కరెంట్ అఫైర్స్ డిసెంబర్ (24 - 31) బిట్ బ్యాంక్
1. ప్రపంచంలో అతిపెద్ద ఉభయచర విమానంగా గుర్తింపు పొందిన ‘‘AG 6000’’ను ఏ దేశం తయారు చేసింది ?
1) చైనా
2) జపాన్
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలో అతిపెద్ద ఉభయచర విమానం ‘‘AG 6000’’ను చైనా రూపొందించింది. కున్లాంగ్గా పిలిచే ఈ విమానం ఇటీవల తొలిసారి దక్షిణ చైనాలోని గువాంగ్ డంగ్ ప్రావిన్స్‌లోని జుహాయ్ విమానశ్రయం నుంచి తొలి ప్రయాణం చేసింది.
- సమాధానం: 1
2. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) సురేశ్ భరద్వాజ్
2) జైరామ్ ఠాకూర్
3) మహేందర్ సింగ్
4) నీరజ్ నాయ్యర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు జైరామ్ ఠాకూర్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 68 సీట్లకుగాను బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది.
- సమాధానం: 2
3. బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఎంవీ శ్రీధర్
2) సబా కరీమ్
3) అజయ్ జడేజా
4) శ్రీనివాసన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ ఇటీవల బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఇంతకముందు ఈ పదవిలో ఉన్న ఎంవీ శ్రీధర్ 2017 సెప్టెంబర్‌లో పదవికి రాజీనామా చేశారు.
- సమాధానం: 2
4. భారత్‌లో గుడ్ గవర్నెన్స్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 23
2) డిసెంబర్ 24
3) డిసెంబర్ 25
4) డిసెంబర్ 26
- View Answer
- సమాధానం: 3
వివరణ: డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో గుడ్ గవర్నెన్స్ డేని 2014 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
- సమాధానం: 3
5. పవిత్రమైనటువంటి గంగా నది వెంట ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ పథకాన్ని ప్రారంభించింది ?
1) గంగా గ్రామ్
2) స్వచ్ఛ గంగా
3) స్వచ్ఛ గ్రామ్
4) గంగా డెవలప్మెంట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పవిత్రమైనటువంటి గంగా నది వెంట ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల గంగా గ్రామ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్లీన్‌గంగా మిషన్ - నమామి గంగా పథకంలో భాగంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
- సమాధానం: 1
6. తీర ప్రాంత రాష్ట్రాల్లో బీచ్‌ల పరిశుభ్రత, అభివృద్ధి కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇటీవల ప్రారంభించిన పెలైట్ ప్రాజెక్టు ఏది ?
1) సముద్ర డైవ్
2) బెటర్ బీచెస్
3) బెటర్ సీ
4) బ్లూ ఫ్లాగ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తీర ప్రాంత రాష్ట్రాల్లో బీచ్‌లను పరిశుభ్రంగా తీర్చిద్దడంతో పాటు వాటిని అభివృద్ధి పరిచేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇటీవల బ్లూ ఫ్లాగ్ పేరుతో పెలైట్ ప్రాజెక్టుని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి తీర ప్రాంత రాష్ట్రం నుంచి ఒక్కో బీచ్‌ను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తారు.
- సమాధానం: 4
7. కింది వాటిలోని ఏ క్రీడను 2022 కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు ?
1) బాక్సింగ్
2) హాకీ
3) షూటింగ్
4) బ్యాడ్మింటన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హాం వేదికగా జరిగే 2022 కామన్ వెల్త్ గేమ్స్ జాబితా నుంచి షూటింగ్‌ని తొలగించారు. దీని స్థానంలో మిక్స్డ్ జండర్ టీ20 క్రికెట్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
- సమాధానం: 3
8. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో ప్రకటించనున్న ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ జాబితాలో కొత్తగా ఏ రుగ్మతను చేర్చనుంది ?
1) మేసేజింగ్ డిజార్డర్
2) సెల్ఫీ డిజార్డర్
3) గేమింగ్ డిజార్డర్
4) సోషల్ మీడియా డిజార్డర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అధికంగా వీడియో గేమ్స్ ఆడటం సరికొత్త మానసిక రుగ్మతేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ మేరకు మానసిక రుగ్మతల జాబితాలో కొత్తగా గేమింగ్‌ను చేరుస్తూ.. 27 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ అనారోగ్య జాబితా(ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్)-2018ని త్వరలో విడుదల చేయనుంది. ఇదివరకు 1990లో ఈ జాబితాను సవరించారు.
