కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 9 - 16) బిట్ బ్యాంక్
1. 16వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2017ను ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) జకార్తా
3) లండన్
4) పారిస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను ఆగస్ట్ 9 - 13 వరకు లండన్లోనిర్వహించారు. ఇందులో జస్టిస్ గాట్లిన్ స్వర్ణం, ఉసేన్ బోల్ట్ కాంస్య పతకం పొందారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేలా 1983లో ప్రారంభించిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను 1991 నుంచి రెండు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 3
2. తెలంగాణలోని చేనేత, హస్తకళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పనకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు?
1) పేటీఎం
2) అమెజాన్
3) ఫ్లిప్‌కార్ట
4) స్నాప్‌డీల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలంగాణలోని చేనేత, హస్తకళల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెట్ కల్పనకు తెలంగాణ ప్రభుత్వం అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఉత్పతులు లిస్ట్ చేయడం వంటి అంశాలపై నేత కార్మికులు, హస్తకళల నిపుణులకు అమెజాన్ శిక్షణ ఇస్తుంది.
- సమాధానం: 2
3. బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణరాష్ర్ట ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) మైక్రోసాఫ్ట్
2) రిలయన్స్ హెల్త్
3) మోడి హెల్త్
4) అరవింద్ ఫార్మా
- View Answer
- సమాధానం: 1
వివరణ: మైక్రోసాఫ్ట్క్లౌడ్ బేస్డ్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ సహాయంతో బాల బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. దీనితో పాటు బాలల్లో అంధత్వాన్ని నివారించేందుకు Microsoft Intelligent Network for Eyecare (MINE) కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
- సమాధానం: 1
4. మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘‘అభయ’’మొబైల్ యాప్‌ను ఏ రాష్ర్టంలో ప్రారంభించారు?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గోవా
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేలా ‘అభయ’ యాప్‌ను రూపొందించారు. ఇందుకోసం తొలి విడతగా 56 కోట్లను కేంద్రం విడుదల చేసింది.
- సమాధానం: 2
5. మాలతీ చందూర్ పురస్కారము-2017నకు ఎంపికైంది ఎవరు?
1) లక్ష్మీ ప్రసాద్
2) తిరుమలమ్మ
3) రామలక్ష్మీ
4) శివరాజు సుబ్బలక్ష్మీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: మాలతీ చందూర్ మరణం తర్వాత ఆమె పేరిట కుటుంబ సభ్యులు 2014లోఈ పురస్కారాన్ని ప్రారంభించారు. ఈ అవార్డుకు ప్రముఖ కథ, నవలా రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మీ ఎంపికయ్యారు.
- సమాధానం: 4
6. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయ జాతీయ పురస్కారమునకు ఎంపికైంది ఎవరు?
1) కె. చంద్రశేఖర్
2) పగిడి సైదులు
3) కంభం వెంకటేశ్
4) పారుపల్లి కృష్ణ ప్రసాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తున్న వైస్సార్ జిల్లా దొరసాని పల్లె హైస్కూల్‌కు చెందిన గణిత ఉపాద్యాయుడు కంభం వెంకటేశ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు.
- సమాధానం: 3
7. 2వ ప్రపంచ ఆప్టోమెట్రి కాంగ్రెస్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) గోవా
2) పాట్నా
3) హైదరాబాద్
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ సమావేశాలను వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రి, ది ఆసియా పసిఫిక్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రి, ఇండియన్ విజన్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్నాయి.
- సమాధానం: 3
8. ఇటీవల ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమితులైనది ఎవరు?
1) అరవింద్ పనగారియ
2) ఎస్.అపర్ణ
3) ఇరా సింఘాల్
4) మేఘనాధో రెడ్డి
- View Answer
- సమాధానం: 2
వివరణ: గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఎస్.అపర్ణ ప్రపంచబ్యాంకు కార్యనిర్వహక డెరైక్టర్‌గా నియమితులయ్యారు.
