కరెంట్ అఫైర్స్ డిసెంబర్ (16 - 23) బిట్ బ్యాంక్
1. యునెస్కో కేటగిరి - 2 సెంటర్ (సి2సి) స్థాయిలో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓశనోగ్రఫీ భారత్‌లోని ఏ నగరంలో ఏర్పాటు కానుంది ?
1) హైదరాబాద్
2) చెన్నై
3) పూణె
4) కొచ్చిన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యునెస్కో కేటగిరి - 2 సెంటర్(సి2సి) స్థాయిలో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓశనోగ్రఫీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇండియన్ ఓషన్ రిమ్ (ఐఒఆర్) వెంబడి ఉన్న దేశాలు, హిందూ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రాలతో సరిహద్దులను కలిగి ఉన్న ఆఫ్రికన్ దేశాల యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి పరచేందుకు గాను ఒక శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాన్నదే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం.
- సమాధానం: 1
2. ఇటీవల ఏ అంతరిక్ష సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం కెప్లర్ - 90ఐ గ్రహాన్ని గుర్తించారు ?
1) ఇస్రో
2) నాసా
3) రాస్ కాస్మోస్
4) జాక్సా
- View Answer
- సమాధానం: 2
వివరణ: నాసా శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ సాయంతో కెప్లర్ 90 సౌర వ్యవస్థలో 8వ గ్రహం కెప్లర్ - 90ఐని ఇటీవల గుర్తించారు. కెప్లర్ 90 గ్రహ వ్యవస్థ భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
- సమాధానం: 2
3. ప్రపంచ వాణిజ్య సంస్థ 11వ మంత్రుల సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) చైనా
2) స్విట్జర్లాండ్
3) అర్జెంటీనా
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 11వ ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల సమావేశం(World Trade Organisation Ministerial conference -MC11) ఇటీవల అర్జెంటీనాలోని బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో జరిగింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు నేతృత్వంలోని నేతృత్వంలోని భారత బృందం ఈ సమావేశాల్లో పాల్గొంది.
- సమాధానం: 3
4. ఎన్ని వేల రూపాయలలోపు డెబిట్ కార్డ్, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీలపై మర్చంట్ డిస్కాంట్ రేట్‌ను ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది ?
1) రూ.1,000
2) రూ.2,000
3) రూ.3,000
4) రూ.4,000
- View Answer
- సమాధానం: 2
వివరణ: రెండు వేల రూపాయల లోపు డెబిట్ కార్డ్, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీలపై మర్చంట్ డిస్కాంట్ రేట్(MDR)ను ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ విధానం 2018 జనవరి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 2
5. భారత ఒలింపిక్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) రాజీవ్ మెహతా
2) రాకేశ్ గుప్తా
3) ఆర్ కే ఆనంద్
4) నరీందర్ బాత్రా
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత ఒలింపిక్ సంఘం(IOA) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఇటీవల ఎన్నికయ్యారు. ఐఓఏ కార్యదర్శిగా రాజీవ్ మెహతా, కోశాధికారిగా ఆనందీశ్వర్ పాండే ఎన్నికయ్యారు.
- సమాధానం: 4
6. ఐరాస ఇటీవల విడుదల చేసిన ప్రపంచ వలస నివేదిక - 2018 ప్రకారం కింది వాటిలోని ఏ దేశం నుంచి ఎక్కువ మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు ?
1) మెక్సికో
2) భారత్
3) చైనా
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐరాస విడుదల చేసిన ప్రపంచ వలస నివేదిక - 2018 ప్రకారం భారత్ నుంచి ఎక్కువ మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఈ నివేదిక ప్రకారం భారత్‌కు చెందిన 15.6 మిలియన్ల మంది ఇతర దేశాల్లో నివశిస్తున్నారు.
- సమాధానం: 2
7. ఆసియాన్ మౌలికవసతుల పెట్టుబడి బ్యాంక్ నుంచి ఎక్కువ రుణాలు పొందిన దేశం ఏది ?
1) భారత్
2) అమెరికా
3) చైనా
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: తమ బ్యాంకు నుంచి అత్యధిక మొత్తంలో రుణాలు పొందిన దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉందని Asian Infrastructure Investment Bank (AIIB) ఇటీవల ప్రకటించింది. ఈ బ్యాంక్ ఇప్పటికే భారత్‌కు 1.5 బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చేందుకు అంగీకరించింది.