- సమాధానం: 3
9. ప్రపంచంలో అతిపొడవైన గాజు వంతెనను(గ్లాస్ బ్రిడ్జ) ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు ?
1) అమెరికా
2) చైనా
3) జపాన్
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనాలోని హెబెయ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనను ఇటీవల సందర్శకుల కోసం ప్రారంభించారు. ఒకేసారి 2 వేల మంది వంతెనపైకి వచ్చినా తట్టుకునే సామర్థ్యంతో ఇది నిర్మితమైంది.
- సమాధానం: 2
10. భారత్‌లో ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) రణ్ వీర్ సింగ్
2) వరుణ్ ధావన్
3) షాహిద్ కపూర్
4) ఫర్హాన్ అక్తర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడను ప్రమోటు చేసేందుకు ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్‌సింగ్ నియమితులయ్యారు.
- సమాధానం: 1
11. అంతరిక్షం నుంచి వెలువడే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు భారత్ ఎప్పటిలోగా దేశంలో లిగో గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేయనుంది ?
1) 2020
2) 2025
3) 2030
4) 2035
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతరిక్షం నుంచి వెలువడే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు భారత్ 2025లోగా లిగో గ్రావిటేషనల్ డిటెక్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయతో కలిసి ఈ ప్రాజెక్టుని చేపట్టనుంది.
ఈ తరంగాలను గుర్తించినందుకు గాను అమెరికాకు చెందిన రెయినర్ వెయిస్, బ్యారీ బారిష్, కీప్ థార్న్.. భౌతికశాస్త్రంలో 2017 నోబెల్ బహుమతి గెలుపొందారు.
- సమాధానం: 2
12. భారత్‌లోని ఏ విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా సముద్ర రన్‌వేను నిర్మించనున్నారు ?
1) అగట్టీ విమానాశ్రయం, లక్షద్వీప్
2) మాల్దా విమానాశ్రయం, పశ్చిమబెంగాల్
3) కులు మనాలి విమానాశ్రయం, హిమాచల్ ప్రదేశ్
4) జుహూ విమానాశ్రయం, ముంబై
- View Answer
- సమాధానం: 1
వివరణ: లక్షద్వీప్‌లోని అగట్టీ విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా సముద్ర రన్ వేను నిర్మించున్నారు. సముద్రంలో వంతెన నిర్మించి.. ప్రస్తుతం ఉన్న రన్‌వేను పొడగించనున్నారు. ఈ మేరకు విమానాశ్రయం విస్తరణకు ఎయిర్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆమోదం తెలిపింది.
- సమాధానం: 1
13. దేశంలో తొలి ఎయిర్ కండీషన్డ్ లోకల్ ట్రైన్‌ను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు ?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) ముంబై
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలోనే తొలిసారిగా ఎయిర్ కండిషన్డ్ లోకల్ ట్రైన్‌ను ముంబైలో డిసెంబర్ 25న ప్రారంభించారు. నగరంలోని బోరివాలి స్టేషన్ నుంచి చర్చిగేట్ స్టేషన్ వరకు ఈ రైలు తొలి ప్రయాణం చేసింది.
- సమాధానం: 3
14. 2016-17లో అత్యధిక ఎగుమతులు నమోదు చేసి ఇటీవల ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి చాంపియన్ ఆఫ్ స్టేట్ గుర్తింపు పొందింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2016-17లో దేశంలోని రాష్ట్రాల్లో అత్యధిక ఎగుమతులు నమోదు చేసినందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒడిశాను చాంపియన్ ఆఫ్ ది స్టేట్‌గా గుర్తించింది. 2015-16లో 19,082 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఒడిశా.. 2016-17లో 40,872 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
- సమాధానం: 4
15. భారత దేశంలో మొదటిసారిగా అధికారిక లోగో రూపొందించుకున్న నగరం ఏది ?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) ముంబై
4) కోల్ కత్తా
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో మొదటిసారిగా అధికారిక లోగో రూపొందించుకున్న నగరంగా బెంగళూరు నిలిచింది. ఎరుపు, నలుపు రంగుల్లో కన్నడ, ఇంగ్లీషు లిపిలో రాసి ఉన్న లోగోని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ఆవిష్కరించారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఈ లోగోని రూపొందించారు.
