ 2018లో జరిగే బ్రిటిష్ ఓపెన్‌కు అర్హత సాధించాడు.
- సమాధానం: 2
25. ఇటీవల రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ?
1) 87
2) 77
3) 90
4) 132
- View Answer
- సమాధానం: 1
వివరణ: సోనియా గాంధీ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఇటీవల ఎన్నికయ్యారు. నెహ్రూ-గాంధీ వారసత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 1885లో స్థాపితమైన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమెష్ చందర్ బెనర్జీ.
- సమాధానం: 1
26. కింది వాటిలోని ఏ దేశం వాణిజ్య సినిమాల ప్రదర్శనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ?
1) ఇరాన్
2) నైజీరియా
3) టర్కీ
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 35 ఏళ్ల తర్వాత మళ్లీ తమ దేశంలో వాణిజ్య సినిమాలను ప్రదర్శించేందుకు అనుమతి ఇస్తున్నట్లు సౌదీ అరేబియా ఇటీవల ప్రకటించింది. దీంతో.. 2018 ప్రారంభంలో కమర్షియల్ సినిమాలు ఆ దేశంలో ప్రదర్శితం కానున్నాయి.
- సమాధానం: 4
27. రష్యా-ఇండియా-చైనా(RIC)15వ త్రైపాక్షిక చర్చలు ఇటీవల ఏ నగరంలో జరిగాయి ?
1) బీజింగ్
2) మాస్కో
3) న్యూఢిల్లీ
4) షాంఘై
- View Answer
- సమాధానం: 3
వివరణ: రష్యా-ఇండియా-చైనా(RIC) 15వ త్రైపాక్షిక చర్చలు ఇటీవల న్యూఢిల్లీలో జరిగాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్ రోవ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ... చర్చల్లో పాల్గొన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ముగ్గురు నేతలు చర్చించారు.
- సమాధానం: 3
28. భారత్‌లో తొలి ఎలక్టాన్రిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్(EMC) ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) హర్యానా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌లో తొలి Electronic manufacturing cluster(emc) ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా భారత్‌లో ఈఎంసీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2012లో ప్రకటించింది. ఈ క్లస్టర్‌ను ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు 2015లో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. 113.27 ఎకరాలు కేటాయించింది. అదే సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్లస్టర్‌కు శంకుస్థాపన చేశారు. సెల్కాన్, కార్బన్, లావా కంపెనీలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
- సమాధానం: 1
29. ప్రతిష్టాత్మక మదర్ థెరెసా స్మారక పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) అక్కినేని అమల
2) ప్రియాంకా చోప్రా
3) ఆంజెలీనా జోలి
4) ఎమ్మా వాట్సన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రతిష్టాత్మక మదర్ థెరెసా స్మారక పురస్కారం - 2017కు బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఎంపికయ్యారు. ప్రియాంక.. మదర్ థెరిస్సా స్ఫూర్తిగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైలీ ప్రాంతంలో ఉన్న ప్రేమ్‌నివాస్ అనే వృద్ధాశ్రమానికి విరాళాలు ఇచ్చింది. ఇందుకు గుర్తింపుగా ఆమెకు ఈ పురస్కారం ప్రకటించారు.
- సమాధానం: 2
30. ప్రతిష్టాత్మక యరారింగన్ అవార్డు - 2017ని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు ?
1) కిరణ్ కుమార్
2) అనిల్ కకోద్కర్
3) ద్రోణం రాజు కృష్ణంరాజు
4) ఎం ఎస్ స్వామినాథన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రతిష్టాత్మక యరారింగన్ అవార్డు- 2017ని ఎం.ఎస్. స్వామినాథన్.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు.
- సమాధానం: 4
31. ఏ సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘‘ఇయర్ ఆఫ్ స్పోర్ట్స’’గా ప్రకటించింది ?
1) 2018
2) 2019
3) 2020
4) 2021
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018ని క్రీడా సంవత్సరంగా ప్రకటిస్తున్నామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ ఇటీవల ప్రకటించారు. అదే సంవత్సరంలో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 2017-18 నుంచి 2019-20 వరకు ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,756 కోట్లు కేటాయించింది.
- సమాధానం: 1
32. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకై క బ్యాట్స్‌మెన్ ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) సచిన్ టెండూల్కర్
3) రోహిత్ శర్మ
4) గ్రిస్ గేల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్, శ్రీలంకల మధ్య డిసెంబర్ 13న మొహాలిలో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 153 బంతుల్లో 208 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్, గప్టిల్ మాత్రమే ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు.
- సమాధానం: 3
33. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వంద సార్లు 300కుపైగా పరుగులు సాధించిన తొలి దేశం ఏది ?
1) ఆస్ట్రేలియా
2) భారత్
3) శ్రీలంక
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వంద సార్లు 300కుపైగా పరుగులు సాధించిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఇటీవల శ్రీలంకతో మొహాలీలో జరిగన మ్యాచ్‌లో 392 పరుగులు సాధించడం ద్వారా ఈ రికార్డుని నమోదు చేసింది.