- సమాధానం: 2
9. UAE నుంచి ప్రతిష్ఠాత్మక సమాజసేవ పురస్కారమునకు ఎంపికైంది ఎవరు?
1) ఫిరోజ్ మర్చంట్
2) అజిమ్ ప్రేమ్‌జీ
3) సైరస్ మిస్త్రీ
4) సి.చంద్రశేఖరన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: UAE జైళ్ళలో జరిమానా కట్టలేని ఖైదీలకు సహాయము చేసినందుకుగాను ఫిరోజ్ మర్చంట్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
- సమాధానం: 1
10. 7వ ఆసియన్ షాట్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో బంగారు పతకం గెలుచుకున్నది ఎవరు?
1) ఖలీద్ అబ్ కబి
2) సైఫ్ అల్ షమ్సీ
3) అంకుర్ మిట్టల్
4) అసబ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారతీయ షూటర్ అంకుర్ మిట్టల్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకున్నాడు. UAE కి చెందిన ఖలీద్ అబ్కబి వెండి పతకం, సైఫ్ అల్ షమ్సీ కాంస్య పతకం గెలుచుకున్నారు.
- సమాధానం: 3
11. International Day of the World's Indigenous Peoples ను ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 6
2) ఆగస్టు 9
3) ఆగస్టు 11
4) ఆగస్టు 13
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా అంతర్జాతీయ స్థానిక ప్రజల దినోత్సవంను జరుపుకోవాలని నిర్ణయించింది. వలసదారులు, స్థానిక ప్రజలను చిత్రహింసలకు గురి చేయకుండా వారిని కాపాడుట ముఖ్య ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం ప్రారభించారు.
- సమాధానం: 2
12. దహి హండి (Dahi Handi) ఉత్సవాలను ఏ రాష్ర్టంలో నిర్వహిస్తారు?
1) కర్ణాటక
2) ఛతీస్త్ఘడ్
3) మధ్యప్రదేశ్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 4
వివరణ: మహారాష్ర్టలో దహి హండి ఉత్సవాలను గోకులాష్టమి రోజున ప్రతిష్ఠాత్మకంగానిర్వహిస్తారు. బాంబే హైకోర్టు 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలు ‘‘దహి హండి’’ ఉత్పవాలలో పాల్గొనకూడదని ప్రకటించింది.
- సమాధానం: 4
13. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ర్టంను ‘కల్లోల ప్రాతం’గా ప్రకటించింది?
1) అస్సోం
2) అరుణాచల్ ప్రదేశ్
3) జమ్ముకాశ్మీర్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సాయుధ దళాల పత్యేకఅధికారాల చట్టం (AFSPA) ప్రకారం ‘‘3’’ నెలల పాటు అస్సోంను పూర్తి కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు.
- సమాధానం: 1
14. 8వ మెకాంగ్-గంగా సహకార మంత్రిత్వశాఖల సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1) కలకత్తా
2) వియోన్షేన్
3) మనీలా
4) హోచిమిన్ సిటీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియా మేకాంగ్ నది పరివాహక ప్రాంతంలోని 5 దేశాలతో కలిసి 2000లో మేకాంగ్ - గంగా సహకార కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. కాంబొడియా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్ మరియు వియత్నాం ఇందులో సభ్యదేశాలు.
- సమాధానం: 3
15. ఏ దేశంలో ముడి చమురు వెలికి తీయుటకు ఓఎన్జీసీ విదేశ్ 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది?
1) కొలంబియా
2) కజికిస్థాన్
3) బంగ్లాదేశ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రస్తుతం ఓఎన్జీసీ కొలంబియాలో రోజుకు 35,000 బ్యారెల్స్ ముడి చమురునువెలికి తీస్తుంది. కజికిస్థాన్కు చెందిన కాస్పియన్ సముద్రం నుంచి ముడి చమురు వెలికి తీయుట ప్రారంభించింది. త్వరలోనే బంగ్లాదేశ్‌లో తన తొలి ముడి చమురు బావిని ఏర్పాటు చేయనుంది.
