కరెంట్ అఫైర్స్ ( శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (14-20 October 2021)
1. భారత తొలి‘వన్ హెల్త్’ కన్సార్టియంను ప్రారంభించిన శాఖ?
ఎ) బయోటెక్నాలజీ విభాగం
బి) ఆరోగ్య శాఖ
సి) కుటుంబ సంక్షేమ శాఖ
డి) ఆయుష్ శాఖ
- View Answer
- Answer: ఎ
2. పిల్లలలో ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం గురించి అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన యాప్ ?
ఎ) ఆరోగ్యకరమైన దంతాలు
బి) ఆరోగ్యకరమైన చిరునవ్వు
సి) ఆరోగ్యకరమైన దంత వైద్యం
డి) ఆరోగ్యం, పరిశుభ్రత
- View Answer
- Answer: బి
3. భారత్, ఏ దేశంతో కలిసి అక్టోబర్ 26న ఇన్నోవేషన్ డేని జరుపుకోనుంది?
ఎ) ఫ్రాన్స్
బి) ఆస్ట్రేలియా
సి) ఫిన్లాండ్
డి) స్వీడన్
- View Answer
- Answer: డి
4. ఒక అధ్యయనం ప్రకారం 2070 నాటికి నికర-జీరో నేషన్‌గా మారడానికి భారతదేశానికి ఎంత గిగా వాట్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ అవసరం?
ఎ) 4579 GW
బి) 6789 GW
సి) 5567 GW
డి) 5630 GW
- View Answer
- Answer: డి
5. ట్రోజన్స్ ఆస్టరాయిడ్స్‌ను అధ్యయనం చేయడానికి మొదటి అంతరిక్ష యాత్ర కోసం నాసా ఏ అంతరిక్ష నౌకను ప్రయోగించింది?
ఎ) లూసీ
బి) ఆరా
సి) ఆక్టేవ్
డి) పెసో
- View Answer
- Answer: ఎ
6. జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియాను ప్రారంభించిన సంస్థ?
ఎ) నీతి ఆయోగ్
బి) నాస్కామ్
సి) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
డి) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
- View Answer
- Answer: ఎ
7. తైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి ఏ దేశం తన తొలి సౌర అన్వేషణ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది?
ఎ) చైనా
బి) ఉత్తర కొరియా
సి) జపాన్
డి) వియత్నాం
- View Answer
- Answer: ఎ