కరెంట్ అఫైర్స్ (డిసెంబర్ 25-31) బిట్ బ్యాంక్
1. NPCIL ఏ ప్రాంతంలో అణు విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది ?
1) కొత్తగూడెం
2) కొవ్వాడ
3) తడ
4) ఆదిభట్ల
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-NPCIL ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. 6,600 మిలియన్ యూనిట్ల సామర్థ్యంతో ఏర్పాటు అవుతోన్న ఈ ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించగా రష్యా నిర్మాణ సహకారం అందిస్తోంది.
- సమాధానం: 2
2. కృష్ణా నది జలాల నిర్వహణ కోసం ఎవరి నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పాటైంది ?
1) ఎ.కె.బజాజ్
2) ఆర్.పి.పాండే
3) పదీప్ కుమార్ శుక్లా
4) గోపాల కృష్ణన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కృష్ణా నదీ జలాలపై మోహిలే నేతృత్వంలో ఏర్పాటు చేసిన మొదటి కమిటీ పక్షపాత ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల కమిషన్ ఛైర్మన్ ఎ.కె.బజాజ్ సారథ్యంలో కొత్త కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో గోపాలకృష్ణన్, ఆర్.పి.పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్.ఎన్. రాయ్‌లు సభ్యులుగా ఉన్నారు.
- సమాధానం: 1
3. జాతీయ సుపరిపాలనా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 31
2) డిసెంబర్ 29
3) డిసెంబర్ 27
4) డిసెంబర్ 25
- View Answer
- సమాధానం: 4
వివరణ: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి పుట్టిన రోజుని పురస్కరించుకొని డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుపరిపాలన, ప్రభుత్వ జవాబుదారీ తనంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రోజున అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 4
4. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ?
1) పుణె
2) నాగ్‌పూర్
3) ముంబయి తీరం
4) రాయ్‌గడ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ముంబయి నగరాన్ని ఆనుకొని ఉన్న అరేబియా సముద్రంలో 192 మీటర్ల ఎత్తయిన భారీ ఛత్రపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. తీరం నుంచి 1.5 దూరంలో సముద్రంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రూ.3,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుని 2019 నాటికి పూర్తి చేస్తారు.
- సమాధానం: 3
5. మహిళల రాత్రి పూట కూడా పనిచేసేలా వీలు కల్పిస్తూ ఇటీవల ఏ రాష్ట్రం చట్టాన్ని తీసుకొచ్చింది ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అన్ని రంగాల్లో స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం మహిళల రాత్రి పూట కూడా పనిచేసే వీలు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే సంస్థలు మహిళా ఉద్యోగుల సమ్మతితోనే రాత్రి విధులు వేయాలని చట్టంలో పేర్కొంది.
- సమాధానం: 2
6. స్కోచ్ మొబిలిటి స్వర్ణ పురస్కారం-2016కు ఎంపికైన సంస్థ ఏది ?
1) APSRTC
2) కొయంబత్తూర్ మునిసిపల్ కార్పొరేషన్
3) TSRTC
4) MTNL
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంధన సామర్థ్యం, ఇంధన ఆదా, ప్రత్యామ్నాయ ఇంధన వాడకం, వాయు కాలుష్య నివారణ వంటి అంశాల్లో TSRTC ఆరు పురస్కారాలు గెలుచుకుంది.
- సమాధానం: 3
7. ఇటీవల 60 వసంతంలోకి అడుగుపెట్టిన డ్యాం ఏది ?
1) ప్రకాశం బ్యారేజ్
2) ముల్ల పెరియార్
3) శ్రీశైలం
4) శ్రీరాంసాగర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కెప్టెన్ ఓర్ ఆధ్వర్యంలో 1852లో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఉన్న ప్రాంతంలో ఓ ఆనకట్ట నిర్మించారు. 1952లో వచ్చిన వరదలకు ఆ ఆనకట్టు ధ్వంసమైంది. దీంతో అదే ప్రాంతంలో కొత్త బ్యారేజ్ నిర్మాణానికి 1954లో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు శంకుస్థాపన చేశారు. దీన్ని 1957లో ప్రారంభించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి డ్యాంకు ప్రకాశం బ్యారేజిగా నామకరణం చేశారు.