- సమాధానం: 1
8. భారత్ ఇటీవల ఏకువెరిన్(Ekuverin) పేరుతో ఏ దేశంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించింది ?
1) శ్రీలంక
2) మాల్దీవులు
3) మలేషియా
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్, మాల్దీవులు ఇటీవల 8వ ఏకువెరిన్ సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించాయి. కర్ణాటకలోని బెలాగవిలో ఈ విన్యాసాలు జరిగాయి. కౌంటర్ టెర్రిరిజం ఆపరేషన్సలో రెండు దేశాల సైన్యం అవలంబించే విధానాలను పరస్పరం తెలుసుకునేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తారు.
- సమాధానం: 2
9. ప్రపంచ ఆరోగ్య సంస్థ కింది వాటిలోని ఏ దేశాన్ని ఇటీవల పోలియో రహిత దేశంగా ప్రకటించింది ?
1) గాబన్
2) కేమరూన్
3) పాకిస్తాన్
4) ఆఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మధ్య ఆఫ్రికాలోని గాబన్లో ఇటీవల కాలంలో పోలియో కేసులు నమోదు కాకాపోవడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ఈ ఏడాది కేవలం ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్లో మాత్రమే పోలియో కేసులు నమోదయ్యాయి.
- సమాధానం: 1
10.దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రం..ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై తనిఖీ నిర్వహించేందుకు సామాజిక తనిఖీ చట్టాన్ని తీసుకొచ్చింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మేఘాలయ
4) బిహార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తీరుని తనిఖీ చేసేందుకు మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా "The Meghalaya Community Participation and Public Services Social Audit Act, 2017' పేరుతో సామాజిక తనిఖీ చట్టాన్ని తీసుకొచ్చింది.
- సమాధానం: 3
11. బీడబ్ల్యూఎఫ్ దుబాయి వరల్డ్ సూపర్ సీరీస్ ఫైనల్స్ - 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) అకెన్ యమాగుచి
2) పీవీ సింధు
3) చెన్ యూఫీ
4) సయాకా సాటో
- View Answer
- సమాధానం: 1
వివరణ: బీడబ్ల్యూఎఫ్ దుబాయి వరల్డ్ సూపర్ సీరీస్ ఫైనల్స్ - 2017 టైటిల్ పోరులో జపాన్‌కు చెందిన అకెన్ యమాగుచి.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుని ఓడించి టైటిల్ గెలుచుకుంది.
- సమాధానం: 1
12. సముద్ర మార్గం ద్వారా అతి తక్కువ సమయంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చి ఇటీవల రికార్డు సృష్టించిందిఎవరు ?
1) థామస్ కోవిల్లే
2) రాబిన్ లీ గ్రహమ్
3) జోయాన్ ఫ్రాన్సిస్
4) ఫ్రాంకోయిస్ గాబర్ట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫ్రాన్స్‌కు చెందిన నావికుడు ఫ్రాంకోయిస్ గాబర్ట్ ఇటీవల 42 రోజుల 16 గంటల్లో సముద్ర మార్గం ద్వారా ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చి రికార్డు నమోదు చేశాడు. గత రికార్డు ఫ్రాన్స్‌కే చెందిన థామస్ కోవిల్లే పేరిట ఉండేది. కోవిల్లే 48 రోజుల్లో ఈ ఘనత సాధించాడు.
- సమాధానం: 4
13. స్మితా పాటిల్ తొలి స్మారక అవార్డు - 2017ని ఇటీవల ఎవరికి ప్రకటించారు ?
1) మాధురి దీక్షిత్
2) శ్రీదేవి
3) రేఖ
4) ప్రీతి జింటా
- View Answer
- సమాధానం: 3
వివరణ: హిందీ, మరాఠీ భాషల్లో 80కిపైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి స్మితా పాటిల్ 1986లో కన్నుమూశారు. ఆమె పేరిట ఏర్పాటు చేసిన స్మితా పాటిల్ తొలి మొమోరియల్ అవార్డుని ప్రముఖ బాలీవుడ్ నటి రేఖకు ఇటీవల ప్రకటించారు.
