కరెంట్ అఫైర్స్ (అక్టోబర్ 1- 8)బిట్ బ్యాంక్
1. జాతీయ బయోఎకానమీ మిషన్ (National Mission on Bioeconomy) ను ఎక్కడ ప్రారంభించారు?
1) షిల్లాంగ్
2) పాట్నా
3) గ్యాంగ్‌టక్
4) డెహ్రడూన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో రిసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ‘జాతీయ బయో ఎకానమీ మిషన్’ను షిల్లాంగ్‌లో ప్రారంభించింది. ప్రసుత్తం సమాజం ఎదుర్కొనే సవాళ్లకు నూతన పరిష్కారాలు కనుగొనటం లక్ష్యంగా ఈ మిషన్‌ను ప్రారంభించారు.
- సమాధానం: 1
2. ఇండియా ఇంటర్నేషనల్ టీ కన్వెన్షన్ ఎక్కడ నిర్వహించారు?
1) సిమ్లా
2) గౌహతి
3) ఊటీ
4) నైనిటాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ కన్వెన్షన్‌ను Tea Board of India, ది యునెటైడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సదరన్ ఇండియా సంయుక్తంగా ఊటీలో నిర్వహించాయి.
- సమాధానం: 3
3. ఇటీవల UNO విడుదల చేసిన ఆరోగ్య ఇండెక్స్ 2016లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) ఫిన్లాండ్
2) స్వీడ న్
3) సింగపూర్
4) ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: యుఎన్ఓ 188 దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి Health index 2016 ను తయారు చేసింది. ఈ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉంది. తర్వాత స్థానాల్లో సింగపూర్, స్వీడన్, ఫిన్లాండ్ ఉన్నాయి. ఈ నివేదికలో ఇండియా 143వ స్థానంలో, పాకిస్తాన్ 149వ స్థానంలో, బంగ్లాదేశ్ 151వ స్థానంలో ఉన్నాయి. చివరి స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది.
- సమాధానం: 4
4. ప్రపంచంలో అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌ను ప్రారంభించిన దే శం ఏది?
1) ఆస్ట్రేలియా
2) చైనా
3) కెనడా
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: విశ్వం, ఉల్కలు, ఇతర అంతరిక్ష వస్తువుల అధ్యయనంలో ఉపయోగించే రేడియో టెలిస్కోప్‌ను చైనా 180 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించింది.
- సమాధానం: 2
5. ప్రపంచంలో అతి చిన్న వయస్సులో వాణిజ్య విమానం నడిపిన పైలట్ ఎవరు?
1) బెస్సి కొల్మ్న్
2) కెట్ మెక్విలియయ్స్
3) అమిజాన్సన్
4) టామిడక్ వర్త్
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్రిటన్‌కు చెందిన 26 సంవత్సరాల కెట్ మెక్‌విలియమ్స్ కెప్టెన్‌గా విమానంను నడిపి, ప్రపంచంలో అతిచిన్న వయస్సులో విమానం నడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
- సమాధానం: 2
6. ఏసియన్ జూనియర్ వ్యక్తిగత స్క్వాష్ ఛాంపియన్ షిప్ U - 19 టైటిల్ విజేత ఎవరు?
1) తుషార్ షాని
2) మహమ్మద్ ఆల్ సర్రాజ్
3) వి.సెంథిల్ కూమార్
4) అబ్దుల్ బారీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: కౌలాలంపూర్‌లో జరిగిన U - 19 Asian Junior Squash Individual Championships లో జోర్డాన్‌కు చెందిన మహమ్మద్ ఆల్ సర్రాజ్ను ఓడించి వి.సెంథీల్ కూమార్టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 3
7. ఇటీవల ప్రపంచ వ్యాపార సంస్థ విడుదల చేసిన ఆర్థిక నివేదిక ప్రకారం ప్రపంచ వృద్ధి రేటు ఎంత?