- సమాధానం: 1
8. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో సామూహిక గృహ ప్రవేశాలు జరిపింది ?
1) చింతమడక
2) దుబ్బాక
3) ఎర్రవల్లి
4) మంగళపల్లి
- View Answer
- సమాధానం: 3
వివరణ: రెండు పడక గదుల పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇళ్లు నిర్మించింది. 2016 డిసెంబర్ 3న ఆ ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించింది.
- సమాధానం: 3
9. 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం ఎక్కడ నిర్వహించారు ?
1) విజయవాడ
2) కూచిపూడి
3) కాకినాడ
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 1
వివరణ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డిసెంబర్ 25 నుంచి 27 వరకూ 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన సమ్మేళనంలో 6,117 మంది ఒకేసారి కూచిపూడి నృత్యం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
- సమాధానం: 1
10. ఐరాస భద్రతా మండలి ఇటీవల ఏ దేశ కార్యకలాపాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది ?
1) సిరియా
2) పాలస్తీనా
3) ఇజ్రాయెల్
4) ఉక్రెయిన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పాలస్తీనా భూ భాగాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ అక్కడ అనేక నిర్మాణాలు చేపట్టింది. వెంటనే ఈ నిర్మాణాలను నిలిపివేయాలంటూ ఐరాస భద్రతా మండలి తీర్మానం చేసింది.
- సమాధానం: 3
11. తెలంగాణలోని వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది ?
1) రూ.100 కోట్లు
2) రూ.200 కోట్లు
3) రూ.350 కోట్లు
4) రూ.450 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలలో వెనకబడిన జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు కేటాయించాలి. ఇందుకు అనుగుణంగా 2016-17 సంవత్సరానికి కేంద్రం తెలంగాణకు రూ.450 కోట్లు విడుదల చేసింది.
- సమాధానం: 4
12. డిజిటల్ లావాదేవీల ప్రచారం కోసం ఇటీవల తెలంగాణలోని ఏ ప్రాంతానికి రూ. 5 కోట్లు కేటాయించారు ?
1) సిద్ధిపేట
2) నల్గొండ
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 1
13. ఇటీవల ఏ ప్రాంతంలో ఆత్మరక్షణపై అతిపెద్ద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు ?
1) అమరావతి
2) చెన్నై
3) వరంగల్
4) నాగ్‌పూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 21,276 మంది కళాశాలల విద్యార్థినులు, మహిళా ఉద్యోగినులకు వరంగల్ పోలీసులు ఆత్మరక్షణ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 'మహిళలకు, ఉద్యోగినులకు భద్రత' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచంలో అతిపెద్ద శిక్షణా కార్యక్రమంగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 3
14. ఆక్సఫర్డ్ డిక్షనరీలో ఇటీవల చేర్చిన పదం ఏది ?
1) సెగ్జిట్
2) యార్
3) మిలేంగే
4) య్యూట్యూబర్
- View Answer
- సమాధానం: 4
15. భారత్‌తో భద్రతా సహకారం కోసం అమెరికా ఇటీవల ఏర్పాటు చేసిన రక్షణ బడ్జెట్ ఎంత ?
1) 118 బిలియన్ డాలర్లు
2) 318 బిలియన్ డాలర్లు
3) 618 బిలియన్ డాలర్లు
4) 918 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
16. అలహాబాద్ బ్యాంకులో ఇటీవల విలీనం అయిన బ్యాంకు ఏది ?