- సమాధానం: 3
14. చిలి దేశ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) సెబాస్టియన్ పినెరా
2) కెన్నెత్ బంకర్
3) క్రిస్టెన్ సెన్ బ్రంచ్
4) అలెజాండ్రో గుల్లియర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇటీవల జరిగిన చిలీ అధ్యక్ష ఎన్నికల్లో సెబాస్టియన్ పినెరా తన ప్రత్యర్థి అలెజాండ్రో గుల్లియర్ను ఓడించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నేషనల్ రెన్యూవల్ పార్టీకి చెందిన పినెరా మొదటిసారి 2010 నుంచి 2014 వరకు చిలీ అధ్యక్షుడిగా ఉన్నారు.
- సమాధానం: 4
15. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది ?
1) భారతీయ జనతా పార్టీ
2) భారత జాతీయ కాంగ్రెస్
3) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
4) సమాజ్ వాదీ పార్టీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. 182 స్థానాలున్న గుజరాత్లో 99, 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో 44 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో విజయంతో దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది.
- సమాధానం: 1
16. ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాలను ప్రోత్సహించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని మెగా ఫుడ్ పార్క్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది ?
1) 12
2) 42
3) 60
4) 78
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆధునిక మౌలిక వసతులను కల్పించేందుకు దేశవ్యాప్తంగా 42 మెగా ఫుడ్ పార్క్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 9 పార్కులు నిర్వహణలోకి వచ్చాయని ఇటీవల కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రి హసిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు.
- సమాధానం: 2
17. జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని ఇటీవల పదవీ విరమణ పొందిన వారు ఎవరు ?
1) దీపక్ మిశ్రా
2) లోకేశ్వర్ సింగ్
3) స్వతంతర్ కుమార్
4) జేఎస్ ఖేహర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జస్టిస్ స్వతంతర్ కుమార్ 2012 డిసెంబర్ 20 నుంచి 2017 డిసెంబర్ 19 వరకు జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్నారు. ఐదేళ్ల పదవీకాలం ముగియటంతో ఇటీవల ఆయన పదవీ విరమణ పొందారు.
- సమాధానం: 3
18. ప్రతిష్టాత్మక నేషనల్ డిజైన్ అవార్డు - 2017ని ఎవరికి ప్రకటించారు ?
1) జి. సతీశ్ రెడ్డి
2) ప్రియా పాల్
3) జీవక్ బాద్వే
4) శ్రీని ఆర్ శ్రీనివాసన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి సైంటిఫిక్ అడ్వైజర్ జి. సతీశ్ రెడ్డి ప్రతిష్టాత్మక నేషనల్ డిజైన్ అవార్డు - 2017కు ఎంపికయ్యారు. నేషనల్ డిజైన్ రీసర్చ్ ఫోరమ్ ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 1
19. బీబీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ - 2017 అవార్డుకి ఏ జట్టు ఎంపికైంది ?
1) భారత మహిళల క్రికెట్ జట్టు
2) ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు
3) భారత మహిళల హాకీ జట్టు
4) ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు
- View Answer
- సమాధానం: 2
వివరణ: బీబీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు - 2017కి ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఎంపికైంది. 2017 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టుని ఓడించి ఇంగ్లండ్ మహిళల జట్టు టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 2
20. మూర్తిదేవి అవార్డు - 2017కి ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎంపీ వీరేంద్ర కుమార్
2) జాయ్ గోస్వామి
3) విశ్వనాథ్ త్రిపాఠి
4) కోలకాలూరి ఎనోచ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ బెంగాలీ కవి జాయ్ గోస్వామి 31వ మూర్తి దేవి పురస్కారానికి ఎంపికయ్యారు. ''డూ దోండో ఫోవారా మాత్రో'' పేరుతో రచించిన కవితా సంకలనానికి గాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు.
- సమాధానం: 2
21. ఇటీవల ఏ రాష్ట్రం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం ఆల్ఫాబెట్ ఇంక్ ఎక్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఉత్తరప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో Free Space Optical Communication (FSOC) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Alphabet Inc. X సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఈ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇంటర్నెట్ సేవల నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుంది. ఆల్ఫాబెట్ గూగుల్ మాతృసంస్థ.