- సమాధానం: 2
16. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసర్చ్(CEBR) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో భారత్ ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది ?
1) 5
2) 3
3) 2
4) 4
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూకేకు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసర్చ్(CEBR) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో ఫ్రాన్స్, యూకేలను అధిగమించి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. చైనా 2032లో అమెరికాను అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది.
- సమాధానం: 1
17. ఇటీవల ఏ నగర పాలక సంస్థ పేదలకు పది రూపాయలకే ఆహారాన్ని అందించేందుకు అటల్ జన్ ఆహార్ పేరుతో పథకాన్ని ప్రారంభించింది ?
1) దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
2) పశ్చిమ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
3) తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
4) ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) ఇటీవల అటల్ జన్ ఆహార్ యోజన పేరుతో పేదలకు పది రూపాయలకే ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది.
- సమాధానం: 1
18. పెటా (People for the Ethical Treatment of Animals - PETA) నుంచి ఇటీవల పరన్స ఆఫ్ ది ఇయర్ - 2017 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు ?
1) ప్రియాంకా చోప్రా
2) సల్మాన్ ఖాన్
3) అనుష్క శర్మ
4) కత్రినా కై ఫ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జంతు రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా బాలీవుడ్ నటి అనుష్క శర్మకు పెటా సంస్థ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2017 పురస్కారాన్ని ప్రకటించింది.
- సమాధానం: 3
19. 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) గుజరాత్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్(NCSC 2017) డిసెంబర్ 27 నుంచి 31 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్ లో జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ సెన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి.
- సమాధానం: 3
20. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాల సదస్సు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్(IEA) శతాబ్ది ఉత్సవాల సదస్సు జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ సదస్సుని ప్రారంభించారు. బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్, ఐఈఏ కాన్ఫరెన్స అధ్యక్షుడు సి.రంగరాజన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
- సమాధానం: 2
21. రిపబ్లిక్ ఆఫ్ లిబెరియా దేశ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) ఎల్లెన్ జాన్సన్ సర్ లీఫ్
2) జార్జ్ వేహ్
3) జోసెఫ్ బోకాయ్
4) అలెక్స్ జే టేలర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు జార్జ్ వేహ్ ఇటీవల జరిగిన లిబెరియా ఎన్నికల్లో తన ప్రత్యర్థి జోసెఫ్ బోకాయ్ను ఓడించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- సమాధానం: 2
22. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) విశ్వనాథన్ ఆనంద్
2) వ్లాదిమిర్ ఫెడోసీవ్
3) మాగ్నస్ కార్లసన్
4) మురళీ కార్తికేయన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సౌదీ అరేబియాలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచి టైటిల్ గెలుచుకున్నాడు. రష్యాకు చెందిన వ్లాదిమిర్ ఫెడోసివ్ రన్నరప్‌గా నిలిచాడు.
- సమాధానం: 1
23. కేర్ రేటింగ్స్ ఇటీవల విడుదల చేసిన మొండి బకాయిలు(నిరర్థక ఆస్తులు) అధికంగా ఉన్న దేశాల ర్యాంకింగ్స్‌లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
1) రెండో స్థానం
2) ఎనిమిదో స్థానం
3) మూడో స్థానం
4) ఐదో స్థానం
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేర్ రేటింగ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. బ్రిక్స్ దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది.
- సమాధానం: 4
24. జీఎస్టీ అమలు వల్ల 2017 జూలై-అక్టోబర్ త్రైమాసికంలో ఏర్పడిన రెవెన్యూ లోటుని పూడ్చడానికి కేంద్ర ఎంత నష్ట పరిహారం చెల్లించింది ?
1) రూ.24,500 కోట్లు
2) రూ.30,000 కోట్లు
3) రూ.15,000 కోట్లు
4) రూ. 22,500 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: వస్తు సేవల పన్ను అమలు వల్ల రాష్ట్రాలకు ఏర్పడిన రెవెన్యూ లోటుని పూడ్చడానికి నష్టపరిహారం చెల్లించామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. జూలై - అక్టోబర్ త్రైమాసికంలో రెవెన్యూ లోటు నష్టపరిహారం కింద రూ.24,500 కోట్లు విడుదల చేశామని పేర్కొంది. ఈ మొత్తంలో అత్యధికంగా రూ. 3,271 కోట్లు కర్ణాటక, రూ. 2,282 కోట్లు గుజరాత్, రూ. 2,098 కోట్లు పంజాబ్ పొందాయి.
