కరెంట్ అఫైర్స్ (డిసెంబర్ 17-24) బిట్ బ్యాంక్
1. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం కోసం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) రిలయన్స్ ఫౌండేషన్
2) టాటా ట్రస్ట్
3) ఆజీమ్ ప్రేమ్‌జి ఫౌండేషన్
4) ఎమ్.వి. ఫౌండేషన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉత్తరప్రదేశ్‌లో టాటా ట్రస్ట్ ప్రభుత్వ చౌక ధరల దుకాణాలలో పాయింట్ ఆఫ్ యంత్రాలు ఏర్పాటు చేయనుంది.
- సమాధానం: 2
2. అత్యంత వివాదస్పద ఖపాలా(Kapala) వ్యవస్థను రద్ధు చేసిన దేశం ఏది?
1) ఇరాన్
2) ఈజిప్ట్
3) ఖతార్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: గల్ఫ్ దేశాల్లో నిర్మాణ, గృహ రంగాలలో ఖపాలా వ్యవస్థ ఎక్కువగా కన్పిస్తుంది. ఈ వ్యవస్థలో వలస కూలీలను పనిలో చేర్చుకోవడం లేదా తీసివేయడం, వేతనాలు నిర్ణయంలో సదరు కంపెనీకి లేదా యజమానికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఖతార్ ప్రభుత్వం వలస కూలీల హక్కుల రక్షణ కోసం ఈ వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో నూతన కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టనుంది.
- సమాధానం: 3
3. 2022లో ఫిఫా ప్రపంచ పుట్‌బాల్ కప్‌ను నిర్వహించనున్న దేశం ఏది?
1) ఖతర్
2) ఫ్రాన్స్
3) రష్యా
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 1
4. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్‌కు నూతన సీఈఓగా ఎంపికైంది ఎవరు?
1) ఎమ్.వి.టాంకశాలే
2) ఎన్.వి.రుద్ర
3) అరవింద్ బజాజ్
4) వి.జి. కన్నన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1946, సెప్టెంబర్ 26న ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. సంస్థ ప్రస్తుత సీఈఓగా వి.జి. కన్నన్ ఎంపికయ్యాడు.
- సమాధానం: 4
5. ఐబీఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2017ను నిర్వహించే అర్హత కొల్పోయిన దేశం ఏది?
1) ఇండియా
2) రష్యా
3) ఇరాన్
4) చీలి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐబీఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ 2017ను నిర్వహించే దేశం రష్యా. డోపింగ్ అధికారికంగా రష్యా ప్రోత్సహిస్తుండంతో, ఈ దేశంలో ఈ క్రీడలను నిర్వహిస్తే లాట్వియా దేశం బహిష్కరిస్తుందని ప్రకటించింది. లాట్వియా ప్రకటనతో చాలా దేశాలు ఈ క్రీడలను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో ఐబీఎస్ఎఫ్ అధికారులు ఈ టైటిల్ నిర్వహణ నుంచి రష్యాను తప్పించారు.
- సమాధానం: 2
6. ఇటీవల ఏ రాష్ట్రంలో శ్రీశ్రీ గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ సోలార్ బ్యాటరీ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది?
1) హర్యానా
2) ఉత్తరాఖండ్
3) అస్సాం
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు చెందిన శ్రీశ్రీ గ్రామీణాభివృద్ధి ట్రస్ట్, కూపర్ ఫౌండేషన్ సహాకారంతో 6 కిలో వాట్ల సామర్థ్యం గల సోలార్ బ్యాటరి స్టేషన్‌ను అస్సాంలో ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి అస్సాంలోని ముల్క్గాట్, మిరిగాట్, గెరికిగాట్, టెన్ జాబ్రి గ్రామల్లోని 287 గృహాలకు సోలార్ విద్యుత్‌ను అందిస్తారు.
- సమాధానం: 3
7. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని దేశాల ప్రజలకు ఈ- టూరిస్ట్ విసా సౌకర్యం కల్పించింది?