- సమాధానం: 4
22. దేశంలో తొలి నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ?
1) గుజరాత్
2) మహారాష్ట్ర
3) పశ్చిమబెంగాల్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో తొలి నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ (NRTU)ని గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018 ఏప్రిల్‌లోగా యూనివర్సిటీ కార్యకలాపాలను ప్రారంభించి.. అదే ఏడాది జూలై నాటికి అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను ప్రారంభించనున్నారు.
- సమాధానం: 1
23. 2040 నాటికి దేశంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ తవ్వకాలను పూర్తిగా నిలిపివేసేందుకు ఇటీవల ఏ దేశ పార్లమెంట్ ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది ?
1) అమెరికా
2) ఫ్రాన్స్
3) జపాన్
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2040 నాటికి దేశంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ తవ్వకాలను పూర్తిగా నిలిపివేసేందుకు ఉద్దేశించిన బిల్లుని ఫ్రాన్స్ పార్లమెంట్ ఇటీవల ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న తవ్వకాల అనుమతులకు రెన్యువల్స్ ఉండవు. అలాగే కొత్త అనుమతులు ఇవ్వరు. పారిస్ వాతావరణ ఒప్పందంలో భాగంగా భూతాపాన్ని తగ్గించేందుకు ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 2
24. తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తుదిదశ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది ?
1) కాళేశ్వరం
2) మల్లన్న సాగర్
3) భక్త రామదాసు
4) ఏవీ కాదు
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తుదిదశ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. రూ. 80,500 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని నిర్మిస్తుంది.
- సమాధానం: 1
25. మిస్ ఇండియా యూఎస్ఏ - 2017 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) కవితా మల్హోత్రా పట్టాని
2) శ్రీ శైనీ
3) ప్రాచీ సింగ్
4) స్వప్నా మన్నం
- View Answer
- సమాధానం: 1
వివరణ: మిస్ ఇండియా అమెరికా 2017 కిరీటాన్ని శ్రీ శైనీ గెలుచుకుంది. ప్రాచీ సింగ్ రన్నరప్‌గా నిలిచింది. శ్రీ శైనీ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ విద్యార్థిని.
- సమాధానం: 1
26. ‘‘నసీం - అల్ - బహర్’’ సంయుక్త నౌకా విన్యాసాలను ఏ దేశాలు నిర్వహిస్తాయి ?
1) భారత్, పాలస్తీనా
2) భారత్, ఒమన్
3) భారత్, ఈజిప్ట్
4) భారత్, ఖతార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ‘‘నసీం - అల్ - బహర్’’ సంయుక్త సైనిక విన్యాసాలను భారత్, ఒమన్ నిర్వహిస్తాయి. 2017 ద్వైపాక్షిక నౌక విన్యాసాలు ఇటీవల ఒమన్‌లోని బిన్ సుల్తాన్ నావల్ బేస్‌లో జరిగాయి. 1993 నుంచి ఈ నౌకా విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 2
27. భారత విదేశాంగ విధానాన్ని దేశంలోని విద్యార్థులకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం ఏది ?
1) AMVARTI
2) AMVEDA
3) SAMPARK
4) SAMEEP
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత విదేశాంగ విధానాన్ని దేశంలోని విద్యార్థులకు వివరించేందుకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ(MEA) ఇటీవల Students and MEA Engagement Programme(SAMEEP) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రిత్వశాఖ అధికారులు విద్యార్థులతో సమావేశమై.. భారత విదేశాంగ విధానాన్ని వివరిస్తారు.
- సమాధానం: 4
28. డిజైన్ రంగంలో భారత తొలి విశ్వవిద్యాలయం.. వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ?
1) ఉత్తరప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) హర్యానా
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: డిజైన్ రంగంలో భారత తొలి విశ్వవిద్యాలయం వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్(WUD)ను ఇటీవల హర్యానాలోని సోనిపట్‌లో ప్రారంభించారు. పంజాబ్‌లోని ఓం ప్రకాశ్ బన్సాల్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఈ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తుంది.
- సమాధానం: 3
29. 2022 కామన్వెల్త్ గేమ్స్ ఏ నగరంలో జరగనున్నారుు ?