1) కొటక్ బ్యాంక్
2) క్యాథలిక్ సిరియా బ్యాంకు
3) ఆమ్రో బ్యాంకు
4) ఆల్ బ్యాంక్ ఫైనాన్స్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆల్ బ్యాంక్ ఫైనాన్స్ లిమిటెడ్ ఖాతాదారులకు అన్ని రకాల ఆర్థిక సేవలను అందించేది. అయితే నష్టాల కారణంగా మాతృసంస్థ అయిన అలహాబాద్ బ్యాంకులో దీన్ని విలీనం చేశారు.
- సమాధానం: 4
17. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి SBI ఇటీవల ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంది ?
1) తడ
2) షిర్కి
3) సిమ్
4) బసోలి
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహారాష్ట్రలోని షిర్కి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎస్బీఐ ఆ గ్రామాన్ని పూర్తి నగదు రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.
- సమాధానం: 2
18. భారత్‌పై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఇటీవల ఏ దేశం ఫిర్యాదు చేసింది ?
1) జపాన్
2) చైనా
3) కొరియా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశీయ ఇనుము, ఉక్కు పరిశ్రమలకు తోడ్పాటు అందించేందుకు భారత్ ఇటీవల పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇనుము, ఉక్కుకు కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఆయా వస్తువులపై యాంటి డంపింగ్ డ్యూటీ విధించింది. ఈ నిర్ణయంపై జపాన్ ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది.
- సమాధానం: 1
19. విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న అంతర్జాతీయ సంస్థ ?
1) అమెరికన్ టూరిస్టర్
2) ఫిగో
3) వోక్స్వాగన్
4) హుందాయ్
- View Answer
- సమాధానం: 1
20. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో DRDO తయారు చేసిన స్మార్ట్ యాంటి ఎయిర్‌ఫీల్డ్ వెపన్‌ను ఎక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించారు ?
1) తుంబా
2) చాందిపూర్
3) వీలర్
4) కేఫ్ ఆఫ్ కామెరూన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్మార్ట్ యాంటి ఎయిర్ ఫీల్డ్ వెపన్-SAAW బరువు 120 కేజీలు. రూ.56.58 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ ఆయుధం వంద కి.మీ. పరిధిలోని రన్వేలు, బంకర్లు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లను నాశనం చేయగలదు.
- సమాధానం: 2
21. ఫ్లెమింగో ఉత్సవాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
1) గంజాం
2) పూరి
3) సూళ్లూరుపేట
4) సాంబార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న పులికాట్ సరస్సుకు ఏటా శీతాకాలంలో వివిధ దేశాల నుంచి ఫ్లెమింగోలు, ఇతర పక్షలు వలస వస్తాయి. వీటి రాకను పురస్కరించుకొని సూళ్లూరుపేటలో 2016 డిసెంబర్ 27-29 వరకూ మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించారు.
- సమాధానం: 3
22. ఆసియాన్ లూగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతక విజేత ఎవరు ?
1) షోబికా తైహై
2) శివ కేశవన్
3) తనకాషోహై
4) లైన్ తె అన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆసియాన్ లూగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న శివ కేశవన్ భారత్‌కు చెందిన ఏకైక లూగ్ క్రీడాకారుడు.
- సమాధానం: 2
23. తెలంగాణలో ముస్లింల స్థితిగతులపై అధ్యయనం కోసం నియమించిన కమిటీ ఏది ?
1) జి.సుధీర్ కమిటీ
2) జస్టిస్ రామనాథం కమిటీ
3) ఎ.కె.ఖాన్ కమిటీ
4) మహమ్ముద్ అలీ కమిటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణలో ముస్లింల ఆర్థిక-సామాజిక, విద్యాస్థితిగతులపై అధ్యయనం కోసం రిటైర్డ్ ఐఏఎస్ జి.సుధీర్‌బాబు అధ్యక్షతన కమిటీ ఏర్పాటయింది. ఇందులో ఎమ్.లబారి, డా.అమీర్ ఉల్లాఖాన్, ప్రొ అబ్దుల్ షాబాన్ సభ్యులుగా ఉన్నారు. తమిళనాడులో తరహాలో ప్రత్యేక చట్టం చేసి ముస్లింలకు 9-12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించింది.