- సమాధానం: 4
16. ఇటీవల ఆసియా సొసైటీ గేమ్ ఛేంజర్ 2017 పురస్కారంనకు ఎంపికైంది ఎవరు?
1) సల్మాన్ ఖాన్
2) దేవ్ పటేల్
3) అమిషా పటేల్
4) రాజేంద్ర ప్రసాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేవ్ పటేల్ (స్లమ్‌డాగ్ మిలియనీర్ కథానాయకుడు) 2017 సవంత్సరానికి ఆసియా సొసైటీ గేమ్ ఛేంజర్ పురస్కారంనకు ఎంపికయ్యాడు. ఇతను ‘Lion Heart ప్రచార కార్యక్రమం ద్వారా 2,50,000 అమెరికన్ డాలర్ల సేకరించి భారత్‌లో వీధి బాలలకు సహాయం చేస్తున్నాడు. ఆసియా గేమ్ ఛేంజర్ జీవితకాల సాఫల్య పురస్కారంనకు స్విట్జర్లాండ్‌కు చెందిన అగాఖాన్ ఎంపికయ్యాడు.
- సమాధానం: 2
17. ఇటీవల సైకస్ జాతిలో రెండు నూతన మొక్క రకాలను కనుగొన్న సంస్థ ఏది?
1) ఆచార్య జగదీశ్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్
2) IISC బెంగళూరు
3) CCMB, హైదరాబాద్
4) ఇందిరా బొటానికల్ గార్డెన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పశ్చిమ బెంగాల్‌లోని జగదీశ్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్‌కు చెందిన శాస్త్రవేత్తలు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో రెండు రకాల కొత్త సైకస్ జాతులను కనుగొన్నారు. వీటికి cycas Pschannae, cycas dharmraj అని నామకరణం చేశారు.
- సమాధానం: 1
18. దేశంలో తొలి మైక్రో అడవిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) తెలంగాణ
2) చత్తీస్ఘడ్
3) గోవా
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 2
19. ఇటీవల క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా టాయిలెట్లు కలిగి ఉన్నాయి?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) కేరళ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
వివరణ: క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం కేరళ మరియు హర్యానా రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించాయి. ఈ జాబితాలో చిట్ట చివరి స్థానంలో బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
- సమాధానం: 3
20. బంగ్లాదేశ్ భారత్‌లోని ఏ నగరంలో దౌత్య కేంద్రంను ఏర్పాటు చేయనుంది?
1) హైదరాబాద్
2) ముంబయి
3) కోల్‌కతా
4) చెన్నై
- View Answer
- సమాధానం: 4
వివరణ: బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా 17 దౌత్య కార్యలయాలు ఏర్పాటు చేయనుంది. ఇందులో ఒక దౌత్య కార్యాలయం చెన్నైలో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా బంగ్లాదేశ్ పౌరులకుమెడికల్ టూరిజం మరియు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురానుంది.
- సమాధానం: 4
21. ఇటీవల ఖతార్ ఎన్ని దేశాల పౌరులకు వీసా అవసరం లేకుండా ఖతార్‌ను సందర్శించే సదుపాయం కల్పించింది?
1) 80
2) 70
3) 50
4) 20
- View Answer
- సమాధానం:1
22. భారత సుప్రీంకోర్టుకు 45వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ జేఎస్ ఖేహార్
2) జస్టిస్ దీపక్ మిశ్రా
3) జస్టిస్ కార్దన్
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 2
23. ఇటీవల ఏ ప్రాంతంలో ప్లాస్టిక్ బ్యాగులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది?
