Padma Bhushan awardee: ప్రముఖ పురావస్తు పరిశోధకుడు నాగస్వామి కన్నుమూత
పురావస్తు, శిలాఫలకాల పరిశోధకుడు, తమిళనాడు పరిశోధక శాఖ మొట్టమొదటి సంచాలకుడు రామచంద్రన్ నాగస్వామి(ఆర్.నాగస్వామి) (91) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా జనవరి 23న తమిళనాడు రాజధాని చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1930 ఆగస్టు 10న జన్మించిన నాగస్వామి.. మద్రాసు వర్సిటీలో సంస్కృతంలో పీజీ చేశారు. పుణె వర్సిటీలో భారత కళలు, పురాతత్వ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలో డాక్టరేట్ పొందారు. భారత పురావస్తు పరిశోధన శాఖలో శిక్షణ పొంది.. 1959 నుంచి 1963 వరకు చెన్నై ప్రభుత్వ మ్యూజియం సంరక్షకునిగా పనిచేశారు.
కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా..
- 1963 నుంచి 1965 వరకు తమిళనాడు ప్రభుత్వ పురావస్తుశాఖ ప్రత్యేక సహాయ అధికారిగా, 1966 నుంచి 1988 వరకు పురావస్తుశాఖ మొదటి సంచాలకునిగా నాగస్వామి సేవలందించారు.
- పదవీవిరమణ తర్వాత కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖ సలహాదారుగా పనిచేశారు.
- శిలాఫలకాలు, కళలు, సంగీతం, నృత్యం, తమిళ చరిత్ర గురించి తమిళం, ఆంగ్లం, సంస్కృత భాషలలో పలు గ్రంథాలు రచించారు.
- ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ములుగు సిద్ధాంతి ఇకలేరు
ప్రముఖ జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి (70) జనవరి 23న శివైక్యం పొందారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడాని కంటే ముందు ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. సినీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు.
చదవండి: ఇటీవల కన్నుమూసిన ప్రముఖ బౌద్ధ గురువు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, పద్మభూషణ్ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : రామచంద్రన్ నాగస్వామి(91)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్