Skip to main content

జూన్ 2019 వ్యక్తులు

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
Current Affairs ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ మటం వెంకటరమణలు ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ జూన్ 20న వీరితో ప్రమాణం చేయించారు.
జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ నేపథ్యం
విజయనగరం జిల్లా పార్వతీపురంలో 1964 మేలో చీకటి నరహరిరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన మానవేంద్రనాథ్‌రాయ్ విశాఖలోని ఎన్వీపీ న్యాయకళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 2002లో జిల్లా జడ్జి కేడర్‌లో జుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయసేవలు అందించారు. 2015 జులై నుంచి హైకోర్టు రిజి్ట్రార్ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో కీలకపాత్ర పోషించారు.
జస్టిస్ వెంకటరమణ నేపథ్యం
అనంతపురం జిల్లా గుత్తి చెందిన జస్టిస్ వెంకటరమణ 1982లో న్యాయ వాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1987లో జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించి వివిధ హోదాల్లో పనిచేశారు. వివిధ ప్రాంతాల్లో సేవలందించిన ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన కోర్టు జడ్జిగా పనిచేశారు. 2019, జనవరి 7 నుంచి కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా (పీడీజే) విధులు నిర్వర్తిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ మటం వెంకటరమణలు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి అధ్యక్షునిగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ జూన్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 22న ఆయన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ హిందూ దేవదాయ, ధర్మాదాయ చట్టం, 1987ను అనుసరించి ఈ నియామకం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్ పేర్కొన్నారు. బోర్డులో ఇతర సభ్యుల నియామకాన్ని త్వరలోనే చేపడతామని తెలిపారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి 2014లో ఒంగోలు ఎంపీగా గెలుపొందారు.
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సహా పలువురు సభ్యుల రాజీనామాల అనంతరం ముగ్గురు సభ్యులతో మిగిలిన దేవస్థానం పాలక మండలిని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి అధ్యక్షునిగా నియామకం
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : వైవీ సుబ్బారెడ్డి

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ చౌహాన్ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో జూన్ 22న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టుకు బదిలీ కావడంతో, 2019, మార్చి 28 నుంచి సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ జూన్ 19న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
ఎక్కడ : దర్బార్‌హాల్, రాజ్‌భవన్, హైదరాబాద్

ఇథియోపియా ఆర్మీ చీఫ్ మెకొన్నెన్ హత్య
ఆఫ్రికాలో జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశమైన ఇథియోపియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సియరే మెకొన్నెన్, మరో పదవీ విరమణ చెందిన జనరల్ జూన్ 22న హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు అంహర(అటానమస్ రీజన్) ప్రాంతీయాధ్యక్షుడు అంబచ్యూ మెకనెన్ ఆయన సలహాదారుడిని అబచెవ్ అంగరక్షకులే కాల్చి చంపారు. అమ్హారా రాష్ట్రాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ఆ రాష్ట్ర భద్రతావిభాగం అధ్యక్షుడు జనరల్ అసమ్‌న్యూ త్సిగే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇథియోపియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హత్య
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : సియరే మెకొన్నెన్
ఎక్కడ : ఇథియోపియా

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ రాజీనామా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్ విరాళ్ ఆచార్య జూన్ 23న రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఇదే కారణంగా చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్‌పటేల్ తర్వాత, బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఆచార్య ఉన్నారు. విరాళ్ రాజీనామాతో నూతన నియామకం జరిగేంతవరకూ డిప్యూటీ గవర్నర్లుగా ముగ్గురు మాత్రమే(ఎన్‌ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్) ఉంటారని ఆర్‌బీఐ తెలిపింది. 45 సంవత్సరాల విరాళ్ ఆచార్య.. ఆర్‌బీఐలోని డిప్యూటీ గవర్నర్లందరిలోకెల్లా పిన్న వయస్కుడు.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ విరాళ్ ఆచార్యను ఆర్‌బీఐ డిప్యూటీ గరవ్నర్‌గా 2016 డిసెంబర్‌లో నియమించింది. 2017 జనవరిలో ఆయన మూడేళ్ల తన బాధ్యతలను చేపట్టారు. అప్పట్లో ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ద్రవ్యఅంశాల విభాగాన్ని ఆయన ఆర్‌బీఐలో పర్యవేక్షించారు.
పాలసీపై విభేదాలు?
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాళ్ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి సమీక్షా కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా కూడా ఉన్నారు. జూన్‌లో ఆర్‌బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయాలతో విరాళ్ ఆచార్య కొంత విభేదించినట్లు సంబంధిత మినిట్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయ-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటుపై ఆయన తాజా పాలసీ సమీక్షలో ఆందోళన వెలిబుచ్చారు. గడచిన ఐదు బడ్జెట్‌లలో మూడుసార్లు ద్రవ్యలోటు కట్టుతప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2013 నుంచీ ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల ద్రవ్యలోటు పరిస్థితి దిగజారుతూ వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రాకేష్ మోహన్ తరువాత...
‘ఫారిన్ ట్రైన్‌‌డ’ ఎకనమిస్ట్‌గా రిజర్‌‌వ బ్యాంక్‌లో పనిచేసి బాధ్యత కాలం పూర్తికాకుండానే తప్పుకున్న రెండో డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య. ఇంతక్రితం 2009 మే నెలలో అప్పటి డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ తన బాధ్యతలకు ముందుగానే రాజీనామా చేశారు. అప్పట్లో జూలై 23తో ఆయన పదవీకాలం పూర్తికావాల్సి ఉంది.
వివాదాల్లో...
స్వతంత్ర నిర్ణయాలు, ఆలోచనలు కలిగిన ఆర్థికవేత్తగా విరాళ్ ఆచార్య పేరుంది. ఇది ఆయనను పలు దఫాలు వివాదాల్లోకీ నెట్టింది. పలు సందర్భాల్లో ఆయన ప్రత్యక్షంగా కేంద్రంపై, ఆర్థిక మంత్రిత్వశాఖపై తన నిరసన గళం వినిపించారు. ప్రత్యేకించి సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృషించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా రాజీనామా
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : డాక్టర్ విరాళ్ ఆచార్య
ఎందుకు : వ్యక్తిగత కారణాల కారణంగా

ప్రముఖ వ్యాపారవేత్త మీలా కన్నుమూత
ప్రముఖ వ్యాపార వేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సుధాకర్ పీవీసీ గ్రూప్ కంపెనీ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ (88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 25న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1971లో ఉపాధ్యాయ వృత్తిని వీడిన మీలా సత్యనారాయణ సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీని ప్రారంభించారు. సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. దేశవ్యాప్తంగా పీవీసీ పైపుల కంపెనీలను స్థాపించారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్వాతంత్య్ర సమరయోధుడు మీలా సత్యనారాయణను ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక చేయగా, అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఆయనకు అవార్డును అందజేశారు. పారిశ్రామిక రంగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అవార్డును అమెరికాలో భారత రాయబారి అబీద్ హుస్సేన్ చేతుల మీదుగా తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ వ్యాపార వేత్త కన్నుమూత
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : మీలా సత్యనారాయణ (88)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