1) ముంబాయి
2) కోల్‌కతా
3) ఢిల్లీ
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఢిల్లీలో 50 మెక్రాన్ల కంటే తక్కువ మందం గల నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడకం మీద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేదం విధించింది. దీనిని అతిక్రమించిన వారికి రూ.5000 జరిమానా విధిస్తారు.
- సమాధానం: 3
24. ఇటీవల ఫేస్బుక్ యూట్యూబ్‌కి పోటీగా ప్రారంభించిన ‘‘వీడియో’’ షేరింగ్ అప్లికేషన్ పేరు ఏమిటి?
1) యువర్స్ వీడియో
2) వీడియో లైవ్
3) వాచ్
4) హవ్ ఫన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: యూట్యూబ్ కి పోటీగా ఫేస్బుక్ ‘‘వాచ్’’ అనే వీడియో అప్లికేషన్ ను ప్రారంభించింది. ఇందులో వీడియోలు షేర్, లైవ్ స్ట్రీమింగ్‌లో చూడవచ్చు.
- సమాధానం: 3
25. ఏ ప్రాంతానికి చెందిన ‘‘రాయి చేపల’’ ను ప్రపంచంలోనే అరుదైనవిగా ఇటీవల ప్రకటించారు?
1) రియో డిజనిరో
2) ప్రిటోరియా
3) సిడ్నీ
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 4
వివరణ: విశాఖపట్నం పరిసరాలలో కనుగొన్న రాయి చేపల (pseudanthias vizagensis) ను ప్రపంచంలోనే అరుదైనవిగా ప్రకటించారు.
- సమాధానం: 4
26. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఏది?
1) హైదరాబాద్
2) బీజింగ్
3) ఢాకా
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: "ఆసియన్ సిటీస్ - రీజియన్స్ ఔట్లుక్ 2016’’ ను ‘‘ఆక్స్ఫోర్డ ఎకానామిక్స్’’ తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఢిల్లీ. ఆక్స్‌ఫోర్డ్ ఎకనామిక్స్‌ను1981లోప్రారంభించారు. దీనికి లండన్, న్యూయార్క్ మరియు సింగపూర్లలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి.
- సమాధానం: 4
27. తెలంగాణలోని శ్రీరామ్‌సాగర్ అధునికీకరణకు ఎన్ని కోట్లు కేటాయించారు?
1) 2000 కోట్లు
2) 2500 కోట్లు
3) 3500 కోట్లు
4) 5000 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు తెలంగాణ ప్రభుత్వం 2000 కోట్లు కేటాయించింది. దీని ద్వారా కాలువలకు నిరంతర నీటి సదుపాయం కల్పించనున్నారు. ప్రాణహిత నది నీటిని మేడిగడ్డ నుంచి శ్రీరామ్ సాగర్‌కు తరలిస్తారు.
- సమాధానం: 1
28. భారతదేశ ప్రస్తుత పవన శక్తి స్థాపిత సామర్థ్యం ఎంత?
1) 60 మెగావాట్లు
2) 100 గిగావాట్లు
3) 32.5 గిగావాట్లు
4) 32.5 మెగావాట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: పస్తుతం పవనశక్తి స్థాపిత సామర్థ్యం 32.5 గిగావాట్లు. దీనిని 2022లోపు 60 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
- సమాధానం: 3
29. బిమ్స్టెక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) ఖాట్మాండు
3) రంగూన్
4) మనీలా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 15వ బిమ్స్టెక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంను నేపాల్‌లోని ఖాట్మాండులో నిర్వహించారు.
BIMSTEC - Bay of bengal initiative for multi-sectoral Technical and Economic coperation
- సమాధానం: 2
30. జంతువుల కొవ్వుతో తయారు చేసిన బ్యాంక్ నోట్ల రద్దు కుదరదని ప్రకటించిన బ్యాంక్ ఏది?