1) 161
2) 130
3) 110
4) 89
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఈ - టూరిస్ట్ వీసాను 161 దేశాలకు ప్రజలు పొందే అవకాశం కల్పించింది. ఈ సదుపాయం ద్వారా ఇండియాకు వచ్చిన తర్వాత విసా పొందవచ్చు.
- సమాధానం: 1
8. 5వ ఇండియా - అరబ్ భాగస్వామ్య సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) దుబాయి
2) మస్కట్
3) రియాద్
4) సన
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఓమన్ రాజధాని మస్కట్‌లో 5వ ఇండియా -అరబ్ భాగస్వామ్య సదస్సును నిర్వహించారు. ఇరుదేశాల మధ్య ప్రాధాన్యత రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించటం కోసం ఈ సమావేశం నిర్వహించారు.
- సమాధానం: 2
9. ఉత్తమ ఆవిష్కరణ చేయడంలో ఆసియాలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) చైనా
2) కొరియా
3) జపాన్
4) ఇండియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: Capgemini consulting digital transformation institute, ఫారెన్ హిట్ 2012 భాగస్వామ్యంతో, బ్రియాన్ సాయిల్స్ ఆఫ్ ఆల్టిమిటర్ సంస్థ కలిసి ఈ నివేదికను తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం ఉత్తమ ఆవిష్కరణల్లో ఆసియాలో తొలిస్థానం, ప్రపంచంలో మూడో స్థానంలో ఇండియా ఉంది. ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆవిష్కరణ కేంద్రం బెంగళూరు. ఆసియాలోని 27% నూతన ఆవిష్కరణలు బెంగళూరు, జైపూర్, పూణే, హైదరాబాద్‌ల్లోనే జరుగుతున్నాయి.
- సమాధానం: 4
10. అంతర్జాతీయ వలస జీవుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 10
2) డిసెంబర్ 14
3) డిసెంబర్ 18
4) డిసెంబర్ 22
- View Answer
- సమాధానం: 3
వివరణ: డిసెంబర్ 18, 1990లో యూఎన్ఓ సాధారణ సభ ‘వలస కూలీల హక్కుల రక్షణ’ కోసం తీర్మానం చేయడం జరిగింది. 1991 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న అంతర్జాతీయ వలస కూలీల దినోత్సవాన్ని డిసెంబర్ 18న నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 3
11. 7వ ఇండియా - మాల్దీవుల ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు ఏ పేరుతో నిర్వహించారు?
1) EKUVERIN
2) ILAAMV
3) INDOMAL
4) MAINDL
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏడో ఇండియా - మాల్దీవుల ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు EKUVERIN పేరుతో మాల్దీవుల్లోని ‘లామూ అటోల్’ వద్ద నిర్వహించారు. ఈ విన్యాసాల్లో ఇండియా నుంచి బీహార్ రెజిమెంట్ పాల్గొంది.
- సమాధానం: 1
12. ఇటీవల ఇండియా, ఆసియాన్ల మధ్య 2020లోపు వ్యాపారాన్ని ఎన్ని డాలర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) 200 బిలియన్ డాలర్లు
2) 100 బిలియన్ డాలర్లు
3) 200 టిలియన్ డాలర్లు
4) 100 ట్రిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రస్తుతం ఇండియా - ఆసియాన్ల మధ్య 57 బిలియన్ డాలర్లు వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారంను 100 బిలియన్ డాలర్లుకు విస్తరించాలని ఇండియా - ఆసియాన్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
- సమాధానం: 2
13. భారత జీవిత బీమా సంస్థ (LIC) కు నూతన చైర్మన్‌గా నియమితులైనది ఎవరు?
1) ఎస్.కె.రాయ్
2) నిరూప్ నిలేకన్
3) శారదాదేవి
4) వి.కె.శర్మ
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతదేశంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థల్లో ఎల్ఐసి ఒకటి. ఎల్ఐసి రూ. 22.10 లక్షల కోట్లు ఆస్తులను కల్గి ఉంది. భారత జీడీపీలో 15% వాటాను కల్గి ఉంది.