1) 1.7%
2) 2.0%
3) 2.5%
4) 3.0%
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ వ్యాపార సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు బ్రెగ్జిట్ ప్రభావం వలన ప్రపంచ వృద్ధి 1.7% ఉంటుంది అని ప్రపంచ వ్యాపార సంస్థ ప్రకటించింది.
- సమాధానం: 1
8. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక 2016 ప్రకారం ప్రపంచంలో ఎంత మంది కాలుష్య వాతవరణంలో నివసిస్తున్నారు?
1) 43%
2) 66%
3) 79%
4) 92%
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 92% ప్రజలు లేదా ప్రతి 10 మందిలో 9 మందికాలుష్య వాతవరణంలో జీవిస్తున్నారు. గాలి కాలుష్యం వల్ల అతి ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశం తుర్క్మెనిస్థాన్. ఇండియాలో 75% మంది రోగులు గుండె, ఊపిరితిత్తుల క్యాన్సర్ ద్వారానే చనిపోతున్నారు.
- సమాధానం: 4
9. 2026లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది?
1) జపాన్
2) చైనా
3) ఇండియా
4) మంగోలియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2026లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం జపాన్. ఈ దేశం ఆసియా క్రీడలు నిర్వహించటం ఇది మూడోసారి.
- సమాధానం: 1
10. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో కార్బన్ ఉద్గారాలు వెలువర్చని ఏకైక ఎయిర్ పోర్ట్ ఏది?
1) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం
2) బీజింగ్ ఎయిర్ పోర్ట్
3) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం
4) బండారు నాయకే అంతర్జాతీయ విమానశ్రయం
- View Answer
- సమాధానం: 3
వివరణ: కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికిఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో 7.84 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 3
11. రాష్ట్రంలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించటం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) గూగుల్
2) మైక్రోసాఫ్ట్
3) నాసా
4) ఇస్రో
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇస్రో సహాయంతో 2016 అక్టోబర్ 14న తెలంగాణలోని 6000 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్ మన టి.వి.
- సమాధానం: 4
12. ఇటీవల క్యూబా ఏ దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకుంది?
1) యుఎస్ఏ
2) రష్యా
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 60వ అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ సాధారణ సమావేశం వియన్నాలో జరిగింది. ఈ సమావేశంలో క్యూబా, రష్యాతో శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఒప్పందంను కుదుర్చుకుంది.
- సమాధానం: 2
13. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ప్రాంతంను ‘మీజిల్స్’ రహిత ప్రాంతంగా ప్రకటించింది?
1) ఇండియా
2) ఆస్ట్రేలియా
3) దక్షిణాఫ్రికా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో మీజిల్స్‌ను పూర్తిగా నిర్మూలించిన మొట్టమొదటి ప్రాంతం అమెరికా. 2014లో ప్రపంచ వ్యాప్తంగా మీజిల్స్ వల్ల 1,15,000 పిల్లలు మరణించారు.
- సమాధానం: 4
14. ఇండియాలో అత్యంత సంపన్న నగరం ఏది?
1) ముంబయి
2) న్యూఢిల్లీ
3) కోల్‌కతా
4) చెన్నై
- View Answer
- సమాధానం: 1
వివరణ: న్యూవరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం ఇండియాలో అత్యంత సంపన్న నగరం ముంబయి. ఈ నగరం సంపద విలువ 820 బిలియన్ డాలర్లు. ముంబయి తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి.
- సమాధానం: 1
15. ప్రతిష్టాత్మక లతా మంగేష్కర్ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) రమేష్ నాయుడు
2) బప్పిలహరి
3) ఉత్తమ్ సింగ్
4) విజయ్ భరద్వాజ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘లతా మంగేష్కర్’ జీవితకాల సాఫల్య పురస్కారానికి సంగీత దర్శకుడు ఉత్తమ్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద రూ.5,00,000 నగదు బహుమతి, ఒక ప్రశంసాపత్రం, ట్రోఫీ, శాలువాతో సత్కారిస్తారు.