1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) రాయల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
3) క్యాథలిక్ సిరియన్ బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లడ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: యునెటైడ్ కింగ్ డమ్ యొక్క అధికారిక బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్. ఈ బ్యాంకు విడుదల చేస్తున్న ప్లాస్టిక్ కరెన్సీలో జంతువుల కొవ్వులు వాడకూడదని ఛేంజ్.ఆర్గ్ ద్వారా ఆన్లైన్ పిటీషన్ దాఖలు చేశారు.
- సమాధానం: 4
31. 2016-17 సంవత్సరంలో ఆర్బీఐ భారత ప్రభుత్వానికి ఎంత డివిడెండ్‌ను ప్రకటించింది?
1) రూ.65,876 కోట్లు
2) రూ.56,768 కోట్లు
3) రూ.30,659 కోట్లు
4) రూ.20,597 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016 సంవత్సరంలో ఆర్బీఐ, భారత ప్రభుత్వానికి రూ.65,876 కోట్ల డివిడెండ్‌ను ఇచ్చింది. కానీ పెద్ద నోట్ల (500,1000)రద్దు మరియు 2000 రూపాయల నోటు ముద్రణ వల్ల ప్రభుత్వానికి వచ్చే డివిడెండ్ 30,659 కోట్లకు పడిపోయింది.
- సమాధానం: 3
32. ఇటీవల ఏ యూనివర్సిటీ తమిళ్ మరియు గుజరాతీ భాషల ఆన్లైన్ పదకోశం (డిక్షనరీ)ను ప్రారంభించింది?
1) ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్
2) కేంబ్రిడ్జి యూనివర్సిటీ
3) స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ
4) మేరియమ్ వెబ్‌స్టర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ తమిళ్ మరియు గుజరాతీ భాషల ఆన్లైన్ పదకోశంను ప్రారంభించింది. దీనిని 2015లో మొదలు పెట్టారు.
- సమాధానం: 1
33. UEFA సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న జట్టు ఏది?
1) బార్సిలోనా
2) రియల్ మాడ్రిడ్
3) లివర్‌పూల్ ఎఫ్‌సి
4) ఆర్సెనల్ ఎఫ్‌సి
- View Answer
- సమాధానం: 2
వివరణ: రియల్ మాడ్రిడ్ జట్టు మాంచెస్టర్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించి UEFA సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను గెలుపొందింది. రియల్ మాడ్రిడ్ ఈ టైటిల్‌ను గెలవడం ఇది నాల్గోసారి. విజేతకు 3.2 మిలియన్ యురోలు, రన్నరప్‌కు 2.2 మిలియన్ యురోలు నగదు బహుమతి లభిస్తుంది.
- సమాధానం: 2
34. రోడ్డు భద్రత కోసం ‘‘స్మార్ట స్ట్రీట్ ల్యాబ్ ప్రోగ్రామ్’’ను ప్రారంభించిన రాష్ర్టం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) గోవా
3) తమిళనాడు
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
35. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ 100 అత్యంత విన్నూత కంపెనీల జాబితాలో ఎన్ని భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి?
1) 5
2) 3
3) 2
4) 1
- View Answer
- సమాధానం: 2
వివరణ: గత సంవత్సరం ఫోర్బ్స్ప్రకటించిన ‘‘ప్రపంచ 100 అత్యంత విన్నూత కంపెనీల జాబితాలో భారత్ నుంచి5 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ సంవత్సరం వీటి సంఖ్య 3 కు తగ్గింది. హిందుస్థాన్ లివర్ 7, ఏషియన్ పెయింట్స్ 8 మరియు భారతీ ఎయిర్టెల్ 78 స్థానంలో ఉన్నాయి. జాబితాలో తొలిస్థానంలో సెల్స్పోర్స్.కామ్, తరువాతి స్థానాల్లో టెస్లా మోటార్స్ మరియు అమెజాన్.కామ్ ఉన్నాయి.
- సమాధానం: 2
36. ‘‘ది హిందూ నాటక రచయిత పురస్కారం 2017’’ నకు ఎంపికైంది ఎవరు?