- సమాధానం: 4
14. ఇటీవల ఐసీసీ 2016నకు ఒక మహిళ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో స్థానం సంపాదించుకున్న భారతీయ క్రికెటర్ ఎవరు?
1) స్మృతి మందనా
2) పూనమ్ రౌత్
3) మిథాలి రాజ్
4) లతికా కుమారి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండియా నుంచి 2016 ఐసీసీ జట్టుకు ఎంపికైన మహిళ క్రికెటర్ స్మృతి మందనా (Smriti Mandhana).
- సమాధానం: 1
15. 6వ ఆసియా - పసిఫిక్ మంత్రుల సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1) బీజింగ్
2) న్యూఢిల్లీ
3) సింగపూర్
4) బాండుంగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: గృహ నిర్మాణాలు, పట్టణాభివృద్ధి అనే అంశం మీద 6వ ఆసియా - పసిఫిక్ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించారు.
Theme: Emerging Urban Forms - Policy Responses & Government Structures.
- సమాధానం: 2
16. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన ఉద్దేశ్యం ఏది?
1) పెద్ద నోట్లు రద్దు
2) స్వచ్ఛంద ఆదాయ వెల్లడి
3) పేదరిక నిర్మూలన
4) పేద అవివాహితలకు ఆర్థిక సహాయం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం పన్ను ఎగవేత దారులకు మరోక అవకాశంను కల్పించింది. పథకం కింద స్వచ్ఛందంగా ఆదాయం వెల్లడించి 50% పన్ను కట్టి మిగతా సొమ్మను తెల్ల ధనంగా మార్చుకోవచ్చు.
- సమాధానం: 2
17. అంతర్జాతీయ మానవ సంఘీభావం దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 20
2) డిసెంబర్ 23
3) డిసెంబర్ 25
4) డిసెంబర్ 31
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2006 నుంచి పేదరిక నిర్మూలనలో సంఘీబావం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయుడం కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న అంతర్జాతీయ మానవ సంఘీబావం దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
18. ICFA గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ పురస్కారం - 2016నకు ఎంపికైంది ఎవరు?
1) సైరస్ మిస్త్రి
2) చంద్రశేఖరన్
3) ముఖేష్ అంబాని
4) రతన్ టాటా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇండియన్ కౌన్సిర్ ఆఫ్ పుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA)సంస్థ గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ పురస్కారానికి రతన్ టాటాను ఎంపిక చేసింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ గల బ్రాండ్‌గా టాటా గ్రూప్‌ను తీర్చిదిద్దినందుకు గాను ఈ పురస్కారానకి రతన్ టాటా ఎంపికయ్యాడు. 2016 సంవత్సరం గాను ఉత్తమ వ్యవసాయ రాష్ట్రంగా ఒడిశా, ఉత్తమ ఉద్యానవన రాష్ట్రంగా హర్యానా ICFA పురస్కారాలకు ఎంపికయ్యాయి.
- సమాధానం: 4
19. ఇటీవల బీబీసీ విడుదల చేసిన జాబితాలో అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో ఉన్నది ఎవరు?
1) జయ బెన్ దేశాయ్
2) ఇందిరా గాంధీ
3) మార్గరెట్ థాచర్
4) థెరిసా మే
- View Answer
- సమాధానం: 3
వివరణ: బీబీసీ గత 70 సంవత్సరాల్లో అత్యంత ప్రభావ వంతమైన 7 గురు మహిళలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలిస్థానంలో బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ ఉన్నారు. 1970వ దశకంలో మహిళలకు తక్కువ వేతనాలు ఇచ్చే యూ.కె. కంపెనీకి వ్యతిరేకంగా జయ బెన్ దేశాయ్ పోరాడింది. ఇండియా నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించుకొన్న ఏకైక మహిళ జయా బెన్ దేశాయ్.