గోవా ఉద్యమకారుడు మోహన్ రనడే కన్నుమూత
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గోవా విముక్తి ఉద్యమ కారుడు మోహన్ రనడే(90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని పూణేలో జూన్ 25న తుదిశ్వాస విడిచారు. రనడేకు 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఆయన మృతి పట్ల గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంతాపం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోవా విముక్తి ఉద్యమకారుడు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : మోహన్ రనడే(90)
ఎక్కడ : పూణే, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా

రాజ్యసభకు నామినేషన్ వేసిన జైశంకర్
విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ స్థానానికి
జూన్ 25న నామినేషన్ దాఖలుచేశారు. జై శంకర్ జూన్ 24న బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. జైశంకర్‌తోపాటు గుజరాత్ బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు జుగల్జీ ఠాకూర్ గుజరాత్ రాజ్యసభ మరో స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా, స్మృతీ ఇరానీ ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికకావడంతో రెండు రాజ్యసభ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.

రా’ ఛీప్‌గా సామంత్ గోయెల్
విదేశీ నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే కీలక విభాగమైన ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా) ఛీప్‌గా సామ్‌ంత్ గోయెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డెరైక్టర్‌గా అరవింద్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు జూన్ 25న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరూ 1984 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారులు. సామంత్ పంజాబ్ కేడర్‌కు చెందినవారు కాగా.. అరవింద్ కుమార్ అసొం-మేఘాలయ కేడర్‌లో పనిచేశారు.
నిఘా వర్గాల ఆపరేషన్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన సామంత్ 2019, ఫిబ్రవరిలో బాలాకోట్‌పై వైమానిక దాడులు, 2016 మెరుపు దాడుల వ్యూహ రచనలో కీలకంగా వ్యవహరించారు. 1990లో పంజాబ్‌లో చెలరేగిన తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వ్యక్తిగా సామంత్‌కు మంచి పేరుంది. అలాగే పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపైనా ఈయనకు మంచి అవగాహన ఉంది. ఐబీ చీఫ్‌గా ఎన్నికై న అరవింద్ కుమార్ వామపక్ష తీవ్రవాదాన్ని నిరోధించడంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన ఐబీ కశ్మీర్ విభాగంలో ప్రత్యేక సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లోయలో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా) ఛీప్‌గా నియామకం
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : సామ్‌ంత్ గోయెల్

భారతీయ తీర రక్షక దళం డీజీగా నటరాజన్
భారతీయ తీర రక్షక దళం డెరైక్టర్ జనరల్(డీజీ)గా తమిళనాడుకు చెందిన కె.నటరాజన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న రాజేంద్రసింగ్ పదవీ విరమణ కానున్న సందర్భంగా కొత్త డీజీగా నటరాజన్ 2019, జూలై 1 నుంచి కొనసాగుతారని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ జూన్ 25న ప్రకటించింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన నటరాజన్ 1984లో తీర రక్షణ దళంలో అసిస్టెంట్ కమాండర్‌గా చేరారు. తర్వాత పలు కీలక పదవులు చేపట్టిన ఆయన ప్రస్తుతం ముంబయిలోని పశ్చిమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ తీర రక్షక దళం డెరైక్టర్ జనరల్(డీజీ)గా నియామకం
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కె.నటరాజన్

నీతి ఆయోగ్ సీఈఓ పదవీకాలం పొడిగింపు
నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడి గిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2021 జూన్ 30 వరకు నీతిఆయోగ్ సీఈవోగా అమితాబ్ కొనసాగనున్నారు. 1980లో ఐఏఎస్‌కు ఎంపికైన అమితాబ్ కాంత్ 2016 ఫిబ్రవరి 17న నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు. 2018లోనే ఆయన పదవీకాలం ముగియగా.. 2019 జూన్ 30 వరకు పొడగిస్తూ అప్పటి కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి రెండేళ్ల పాటు పొడిగించారు.
అమితాబ్ నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టకముందు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్టియ్రల్ పాలసీ అండ్ ప్రమోషన్) కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఈ విభాగాన్ని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌గా పిలుస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్ పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : కేబినెట్ నియామకాల కమిటీ

ఎఫ్‌ఎఓ డెరైక్టర్ జనరల్‌గా చైనా మంత్రి
ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) డెరైక్టర్ జనరల్‌గా చైనా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉప మంత్రి క్యూ డోంగ్యూ ఎన్నికయ్యారు. దీంతో ఎఫ్‌ఎఓ సారథిగా ఎన్నికైన తొలి చైనా వ్యక్తిగా క్యూ గుర్తింపు పొందారు. ఎఫ్‌ఎఓ 41వ వార్షిక సదస్సు సందర్భంగా జూన్ 23న నిర్వహించన ఓటింగ్‌లో క్యూకు మొత్తం పోలయిన 191 ఓట్లలో 108 ఓట్లు లభించాయి. 2019, ఆగస్టు 1న క్యూ ఎఫ్‌ఎఓ డెరైక్టర్ జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస ఎఫ్‌ఎఓ డెరైక్టర్ జనరల్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : చైనా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉప మంత్రి క్యూ డోంగ్యూ

సినీ నటి విజయనిర్మల కన్నుమూత
ప్రముఖ నటి, దర్శకురాలు, సినీ నటుడు కృష్ణ సతీమణి ఘట్టమనేని విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో జూన్ 26న తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న గుంటూరు జిల్లా నరసరావుపేటలో విజయనిర్మల జన్మించారు. పాండురంగ మహత్యం సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకెక్కారు. ఆమె అసలు పేరు నిర్మల కాగా..తనకు సినీరంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : ఘట్టమనేని విజయనిర్మల (73)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా విజయానంద్
Current Affairs ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా 1992 బ్యాచ్ ఐఏఎస్ కె.విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జూన్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుత్తం ఏపీ జెన్‌కో సీఎండీగా ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఈసీఐ బదిలీ చేసింది. 2019, జనవరిలో ఏపీ సీఈవోగా ద్వివేది నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా నియామకం
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : కె.విజయానంద్

ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం
ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. వారిద్దరి హోల్డింగ్ కంపెనీలు రెండేళ్ల పాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సెబీ ఆదేశించింది. ఈ రెండేళ్లలో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు బోర్డ్ పదవితో పాటు ఎలాంటి ఉన్నతోద్యోగాలు చేపట్టరాదని జూన్ 14న ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఏడాది కాలంలో ఏ లిస్టెడ్ కంపెనీలో కూడా డెరైక్టర్‌గా వ్యవహరించకూడదని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించనందుకే ఈ నిషేధం విధిస్తునుట్లు సెబీ వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ పై నిషేదం
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ
ఎందుకు : బ్యాంకుల రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించనందుకు

మిస్ ఇండియా-2019 విజేత సుమన్ రావ్
రాజస్తాన్‌కు చెందిన సీఏ విద్యార్థిని సుమన్ రావ్ మిస్ ఇండియా-2019 విజేతగా నిలిచారు. ముంబైలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జూన్ 15న ఈ కార్యక్రమం జరిగింది. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. పరిస్థితులు ఎప్పటికీ చేజారవని, తనలాగే కలలు కంటున్న ఇతర మహిళలు భయపడకుండా కలలను సాకారం చేసుకోవచ్చన్న నమ్మకం ఈ టైటిల్ అందుకోవడం ద్వారా కలిగిందన్నారు. డిసెంబర్‌లో బ్యాంకాక్‌లో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇంజినీర్ శివాని జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియాగా నిలిచారు. బిహార్‌కు చెందిన మేనేజ్‌మెంట్ విద్యార్థిని శ్రేయా శంకర్ మిస్ ఇండియా యునెటైడ్ కాంటినెంట్స్‌గా నిలిచారు. తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ ద్వయం ఫాల్గుని షేన్ పీకాక్, మిస్ వరల్డ్ 2018 వెనెస్సా పొన్కా డి లియోన్, నటులు హుమా ఖురేషి, చిత్రాంగ సింగ్, ఆయుష్ శర్మ, కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత రెమో డి సౌజా, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఫుట్‌బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛెత్రితో కూడిన బృందం విజేతలను ఎంపిక చేసింది.
ఎంటెక్ చదువుతున్న సంజన...
తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. దీనితోపాటు మిస్ తెలంగాణ 2019 టైటిల్‌ను అందుకున్నారు. ఈమె యూపీలోని అమితీ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో ఎం.టెక్ చదువుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మిస్ ఇండియా-2019 విజేతగా సుమన్ రావ్
ఎప్పుడు: జూన్ 15
ఎవరు: సుమన్ రావ్
ఎక్కడ: ముంబై

ఐఎస్‌ఐ చీఫ్‌గా ఫైజ్ హమీద్
పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)కు నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను నియమిస్తున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ప్రస్తుత ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. మునీర్‌ను గుజ్రన్‌వాలా కోర్ కమాండర్‌గా నియమించినట్లు పేర్కొంది. ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్‌ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లో పనిచేసినట్లు సమాచారం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐఎస్‌ఐ చీఫ్‌గా ఫైజ్ హమీద్ నియమాకం
ఎవరు: ఫైజ్ హమీద్
ఎక్కడ: పాకిస్థాన్
ఎందుకు: పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్

ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘బంగారు’ స్వప్నం సాకారమవలేదు. 14 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన భారత పురుషుల రికర్వ్ జట్టు మళ్లీ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూన్ 16న జరిగిన ఫైనల్లో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత్ 2-6 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
ఎప్పుడు: జూన్ 16
ఎవరు: తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్
ఎక్కడ: డెన్ బాస్చ్ (నెదర్లాండ్‌‌స)

శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీని నియమిస్తున్నట్టు పీఠాధిపతి మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జూన్ 17న అధికారిక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా తీరంలో గల గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో మూడు రోజులపాటు నిర్వహించిన శారదా పీఠం ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవం జూన్ 17న పరిసమాప్తమైంది. 2024లో శారదా పీఠం పూర్తి బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి అప్పగించనున్నట్లు స్వరూపానందేంద్ర తెలిపారు.
శారదా పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టిన స్వాత్మానందేంద్ర అసలు పేరు కిరణ్‌కుమార్‌శర్మ. విశాఖ జిల్లా భీముని పట్నానికి చెందిన హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతులకు 1993 ఏప్రిల్ 4న ఆయన జన్మించారు. తన 5వ ఏటనే శారదా పీఠానికి వెళ్లిన కిరణ్‌కుమార్‌శర్మ నాటినుంచీ మహాస్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ చెంతనే ఉన్నారు. మహాస్వామికి ఆంతరంగిక శిష్యునిగా కొనసాగిన ఆయన దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్కం, మీమాంస, వేదాంతం, ఉపనిషత్తులు, శంకరాచార్యుల వారి భాష్యాలు, బ్రహ్మసూత్రాలును ఔపోసన పట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా నియామకం
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మోర్సీ మృతి
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ(67) కోర్టు హాల్లో కుప్పకూలి మరణించారు. గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న మోర్సీ జూన్ 17న ఈజిప్టు రాజధాని కైరోలోని కోర్టుకు హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. 30 ఏళ్లపాటు ఈజిప్టును నిరంకుశంగా పరిపాలించిన హోస్ని ముబారక్‌ను 2011లో పదవీచ్యుతుణ్ని చేశాక, 2012లో మోర్సీ ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడయ్యారు. 2013లో సైన్యం మోర్సీని పదవీచ్యుతుడిని చేసి, ఆయన రక్షణమంత్రి అల్ సిసిని అధ్యక్షుడి పీఠంపై కూర్చోబెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మృతి
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : మొహమ్మద్ మోర్సీ(67)
ఎక్కడ : కైరో కోర్టు

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సజ్జల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయనను కేబినెట్ మంత్రి హోదాలో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా జూన్ 18న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ పాత్రికేయునిగా, సీనియర్ రాజకీయ నేతగా ప్రజా వ్యవహరాల్లో అనుభవం ఉన్న సజ్జల ప్రస్తుతం వైకాపా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా నియామకం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శిగా ద్వివేది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జూన్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ద్వివేది ఇటీవల వరకూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
పురపాలక శాఖ కార్యదర్శి పరిధిలోకి సీఆర్‌డీఏ
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) వ్యవహారాల్ని ఇకపై పురపాలక శాఖ కార్యదర్శి పర్యవేక్షిస్తారని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : గోపాలకృష్ణ ద్వివేది

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ జూన్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమిస్తూ మరో ఉత్తర్వు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగొయ్, జస్టిస్ బాబ్దే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడంతో వాటికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ జూన్ 22న సీజేగా జస్టిస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్ నియమాకం
ఎవరు: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
ఎప్పుడు: జూన్ 22న
ఎక్కడ: తెలంగాణ

ఏపీ అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
Current Affairs ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని నియమిస్తూ జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ హైకోర్టులో జూన్ 7న ఏఏజీగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 1957లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనుపర్తిపాడులో జన్మించిన ఆయన నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. 1980లో న్యాయవాదిగా ఎన్‌రోల్ చేసుకుని నెల్లూరులోనే ప్రాక్టీస్ ప్రారంభించారు. తరువాత ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చి అనతి కాలంలోనే నిపుణుడైన క్రిమినల్ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా నియామకం
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం
ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా డాక్టర్ పి.లక్ష్మీనరసింహం జూన్ 6న విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రభుత్వం సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్‌ను బదిలీ చేసి ఆ స్థానంలో లక్ష్మీనరసింహంను నియమించింది. మరోవైపు ఏపీ ట్రాన్స్ కో సీఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్ కూడా జూన్ 6న బాధ్యతలు చేపట్టారు. అలాగే ఏపీ జెన్‌కో ఎండీగా శ్రీధర్ జూన్ 7న బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : డాక్టర్ పి.లక్ష్మీనరసింహం
ఎక్కడ : సీఆర్‌డీఏ కార్యాలయం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్

విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ పదవీ విరమణ
విప్రో వ్యవస్థాపకులు అజీమ్ హెచ్.ప్రేమ్‌జీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ మేరకు 2019, జూలై 30న ఆయన పదవీ విరమణ చేసి, తనయుడు రిషద్ ప్రేమ్‌జీకి బాధ్యతలు అప్పగించనున్నారని జూన్ 6న సంస్థ ప్రకటించింది. అయితే సంస్థ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా, వ్యవస్థాపక ఛైర్మన్‌గా అయిదేళ్లపాటు (2024 జులై వరకు) అజీమ్ కొనాసాగుతారని తెలిపింది. ప్రస్తుతం విప్రో ముఖ్య వ్యూహాత్మక అధికారిగా, నాస్‌కామ్ ఛైర్మన్‌గా రిషద్ వ్యవహరిస్తున్నారు.
వంట నూనెల సంస్థగా మొదలైన విప్రోను 8.5 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ టెక్ దిగ్గజంగా అజీమ్ ప్రేమ్‌జీ తీర్చిదిద్దారు. విప్రో ఎంటర్‌ప్రెజైస్‌ను అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ సంస్థగా నిలబెట్టారు. ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్, మెడికల్ డివైజ్‌ల తయారీ తదితర రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించారు. వీటి ఆదాయం దాదాపు 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను ఆయన అందుకున్నారు.
అజీమ్ ప్రేమ్‌జీ తన పేరిటే ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యకలాపాల్లో ఉన్నారు. ఈ ట్రస్టు కు రూ. 52,750 కోట్ల విలువ చేసే విప్రో షేర్లను 2019, మార్చిలో ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యా రంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న దాదాపు 150 పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విప్రో చైర్మన్ పదవీ విరమణ
ఎప్పుడు : జూలై 30
ఎవరు : అజీమ్ హెచ్.ప్రేమ్‌జీ

ఏపీ పౌరసరఫరాల కమిషనర్‌గా శశిధర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌గా కె.శశిధర్ జూన్ 7న బాధ్యతలు స్వీకరించారు. అలాగే రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా గిరిజాశంకర్ కూడా జూన్ 7న బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పీవీ రమేశ్ నియమితులయ్యారు. మరోవైపు ఈబీసీ సంక్షేమ సంస్థ చైర్మన్ పదవికి కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్య రాజు) రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ పౌరసరఫరాల కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : కె.శశిధర్

ఫోర్బ్స్ మహిళా వ్యాపారవేత్తల జాబితా విడుదల
అమెరికాలోని 80 మందితో కూడిన అత్యంత ధనిక మహిళల జాబితాను జూన్ 7న ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏబీసీ సప్లై సంస్థ చైర్‌పర్సన్ డయానే హెండ్రిక్స్ దాదాపు రూ.4 లక్షల కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యాపారులు స్థానం సంపాదించారు. భారత సంతతికి చెందిన వారిలో అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ రూ.97 వేల కోట్లతో 18వ స్థానంలో ఉన్నారు. అలాగే సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథీ రూ.35 వేల కోట్లతో 23వ స్థానం పొందారు. కన్‌ఫ్లుయెంట్ టెక్నాలజీ కంపెనీ సహవ్యవస్థాపకురాలు నేహా నార్కేడే రూ.24 వేల కోట్లతో 60వ స్థానంలో నిలిచారు.

కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి మే రాజీనామా
కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి బ్రిటన్ ప్రధాని థెరీసా మే రాజీనామా చేశారు. కొత్త ప్రధాని వచ్చేంత వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని జూన్ 7న ఆమె తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ జూన్ 10న మొదలుకానుంది. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఏకాభిప్రాయ సాధనకు మూడేళ్ల పాటు పోరాడి ఓడిన మే బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని 23న తెలిపారు. 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఆ నేపథ్యంలో ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవీచ్యుతుడవడంతో థెరీసా ప్రధాని పగ్గాలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి బ్రిటన్ ప్రధాని రాజీనామా
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : థెరీసా మే

కేబినెట్ కార్యదర్శి సిన్హా పదవీకాలం పొడిగింపు
కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా పదవీ కాలాన్ని కేంద్రప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ జూన్ 7న ఈ మేరకు ఆమోదం తెలిపింది. సిన్హా పదవీకాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి. తాజా పొడిగింపుతో గత ఏడు దశాబ్దాల్లో కేబినెట్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన అధికారిగా సిన్హా గుర్తింపు పొందనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : కేంద్రప్రభుత్వం

బ్రిటన్ ఆర్థికవేత్తగా భారత సంతతి వ్యక్తి
బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని విదేశీ, కామన్‌వెల్త్ కార్యాలయంలో ప్రధాన ఆర్థికవేత్తగా భారత సంతతికి చెందిన కుమార్ అయ్యర్ నియమితులయ్యారు. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తిగా అయ్యర్ నిలిచారు. ఇంతకుముందు ముంబయిలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్‌గా ఆయన పనిచేశారు. తమిళం, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న అయ్యర్ తన బాల్యాన్ని భారత్‌లోనే గడిపాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ ఆర్థికవేత్తగా భారత సంతతి వ్యక్తి
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : కుమార్ అయ్యర్

సంఘ సేవకుడు భాగవతుల కన్నుమూత
ప్రముఖ సంఘ సేవకుడు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాగవతుల వెంకట పరమేశ్వరరావు (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 9న కన్నుమూశారు. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన భాగవతుల అమెరికాలోని జేన్‌స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో రీసెర్చ్ అసోసియేట్‌గా కొన్నాళ్లు పనిచేశారు.
1976 నవంబర్‌లో యలమంచిలి సమీప గ్రామం హరిపురంలో బీసీటీ అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను భాగవతుల ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై గ్రామాల్లో ప్రచారం చేసి వినూత్న మార్పునకు కృషి చేశారు. గ్రామ స్వరాజ్యం స్థాపన ధ్యేయంగా స్వగ్రామం దిమిలిలో హైస్కూల్ ఏర్పా టు చేసి అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ సంఘ సేవకుడు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : భాగవతుల వెంకట పరమేశ్వరరావు (86)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

పుదుచ్చేరి మాజీ సీఎం జానకీరామన్ కన్నుమూత
పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే సీనియర్ నేత ఆర్‌వీ.జానకీరామన్(78) అనారోగ్యం కారణంగా పుదుచ్చేరిలో జూన్ 10న కన్నుమూశారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా అలత్తూర్‌కు చెందిన జానకీరామన్ పుదుచ్చేరిలోని నెల్లితోపే శాసనసభ నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున 1985, 1990, 1991 మధ్యంతర ఎన్నికల్లో, 1996, 2001లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996, మే 26 నుంచి 2000, మార్చి 18 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : ఆర్‌వీ.జానకీరామన్(78)
ఎక్కడ : పుదుచ్చేరి
ఎందుకు : అనారోగ్యం కారణంగా