- సమాధానం: 2
34. ఇటీవల ఎఫ్ఎం రేడియో నెట్‌వర్క్‌ను పూర్తిగా నిలిపివేసి ప్రసారాలను డిజిటల్ ఆడియో బ్రాడ్ కాస్టింగ్ విధానంలోకి మార్చిన తొలి దేశం ఏది ?
1) నార్వే
2) అమెరికా
3) ఫ్రాన్స్
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే తొలిసారిగా ఇటీవల నార్వే ఎఫ్ఎం రేడియో నెట్వర్క్ ను పూర్తిగా నిలిపివేసి ప్రసారాలను డిజిటల్ ఆడియో బ్రాడ్ కాస్టింగ్(DAB) విధానంలోకి మార్చింది.
- సమాధానం: 1
35. ఏషియన్ బాక్సింగ్ కాన్ఫెడరేషన్ నుంచి సంవత్సరపు ఉత్తమ యూత్ బాక్సర్ - 2017 అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
1) సచిన్ సివాచ్
2) నానోవ్ సింగ్
3) వికాస్కృష్ణన్
4) సంజయ్ స్వారన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్ సచిన్ సివాచ్.. ఏషియన్ బాక్సింగ్ కాన్ఫెడరేషన్ నుంచి సంవత్సరపు ఉత్తమ యూత్ బాక్సర్ - 2017 పురస్కారానికి ఎంపికయ్యాడు. అవార్డు విజేతను ఆన్లైన్ పోల్ ద్వారా ఎంపిక చేశారు.
- సమాధానం: 1
36. 2017 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఏ పదాన్ని గుర్తిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఇటీవల ప్రకటించింది ?
1) YouthQuake
2) EarthQuake
3) Social Media
4) Politics
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్ అనే పదాన్ని గుర్తిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఇటీవల ప్రకటించింది. ఈ ఏడాదిలో యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యాన్ని గుర్తిస్తూ భాషాపరమైన ఆసక్తి, దాని వాడకాన్ని పరిగణలోనికి తీసుకుని యూత్‌క్వేక్‌ను ఈ ఏడాదికి వర్డ్ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తున్నట్లుతెలిపింది.
- సమాధానం: 1
37. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ముంబైలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టిన ‘‘ఐఎన్ఎస్ కల్వరి’’ జలాంతర్గామి స్కార్పియన్ శ్రేణిలో ఎన్నోది ?
1) మొదటిది
2) రెండోది
3) మూడవది
4) ఆరవది
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్కార్పిన్ శ్రేణిలో మొదటిదైన అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ కల్వరి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 14న ముంబైలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. హిందూ మహాసముద్రంలోని భయంకరమైన ‘టైగర్’ షార్క్ (మలయాళంలో కల్వరి అంటారు) పేరును ఈ జలాంతర్గామికి పెట్టారు. స్కార్పిన్ సిరీస్‌లో మొత్తం ఆరు సబ్మెరైన్లు నిర్మిస్తున్నారు.
- సమాధానం: 1
38. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలని ఎవరు ప్రారంభించారు ?
1) నరేంద్ర మోదీ
2) కే చంద్రశేఖర్ రావు
3) ఎం. వెంకయ్య నాయుడు
4) ఈఎస్ఎల్ నరసింహన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహించిన తెలుగు మహాసభలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. డిసెంబర్ 15 - 19 వరకు ఈ సభలు జరిగాయి. ముగింపు వేడకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- సమాధానం: 3
39. ఇటీవల ఏ రాష్ట్రం డీజీపీ నియామకాన్ని రాష్ట్ర పరిధిలోకి తెచ్చేందుకు పోలీస్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీజీపీ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేలా పోలీస్ యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది.
- సమాధానం: 1
40. ఇండియన్ నేవీలో సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తరుున సందర్భాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవాలను ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు ?
1) ముంబై
2) కొచ్చిన్
3) విశాఖపట్నం
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియన్ నేవీలో జలాంతర్గాముల సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో డిసెంబర్ 8న సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ కల్వరి సబ్‌మెరైన్ సేవలు 1967లో ప్రారంభించారు. ఈ 50 ఏళ్లలో 25 సబ్మెరైన్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి.
- సమాధానం: 3
41. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకే సరకులు అందించే కేంద్రాలను ఇటీవల ఏ పేరుతో ప్రారంభించింది ?
1) ఎన్టీఆర్ మాల్స్
2) చంద్రన్న విలేజ్ మాల్స్
3) ఏపీ మాల్స్
4) రూరల్ మాల్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ, గుంటూరులో పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టిన చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న ప్రారంభించారు. ఇందులో వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్పీ కంటే 4 నుంచి 35 శాతం తక్కువ ధరకు లభిస్తాయి.
- సమాధానం: 2
42. దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల తయారీ పార్కు ఏర్పాటు కానుంది ?