- సమాధానం: 3
20. ‘తాల్ పావంగ్ ఖుత్’ అనే ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
1) జమ్ము కాశ్మీర్
2) సిక్కిం
3) మిజోరామ్
4) గోవా
- View Answer
- సమాధానం: 3
వివరణ: మిజోరామ్ రాష్ట్రంలో పంట చేతికి వచ్చిన తర్వాత నిర్వహించే ఉత్సవమే ఇది. కేంద్ర ప్రభుత్వం మిజోరామ్‌లో ఉత్సవాల నిర్వహణ కోసం రూ.50 లక్షలు కేటాయించింది. తాల్ పావంగ్ ఖుత్ ఉత్సవాన్ని మిజోరామ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
- సమాధానం: 3
21. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 20
2) డిసెంబర్ 22
3) డిసెంబర్ 24
4) డిసెంబర్ 26
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2011లో భారత ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ శ్రీనివాస రామనుజన్ జన్మదినం డిసెంబర్ 22ను జాతీయ గణిత శాస్త్ర దినం జరుపుకోవాలని ప్రకటించారు. 2012 సంవత్సరంను జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించారు.
- సమాధానం: 2
22. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింధూనది జలాల ఒప్పందం కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేసింది?
1) నృపేంద్ర మిశ్రా
2) అజిత్ దోవత్
3) ఎస్. జై శంకర్
4) శక్తి కాంత్ దాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నృపేంద్ర మిశ్రా నేతృత్యంలో సింధూనది జలాలు ఒప్పందం మీద ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్‌లో ఇతర సభ్యులు ఆజిత్ దోవల్, ఎస్. జైశంకర్.
- సమాధానం: 1
23. ఇటీవల సుప్రీం కోర్టు వేటి మీద పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు కల్పించింది?
1) వాహనాలు
2) రోడ్లు
3) ప్రైవేట్ కాలువలు
4) సెల్ టవర్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: సెల్ టవర్లను వ్యక్తిగత ఆస్తిగా పరిగణించి, ఆస్తి పన్నును విధించుకోవచ్చు అని సుప్రీం కోర్టు రాష్ట్రాలకు సూచించినది.
- సమాధానం: 4
24. డిజిటల్ ఇండియా సిల్వర్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది?
1) కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్
2) ఏపీ ట్రాన్స్‌కో
3) ఢిల్లీ పవర్ లిమిటెడ్
4) కొల్కత్తా మున్సిపల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ‘మోస్ట్ ఇన్నోవేటివ్ సిటిజన్ ఎంగేజ్మెంట్’ కేటగిరిలో కోయంబత్తూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ‘డిజిటల్ ఇండియా సిల్వర్ పురస్కారానికి’ ఎంపిక చేసింది. ఈ కార్పొరేషన్ తన కార్యాలయాల్లో పూర్తిగా ఉచిత వైఫై సౌకర్యం ఏర్పాటు చేసినందుకు గాను ఈ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 1
25. శ్రీ చంద్ర శేఖర సరస్వతి జాతీయ విశిష్ట పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) కె.చంద్రశేఖర రావు
2) చంద్రబాబు నాయుడు
3) ఓ. పన్నీర్ సెల్వమ్
4) దేవేంద్ర ఫఢ్నవీస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కంచికి చెందిన దివంగత శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి గౌరవార్థం 1998లో దక్షిణ భారత విద్యా సమాజం వారు ఈ పురస్కారానికి నెలకొల్పారు. ప్రజా నాయకత్వం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక వేత్తలు, సమాజాభివృద్ధి విభాగాల్లో పురస్కారాలను ప్రధానం చేస్తారు. ప్రజా నాయకత్వ విభాగంలో దేవేంద్ర ఫఢ్నవీస్ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద రూ. 2.5 లక్షల నగదు, ప్రశంసా పత్రం, శాలువా ప్రదానం చేస్తారు.