- సమాధానం: 3
16. 35వ కోస్ట్‌గార్డ్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు?
1) ముంబయి
2) ఢిల్లీ
3) విశాఖపట్నం
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ 35వ కోస్ట్‌గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించారు.
- సమాధానం: 2
17. మౌంట్ బరుజరి (Mount Barujari) అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?
1) అండమాన్
2) వియత్నాం
3) న్యూజిలాండ్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇటీవల ఇండోనేషియాలోని మౌంట్ బరుజరి అగ్ని పర్వతం బద్దలయింది.
- సమాధానం: 4
18. 70వ గ్లెన్‌మార్క్ జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) రాంచీ
2) రాయ్‌పూర్
3) పాట్నా
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, జార్ఖండ్ స్విమ్మింగ్ అసోసిమేషన్ సంయుక్తంగా 70వ గ్లెన్‌మార్క్ సీనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్‌ను రాంచీలో నిర్వహించాయి. ఈ క్రీడల్లో అతి ఎక్కువ పతకాలు గెలుచుకున్న రాష్ట్రం కర్ణాటక.
- సమాధానం: 1
19. 18వ ప్రపంచ క్రిమినాలజీ కాంగ్రెస్‌ను నిర్వహించనున్న దేశం ఏది?
1) ఇండియా
2) చైనా
3) సింగపూర్
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 18వ ప్రపంచ క్రిమినాలజీ కాంగ్రెస్‌ను డిసెంబర్ 15-19 వరకు హర్యానాలోని సోనిపేట్‌లో OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ క్రిమినాలజీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఇతివృత్తం: పట్టణీకరణ, ప్రపంచీకరణ, అభివృద్ధి, నేరాలు, అవకాశాలు, 21వ శతాబ్దంలో సవాళ్ళు.
- సమాధానం: 1
20. ప్రతిష్టాత్మక మూర్తిదే వి పురస్కారం 2015నకు ఎంపికైంది ఎవరు?
1) అంపశయ్య నవీన్
2) స్కైబాబా
3) కొలకలూరి ఇనాక్
4) తిరుమల్ రావ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1944లో సాహు శాంతి ప్రసాద్ జైన్ భారతీయ జ్ఞాన్‌పీఠ్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. శాంతి ప్రసాద్ జైన్ తన తల్లి మూర్తిదేవి పేరు మీద ఆధునిక భాషల్లో అత్యుత్తుమ రచనలు చేసిన వారిని గౌరవించటం కోసం ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. మూర్తిదే వి పురస్కారం కింద రూ.1 లక్ష నగదు ప్రదానం చేస్తారు. కొలకలూరి ఇనాక్ రాసిన ‘ఆనంత జీవనం’ నవలకు ఈ పురస్కారం లభించింది.
- సమాధానం: 3
21. ఇటీవల సుగంధ ద్రవ్యాల ఆహారోత్సవం ఎక్కడ ప్రారంభించారు?
1) సేలం
2) కొచ్చి
3) మహే
4) కరైకల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: యునెస్కో, పర్యాటక శాఖ సంయుక్తంగా సుగంధ్ర ద్రవ్యాల ఆహారోత్సవాన్ని కొచ్చిలో నిర్వహించాయి.
- సమాధానం: 2
22. అమృత్ నగరాల అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) కేరళ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమృత్ నగరాల అభివృద్ధిలో తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఛండీఘర్ మొదటి స్థానంలో ఉన్నాయి. న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా సానిటేషన్ కాన్ఫరెన్స్’లో స్మార్ట్ నగరాలు, అమృత్ నగరాల అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు బహుమతులు ప్రదానం చేశారు.