1) గుజరాత్
2) పశ్చిమ బెంగాల్
3) తమిళనాడు
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని జహీరాబాద్‌లో ఉన్న ‘నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’లో 500 ఎకరాల్లో ‘మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఎక్విప్మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్)’ ఏర్పాటు కానుంది. ఇందుకోసం బెంగళూరులోని శ్రేయీ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్స్ ఫైనాన్స లిమిటెడ్ అనుబంధ కంపెనీ అట్టివో ఎకనామిక్ జోన్స ప్రైవేటు లిమిటెడ్.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ పార్కులో భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో ఉపయోగించే యంత్ర పరికరాలు తయారు చేస్తారు.
- సమాధానం: 4
43. దేశంలోని ఏ రాష్ట్రం ఆగ్నేయాసియా గేట్వేగా మారనుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు ?
1) మిజోరాం
2) మణిపూర్
3) సిక్కిం
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మిజోరంలో తుయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టుని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు.. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్‌లోని సిత్వే పోర్టును మిజోరాంతో అనుసంధానించే కలడన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్సపోర్ట్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. ఆసియాన్ కూటమి దేశాలకు మిజోరాం ముఖ్యద్వారంగా మారుతుందని అన్నారు.
- సమాధానం: 1
44. దివ్యాంగులకు ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే అన్ని విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎంత శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది ?
1) 3 శాతం
2) 4 శాతం
3) 5 శాతం
4) 6 శాతం
- View Answer
- సమాధానం: 3
వివరణ: దివ్యాంగులకు ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే అన్ని ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో 5 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల చట్టం -2016, సెక్షన్ 32 పరిధిలోకి వచ్చే అన్ని విద్యాసంస్థలు ఏటా ఈ నిబంధనను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.
- సమాధానం: 3
45. చైనా గోయింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ - 2017 పేరుతో ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స యూనిట్ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 30
2) 37
3) 45
4) 60
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనా గోయింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ - 2017 పేరుతో ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్ ఆరు స్థానాలు దిగజారి 37వ స్థానంలో నిలిచింది. చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లే పెట్టుబడులను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ర్యాంకింగ్స్‌లో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా.. అమెరికా, హాంకాంగ్, మలేషియా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 2
46. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో భాగంగా అందించే సెసిల్ బి డిమిల్లే అవార్డు - 2018ని ఎవరికి ప్రకటించారు ?
1) క్రిస్సీ మెట్జ్
2) శైలేన్ ఊడ్లే
3) ఓప్రా విన్ ఫ్రే
4) ఇస్సా రే
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికా టీవీస్టార్ ఓప్రా విన్ఫ్రే 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ‘ది ఓప్రా విన్ఫ్రే షో’తో గుర్తింపు సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం ఓప్రా విన్ఫ్రే నెట్వర్క్ చానల్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డులని ఏటా హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్(హెచ్‌ఎఫ్‌పీఏ) ప్రకటిస్తుంది.
- సమాధానం: 3
47. బాపు జీవిత సాఫల్య పురస్కారం - 2017ని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు ?
1) కే విశ్వనాథ్
2) కై కాల సత్యనారాయణ
3) కోటా శ్రీనివాసరావు
4) రాఘవేంద్రరావు
- View Answer
- సమాధానం: 1
వివరణ: సినీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌కు బాపు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో అధికారికంగా మూడు రోజులుగా నిర్వహించిన బాపు జయంత్యుత్సవాల్లో ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.
- సమాధానం: 1
48. ఫోర్బ్స్ మేగజైన్ ఇటీవల విడుదల చేసిన అత్యంత ఎక్కువ ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో తొలి స్థానంలో ఎవరు ఉన్నారు ?
1) మైకేల్ జోర్డాన్
2) టైగర్ వుడ్స్
3) ఆర్నాల్డ్ పాల్మర్
4) జాక్ నిక్ లాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫోర్బ్స్ మేగజైన్ ఇటీవల విడుదల చేసిన అత్యంత ఎక్కువ ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్ 1.85 బిలియన్ డాలర్ల సంపాదనతో తొలి స్థానంలో ఉన్నాడు. టైగర్ వుడ్స్, ఆర్నాల్డ్ పాల్మర్, జాక్ నిక్ లాస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- సమాధానం: 1
49. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) అత్యుత్తమ విదేశీ క్రీడాకారుడి పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) మొహమ్మద్ అలీ
2) ఉసేన్ బోల్ట్
3) విరాట్ కోహ్లీ
4) రోజర్ ఫెడరర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) ఏటా అందించే అత్యుత్తమ విదేశీ క్రీడాకారుడి పురస్కారానికి ఎంపికయ్యాడు. ఫెడరర్‌కు ఈ పురస్కారం లభించడం ఇది నాలుగోసారి. 2004, 2006, 2007లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.
- సమాధానం: 4
50. నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) నూతన డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఆర్. హేమలత
2) సౌమ్యా స్వామినాథన్
3) సుభద్రా నాయర్
4) నీలమ్ క్లెర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) నూతన డెరైక్టర్‌గా సీనియర్ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత నియమితులయ్యారు. పరిశోధన రంగంలో ఆమె అందించిన సేవలకు 2016లో ‘ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్’, 2017 లో ‘ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ న్యూట్రిషన్ సెన్సైస్’ అవార్డులు అందుకున్నారు.
- సమాధానం: 1