- సమాధానం: 4
26. QS యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 4 స్టార్స్ పొందిన ఏకైక భారతీయ యూనివర్సిటీ ఏది?
1) ఢిల్లీ యూనివర్సిటీ
2) జె.ఎన్.యూ
3) వీఐటీ యూనివర్సిటీ
4) IISC బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భోదన, విన్నూత ప్రయోగాలు, ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని QS సంస్థ యూనివర్సిటీ రేటింగ్ ఇస్తుంది. ఇండియా నుంచి 4 స్టార్స్ల రేటింగ్ పొందిన ఏకైక యూనివర్సిటీ వెల్లూరు ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ (VIT).
- సమాధానం: 3
27. జాతీయ కిసాన్ దివస్‌ను ఏ రోజున నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 30
2) డిసెంబర్ 27
3) డిసెంబర్ 25
4) డిసెంబర్ 23
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ గౌరవార్థం డిసెంబర్ 23ను జాతీయ కిసాన్ దివస్‌గా 2001 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 4
28. ‘జుడిమా’ ఉత్సవాలను ఏ రాష్ట్రం నిర్వహిస్తారు?
1) అస్సాం
2) మేఘాలయ
3) ఉత్తరాఖండ్
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దిమాసా తెగలకు చెందిన సంస్కృతి, సంగీత, నృత్యం, జానపద కళలు కాపాడటం కోసం అస్సాంలోని దిమా హసావో జిల్లాలో జుడిమా నృత్యంను నిర్వహించుకుంటారు.
- సమాధానం: 1
29. WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ విజేత ఎవరు?
1) ఫ్రాన్సిస్ చేకా
2) విజేందర్ సింగ్
3) నర్సింగ్ యాదవ్
4) కేర్రి హోప్
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూఢిల్లీలో జరిగిన WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌షిప్‌లో ఫ్రాన్సిస్ చేకాను ఓడించి విజేందర్‌సింగ్ టైటిల్ గెలుచుకున్నాడు. 2015లో కూడా ఈ టైటిల్‌ను విజేందర్ సింగ్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
30. 2016 సంవత్సరానికి ప్రపంచ సుందరిగా ఎంపికైనది ఎవరు?
1) నతషా మన్నెలా
2) యారిత్జ్ మిగులైనా
3) ప్రియ దర్శిని
4) స్టెఫానిడెల్ వాల్లే
- View Answer
- సమాధానం: 4
వివరణ: వాషింగ్ట్‌న్‌లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ప్యూర్టోరికో కు చెందిన స్టెఫానీ డెల్ వాల్లే ప్రపంచ సుందరి కిరిటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటిల్లో మొదటి రన్నరప్‌గా డోమినికన్ రిపబ్లిక్కు చెందిన యారిత్జ్ మిగులైనా, రెండో రన్నరప్‌గా ఇండోనేషియాకు చెందిన నతాషా మన్నెలా ఎంపికైంది.
- సమాధానం: 4
31. జాతీయ వినియోగదారుల దినోత్సవంను ఏ రోజున నిర్వహించారు?
1) డిసెంబర్ 18
2) డిసెంబర్ 21
3) డిసెంబర్ 24
4) డిసెంబర్ 27
- View Answer
- సమాధానం: 3
వివరణ: డిసెంబర్ 24, 1986న వినియోగదారుల రక్షణ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవంను నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కులను గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
- సమాధానం: 3
32. అంతర్జాతీయ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ప్రదానం చేసే విశిష్ట జర్నలిజం పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) ఆర్నాబ్ గోస్వామి
2) ఎన్.రామ్
3) వరుణ్ భట్
4) ఆమోల్ రాజన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: విశిష్ట జర్నలిజం పురస్కారానికి ఎంపికైన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి, ఒక ట్రోఫీ, ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. స్వాతంత్య్రోదమ కాలంలో రాజస్థాన్‌లోని మాన్గాధ్ అనే ప్రాంతంలో 1500 గిరిజనులను బ్రిటిష్ వారు చంపివేశారు. ఈ సంఘటనకు గుర్తుగా స్మారక చిహ్నం నిర్మాణంలో అధికారుల చూపిన నిర్లక్ష్యం గురించి వరుణ్ భట్ రాజస్థాన్ పత్రికలో వ్యాసం రాసినందుకు గాను ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.