- సమాధానం: 1
24. అండర్-19 ఆసియా క్రికెట్ కప్ విజేత ఎవరు ?
1) శ్రీలంక
2) పాకిస్తాన్
3) బంగ్లాదేశ్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: శ్రీలంకలో జరిగిన ఆసియా అండర్-19 కప్ ఫైనల్లో ఆతిథ్య దేశాన్ని ఓడించి భారత్ విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద సీరీస్‌గా హిమాంశు రానా ఎంపికయ్యాడు.
- సమాధానం: 4
25. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
1) విజయవాడ
2) హైదరాబాద్
3) తిరుపతి
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
26. హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఇటీవల ఏ ప్రాంతంలో రెండో తరం ఇథనాల్ బయో రిఫైనరీని ప్రారంభించింది ?
1) బయోలి
2) సింగిడి
3) తర్ఖన్వాల
4) ఎర్రవల్లి
- View Answer
- సమాధానం: 3
వివరణ: పంజాబ్ భటండాలోని తర్ఖన్వాల గ్రామం వద్ద రూ.600 కోట్లతో HPCL ఈ రిఫైనరీని ఏర్పాటు చేసింది. ఇక్కడ వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారు చేస్తారు.
- సమాధానం: 3
27. ఆమెజాన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోన్న నగరం ఏది ?
1) పట్నా
2) ముంబయి
3) బెంగళూరు
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్‌లో చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నగరాలపై ఆమెజాన్ సంస్థ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ తొలిస్థానంలో నిలవగా బెంగళూరు, ముంబయి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 4
28. లండన్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న 4000 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే పదార్ధం పేరేమిటి ?
1) హఫ్నియా కార్బైడ్
2) క్రిస్టిలినిట కార్బైడ్
3) సిలికాన్ నైట్రేట్
4) క్రొరిథమ్ కార్బైడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇంపిరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 4 వేల డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే హఫ్నియం కార్బైడ్, టాన్టలమ్ కార్బైడ్లను కనుగొన్నారు. వీటిని అణు రియాకర్లు, హైపర్ సోనిక్ విమానాలలో వినియోగించవచ్చు.
- సమాధానం: 1
29. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం విడుదల చేసింది ?
1) రూ.1,082 కోట్లు
2)రూ.1,482 కోట్లు
3)రూ.1,982 కోట్లు
4) రూ.2,582 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: పోలవరం నిర్మాణం కోసం నాబార్డ్ రూ.1,982 కోట్లు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. 23.44 టీఎంసీల నీటిని పరిశ్రమలకు కేటాయించనున్నారు. గోదావరి నుంచి కృష్ణాకు 80 TMCల మళ్లిస్తారు.
- సమాధానం: 3
30. ఫోర్బ్స్ భారతీయుల సెలబ్రెటీల జాబితా-2016లో తొలిస్థానంలో నిలిచింది ఎవరు ?
1) షారూఖ్ ఖాన్
2) విరాట్ కోహ్లీ
3) సచిన్ టెండూల్కర్
4) సల్మాన్ ఖాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సెలబ్రె టీల పేరు ప్రఖ్యాతలు, 2016లో వారి ఆదాయం ఆధారంగా ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది.
- సమాధానం: 4
31. ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి పరిధి ఎంత ?
1) 2000-2200 కి.మీ.
2) 5000-5300 కి.మీ.
3) 5500-5800 కి.మీ.
4) 6500-6800 కి.మీ.
- View Answer
- సమాధానం: 3
వివరణ: డీఆర్డీవో స్వదేశీ పరిజ్ఞానంతో అగ్ని-5 క్షిపణిని అభివృద్ధి చేసింది. దీని పరిధి 5500-5800 కి.మీ. బరువు 50 టన్నులు. 1.5 టన్నుల అణు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిలో Ring Laser Gyro based Inertial Navigation System (RINS), Micro Navigation System (MINS) వ్యవస్థలను పొందుపరిచారు.