- సమాధానం: 1
25. 61వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటీషన్స్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో స్వర్ణాన్ని గెలుచుకున్న షూటర్ ఎవరు ?
1) అమన్ ప్రీత్ సింగ్
2) జై సింగ్
3) ఓంకార్ సింగ్
4) జీతూ రాయ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేరళలోని తిరువనంతపురంలో 61వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటిషన్స్ జరిగాయి. ఈ టోర్నమెంట్లో జీతూ రాయ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈ వెంట్లో పసిడి పతకాన్ని గెలుపొందాడు.
- సమాధానం: 4
26. థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగిన రాయల్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్ - 2017 విజేత ఎవరు ?
1) కాహ్ లిన్ జోషి
2) గగన్ జీత్ భుల్లర్
3) ప్రోమ్ మీసావత్
4) శివ కపూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత గోల్ఫర్ శివ కపూర్ థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగిన రాయల్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్ - 2017 టైటిల్ విజేతగా నిలిచాడు.
- సమాధానం: 4
27. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రిక్రియకు ఏ తేదీని తుది గడువుగా నిర్ణయించారు ?
1) 2018 డిసెంబర్ 31
2) 2019 డిసెంబర్ 31
3) 2020 డిసెంబర్ 31
4) 2021 డిసెంబర్ 31
- View Answer
- సమాధానం: 4
వివరణ: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదిలొగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020 డిసెంబర్ 31ని తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ ఇటీవల పేర్కొంది.
- సమాధానం: 4
28. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?
1) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
2) ప్రధాని నరేంద్ర మోదీ
3) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
4) ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న ప్రారంభించారు.
- సమాధానం: 2
29. గడిచిన మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రం అటవీ భూములను అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లించింది ?
1) తెలంగాణ
2) హరియాణా
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2014-15 నుంచి 2016-17 వరకు దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇటీవల వెల్లడించింది. 7,944 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి ఈ జాబితాలో హరియాణా తొలి స్థానంలో ఉంది. 7,149 హెక్టార్లను మళ్లించిన తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 3,344 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 2
30. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగాల్సిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ విశ్వవిద్యాలయానికి తరలిపోయింది ?
1) ఆంధ్ర విశ్వవిద్యాలయం
2) ఢిల్లీ యూనివర్సిటీ
3) మణిపూర్ విశ్వవిద్యాలయం
4) పాట్నా యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 జనవరి 3-7 వరకు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగాల్సిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్.. మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి తరలిపోయింది. ఐఎస్‌సీని నిర్వహించలేమంటు ఓయూ నిర్వహణ నుంచి తప్పుకోవడంతో మణిపూర్ యూనివర్సిటీ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. 2018 మార్చి 18-22 వరకు ఐఎస్సీ జరగనుంది.
- సమాధానం: 3
31. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు ?
1) విజయ్ రూపాని
2) ఓపీ కోహ్లీ
3) ఆనంది బెన్
4) నితిన్ పటేల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఆరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా రెండోసారి విజయ్ రూపాని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా నితన్ పటేల్, మంత్రులగా మరో 18 మంది ప్రమాణం చేశారు. గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ.
- సమాధానం: 1
32. నీతి ఆయోగ్ ఇటీవల రూపొందించిన దేశవ్యాప్తంగా 115 వెనుకబడిన జిల్లాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ?
1) ఒక జిల్లా
2) నాలుగు జిల్లాలు
3) ఐదు జిల్లాలు
4) మూడు జిల్లాలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 వెనుకబడిన జిల్లాలను నీతిఆయోగ్ ఇటీవల గుర్తించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్(విశాఖపట్నం,కడప, విజయనగరం) నుంచి మూడు, తెలంగాణ(వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం)నుంచి మూడు జిల్లాలు ఉన్నాయి. 115 జిల్లాల్లో 35 జిల్లాలు వామపక్ష తీవ్రవాదం సమస్యను ఎదుర్కొంటున్నాయి.
- సమాధానం: 4
33. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టుని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?
1) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
2) ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు
3) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
4) ఏపీ గవర్నర్ నరసింహన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న వెలగపూడిలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పిస్తుంది.