- సమాధానం: 3
33. ఇటీవల అస్సాం పర్యాటక రంగం సౌహర్థ రాయబారిగా నియమితులైనది ఎవరు?
1) ప్రియంకా చోప్రా
2) దీపికా పదుకొనే
3) తాప్సి పన్ను
4) విద్యా బాలన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అస్సాంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ‘అద్భుతమైన అస్సాం’ అనే ప్రచార కార్యక్రమంను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రచారానికి సౌహర్ధ రాయబారిగా 2 సంవత్సరాల పాటు ప్రియాంకా చోప్రా కొనసాగుతారు.
- సమాధానం: 1
34. 11వ జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2016 విజేత ఎవరు?
1) బెల్జియం
2) ఇండియా
3) జర్మనీ
4) మలేషియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 11వ జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2016 పోటీలు భారతదేశంలో నిర్వహించారు. ఈ పోటీల్లో బెల్జియంను ఓడించి ఇండియా జూనియర్ హాకీ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ టైటిల్‌ను ఇండియా గెలవటం ఇది రెండోసారి. 2001లో తొలిసారి ఇండియా ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 2
35. ఇటీవల 12 అడుగుల తిరువాళ్వార్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) హరిద్వార్
2) బాలి
3) సింగపూర్
4) కౌలాలంపూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త అయిన తిరువాళ్వార్ 12 అడుగుల విగ్రహంను హరిద్వార్‌లోని మేళా భవన్లో ఏర్పాటు చేశారు. హరిద్వార్ బ్రాహ్మణులు తిరువాళ్వార్ శూద్రుడు అయినందు వలన అతని విగ్రహంను గంగానది ఒడ్డున పెట్టనివ్వకుండా 6 నెలల పాటు అడ్డుకున్నారు.
- సమాధానం: 1
36. ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు మసీదుల్లో నడిచే షరియా కోర్టుల మీద నిషేదం విధించింది?
1) నాగ్‌పూర్ హైకోర్టు
2) బెంగాల్ హైకోర్టు
3) మద్రాస్ హైకోర్టు
4) అలహాబాద్ హైకోర్టు
- View Answer
- సమాధానం: 3
వివరణ: తమిళనాడులోని వివిధ మసీదుల్లో అనధికారంగా నడుస్తున్న షరియా కోర్టులను మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ షరియా కోర్టులు ద్వారా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. లబ్దుల్ రహమాన్ అనే 29 సంవత్సరాల NRI మద్రాస్ హైకోర్టులోప్రజా పయోజనాలు వ్యాజంనుదాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు షరియా కోర్టుల మీద నిషేధం విధించింది.
- సమాధానం: 3
37. ప్రపంచ పవన శక్తి స్థాపిత సామర్థ్యం ఇండెక్స్‌లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) చైనా
2) యూఎస్ఏ
3) జర్మనీ
4) ఇండియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ పవన శక్తి స్థాపిత సామర్ధ్యం ఇండెక్స్‌లో తొలి స్థానంలో చైనా ఉంది. తర్వాత స్థానాల్లో యూఎస్ఏ, జర్మనీ, ఇండియా ఉన్నాయి. 2016లో ఇండియా పవన శక్తి స్థాపిత సామర్థ్యం 28,27 MW.
- సమాధానం: 1
38. ఇటీవల ఇండియా స్పూర్తితో నల్లధనం నిర్మూలన కోసం పెద్ద నోట్లలను రద్దు చేసిన దేశం ఏది?