1) అక్షత్ నిగమ్
2) రాజేంద్ర సంగమ్
3) కృష్ణ రాజస్వామి
4) కస్తూరి రంగన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: "In search of Dariya Sagara" రాసినందుకు అక్షత్ నిగమ్మరియు గిరిష్ కేమ్క‘‘ది హిందు’’ పత్రిక నాటక రచయిత పురస్కారంనకు ఎంపికైనారు. దీనిని 2008 లో ప్రారంభించారు. అవార్డు కింద 2 లక్షల నగదు బహుమతి లభిస్తుంది.
- సమాధానం: 1
37. తొలి కేసరి మీడియా పురస్కారంనకు ఎంపికైంది ఎవరు?
1) గిరిష్ కెమని
2) ఆర్.ఎస్.రామచంద్ర
3) టిజెఎస్ జార్జ
4) భారతీ నందా
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేసరి మెమొరియల్ ట్రస్ట్ ఈ పురస్కారంను ప్రారంభించింది. అవార్డు కింద రూ.50,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం మరియు ఒక ప్రతిమను అందజేస్తారు.
- సమాధానం: 3
38. అంతర్జాతీయ యువత దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 25
2) ఆగస్టు 20
3) ఆగస్టు 16
4) ఆగస్టు 12
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1985లో తొలిసారి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యువత దినోత్సవంను ఆగస్టు 12న నిర్వహించింది.
2017 Theme: Youth Building Peace
- సమాధానం: 4
39. ఇటీవల Mt Stok Kangri ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడు ఎవరు?
1) శేఖర్ బాబు
2) కామ్య కార్తికేయన్
3) మాలవత్ పూర్ణ
4) ప్రేమలత అగర్వాల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 9 సంవత్సరాల కామ్య కార్తి కేయన్ (Kaamya karthikeyan) 6,153 మీటర్ల ఎత్తుగల Stok Kangri (కాశ్మీర్) పర్వతంను అధిరోహించి అతి పిన్న వయస్సులో ఈ పర్వతంను అధిరోహించిన బాలికగా గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
40. ఇటీవల సైనికుల పెన్షన్ విధానం పై నియమించిన కమిటీ ఏది?
1) జస్టీస్ మార్కెండేయ కట్జూ
2) బి సి ఖండూరి కమిటీ
3) నానావతి కమిటీ
4) గోస్వామి కమిటీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: మేజర్ జనరల్ బి సి ఖండూరి (రిటైర్డ) నేతృత్వంలో సైనికుల పెన్షన్ విధానం పై కమిటీ వేశారు. సైనికుల మరణాంతరం, వారి భార్యలకు పూర్తి పెన్షన్ ఇవ్వాలి అని కమిటీ సిఫార్సు చేసింది. గతంలో 60% మాత్రమే పెన్షన్ కింద ఇచ్చేవారు.
- సమాధానం: 2
41. ప్రపంచంలో అతి ఎక్కువ నిధులు పొందిన ప్రైవేట్ సంస్థ ఏది?
1) ఫ్లిప్‌కార్ట్
2) అమెజాన్
3) దిది చక్సింగ్
4) ఉబెర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలో అతి ఎక్కువ నిధులు పొందిన ప్రెవైట్ సంస్థ దిది చిక్సింగ్ (Didi chuxing). రెండో స్థానంలో అమెరికాకు చెందిన ఉబెర్, మూడో స్థానంలో ఇండియాకు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ 7 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.
- సమాధానం: 3
42. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆగ్నేయాసియా ప్రాంతంలో రాయబారిగా ఎవరిని నియమించింది?
1) రాజేంద్ర సింగ్ పచేరి
2) సందీప్ పాటిల్
3) ఐశ్వర్యరాయ్ బచ్చన్
4) మిల్కా సింగ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మిల్కాసింగ్ ఆగ్నేయాసియా ప్రాంతంలో అంటువ్యాధులు కాని వ్యాధుల నివారణ మరియు నియంత్రణ గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తారు.
