Lucile Randon: అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత
Sakshi Education
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గుర్తింపు పొందిన లూసిల్ రాండన్ (118).. జనవరి 17న కన్నుమూసింది. దక్షిణ ఫ్రాన్ ్సలోని అలెస్ పట్టణంలో 1904, ఫిబ్రవరి 11న ఆమె జన్మించారు.
కొవిడ్ నుంచి కోలుకున్న అత్యంత వృద్ధ మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా 110ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల వివరాలను జెరోంటాలజీ రీసర్చ్ గ్రూప్(జీఆర్‌జీ) ధ్రువీకరిస్తోంది. అమెరికాలో జన్మించిన మరియా బ్రన్యాస్ మోరేరా.. ప్రస్తుతం అత్యంత వృద్ధ వ్యక్తిగా తెలిపింది. ఆమె ప్రస్తుతం స్పెయిన్ లో నివసిస్తున్నారు. ఆమె వయసు 115 ఏళ్లు.
Also read: World Population Review: జనాభాలో చైనాను అధిగమించిన భారత్
Published date : 24 Jan 2023 08:49AM