- సమాధానం: 1
34. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) మాలకొండయ్య
2) సాంబశివరావు
3) మహేందర్ రెడ్డి
4) గౌతం సవాంగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: డీజీపీ సాంబశివరావు డిసెంబర్ 31న పదవీ విరమణ చేయటంతో.. ఆయన స్థానంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు.
- సమాధానం: 1
35. ఇటీవల ఏ రెండు దేశాల మధ్య సంప్రదాయ టెస్టుకు భిన్నంగా నాలుగు రోజుల అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరిగింది ?
1) భారత్ - శ్రీలంక
2) దక్షిణాఫ్రికా - జింబాబ్వే
3) న్యూజిలాండ్ - వెస్టిండీస్
4) ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: సంప్రదాయ టెస్టుకు భిన్నంగా నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ఇటీవల దక్షిణాఫ్రికా- జింబాబ్వే మధ్య జరిగింది. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 1972 - 73 తర్వాత ఐదు రోజులు కాకుండా ఒక టెస్టు నాలుగు రోజుల్లో జరగడం ఇదే తొలిసారి.
- సమాధానం: 2
36.ప్రతిష్టాత్మక హరివర్సనం పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
2) ఎం జయచంద్రన్
3) కేఎస్ చిత్ర
4) కేజే యేసుదాస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేరళ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక హరివర్సనం - 2017 పురస్కారానికి ప్రముఖ గాయని కేఎస్ చిత్ర ఎంపికయ్యారు. లౌకికవాదం, సమానత్వం కోసం కృషి చేసినందుకు గాను ఆమెను ఈ అవార్డుకి ఎంపిక చేశారు.
- సమాధానం: 3
37. 78వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) లక్నో
2) న్యూఢ్లిలీ
3) కోల్‌కతా
4) భోపాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 78వ సమావేశాలు ఇటీవల కోల్‌కతాలోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో జరిగాయి. భారత దేశ చరిత్రపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ సమావేశాలను ఏటా నిర్వహిస్తారు.
- సమాధానం: 3
38. అమెరికా తర్వాత, యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన రెండో దేశం ఏది ?
1) రష్యా
2) సౌదీ అరేబియా
3) యూఏఈ
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు 2017 అక్టోబర్‌లో అమెరికా ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ సైతం యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. యునెస్కో ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
- సమాధానం: 4
39. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) వినయ్ సహస్రబుద్ధే
2) లోకేశ్ చంద్రా
3) ఎంజే అక్బర్
4) కైలాష్ విజయ్ వర్గియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ వినయ్ సహస్రబుద్ధే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్(ICCR) నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులయ్యారు. ప్రొఫెసర్ లోకేశ్ చంద్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఐసీసీఆర్ని 1950లో ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
40. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ జినోమ్ రీసర్చ్ ప్రాజెక్టుని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది ?
1) చైనా
2) జపాన్
3) బ్రెజిల్
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ జినోమ్ రీసెర్చ్ ప్రాజెక్టుని చైనా ఇటీవల ప్రారంభించింది. లక్ష మంది నుంచి జన్యువులను సేకరించి వాటిపై పరిశోధనలు చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మెరుగైన ఔషధాలను తయారు చేయాలన్నది చైనా లక్ష్యం.
- సమాధానం: 1
41. ఆసియాన్-ఇండియా ప్రవాసి భారతీయ దివస్ - 2018 ఏ దేశంలో జరగనుంది ?
1) సింగపూర్
2) భారత్
3) మలేషియా
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆసియాన్ - ఇండియా ప్రవాసి భారతీయ దివస్ - 2018, జనవరి 6-7 తేదీల్లో సింగపూర్‌లో జరిగింది.
2018 Theme: "Ancient Route, New Journey: Diaspora in the Dynamic India-ASEAN Partnership".
- సమాధానం: 1
42. పర్యాటక రంగంలో సహకారం కోసం దేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల దక్షిణ కొరియాతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) తెలంగాణ
2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) మిజోరం
- View Answer
- సమాధానం: 2
వివరణ: పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, సంస్కృతి, వ్యవసాయ రంగాల్లో సహకారం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దక్షిణ కొరియాతో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 2
43. మజూలి దీవి ఏ రాష్ట్రంలో ఉంది ?