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అరెస్టయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) బృందం జూన్ 10న అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీతోపాటు ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన రూ.6.80 కోట్లను విదేశాలకు తరలించేందుకు వేలాది నకిలీ అకౌంట్లను సృష్టించారని వీరిపై ఆరోపణలున్నాయి.
పాక్ ప్రధానిగా బేనజిర్ భుట్టో 1988-90, 1993-96 సంవత్సరాల్లో పనిచేయగా, ఆమె భర్త జర్దారీ అధ్యక్షుడిగా 2008-13 సంవత్సరాల మధ్య పనిచేశారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : అసిఫ్ అలీ జర్దారీ
ఎందుకు : మనీ లాండరింగ్ కేసులో

బహుభాషా నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత
బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ (81) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 10న బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మాథెరన్ (ముంబైకి సమీపంలో ఉండే హిల్‌స్టేషన్)లో జన్మించిన కర్నాడ్ బాల్యం పూణెలో కౌమారం కర్నాటకలోని ధార్వాడ్‌లో గడిచింది. మరాఠి, కన్నడ మాట్లాడే ఆయన బిఎస్సీ మేధమేటిక్స్ చదివారు. పైచదువులకు ఇంగ్లండ్ వెళ్లి అక్కడ రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, ఫిలాసఫీలో పీజీ పూర్తిచేశారు.
1962-63లో ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు.
1963-70 మధ్యకాలంలో చెన్నైలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పనిచేసిన కర్నాడ్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో నాటకరచనపై దృష్టిసారించారు. 1974-75 లో పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెరైక్టర్‌గా వ్యవహరించారు. 1987-88లో యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 1988-93 నడుమ సంగీత్ నాటక్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 2000-03లో లండన్‌లోని ఇండియన్ హైకమిషన్‌లో మినిస్టర్ ఆఫ్ కల్చర్‌గా, నెహ్రూ సెంటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.
రచయితగా..
తన మాతృభాష అయిన కన్నడలో రచనలు చేసిన గిరీశ్ ఎన్నో నాటకాలు, సినిమాలకు కథలు రాసి, వాటికి దర్శకత్వం వహించి, నటించారు. 1961లో ఆయన తన తొలి నాటకం.. ‘యయాతి’ రాశారు. తర్వాత తుగ్లక్, హయవదన, అంగుమల్లిగె, హిట్టిన హుంజ, నాగమండల, తేల్‌దండా, అగ్ని మట్టు మేల్, ద డ్రీమ్స్ ఆఫ్ టిప్పు సుల్తాన్ వంటి రచనలు చేశారు. 2011లో ‘హాడాడతా ఆయుష్య’ పేరిట ఆయన తన ఆత్మకథను రచించారు.
నటుడిగా..
గిరీశ్‌కర్నాడ్ నటించిన తొలిసినిమా.. ‘సంస్కార’. 1970లో విడుదలైన ఆ సినిమా రాష్ట్రపతి స్వర్ణకమలం అందుకుంది. ఆ తర్వాత నిశాంత్, మంథన్, స్వామి సినిమాల్లో నటించారు. దర్శకుడుగా వంశవృక్ష, గోధూళి, ఉత్సవ్ వంటి చిత్రాలు తీశారు. టైగర్ జిందాహై, శివాయ్, ఆనందభైరవి, ధర్మచక్రం, శంకర్‌దాదా ఎంబీబీఎస్, కొమరం పులి వంటి చిత్రాల్లో నటించారు.
అవార్డులు...
కర్నాడ్‌ను ఎన్నో అవార్డుల వరించాయి. 1972లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, అదే ఏడాది సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ పురస్కారం, 1998లో కాళిదాస సమ్మాన్, రాజ్యోత్సవ పురస్కారాలు ఆయనకు లభించాయి. కన్నడ, హిందీ భాషల్లో ఏడు ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కర్నాడ్‌కే దక్కుతుంది. పురాణాలు, చరిత్ర, వర్తమాన అంశాలను సాహిత్య వస్తువుగా ఆయన ఎంచుకునేవారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బహుభాషా నటుడు, రచయిత, సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : గిరీష్ కర్నాడ్ (81)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యం కారణంగా

పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత డాక్టర్ సి. నారాయణరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాల సంకలనం ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యలయంలో జూన్ 11న జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పుస్తకాన్ని రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

ఏపీ సమాచారశాఖ కమిషనర్‌గా విజయకుమార్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా తుమ్మా విజయకుమార్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జూన్ 11న ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) 1990 బ్యాచ్‌కు చెందిన విజయకుమార్‌రెడ్డి.. డెప్యుటేషన్‌పై రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించడానికి కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ స్థానంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా విజయకుమార్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ నియామక
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : తుమ్మా విజయకుమార్‌రెడ్డి

తాత్కాలిక సీవీసీగా శరద్ కుమార్
తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా శరద్ కుమార్‌ను నియమిస్తూ జూన్ 11న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీవీసీగా ఉన్న కె.వి.చౌదరి పదవీ కాలం జూన్ 9న ముగిసింది. దీంతో విజిలెన్స్ కమిషనర్ (వీసీ) శరద్ కుమార్‌ను ప్రభుత్వం తాత్కాలిక సీవీసీగా నియమించింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) మాజీ అధిపతి అయిన శరద్ కుమార్ 2018, జూన్ 12న విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లో మరో కమిషనర్ అయిన టి.ఎం.భాసిన్ పదవీ కాలం జూన్ 10న ముగిసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియామకం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : శరద్ కుమార్

ప్రధానికి ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర మిశ్ర, అదనపు ముఖ్య కార్యదర్శిగా పి.కె.మిశ్ర పునఃనియమితులయ్యారు. ఈ మేరకువీరి నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ జూన్ 11న ఆమోదించింది. కేబినెట్ మంత్రుల హోదాలో మే 31 నుంచి వీరి నియామకం అమల్లోకి వచ్చిందని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానికి ముఖ్య కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : నృపేంద్ర మిశ్ర

కనోజియాను విడుదల చేయండి: సుప్రీంకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ... పోలీసులు అరెస్టు చేసిన పాత్రికేయుడు ప్రశాంత్ కనోజియాను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో, అలాంటి పోస్టులు ఆమోదయోగ్యం కాదని సదరు పాత్రికేయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కును ప్రభుత్వాలు అడ్డుకోజాలవని, స్వేచ్ఛ హక్కు పవిత్రమైంది, చర్చకు అతీతమైందని ఈ సందర్భంగా పేర్కొంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేసిన వీడియోను కనోజియా షేర్ చేయడంతో జూన్ 8న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. కనోజియాను చట్ట విరుద్ధంగా నిర్బంధించారంటూ అతని భార్య జిగిషా అరోరా పెట్టుకున్న హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగిల వెకేషన్ బెంచ్ జూన్ 11న విచారణ చేపట్టింది.

ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ మటం వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ జూన్ 12న నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరుకుంది. వీరిద్దరూ న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులయ్యారు. ఏపీ హైకోర్టులో మరో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియామకం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ మటం వెంకటరమణ

ప్రముఖ రచయిత రామతీర్థ కన్నుమూత
Current Affairs ప్రముఖ రచయిత, అనువాదకుడు, సాహతీ విమర్శకుడు రామతీర్థ (59) మే 30న విశాఖపట్నంలో గుండెపోటు కారణంగా కన్నుమూశారు. నెల్లూరు జిల్లా అలగానిపాడులో వై రాధాకృష్ణ, సూర్యం దంపతులకు ఆయన జన్మించారు. ఆయన తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తుండేవారు. బాల్యం, ఇంటర్మీడియట్ విద్య ఖరగ్‌పూర్‌లో పూర్తి చేసిన రామతీర్థ బరహంపూర్‌లో ఉండగా ఉప్పల లక్ష్మణరావు స్థాపించిన వికాసం సంస్థతో అనుబంధం పెంచుకుని అతనివద్దే శిష్యరికం చేసి కథలు, కవితలు రాయడం నేర్చుకున్నారు.
కేంద్ర ప్రభుత రంగ సంస్థ డాక్‌యార్డు సెక్యూరిటీలో ఉద్యోగం కోసం విశాఖ నగరానికి వచ్చిన రామతీర్థ ఐదేళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సాహిత్య కార్యక్రమాల్లో పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆయన రచించిన తెల్ల మిరియం కవితా సంపుటి అత్యంత ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్య విసృ్తతి కోసం మొజాయిక్ సాహిత్య సంస్థను ఆయన స్థాపించారు. ఆయన రచనలకుగాను రావిశాస్త్రి పురస్కారం, మునిపల్లె రాజు పురస్కారం, కళారత్న అవార్డు వంటి పురస్కారాలు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ రచయిత కన్నుమూత
ఎప్పుడు : మే 30
ఎవరు : రామతీర్థ (59)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : గుండెపోటు కారణంగా

డబ్ల్యూఈఎఫ్ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మేల్యే కె.తారకరామారావుకు ఆహ్వానం లభించింది. ఢిల్లీలో 2019, అక్టోబర్ 3, 4 తేదీల్లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా’పేరుతో సీఐఐ భాగస్వామ్యంతో నిర్వహించే సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని ఆ ఫోరం కేటీఆర్‌ను కోరింది. ‘మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్’అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సదస్సులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశం జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) నుంచి ఆహ్వానం
ఎప్పుడు : మే 30
ఎవరు : కె.తారకరామారావు

ఏపీ సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మే 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ధనుంజయరెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) అదనపు కమిషనర్‌గా ధనుంజయరెడ్డి పనిచేశారు. అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ)గా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖల డెరైక్టర్‌గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ సీఎంఓ అదనపు కార్యదర్శి నియామకం
ఎప్పుడు : మే 30
ఎవరు : కె.ధనుంజయరెడ్డి

ఏపీ సీఎం ఓఎస్డీగా కృష్ణమోహన్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా రిటైర్డు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమోహన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పులివెందుల నియోజకవర్గం డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) ఓఎస్డీగా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ సీఎం ఓఎస్డీ నియామకం
ఎప్పుడు : మే 30
ఎవరు : పి.కృష్ణమోహన్‌రెడ్డి

ఏపీ సీఎం కార్యదర్శిగా సొల్మొన్ ఆరోఖ్య రాజ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యదర్శిగా సొల్మొన్ ఆరోఖ్య రాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మే 30న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఎం కార్యదర్శిగా ఆయనను నియమించిన నేపథ్యంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. 2000 సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సొల్మొన్ ఆరోఖ్య రాజ్ చిత్తూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేశారని పేరుంది.
మరోవైపు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న షంషేర్ సింగ్ రావత్‌ను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా మరొకరిని నియమించే వరకూ ఆ శాఖ బాధ్యతలనూ షంషేర్ సింగ్ రావత్‌కే అదనంగా అప్పగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ సీఎం కార్యదర్శి నియామకం
ఎప్పుడు : మే 30
ఎవరు : సొల్మొన్ ఆరోఖ్య రాజ్

ఏపీ ఏసీబీ డీజీగా కుమార్ విశ్వజిత్
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్‌గా కుమార్‌విశ్వజిత్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. 1994బ్యాచ్ అధికారైన ఆయన ప్రస్తుతం నిఘా విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఏసీబీ డీజీగా వ్యవహరిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థానం నుంచి బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా వ్యవహరిస్తున్న టీఏ త్రిపాఠిని కూడా ఆ స్థానం నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు
ఎప్పుడు : మే 30
ఎవరు : కుమార్‌విశ్వజిత్

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా(డీజీపీ) సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా వ్యవహరిస్తున్న ఆర్.పి.ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఐపీఎస్ 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్ ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డెరైక్టర్ జనరల్‌గా సవాంగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అస్సాంకు చెందిన సవాంగ్ ఏఎస్పీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీగా సేవలందించిన ఆయన 2000లో డీఐజీగా పదోన్నతి పొంది వరంగల్, కరీంనగర్ రేంజ్‌ల్లో పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు. 2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేశారు. తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2016 జూన్‌లో డీజీగా పదోన్నతి పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా(డీజీపీ)గా అదనపు బాధ్యతలు
ఎప్పుడు : మే 30
ఎవరు : దామోదర్ గౌతమ్ సవాంగ్

నేవీ చీఫ్‌గా కరమ్‌వీర్ బాధ్యతల స్వీకరణ
భారత నౌకాదళానికి 24వ చీఫ్‌గా అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ మే 31న ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఓ హెలికాప్టర్ పైలట్ నౌకాదళ చీఫ్‌గా నియమితులు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటివరకు నేవీ చీఫ్‌గా ఉన్న అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో కరమ్‌వీర్ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు అడ్మిరల్ కరమ్‌వీర్ విశాఖపట్టణంలోని తూర్పు నావల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత నౌకాదళానికి 24వ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మే 31
ఎవరు : అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్
ఎక్కడ : ఢిల్లీ

తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా
దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. రెండో సారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను మే 31న నిర్మలా చేపట్టారు. గతంలో ఇందిరా గాంధీ తాత్కాలికంగా ఆర్థిక శాఖను నిర్వహించినా పూర్తి స్థాయి మంత్రిగా నియమితులయిన మహిళ నిర్మలా సీతారామనే. గతంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దగ్గర సహాయ మంత్రిగా పనిచేసిన నిర్మలా వాణిజ్య, పరిశ్రమల శాఖలను నిర్వహించడంతోపాటు రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.
మరోవైపు విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్. జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. యూపీఏ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన నట్వర్ సింగ్ ఒకప్పుడు దౌత్యవేత్త. కానీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి, చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా మంత్రి పదవిని కట్టబెట్టడం ఇదే తొలిసారి. ఆయన లోక్‌సభ సభ్యుడు కాదు. రాజ్యసభలోనూ సభ్యత్వం లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి మహిళా కేంద్ర ఆర్థిక మంత్రి
ఎప్పుడు : మే 31
ఎవరు : నిర్మలా సీతారామన్