1) బీజింగ్
2) బర్మింగ్ హం
3) డర్బన్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2022 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హమ్ను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఈ పోటీలు జరుగుతాయని 2015లో ప్రకటించారు. ఆర్థిక సమస్యలతో డర్బన్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఇటీవల బర్మింగ్ హమ్ను ఎంపికచేశారు. ఈ పోటీలకు ఇంగ్లండ్ వేదిక కావడం ఇది మూడోసారి. 1934లో లండన్‌లో, 2002లో మాంచెస్టర్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి.
- సమాధానం: 2
30. ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన వరల్డ్ ఆఫ్ బిజినెస్ ఇన్ 2018 ర్యాంకింగ్స్ లో ఏ దేశం తొలిస్థానంలో నిలిచింది ?
1) యూకే
2) అమెరికా
3) స్వీడన్
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన వరల్డ్ ఆఫ్ బిజినెస్ ఇన్ 2018 ర్యాంకింగ్స్ లో యునెటైడ్ కింగ్డమ్ తొలిస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. 153 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 62వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 1
31. నేషనల్ కేడెట్ కాప్స్(NCC) డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) బీఎస్ సహరావత్
2) సుదీప్ లఖ్తాకియా
3) బీఎస్ నేగి
4) మనోజ్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: లెఫ్టినెంట్ జనరల్ బీ ఎస్ సహరావత్ ఇటీవల నేషనల్ కెడిట్ కాప్స్ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
- సమాధానం: 1
32. జాతీయ రైతు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 19
2) డిసెంబర్ 20
3) డిసెంబర్ 23
4) డిసెంబర్ 17
- View Answer
- సమాధానం: 3
వివరణ: డిసెంబర్ 23న భారత 5వ ప్రధాన మంత్రి చౌదరీ సింగ్ జయంతిని పురస్కరించుకొని జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని కిసాన్ దివస్ గాను పిలుస్తారు.
- సమాధానం: 3
33. ఫోర్బ్స్ ఇండియా ఇటీవల విడుదల చేసిన 100 మంది సెలబ్రిటీ జాబితాలో తొలిస్థానంలో ఎవరు నిలిచారు ?
1) అక్షయ్ కుమార్
2) షారుఖ్ ఖాన్
3) విరాట్ కోహ్లీ
4) సల్మాన్ ఖాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా’ 100 మంది సెలబ్రిటీ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ మరోసారి తొలి స్థానంలో నిలిచాడు. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారి పేర్లతో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. షారూఖ్‌ఖాన్ రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 4
34. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) వేద్ ప్రకాశ్
2) ధీరేంద్ర పాల్ సింగ్
3) అనితా కార్వాల్
4) ఆర్ కే చతుర్వేది
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) చైర్మన్‌గా ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్ ఇటీవల నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లు ఉంటారు. ధీరేంద్ర కన్నా ముందు వేద్ ప్రకాశ్ యూజీసీ చైర్మన్‌గా ఉన్నారు.
- సమాధానం: 2
35. అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) కుమీ నాయుడు
2) సలీల్ షెట్టి
3) అహ్మద్ కథ్రాడా
4) ఇబ్రహీం పటేల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలు ఉన్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు కుమీ నాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న బెంగళూరుకు చెందిన సలీల్ షెట్టి 2018 ఆగస్టులో రిటైరయిన తర్వాత కుమీ నాయుడు బాధ్యతలు చేపడతారు.
- సమాధానం: 1
36. నల్లధనంపై సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్ ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం 2018 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది ?
1) అమెరికా
2) ఆస్ట్రేలియా
3) స్విట్జర్లాండ్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: నల్లధనంపై సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్ లు ఇటీవల సంతకం చేశాయి. దీంతో.. 2018 జనవరి 1 నుంచి ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది.
- సమాధానం: 3
37. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీల ర్యాంకింగ్స్‌లో ఏ రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ప్రకటించిన మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. గ్రామాల సమగ్ర అభివృద్ధి ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు.
- సమాధానం: 1
38. ఇటీవల ప్రకటించిన సాహిత్య అకాడమీ అవార్డులు - 2017లో తెలుగు విభాగంలో పురస్కారానికి ఎంపికైన రచయిత ఎవరు ?