1) అస్సోం
2) పశ్చిమ బెంగాల్
3) త్రిపుర
4) మిజోరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోని అతిపెద్ద నది ఆధారిత దీవి మజూలి.ఇది అస్సోం రాష్ట్రంలో ఉంది. బ్రహ్మపుత్ర నది ద్వారా ఇది ఏర్పడింది. ఈ దీవి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 1
44. బెటర్ ఇండియా ఇటీవల ప్రకటించిన టాప్ - 10 ఐపీఎస్ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఆఫీసర్ ఎవరు ?
1) సీవీ ఆనంద్
2) మహేశ్ భగవత్
3) మహేందర్ రెడ్డి
4) సత్యనారాయణ
- View Answer
- సమాధానం: 2
వివరణ: బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్ - 10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చోటు దక్కించుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్ - 10 ఐపీఎస్ అధికారుల జాబితాను బెటర్ ఇండియా ఏటా విడుదల చేస్తుంది.
- సమాధానం: 2
45. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగ పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది ?
1) భారత్ బెనిఫిషియరీ
2) ఇండియా స్కీమ్
3) డీబీటీ భారత్
4) హమారా హిందుస్తాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగ పరిచేందుకు డీబీటీ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డీబీటీ) పద్ధతిలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారులు, ప్రభుత్వానికి మిగిలిన ఆదాయం తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది.
- సమాధానం: 3
46. విశ్వాన్ని చిత్రీకరించేందుకు వైడ్ ఫీల్డ్ ఇన్ఫార్రెడ్ సర్వే టెలిస్కోప్‌ను ఏ అంతరిక్ష సంస్థ నింగిలోకి పంపనుంది ?
1) నాసా
2) ఇస్రో
3) జాక్సా
4) రాస్ కాస్మోస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: విశ్వానికి సంబంధించి హబుల్ టెలిస్కోప్ కన్నా మెరుగైన చిత్రాలను తీసేందుకు వైడ్ ఫీల్డ్ ఇన్ఫార్రెడ్ సర్వే టెలిస్కోప్‌ను నింగిలోకి పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తుంది. 2020లో ఈ టెలిస్కోప్‌ను నింగిలోకి పంపనుంది.
- సమాధానం: 1
47. గల్యమ్ జరిల్ గపోవ్ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణం సాధించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ ఎవరు ?
1) కాకర శ్యామ్ కుమార్
2) మనీశ్ కౌశిక్
3) మన్ దీప్ జాంగ్రా
4) నమన్ తన్వర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కజకిస్తాన్‌లోని కరాగండలో జరిగిన గల్యమ్ జరిల్ గపోవ్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు.
- సమాధానం: 1
48. అంతర్జాతీయ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో భారత్ తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడు ఎవరు ?
1) రిషబ్ పంత్
2) వాషింగ్టన్ సుందర్
3) ఇషాంత్ శర్మ
4) రవీంద్ర జడేజా
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర్జాతీయ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో భారత్ తరపున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా వాషింగ్టన్ సుందర్( 18 ఏళ్ల 80 రోజులు) ఇటీవల రికార్డు సృష్టించాడు. ముంబైలో శ్రీలంకతో జరిగిన టీ 20 మ్యాచ్‌లో ఆడటం ద్వారా సుందర్ ఈ రికార్డుని నమోదు చేశాడు.
- సమాధానం: 2
49. జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సరికొత్త జాతీయ రికార్డుని ఇటీవల ఎవరు నెలకొల్పారు ?
1) అనీసా సయ్యద్
2) శీతల్ శివాజీ థోరాట్
3) రాహీ సర్ణోబత్
4) స్వాతి సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనీసా సయ్యద్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 25 మీటర్ల పిస్టల్ షూటింగ్లో హరియాణాకు చెందిన అనీసా 33 పాయింట్లతో జాతీయ రికార్డును తిరగరాయడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించింది.
- సమాధానం: 1
50. రంజీ ట్రోఫీ 2017-18 టైటిల్‌ను ఏ జట్టు గెలుచుకుంది ?
1) విదర్భ
2) ఢిల్లీ
3) కర్ణాటక
4) ముంబై
- View Answer
- సమాధానం: 1
వివరణ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు ఢిల్లీని ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. రంజీ చరిత్రలో విదర్భ జట్టు ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఇదే తొలిసారి.
- సమాధానం: 1