- సమాధానం: 3
32. ITF హాంకాంగ్ F4 ఫ్యూచర్ టైటిల్ విజేత ఎవరు ?
1) షింతారో ఇమై
2) యూకి బాంబ్రి
3) కరణ్ రస్తోగి
4) జాక్ వాంగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్‌కు చెందిన ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు యూకి బాంబ్రి జపాన్‌కు చెందిన షింతారో ఇమైను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 2
33. మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందింది ఎవరు ?
1) సల్మాన్ ఖాన్
2) అమీర్‌ఖాన్
3) అమితాబ్ బచ్చన్
4) షారూఖ్ ఖాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఇటీవల బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, రేక్తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరఫ్లకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
- సమాధానం: 4
34. ప్రతిష్టాత్మక బిహారీ పురస్కారం-2016కు ఎవరు ఎంపికయ్యారు ?
1) సత్యనారాయణ్
2) జై శంకర్ ప్రసాద్
3) రామ్ ధారి సింగ్
4) సాయి చంద్రవర్దన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కె.కె. బిర్లా ఫౌండేషన్ ఏటా బిహారీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. 2016 అవార్డుకు ప్రముఖ రాజస్థాన్ కవి సత్యనారాయణ్ ఎంపికయ్యారు. యే ఏక్ దునియా పుస్తకానికి గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. అవార్డు కింది రూ.2 లక్షల బహుమతి అందిస్తారు.
- సమాధానం: 1
35. 24వ జాతీయ పిల్లల సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ?
1) ముంబయి
2) పుణే
3) హైదరాబాద్
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎన్విరాన్మెంట్ ఫోరమ్ ఆఫ్ ఇండియా, విద్యా ప్రతిష్ఠాతన్ ఇనిస్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ సంయుక్తంగా 24వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించాయి.
- సమాధానం: 2
36. అతి ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశం ఏది ?
1) భారత్
2) చిలీ
3) సౌదీ అరేబియా
4) వెనెజులా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటోన్న దేశం సౌదీ అరేబియా. ఇందుకోసం ఆ దేశం 93.5 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోండగా ఆ తర్వాతి స్థానంలో ఉన్న భారత్ 34 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.
- సమాధానం: 3
37. దేశంలో పూర్తిగా డిజిటలైజ్ అయిన మొదటి కాలనీ ఏది ?
1) గాంధీనగర్, హైదరాబాద్
2) అడయార్, చెన్నై
3) పోవై, ముంబయి
4) నెడుంకాయం, మళపురం
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేరళలోని మళపురం జిల్లాలో ఉన్న నెడుంకాయం అనే గిరిజన కాలనీ దేశంలో పూర్తిగా డిజిటలైజ్ అయిన మొదటి కాలనీగా గుర్తింపు పొందింది. జనశిక్షాన్ సంస్థాన్, కొండొత్తికి చెందిన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ కాలనీ వాసులకు డిజిటల్ అక్ష్యరాస్యతపై అవగాహన కల్పించారు.
- సమాధానం: 4
38. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌కు అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) నారిమన్
2) సోలి సోరాబ్జి
3) మార్కండేయ కట్జూ
4) జస్టిస్ చలమేశ్వర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జపాన్ రాజు అకిహిటో 1960లో ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్-IIC కి శంకుస్థాపన చేశారు. 1962లో దీన్ని ప్రారంభించారు. వరుసగా రెండోసారి కూడా సోలి సోరాబ్జిని IIC అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
- సమాధానం: 2
39. 2022 లో జరిగే జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ?
1) మేఘాలయ
2) మణిపూర్
3) నాగాలాండ్
4) అస్సోం
- View Answer
- సమాధానం: 1
40. ఇటీవల ప్రపంచ భోజ్‌పురి కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు ?