యూఎన్-ఉమెన్ డిప్యూటీ డెరైక్టర్‌గా అనితా
మహిళా సాధికారత, స్త్రీ-పురుష సమానత్వంపై కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్-ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా నియమితులయ్యారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరస్ మే 31న ప్రకటించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో బీఏ చదివిన అనితా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వనరుల సమీకరణ, నిర్వహణలో నిష్ణాతురాలు.
అమెరికాలోని యేల్ వర్సిటీ నుంచి రాజకీయ శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన అనితా జార్జిటౌన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌లో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ బ్యాంకులోని ప్రైవేటురంగ విభాగమైన అంతర్జాతీయ ఆర్థిక కార్పొరేషన్‌లో డెరైక్టర్‌గా కూడా వ్యవహరించారు. గతంలో భారత్‌కు చెందిన లక్ష్మిపురి యూఎన్-ఉమెన్‌కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్-ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారత సంతతి మహిళ
ఎప్పుడు : మే 31
ఎవరు : అనితా భాటియా

చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా రాజీనామా
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగులు జరిగితే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో రూ.4 కోట్లలోపు బడ్జెట్‌తో సినిమాలు ఏపీలో షూటింగ్ పూర్తిచేస్తే వారికి పన్నులు నుంచి మినహాయింపునిస్తూ తాను జీఓ తీసుకువచ్చినట్లు వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ పదవికి పెమ్మసాని నరసింహారావు కూడా మే 31న రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ చలనచిత్ర, టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : మే 31
ఎవరు : అంబికా కృష్ణ

సెర్ప్ సీఈవోగా రంజిత్‌బాషా
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ముఖ్య కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకులు పి.రంజిత్‌బాషా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు మే 31న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సెర్ప్ సీఈవోగా ఉన్న కృష్ణమోహన్ మే 25న తన పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవోగా అదనపు బాధ్యతలు
ఎప్పుడు : మే 31
ఎవరు : పి.రంజిత్‌బాషా

హాక్ జెట్ తొలి మహిళా పైలట్‌గా మోహనా
అత్యాధునిక హాక్ యుద్ధవిమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ మోహనా సింగ్ రికార్డు నెలకొల్పారు. బెంగాల్‌లోని కలైకుండా వాయుసేన కేంద్రంలో మోహనాసింగ్ శిక్షణను పూర్తిచేసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది. శిక్షణలో రాకెట్ల ప్రయోగం, బాంబులు జారవిడవడం, లక్ష్యాలను గురిచూసి కాల్చడం వంటి ప్రక్రియల్ని పూర్తిచేశారు. ఆమెకు 500 గంటలకుపైగా ఫ్లయింగ్ అనుభవం ఉండగా, ఇందులో 380 గంటలు హాక్ ఎంకే-132 జెట్‌ను నడిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాక్ జెట్ తొలి మహిళా పైలట్ గా గుర్తింపు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : మోహనా సింగ్

ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ రాజీనామా
ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ జూన్ 1న తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ... గతంలో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలకు సంబంధించిన కేసుల్లో 80 శాతం ప్రభుత్వం ఓటమి చెందితే తాను బాధ్యతలు చేపట్టిన తరువాత 90 శాతం విజయం సాధించామని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : జలీల్‌ఖాన్

ఏపీవోఏ అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీఓఏ) గౌరవాధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని ఎన్నుకున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్‌కే పురుషోత్తం తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఎన్నికైన విషయం తెలిసిందే. క్రీడారంగాభివృద్ధికి తనవంతు
కృషి చేస్తానని ఈ సందర్భంగా కృష్ణదాస్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీఓఏ) గౌరవాధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : వి.విజయసాయిరెడ్డి

జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ - నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్)గా అజిత్ దోవల్‌ను కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి నియమించింది. ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను కూడా తాజాగా కల్పించింది. 2014 మే 30న తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన దోవల్ పదవీకాలం మే 30న ముగిసింది. దీంతో మరోసారి ఎన్‌ఎస్‌ఏగా దోవల్‌ను నియమించామని జూన్ 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019, మే 31 నుంచి మొదలై వచ్చే ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేర్కొంది.
1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్‌గా పదవీ విరమణ పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక చేపట్టిన తొలి కీలక నియామకం ఇదే. వరుసగా రెండు పర్యాయాలు ఎన్‌ఎస్‌ఏగా నియమితులైన తొలి వ్యక్తి దోవలే. శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను అందుకున్న తొలి వ్యక్తి కూడా దోవలే. 1988లో మిజో తీవ్రవాద నాయకుడు లాల్‌డెంగాను చర్చలకు ఒప్పించడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) నియామకం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : అజిత్ దోవల్

ఎఫ్‌ఐఎస్‌ఎస్‌ఈ ఏపీ కమిషనర్‌గా నాయక్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ స్పోర్‌‌ట్స, స్కౌటింగ్ అండ్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఐఎస్‌ఎస్‌ఈ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషనర్‌గా నూన్సావత బద్దు నాయక్‌ను నిమమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఫ్‌ఐఎస్‌ఎస్‌ఈ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలు, స్కౌటింగ్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థ ఏపీ కమిషనర్‌గా నియమితులైన బద్దు నాయక్ అంతర్జాతీయ క్రీడా, వినోద కార్యక్రమాల నిర్వాహకునిగా పేరు తెచ్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఈ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ నియామకం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : నూన్సావత బద్దు నాయక్

యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రాకేష్
యాక్సిస్ బ్యాంక్ స్వతంత్ర డెరైక్టర్ రాకేష్ మఖీజాను మూడేళ్ల వ్యవధితో నాన్ ఎగ్జిక్యూటివ్ (పార్ట్-టైం) చైర్మన్‌గా నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. 2019 జూన్ 18 నుంచి 2022 జూలై 17 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారని జూన్ 3న యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ (పార్ట్-టైం) చైర్మన్ నియామకం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : రాకేష్ మఖీజా

తెలంగాణ జైళ్లశాఖ ఇన్‌చార్జి ఐజీగా సైదయ్య
తెలంగాణ జైళ్ల శాఖ ఇన్‌చార్జి ఐజీగా బి.సైదయ్య నియ మితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జైళ్ల శాఖ డీజీఎం వినయ్‌కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు జెళ్ల శాఖ ఐజీగా ఉన్న ఆకుల నరసింహ మే 30న పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న సైదయ్య 2018లో రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ జైళ్ల శాఖ ఇన్‌చార్జి ఐజీ నియామకం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : బి.సైదయ్య