- సమాధానం: 4
23. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 1
2) అక్టోబర్ 4
3) అక్టోబర్ 6
4) అక్టోబర్ 10
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1990లో ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న వృద్ధుల దినోత్సవాన్నిజరుపుకోవాలని నిర్ణయించింది. మొట్టమొదటిగా అక్టోబర్ 1, 1991లో వృద్ధుల దినోత్సవంను నిర్వహించారు.
- సమాధానం: 1
24. ‘అభానేరి’ ఉత్సవాలు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1) అస్సాం
2) జార్ఖండ్
3) రాజస్తాన్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధి చేయటం కోసం రాజస్తాన్‌లోని దౌసా జిల్లా అభానేరి గ్రామంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తోలు బొమ్మలాట, రావణవధ, షెహనాయి వంటి స్థానిక కళా రూపాలను ప్రదర్శిస్తారు.
- సమాధానం: 3
25. ఇటీవల ఏ బ్యాంక్ ‘హోప్ లోన్స్’ పేరుతో తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే పథకం ప్రారంభించింది?
1) ఐసీఐసీఐ
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) విజయ బ్యాంక్
4) ఎస్బీఐ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎస్బీఐ ‘హోప్ లోన్స్’ పేరుతో అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే పథకంను ప్రారంభించినది. ఈ పథకం కింద గృహరుణాలుమహిళలకు 9.25%, పురుషులకు 9.30% తో ఇస్తారు.
- సమాధానం: 4
26. అంత ర్జాతీయ అహింస దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 7
2) అక్టోబర్ 5
3) అక్టోబర్ 2
4) సెప్టెంబర్ 31
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2004లో ఇరాన్ దేశపు నోబెల్ అవార్డు గ్రహిత షిరిన్ ఎబాది మొదటి సారిగా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించాలని UNO కు సూచించాడు. 2007లో ఐక్యరాజ్యాసమితి అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింస దినంగా ప్రకటించింది.
- సమాధానం: 3
27. ప్రపంచ ఆవాస దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ చివరి సోమవారం
2) అక్టోబర్ మొదటి సోమవారం
3) అక్టోబర్ రెండో సోమవారం
4) అక్టోబర్ చివరి సోమవారం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1986లో మొదటి సారిగా ఐక్యరాజ్య సమితి అక్టోబర్ మొదటి సోమవారంను పపంచ ఆవాస దినోత్సవంగా నిర్వహించింది. 2016 ఇతివృత్తం - హౌజింగ్ ఎట్ ది సెంటర్.
- సమాధానం: 2
28. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి అధ్యక్షుడుగా ఎవరు ఎంపికయ్యారు?
1) అఖిలా ఉరంకర్
2) కె.బాలాజీ
3) సోమేష్ శర్మ
4) శరద్ సక్సేనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016 - 17 సంవత్సరానికి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్రమాత్ సప్తహిక్ (Rashtradoot Saptahik) ఎడిటర్ సోమేష్ శర్మ ఎంపికయ్యాడు.
- సమాధానం: 3
29. 56వ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్
2) నాగ్‌పూర్
3) కాన్పూర్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: 56వ ఓపెన్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ క్రీడల్లో జావెలిన్ త్రోను 60 మీ. దూరం విసిరి ‘అనురాణి’ జాతీయ రికార్డును నెలకొల్పింది.
- సమాధానం: 4
30. ప్రపంచ జంతువుల దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 4
2) అక్టోబర్ 7
3) అక్టోబర్ 11
4) అక్టోబర్ 14
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1925లో మొదటిసారి ప్రపంచ జంతువుల దినోత్సవంను బెర్లిన్‌లో ‘హెయిన్ రీచ్’ అనే జర్మన్ రచయిత ప్రారంభించారు.
- సమాధానం: 1
31. అండర్ - 18 ఆసియా కప్ పురుషుల హాకీ ట్రోఫీ విజేత ఎవరు?