1) ఈక్వేడార్
2) మలేషియా
3) ఇండోనేషియా
4) పాకిస్థాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇండియాలో పెద్ద నోట్ల రద్దు తర్వాత వెనెజులా, పాకిస్థాన్ పెద్ద నోట్లు రద్దు చేశాయి. వెనెజులాలో ప్రజల నుంచి త్రీవ వ్యతిరేకత రావటం, ఒక వ్యక్తి మరణంతో ఆ దేశ ప్రభుత్వం నిర్ణయంను వెనక్కి తీసుకుంది. పాకిస్థాన్ నల్లధనం నిర్మూలనకు దేశంలో ఉన్న పెద్ద నోటు అయిన రూ.5000 ను రద్దు చేశారు.
- సమాధానం: 4
39. ఇటీవల శాస్త్రవేత్తలు ఏ సముద్రంలో 60,000 చ.కి.మీ.ల డెడ్జోన్ను కనుగొన్నారు?
1) నల్ల సముద్రం
2) దక్షిణ చైనా సముద్రం
3) బంగాళా ఖాతం
4) ఎర్ర సముద్రం
- View Answer
- సమాధానం: 3
వివరణ: డెడ్ జోన్ అనగా సముద్రంలో ఆక్సిజన్ స్థాయిలో తగ్గుదల ఎక్కువగా ఉండి, నత్రజని నిర్మూలన సహజంగా జరిగే ప్రాంతం. ఈ డెడ్ జోన్లు ఎక్కువగా ఉత్తర, దక్షిణ అమెరికాల పశ్చిమ తీరంలో, ఆఫ్రికాలో నమీబియా తీరంలో, భారతదేశ పశ్చిమ తీరంలో కన్పిస్తాయి.
- సమాధానం: 3
40. 5వ గ్లోబల్ సైబర్ స్పేస్ కాన్ఫరెన్స్ 2017 ను నిర్వహించనున్న దేశం ఏది?
1) కెనడా
2) ఇండియా
3) సింగపూర్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా వలన డిజిటల్ రంగంలో ఇండియా అంతర్జాతీయ ఖ్యాతిని పొంది, ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం లభించింది. గ్లోబల్ సైబర్ స్పెస్ కాన్ఫరెన్స్ తొలి సమావేశం యూ.కెలో 2011లో నిర్వహించారు.
- సమాధానం: 2
41. ఇటీవల ఏ ఇస్లామిక్ దేశం ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పిస్తూ చట్టం చేసింది?
1) ఇరాన్
2) సిరియా
3) జోర్డాన్
4) లెబనాన్
- View Answer
- సమాధానం: 1
42. ఇటీవల భారతీయులకు వీసా రహిత సౌకర్యంను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన దేశం ఏది?
1) సింగపూర్
2) హాంకాంగ్
3) ఫిజి
4) మారిషస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వీసా లేకుండా వచ్చే భారతీయులకు హాంకాంగ్‌లో 14 రోజుల పాటు తిరిగే అవకాశం గతంలో ఆ దేశ ప్రభుత్వం కల్పించింది. చైనా ప్రభుత్వం త్రీవ ఒత్తిడి మేరకు హాంకాంగ్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుంది.
- సమాధానం: 2
43. పిల్లల గోల్ఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను గెలుచుకుంది ఎవరు?
1) మేతు డేనిష్
2) విల్లి డేవిడ్
3) అర్జున్ భాతి
4) నిక్లస్ స్టబ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మలేషియాలో జరిగిన పిల్లలు గొల్ఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో మేతు డేనిష్‌ను ఓడించి అర్జున్ భాతి టైటిల్‌ను సొంత చేసుకున్నాడు. ఆల్ బట్రాస్ అంతర్జాతీయ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ 2016 టైటిల్‌ను కూడా అర్జున్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
44. ఇటీవల పోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం ఏది?
1) చైనా
2) యూఎస్ఏ
3) జపాన్
4) ఇండియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న U.S.A. తర్వాత స్థానాల్లో చైనా, జపాన్, జర్మనీ ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం ఇండియా, UK ని వెనక్కి నెట్టి 5వ స్థానాన్ని ఆక్రమించుకుంది.