- సమాధానం: 4
43. 7వ ఆసియన్ షాట్న్ ఛాంపియన్‌షిప్‌లో ‘‘స్కీట్’’ విభాగంలో కాంస్యం గెలిచినది ఎవరు ?
1) మహేశ్వరి చౌహన్
2) రష్మీ రాధోర్
3) సానియా షేక్
4) వై మెంగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్కీట్ మహిళల విభాగంలో చైనాకు చెందిన వెమైంగ్ (Weimeng) బంగారు పతకం సాధించింది. ఇండియాకు చెందిన మహేశ్వరి చౌహన్ కాంస్య పతకంను గెలుచుకుంది.
- సమాధానం: 1
44. ప్రపంచ అవయవాల దాన దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 10
2) ఆగస్టు 13
3) ఆగస్టు 15
4) ఆగస్టు 16
- View Answer
- సమాధానం: 2
వివరణ: అవయవాల దానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించుట కొరకుప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీన ప్రపంచ అవయవాల దాన దినోత్సవంను నిర్వహిస్తారు.
- సమాధానం: 2
45. ICG శౌర్య నౌకను ఎక్కడ నిర్మించారు?
1) కొచ్చిన్ షిప్‌యార్డ్
2) మజ్గావ్ డాక్ షిప్‌యార్డ్
3) హిందుస్తాన్ షిప్‌యార్డ్
4) గోవా షిప్‌యార్డ్
- View Answer
- సమాధానం: 4
46. ప్రతిష్ఠాత్మక హ్యూగో పురస్కారం 2017లో ఉత్తమ సైన్స్ ఫిక్షన్ గా ఎంపికైన నవల ఏది?
1) ది టమాటో తీఫ్
2) ది ఒబెలిస్క్ గేట్
3) ఎమ్రీ హర్ట ఎ డోర్‌వే
4) వర్డ ఆర్ మై మాటర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ సైన్స్ ఫిక్షన్ సొసైటీ 1953 నుంచి హ్యూగొ (Hugo) పురస్కారాలు ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరంనకు N.K. Jemisin రాసిన the obelisk gate ఉత్తమ సైన్స్ ఫిక్షన్ గా ఎంపికైంది.
- సమాధానం: 2
47. దేశంలో తొలి రైల్వే డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రామం ను ఎక్కడ ప్రారంభించనున్నారు?
1) హైదరాబాద్
2) పూణే
3) బెంగళూరు
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2018 డిసెంబర్‌లోపు రైల్వే డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రామంను రూ.44.42 కోట్లతో బెంగళూరు దగ్గర ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలను ఆర్టిఫిసియల్గా సృష్టించి రెస్క్యూ విభాగం వారికి శిక్షణ ఇస్తారు.
- సమాధానం: 3
48. భారత్-రష్యా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలను ఏ పేరుతో నిర్వహిస్తున్నారు?
1) ఇంద్ర
2) వరుణ
3) అగ్ని
4) వాయు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్ - రష్యా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు రష్యాలో అక్టోబర్ 19 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
49.ఇటీవల ఏ దేశం కృష్ణాష్టమి సందర్భంగా వెండి నాణేమును విడుదల చేసింది?
1) దక్షిణాఫ్రికా
2) చాద్
3) కొలంబియా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ‘‘ది రిపబ్లిక్ ఆఫ్ చాద్’’ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణుని ప్రతిమ గల వెండి నాణేమును విడుదల చేసింది.
- సమాధానం: 2
50. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ను అందిస్తున్న దేశం ఏది?
1) నెదర్లాండ్స్
2) హంగేరి
3) స్వీడన్
4) నార్వే
- View Answer
- సమాధానం: 4
వివరణ: Ookla సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశం నార్వే. తరువాతి స్థానాల్లో నెదర్లాండ్స్, మరియు హంగేరి ఉన్నాయి.
- సమాధానం: 4