1) వారణాసి
2) పట్నా
3) రాంచి
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భోజ్పురిలను ఒక్క చోటికి తీసుకురావాలనే ఉద్దేశంతో వారణాసిలో 2016 డిసెంబర్ 29 నుంచి నాలుగు రోజుల పాటు ప్రపంచ భోజ్‌పురి కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత్‌లో మారిషస్ హైకమిషనర్ జగదీశ్వర్ గోబార్దన్తో పాటు 18 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- సమాధానం: 1
41. హర్యానా పౌరుల డేటాబేస్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు హర్యానా ప్రభుత్వం పౌరుల డేటాబేస్ తయారు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందం చేసుకుంది.
- సమాధానం: 2
42. భారత్ ఇటీవల ఏ దేశస్థుల కోసం వీసా నిబంధనలను సులభతరం చేసింది ?
1) పాకిస్తాన్
2) నేపాల్
3) బంగ్లాదేశ్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
43. తెలంగాణలో తన రెండవ 600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంస్థ ఏది ?
1) ఎన్టీపీసీ
2) కోల్ ఇండియా
3) బీఈఎల్
4) బీహెచ్ఈఎల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: BHEL 600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసింది.
- సమాధానం: 4
44. ప్రతిష్టాత్మక గ్లోబల్ సాకర్ పురస్కారం-2016కు ఎంపికైన క్రీడాకారుడు ఎవరు ?
1) క్రిస్టియానో రొనాల్డో
2) నైమర్
3) లియోనెల్ మెస్సీ
4) బైచుంగ్ భుటియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో గ్లోబల్ సాకర్ పురస్కారం-2016కు ఎంపికయ్యాడు. ఉత్తమ ఫుట్‌బాల్ క్లబ్‌గా రియల్ మాడ్రిడ్, ఉత్తమ కోచ్‌గా ఫెర్నాండో శాంతోస్ ఎంపికయ్యారు.
- సమాధానం: 1
45. ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) నజీబ్ జంగ్
2) అనిల్ బైజల్
3) సి.ెహ చ్.విద్యాసాగర్‌రావు
4) కిరణ్‌బేడి
- View Answer
- సమాధానం: 2
46. భారత్‌లో మొట్టమొదటి ఆర్గానిక్ రాష్ట్రం ?
1) తమిళనాడు
2) కేరళ
3) తెలంగాణ
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 4
47. 77వ భారత చరిత్ర కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ?
1) తిరువనంతపురం
2) గోవా
3) హైదరాబాద్
4) కోయంబత్తూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేరళలోని తిరువనంతపురంలోజరిగిన 77వ భారత చరిత్ర కాంగ్రెస్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ప్రారంభించారు.
- సమాధానం: 1
48. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ డిజిటల్ విలేజ్‌గా దేనిని ప్రకటించారు ?
1) సర్పవరము
2) బిక్కవోలు
3) మోరి
4) మువ్వ
- View Answer
- సమాధానం: 3
వివరణ: తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలోని మోరి గ్రామం స్మార్ట్ డిజిటల్ విలేజ్‌తో పాటు స్వచ్ఛ గ్రామంగా ఎంపికైంది.
- సమాధానం: 3
49. ఇటీవల ఏ దేశం తీవ్రవాద పన్ను విధించటం ప్రారంభించింది ?
1) అమెరికా
2) ఫ్రాన్స్
3) కెనడా
4) భారత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: గత రెండేళ్లలో ఫ్రాన్స్‌లో జరిగిన తీవ్రవాద దాడుల్లో అనేక మంది చనిపోయారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం తీవ్రవాద పన్ను ద్వారా వచ్చిన మొత్తంతో వారికి ఆర్థిక సహాయం అందిస్తోంది.
- సమాధానం: 2
50. ఇటీవల యూఏఈలో జరిగిన పశ్చిమాసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్-2016 విజేత ఎవరు ?
1) కుష్ భగత్
2) మధు కొండ
3) రాజేశ్ నల్ల
4) అభ్యుదయ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ టోర్నీలో కుష్ భగత్ 20 దేశాలకు చెందిన 158 మంది ప్రతినిధులను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
- సమాధానం: 1