1) బంగ్లాదేశ్
2) భూటాన్
3) భారత్
4) బర్మా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఢాకాలో జరిగిన 4వ అండర్ 18 ఆసియాకప్ పురుషుల ట్రోఫీలో బంగ్లాదేశ్‌ను ఓడించి, ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో ‘బెస్ట్ గోల్ కీపర్’ టైటిల్‌ను పంకజ్ కమార్ రజక్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
32. బ్రిక్స్ దేశాల విద్యా సదస్సు 2016లో ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) కజన్
3) నేపాల్
4) షాంఘై
- View Answer
- సమాధానం: 1
వివరణ: నాల్గో బ్రిక్స్ దేశాల విద్యా సదస్సును న్యూఢిల్లీలో నిర్వహించారు. బ్రిక్స్దేశాల విద్యామంత్రులు ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ పై సంతకాలు చేశారు. బ్రిక్స్ దేశాల్లో ప్రజలకు అత్యుత్తమ విద్యను అందిచ టం న్యూఢిల్లీ డిక్లరేషన్ లక్ష్యం.
- సమాధానం: 1
33. ప్రపంచంలో సమాచార హక్కు చట్టం అమలులో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) ఇండియా
2) సెర్బియా
3) మెక్సికో
4) స్లోవెనియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: సమాచార హక్కు చట్టం అమలులో అత్యుత్తమ చట్టాలు చేసిన మొదటి దేశం మెక్సికో, తర్వాతి స్థానాల్లో సెర్బియా, స్లోవెనియా ఉన్నాయి. నాల్గో స్థానంలో ఇండియా ఉంది.
- సమాధానం: 3
34. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆదాయ వెల్లడి పథకం’ కింద ఎన్ని కోట్ల నల్లధనం వెల్లడించారు?
1) రూ.10,250 కోట్లు
2) రూ.30,250 కోట్లు
3) రూ.45,250 కోట్లు
4) రూ.65,250 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐడీఎస్ కింద పజలురూ.65,250 కోట్లు నల్లధనంను వెల్లడించారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీప్రకటించాడు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికిరూ.30,000 కోట్లు ఆదాయం లభిస్తుంది.
- సమాధానం: 4
35. స్వచ్ఛ భారత్ పురస్కారాల్లో ‘అతి శుభ్రమైన చారిత్రక ప్రదేశం’ పురస్కారం పొందిన ప్రాంతం ఏది?
1) ఎల్లోరా గుహలు
2) రాణికివావ్
3) ఖండగిరి గుహలు
4) ఉండవల్లి గుహలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: గుజరాత్‌లోని పఠాన్ అనే ప్రాంతంలో రాణికి వావ్ ఉంది. ఈ ప్రాంతం ఇండియాలో అతి శుభ్రమైన చారిత్రక ప్రదేశంగా ఎంపికైనది. 900 సంవత్సరాల చరిత్ర గల రాణికి వావ్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో 2014లో చేర్చింది. ఇండియాలో అతిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా సూరత్ రైల్వే స్టేషన్ ఎంపికైంది.
- సమాధానం: 2
36. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు?
1) అక్టోబర్ 4 - 10
2) అక్టోబర్ 5 - 11
3) అక్టోబర్ 8 - 14
4) అక్టోబర్ 10 - 18
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2016 ఇతివృత్తం: రిమోట్ సెన్సింగ్ : ఎనేబ్లింగ్ అవర్ ఫ్యూచర్
- సమాధానం: 1
37. కొలియా అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?
1) చిలీ
2) ఈక్వెడార్
3) మెక్సికో
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: మెక్సికోలో క్రియాశీలక అగ్ని పర్వతం కొలియా ఇటీవల బద్దలయింది. ఈ అగ్ని పర్వతం1585 నుంచి ఇప్పటి వరకు 30 సార్లు బద్దలైంది.
- సమాధానం: 3
38. బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ‘స్థానికంగా పుష్పించే’ మొక్కల జాతులు ఎక్కువ గల రాష్ట్రం ఏది?
