Glasgow: కాప్–26 సదస్సులో ప్రసగించిన భారతీయ బాలిక ఎవరు?
వాతావరణ మార్పులపై గ్లాస్గోలోని కాప్–26 సదస్సులో భారత్‌కు చెందిన 14 ఏళ్ల వయసున్న టీనేజ్ బాలిక వినీశా ఉమాశంకర్ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేసింది. ఎకో ఆస్కార్ అవార్డులుగా భావించే ఎర్త్ షాట్ ప్రైజ్ ఫైనలిస్ట్ అయిన వినీశ కాప్ ఇతర పర్యావరణ పరిరక్షకులతో కలిసి ప్రిన్స్ విలియమ్ విజ్ఞప్తి మేరకు నవంబర్ 3న సదస్సులో మాట్లాడింది. ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ల సమక్షంలో తమిళనాడుకి చెందిన వినీశ ధైర్యంగా మాట్లాడింది. ‘‘భూమి ఉష్ణోగ్రతలు తగ్గించే అంశంపై ఇక మీరు మాటలు ఆపాలి. చేతలు మొదలు పెట్టాలి’’ తన ప్రసగంలో పేర్కొంది.
అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్
దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చిన భారత వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ‘గ్రూప్ కెప్టెన్’ ర్యాంక్ దక్కనుంది. ఆయనకు ఆ ర్యాంక్ ఇవ్వాలని భారత వాయుసేన నిర్ణయించిందని సంబంధిత వర్గాలు నవంబర్ 3న వెల్లడించాయి.
చదవండి: పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పనున్న వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాప్–26 సదస్సులో ప్రసగించిన భారతీయ బాలిక?
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : వినీశా ఉమాశంకర్
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : భూమి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్