1) రమేశ్ కుంతల్ మేఘ్
2) దేవీ ప్రియ
3) మమంగ్ దాయ్
4) టీపీ అశోక
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ కవి, రచయిత దేవీప్రియ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - 2017కు ఎంపికయ్యారు. తెలుగులో ఆయన రచించిన పద్యకావ్యం ‘‘గాలిరంగు’’గాను ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద రచనగా తెలుగు నుంచి వెన్న వల్లభరావు అనువదించిన విరామం ఎరుగని పయనం రచనకు అవార్డు లభించింది.
- సమాధానం: 2
39. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ నుంచి లీడర్ ఆఫ్ ది ఇయర్ - 2017 పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు ?
1) కె తారకరామారావు
2) నారా లోకేశ్
3) హరీశ్ రావు
4) కల్వకుంట్ల కవిత
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ నుంచి లీడర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. పట్టణ మౌళిక వసతుల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ మరో అవార్డు గెలుచుకుంది.
- సమాధానం: 1
40. అంతర్జాతీయ టీ 20ల్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ నెలకొల్పిన వేగవంతమైన సెంచరీ రికార్డుని ఇటీవల సమం చేసిన భారత బ్యాట్స్‌మెన్ ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) రిషబ్ పంత్
3) రోహిత్ శర్మ
4) శిఖర్ ధావన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: డిసెంబర్ 22న ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో సాధించిన వేగవంతమైన సెంచరీ రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు.
- సమాధానం: 3
41. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం తమ పౌరులకు హిందీలో ఈ-మెయిల్ ఐడీలను అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది ?
1) ఉత్తరప్రదేశ్
2) రాజస్తాన్
3) గుజరాత్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోనే తొలిసారిగా రాజస్తాన్ ప్రభుత్వం తమ పౌరులకు హిందీలో ఈ - మెయిల్ ఐడీలను అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. name@rajasthan.bharat ద్వారా ఆ రాష్ట్ర పౌరులు హిందీ మెయిల్ ఐడీలను పొందవచ్చు. ప్రభుత్వ పథకాలు, సేవలను స్థానిక భాషలో అందుబాటులో ఉంచేందుకు రాజస్తాన్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
- సమాధానం: 2
42. 4వ భారత్-ఆస్ట్రేలియా-జపాన్ త్రైపాక్షిక చర్చలు ఇటీవల ఏ నగరంలో జరిగాయి ?
1) న్యూఢిల్లీ
2) కాన్ బెర్రా
3) టోక్యో
4) మెల్ బోర్న్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 4వ భారత్-ఆస్ట్రేలియా-జపాన్ త్రైపాక్షిక చర్చలు ఇటీవల న్యూఢిల్లీలో జరిగాయి. భారత విదేశాంగ కార్యదర్శి డాక్టర్ ఎస్ జైశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ కార్యదర్శి ఫ్రాన్సెస్ ఆడమ్ సన్, జపాన్ విదేశాంగ వ్యవహారాల ఉపమంత్రి షిన్ షుకే జే సుగియామాలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో శాంతి, ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధి వెల్లివిరిసేందుకు కృషి చేస్తామని మూడు దేశాలు మరోసారి స్పష్టం చేశాయి.
- సమాధానం: 1
43. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఏ నది వెంట ఉన్న నగరాల్లో ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం, అమ్మకం, తయారీపై పూర్తిగా నిషేధం విధించింది ?
1) గోదావరి
2) గంగా
3) కృష్ణా
4) బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉత్తరాఖండ్‌లోని గంగా నది వెంట ఉన్న నగరాల్లో ప్లాస్టిక్ బ్యాగులు, ప్లేట్లు, స్పూన్ల వినియోగం, అమ్మకం, తయారీపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల పూర్తిగా నిషేధం విధించింది. గంగా నది కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 2
44. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఎప్పటిలోగా వంద శాతం ఎల్ఈడీ లైట్లను అమర్చనున్నారు ?
1) 2018 మార్చి
2) 2019 జనవరి
3) 2020 మార్చి
4) 2021 జనవరి
- View Answer
- సమాధానం: 1
వివరణ: విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు, రైల్వే క్వార్టర్స్‌లో 2018 మార్చిలోగా వంద శాతం ఎల్ఈడీ లైట్లను అమర్చనున్నారు. దీని ద్వారా భారతీయ రైల్వేకు విద్యుత్ చార్జీల రూపంలో ఏటా 180 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి.