1) కేరళ
2) తమిళనాడు
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
వివరణ: BSI ప్రకారం పుష్పించే మొక్కల జాతులు అతి ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో (410) ఉన్నాయి. తర్వాత స్థానంలో కేరళ (357), మహారాష్ట్ర (278)ఉన్నాయి. దేశంలో రెండు బయోడైవర్సిటీ హాట్ స్పాట్లు ఉన్నాయి. అవి పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలు.
- సమాధానం: 2
39. అత్యంత కఠినమైన పరుగు పందెం ‘స్పార్టాద్లాన్’ను పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు?
1) స్టీఫెన్ డిసౌజా
2) తింటూ లక్రా
3) గౌరవ్ అరోరా
4) కిరన్ డిసౌజా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలో అతి కష్టమైన పరుగు పందెం స్పార్టాద్లాన్. ఈ పందెంలో స్పార్టా నుంచి ఎథెన్స్ వరకు 246.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. ఈ పరుగును పూర్తి చేసిన మొదటి భారతీయుడు కిరన్ డిసౌజా.
- సమాధానం: 4
40. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 5
2) సెప్టెంబర్ 30
3) అక్టోబర్ 5
4) అక్టోబర్ 7
- View Answer
- సమాధానం: 3
వివరణ: యునెస్కో ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంను నిర్వహించాలని తీర్మానించింది. మొదటిసారిగా 1994 అక్టోబర్ 5న నిర్వహించింది.
- సమాధానం: 3
41. 5వ బౌద్ధమత అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) అజంతా - ఎల్లోరా
2) వారణాసి - సారనాథ్
3) ఎలిఫెంటా - బెలుంగుహలు
4) సాంచి - గయ
- View Answer
- సమాధానం: 2
వివరణ: బౌద్ధ మతం ఇండియాలో పుట్టి, ఆసియాలోని అనేక దేశాల్లో విస్తరించింది. బౌద్ధమత యాత్రికులను భారతదేశానికి ఆకర్షించటం కోసం 5వ బౌద్ధ మత అంతర్జాతీయ సమావేశంను వారణాసిలోని సారనాథ్‌లో అక్టోబర్ 2 నుంచి 6 వరకు నిర్వహించారు. ఈ సమావేశంను కేంద్ర పర్యాటక రంగ శాఖ, ఉత్తర ప్రదేశ్, బీహర్ రాష్ట్రాల సహకారంతో నిర్వహించింది.
- సమాధానం: 2
42. ప్రపంచంలో నాల్గో అతి పెద్ద మతం ఏది?
1) షింటో మతం
2) జైన మతం
3) బౌద్ధ మతం
4) జుడాయిజం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలో అతి పెద్ద మతం క్రైస్తవ మతం. ప్రపంచంలో 2.3 బిలియన్ ప్రజలు క్రైస్తవ మతంను అవలంబిస్తున్నారు. రెండో స్థానంలో ఇస్లాం (1.6 బిలియన్), మూడో స్థానంలో హిందుమతం (1 బిలియన్), నాల్గో స్థానంలో బౌద్ధ మతం (50 మిలియన్లు) అవలంబిస్తున్నారు. ప్రపంచంలో 7% ప్రజలు బౌద్ధ మతంను అవలంబిస్తున్నారు.
- సమాధానం: 3
43. ఇటీవల స్టూడెంట్ క్రెడిట్ కార్డ్‌లు ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) బీహార్
2) తెలంగాణ
3) మధ్య ప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇంటర్ విద్యను పూర్తి చేసి, ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బీహార్ ప్రభుత్వం విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటానికి ఈ పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రూ.4 లక్షలు రుణాన్ని అందిస్తారు.