ఆంధ్రప్రదేశ్ ఏజీగా సుబ్రహ్మణ్యం శ్రీరామ్
ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ను నియమిస్తూ రాష్ట్ర సీఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం జూన్ 4న ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 5న ఏపీ ఏజీగా శ్రీరామ్ బాధ్యతలు స్వీకరించారు. 1969లో జన్మించిన శ్రీరామ్ 1992 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. అనతి కాలంలోనే రాజ్యాంగపరమైన కేసులతో పాటు, సివిల్ కేసులు, సర్వీసు వివాదాల కేసులు, విద్యా రంగానికి సంబంధించిన కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2009 నుంచి 2011 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. ఇప్పటివరకు ఏపీ ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నియామకం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : సుబ్రహ్మణ్యం శ్రీరామ్

ఏపీ సీఎం సలహాదారుగా అజేయ కల్లం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం మూడేళ్ల కాలానికి కేబినెట్ హోదాతో జూన్ 4న నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా ఆయన వ్యవహరించనున్నారు. సీఎంవో కార్యదర్శులకు శాఖలను కేటాయించే బాధ్యతను కూడా ప్రభుత్వం కల్లంకు అప్పగించింది. కల్లం గతంలో తిరుమల - తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు నియామకం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం

ఐఎండీ చీఫ్‌గా మృత్యుంజయ మహాపాత్ర
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చీఫ్‌గా ప్రముఖ శాస్త్రవేత్త, సైక్లోన్ మ్యాన్ మృత్యుంజయ మహాపాత్ర నియమితులయ్యారు. ఈ మేరకు జూన్ 4న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఐఎండీలో అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న మహాపాత్రను ఐఎండీ డెరైక్టర్ జనరల్‌గా ఐదేళ్ల కాలానికి నియమించింది. ఆయన ఆగస్టులో బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలో వాతావరణంలో మార్పులను పసిగట్టడం ఐఎండీ ముఖ్య విధి. ఐఎండీలోని తుపాను హెచ్చరికల విభాగంలో పనిచేసే మహాపాత్రతోపాటు, ఆయన బృందం సభ్యులకు తుపాను రాకను కచ్చితంగా గుర్తిస్తారనే పేరుంది. అందుకే మహాపాత్రకు ‘సైక్లోన్‌మ్యాన్’ అనే పేరు వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చీఫ్ నియామకం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : మృత్యుంజయ మహాపాత్ర

కంటి శుక్లాల నిపుణురాలు బాత్ కన్నుమూత
కంటి శుక్లాలకు నిర్దిష్టమైన చికిత్సను రూపొందించి, ఎంతోమందికి దృష్టిని ప్రసాదించిన ఘనతను పొందిన డా.ప్యాట్రీసియా బాత్(76) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మే 30న తుదిశ్వాస విడిచారు. వైద్య పేటెంట్ పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా వైద్యురాలిగా బాత్ గుర్తింపుపొందారు. 1988లో లేజర్‌ఫేకో ప్రోబ్ అనే ఉపకరణానికిగాను ఆమె పేటెంట్ సాధించారు. లేజర్ ద్వారా కంటి శుక్లాలను కరిగించేందుకు ఈ ఉపకరణం తోడ్పడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ కంటి శుక్లాల నిపుణురాలు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : డా.ప్యాట్రీసియా బాత్(76)
ఎక్కడ : శాన్‌ఫ్రాన్సిస్కో, అమెరికా
ఎందుకు : క్యాన్సర్ కారణంగా

నోబెల్ శాంతి సదస్సులో రవిశంకర్
నార్వే రాజధాని ఓస్లో నగరంలో నోబెల్ శాంతికేంద్రం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగించారు. పరిశుభ్రమైన వాతావరణంలో క్రీడలు అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సును నిర్వహించారు. అంతరంగంలో శాంతి ఉన్నప్పుడే బయటి ప్రపంచంలో శాంతంగా ఉండగలమని ఈ సందర్భంగా రవిశంకర్ తెలిపారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి ప్రధాన కారణమైన వ్యవసాయ వ్యర్థాలను కాల్చడానికి ప్రత్యామ్నాయాలను ఆయన సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోబెల్ శాంతికేంద్రం సదస్సులో ప్రసంగం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్
ఎక్కడ : నార్వే, ఓస్లో

ఆస్టియ్రా తొలి మహిళా ఛాన్స్ లర్‌గా బీర్లీన్
ఆస్టియ్రా తొలి మహిళా చాన్స్ లర్‌గా బ్రిగిట్టీ బీర్లీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆస్టియ్రా అధ్యక్షుడు వాన్‌డర్ బెలెన్ జూన్ 4న ఆమెతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. 2019, సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల వరకూ పనిచేసే సంకీర్ణ ప్రభుత్వానికి ఆమె సారథ్యం వహించనున్నారు. గత ఛాన్స్ లర్ సెబాస్టియన్ కర్జ్ పార్లమెంట్ విశ్వాసం కోల్పోవటంతో బీర్లీన్ తాత్కాలిక నేతగా తెరపైకి వచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్టియ్రా తొలి మహిళా చాన్స్ లర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : బ్రిగిట్టీ బీర్లీన్

థాయ్‌లాండ్ ప్రధానిగా ప్రయూత్ చాన్
థాయ్‌లాండ్ ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్ చాన్ ఓచా ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి థనాత్రోన్ జువాంగ్రోంగ్ రువాంకిట్‌పై ఆయన విజయం సాధించారు. 2014లో ఇంగ్లక్ షీనవత్ర ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌరప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా నిలిచారు. ధాయ్‌లాండ్‌లో ప్రధానిని ఎన్నుకోవడానికి ప్రతినిధుల సభ, సెనెట్ కలిపి 375 సభ్యుల మద్దతు ఉండాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : థాయ్‌లాండ్ ప్రధానిగా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రయూత్ చాన్ ఓచా

ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ కన్నుమూత
ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్(58) జూన్ 5న కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 2019 ఫిబ్రవరిలో రాష్ట్ర శాసనసభలో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా అసెంబ్లీలోనే పంత్ కుప్పకూలిపోయారు. గత ఎన్నికల అనంతరం ఉత్తరాఖండ్‌కు ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న వార్తలు వచ్చిన వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి కన్నుమూత
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రకాశ్ పంత్(58)
ఎందుకు : శ్వాసకోశ వ్యాధి కారణంగా

అమెరికా తాత్కాలిక స్పీకర్‌గా ప్రమీల
అమెరికా ప్రతినిధుల సభ తాత్కాలిక స్పీకర్‌గా ప్రమీల జయపాల్ జూన్ 4న సభా కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా ప్రమీల నిలిచారు. 2016లో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఆమె ఎన్నికయ్యారు. స్పీకర్‌గా నాన్సీ పెలోసీ కొనసాగుతున్నారు. అయితే వంతులవారీగా అధికార పక్షానికి చెందిన సభ్యులు స్పీకర్‌గా కొద్దికాలం పాటు తాత్కాలిక బాధ్యతలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ప్రతినిధుల సభ తాత్కాలిక స్పీకర్
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ప్రమీల జయపాల్
Published date : 18 Jun 2019 04:12PM

Photo Stories