- సమాధానం: 1
45. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, ప్రమోషన్ కోసం నీతిఆయోగ్ ఎన్ని కోట్ల రూపాయలతో మీథనాల్ ఎకనామీ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది ?
1) రూ. 1000 - 2000 కోట్లు
2) రూ. 2000 - 3000 కోట్లు
3) రూ. 3000 - 4000 కోట్లు
4) రూ. 4000- 5000 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: కాలుష్య రహిత ఇంధనంగా గుర్తింపు పొందిన మీథనాల్ ఉత్పత్తి కోసం నీతి ఆయోగ్ రూ. 4000 - 5000 వేల కోట్లతో మీథనాల్ ఎకనామీ ఫండ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నిధితో మీథనాల్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తుంది. బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే తొలి మీథనాల్ ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్లో కోల్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది.
- సమాధానం: 4
46. లోక్‌సభలో ఇటీవల ఆమోదం పొందిన భారత అటవీ(సవరణ) బిల్లు - 2017 ప్రకారం ఏ చెట్టుని వృక్షాల జాబితా నుంచి తొలగించారు ?
1) వెదురు
2) వేప
3) టేకు
4) తుమ్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగిస్తు కేంద్ర ప్రభుత్వం భారత అటవీ చట్టం 1927కు సవరణ చేస్తు నవంబర్‌లో ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది. ఇటీవల ఈ ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టిన భారత అటవీ(సవరణ) బిల్లు - 2017 లోక్‌సభలో ఆమోదం పొందింది. కొత్త బిల్లులోని నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతం కాని చోట్ల పెరిగే వెదురు చెట్లను నరకడానికి, రవాణా చేయడానికి అనుమతులు అక్కర్లేదు.
- సమాధానం: 1
47. రఖైన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటీవల మయన్మార్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) భారత్
2) ఆఫ్గనిస్తాన్
3) శ్రీలంక
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్ర అభివృద్ధి కోసం భారత్‌తో ఆ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్, మయన్మార్ సంక్షేమ శాఖ డిప్యుటి మంత్రి యూ సో ఆంగ్లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యాల జనాభా అధికంగా ఉంటుంది. ఇటీవల ఆ దేశంలో చెలరేగిన అల్లర్ల కారణంగా లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వలస వెళ్లారు.
- సమాధానం: 1
48. ఎఫ్ఎం రేడియో ప్రైవేటైజేషన్ ఫేస్ - 3లో భాగంగా ఎన్ని చానళ్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది ?
1) 583
2) 683
3) 783
4) 483
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎఫ్ఎం రేడియో ప్రైవేటైజేషన్ ఫేస్ - 3 లో భాగంగా 236 నగరాల్లో 683 చానళ్ల వేలానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. వీటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 1,100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. అలాగే ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో 10 వేల మంది ఉపాధి లభిస్తుంది.
- సమాధానం: 2
49. తేళ్ల జాతిలో కొత్త రకం స్కాలెర్స్ వుడ్ స్కార్పియన్లను ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు ?
1) బిహార్
2) కేరళ
3) త్రిపుర
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: త్రిపురలోని త్రిష్ణ అటవీ జంతువుల సంరక్షణ కేంద్రంలో కొత్త రకం తేళ్లను గుర్తించారు. ప్రపంచంలో అటవీ జంతువులపై విస్తృత పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త జార్జ్ స్కాలెర్ పేరుని ఈ తేళ్లకు పెట్టారు.
- సమాధానం: 2
50. కల్తీ మద్యం అమ్మి అమాయక ప్రజల మరణానికి కారుకలయ్యే వారికి మరణశిక్ష విధించే బిల్లుని ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది ?
1) తెలంగాణ
2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కల్తీ మద్యం అమ్మి ప్రజల మరణానికి కారకులయ్యే వారికి మరణ శిక్ష విధించే బిల్లుకి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపింది. యూపీ ఎక్సైజ్ (సవరణ) బిల్లు - 2017 ప్రకారం కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధం ఉన్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
- సమాధానం: 2