- సమాధానం: 1
44. వైద్య రంగంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) కెన్నెతే ఆర్. మిల్లర్
2) రోనాల్డ్ ప్లాస్ట్ర్క్
3) ప్యాట్రిక్ బెట్స్న్
4) యోశినోరి ఓసుమి
- View Answer
- సమాధానం: 4
వివరణ: జపాన్‌కు చెందిన కణ బయాలజీ శాస్త్రవేత్త యోశినోరి ఓసుమి (Yoshinori Ohsumi) కణ స్వభావం మీద చేసిన పరిశోధనలకుగాను వైద్య రంగంలోనోబెల్ పురస్కారానికి ఎంపికయ్యాడు.
- సమాధానం: 4
45. ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ’ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) నితీష్ కుమార్
2) కె.తారక రామారావు
3) నారా లోకేష్
4) అఖిలేష్ యాదవ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: డిజిటల్ విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకరావడానికి కృషి చేసిన ప్రభుత్వ సంస్థలు, అధికారులను గౌరవించటానికి సెర్టిపోర్ట్ సంస్థ ఈ పురస్కారంను నెలకొల్పింది. ఈ పురస్కారానికి కేటీఆర్ తో పాటు, నైజీరియా కమ్యూనికేషన్ మంత్రి అబ్దుల్ రహిమ్ షిత్తూ కుడా ఎంపికైనాడు.
- సమాధానం: 2
46. మిసెస్ ఇండియా ఎర్త్ 2016 అందాల పోటీలో విజేతగా నిలిచింది ఎవరు?
1) పరిన్ కేశ్వాని
2) ప్రనీత్ గర్వాల్
3) రోషిణి హసన్
4) రాశి యాదవ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పూణెకు చెందిన 29 సంవత్సరాల పనీత్ గర్వాల్మిసెస్ ఇండియా ఎర్త్ 2016 అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో పరిస్ కేశ్వాని, రోషిణి హసన్ నిలిచారు.
- సమాధానం: 2
47. మలేషియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ విజేత ఎవరు?
1) నికో రోస్‌బర్గ్
2) సెబాస్టియన్ వెటల్
3) డేనియల్ రిక్కియార్డో
4) మాక్స్ వర్ట్సపెన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రెడ్‌బుల్ డ్రైవర్ డేనియల్ రిక్కియార్డ్ మలేషియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
- సమాధానం: 3
48. కొరియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ విజేత ఎవరు?
1) గగన్ జీత్ బుల్లర్
2) కె.జె.చోయి
3) కెవిన్ నా
4) చార్లి వై
- View Answer
- సమాధానం: 1
వివరణ: కొరియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ 2016ను గగన్ జీత్ బుల్లర్ గెలుచుకున్నాడు. విజేతకు 1,96,000 డాలర్లు నగదు బహుమతి లభిస్తుంది.
- సమాధానం: 1
49. దేశంలో కిరోసిన్ పంపిణీ కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకంను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) గుజరాత్
3) జార్ఖండ్
4) అసోం
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో ఇప్పటి వరకు ఆహార వస్తువులకు, గ్యాస్‌కు మాత్రమే నగదు బదిలీ పథకం ఉంది. జార్ఖండ్ రాష్ట్రం కిరోసిన్‌ని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కిందకు తెచ్చిన మొదటి రాష్ట్రంగా నిలిచింది.
- సమాధానం: 3
50. యాంగూన్‌లో తన తొలి శాఖను ఏర్పాటు చేసిన భారతీయ బ్యాంకు ఏది?
1) విజయ బ్యాంక్
2) ఎస్బీఐ
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) అలహాబాద్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎస్బీఐ యాంగూన్‌లో తన తొలి శాఖను ఏర్పాటు చేసింది. విదేశాల్లో ఎస్బీఐ ఏర్పాటు చేసుకున్న 54వ శాఖ యాంగూన్ శాఖ. ఘన శ్యామ్ శ్రీవత్సవ్ను యాంగూన్ శాఖకు ముఖ్య అధికారిగా నియమించారు.
- సమాధానం: 2