- సమాధానం: 2
45. ప్రతిష్టాత్మక సర్ గ్యారిఫిల్డ్ సోబర్ ట్రోఫి కి ఎంపికైనది ఎవరు?
1) విరాట్ కోహ్లి
2) గిల్ క్రిస్ట్
3) మహమ్మద్ సమి
4) రవిచంద్రన్ ఆశ్విన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సర్ గ్యారిఫిల్డ్ సోబర్ ట్రోఫినకు ఎంపికైన మూడో ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. గతంలో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండ్కూలర్ ఈ ట్రోఫికి ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం ICC ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం అందిస్తుంది. ICC ఉత్తమ క్రీడాకారుని పురస్కారానికి ఎంపికైన క్రీడాకారునికి సర్ గ్యారిఫిల్డ్ సోబర్ ట్రోఫి కూడా బహుకరిస్తారు.
- సమాధానం: 4
46. 2016 శాస్త్ర - రామానుజన్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) కైసా మతోమాకి
2) ప్రొ.వైంత్రౌజ్
3) కాథరిన్ బ్రింగ్మన్
4) మారాయిస్ ఎరాస్మస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2016 సంవత్సరానికి గాను శాస్త్ర - రామానుజున్ పురస్కారానికి మెక్‌గ్రిల్ యూనివర్సిటీకి చెందిన మక్సమ్ రాడ్జివిల్ (Maksym Radziwill) (కెనడా), తరుకు విశ్వ విద్యాలయానికి చెందిన కైసా మతోమకి లకు సంయుక్తంగా ఇచ్చారు. ఈ పురస్కారం కింద 5,000 డాలర్లు నగదు బహమతి, ప్రశంసా పత్రం ఇస్తారు.
- సమాధానం: 1
47. ఇటీవల ‘బిజు శిశు సంరక్షణ యోజన’ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) ఉత్తరాఖండ్
2) మధ్యప్రదేశ్
3) ఒడిశా
4) అస్సాం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఒడిశాలో HIV బారిన పడిన అనాథ పిల్లల కోసం ఒడిశా ప్రభుత్వం బిజు శిశు సంరక్షణ యోజన ప్రారంభించినది. ఈ స్కిమ్ కింద చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తారు.
- సమాధానం: 3
48. ప్రపంచంలో తొలిసారి సోలార్ ప్యానెల్‌తో రోడ్డును ఎక్కడ నిర్మించారు?
1) ఫిజి
2) ఫ్రాన్స్
3) కెనడా
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 2
49. 52వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) షాంక ఘోష్
2) జయతి ఘోష్
3) వినయ్ చంద్ర
4) రూపాలి ముఖర్జి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ బెంగాలి కవి షాంక ఘోష్‌ను (Shanka Gosh)ను 52వ జ్ఞాన పీఠ్ పురస్కారానికి ఎంపిక చేశారు. 1961లో భారతీయ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ పురస్కారం కింద రూ.11 లక్షలు, ఒక ప్రశంసాపత్రం, కంచుతో చేసిన సరస్వతి విగ్రహం ప్రదానం చేస్తారు.
- సమాధానం: 1
50. ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలు పర్యవేక్షించడానికి ఉపగ్రహంను అంతరిక్షంలోకి పంపిన దేశం ఏది?
1) ఇండియా
2) జపాన్
3) అమెరికా
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: చైనా, భూమి నుంచి 700 కి.మీ. ఎత్తులో వాతవరణ పొరలలో కార్బన్ డై ఆక్సైడ్ వ్యాప్తి, ప్రవాహం, కేంద్రీకరణను పర్యవేక్షించటం కోసం Tansat అనే ఉపగ్రహంను లాంగ్ మార్చ్ 2D రాకెట్ ద్వారా అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది. Tansat ఉపగ్రహం బరువు 620 కేజీలు.
- సమాధానం: 4