Skip to main content

జూలై 2018 వ్యక్తులు

ఫార్చూన్ జాబితాలో నలుగురు భారతీయులు
Current Affairs పిన్న వయస్సులో వ్యాపార రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న 40 మంది ప్రముఖుల జాబితాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు 40 ఏళ్ల లోపు వయస్సు గల 40 మంది (40 అండర్ 40) ప్రముఖులతో రూపొందించిన జాబితాను ఫార్చూన్ మ్యాగజైన్ జూలై 25న విడుదల చేసింది. ఇందులో జనరల్ మోటార్స్ సీఎఫ్‌వో దివ్య సూర్యదేవర నాలుగవ స్థానంలో నిలవగా విమియో సీఈవో అంజలీ సూద్ 14వ స్థానం, రాబిన్‌హుడ్ సహవ్యవస్థాపకుడు బైజూ భట్ 24వ స్థానం, ఫిమేల్ ఫౌండర్స్ ఫండ్ వ్యవస్థాపక భాగస్వామి అను దుగ్గల్ 32వ స్థానంలో ఉన్నారు.
ఈ జాబితాలో ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుడు కెవిన్‌స్ట్రామ్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిల్చారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో కేవలం రెండు కంపెనీల్లో మాత్రమే మహిళా సీఈవో, సీఎఫ్‌వోలు ఉన్నారు.
ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల ముఖచిత్రాన్ని మారుస్తున్న యువతతో అనుబంధ లిస్టును కూడా ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించింది. ‘లెడ్జర్ 40 అండర్ 40’లో కరెన్సీ ఎక్స్చేంజ్ రిపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆశీష్ బిర్లా, డిజిటల్ కరెన్సీ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్ సీటీవో బాలాజీ శ్రీనివాసన్, ఎంఐటీ డిజిటల్ కరెన్సీ ఇనీషియేటివ్ డెరైక్టర్ నేహా నరులా, కాయిన్‌బేస్ వైస్ ప్రెసిడెంట్ టీనా భట్నాగర్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫార్చూన్ జాబితాలో నలుగురు భారతీయులు
ఎప్పుడు : జూలై 25
ఎవరు : దివ్య సూర్యదేవర, అంజలీ సూద్, బైజూ భట్, అను దుగ్గల్
ఎక్కడ : 40 అండర్ 40లో
ఎందుకు :పిన్న వయస్సులో వ్యాపార రంగాన్ని ప్రభావితం చేస్తున్నందుకు

ఇన్‌స్టాగ్రామ్ సంపాదనలో కోహ్లీకి 9వ స్థానం
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి 9వ స్థానంలో నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేస్తే అతనికి 82 లక్షల రూపాయలు అందుతాయి. ఈ మేరకు హోపర్స్ హెచ్‌క్యూ సంస్థ జూలై 25న విడుదల చేసిన క్రీడాకారుల జాబితాలో కోహ్లీ 9 స్థానంలో నిలవగా ఓవరాల్‌గా 17వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మొదటి పది మందిలో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లినే. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ను దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది అభిమానులు అనుసరిస్తున్నారు.
హెచ్‌క్యూ సంస్థ క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలవగా నెమార్, మెస్సీ, బెక్‌హామ్, గ్యారెత్ బేల్, ఇబ్రహిమోవిచ్, సురెజ్, మెక్‌గ్రెగర్ (ఫైటర్)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాస్కెట్‌బాల్ ప్లేయర్ స్టీఫెన్ కరీ పదో స్థానం దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితా
ఎప్పుడు : జూలై 25
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎక్కడ : 9వ స్థానం

కిలిమంజారోని అధిరోహించిన గుంటూరు యువతి
ఆఫ్రికాలో అతి పెద్దదైన కిలిమంజారో (5895 మీటర్లు) పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశ దళవాయి అధిరోహించింది. జూలై 16 నుంచి 20వ తేదీ వరకు ప్రయాణం చేసి 19,341 అడుగుల ఎత్తుకు చేరుకుంది. పర్వతారోహణకు మొరాంగో మార్గంలోని అత్యంత కఠినమైన మార్గంను ఆమె ఎంచుకుంది.
గుంటూరులోని పార్వతీపురంలో నివాసం ఉంటున్న శివకుమార్, అనురాధ దంపతులకు జన్మించిన దళవాయి డిగ్రీ చదివే రోజుల్లో ఎన్‌సీసీలో చేరింది. 2006లో ఎన్‌సీసీలో హిల్ మౌంటెనీరింగ్ కోర్సుకు అర్హత సాధించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (పర్వతారోహణ) లో శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా దళవాయి మాట్లాడుతూ... ప్రపంచంలోని ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో భాగంగా కిలిమంజారోని అధిరోహించానని త్వరలో యూరప్‌లోని ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నాని చెప్పింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిలిమంజారోని అధిరోహించిన ఆంధ్రప్రదేశ్ యువతి
ఎప్పుడు : జూలై 20
ఎవరు : ఆశ దళవాయి
ఎక్కడ : టాంజానియా, ఆఫ్రికా

ప్రపంచ వృద్ధురాలు కన్నుమూత
ప్రపంచంలో అతిపెద్ద వయస్కురాలిగా గిన్నిస్ రికార్డు నమోదుచేసిన 117 ఏళ్ల చియో మియాకో జపాన్‌లోని కనగవాలో జూలై 27న కన్నుమూశారు. 1901, మే 2న జన్మించిన మియాకో ఏప్రిల్‌లో ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది.
సౌత్ జపాన్‌లోని కికాయ్ ఐలాండ్‌కు చెందిన నబి తజిమా 117 ఏళ్ల వయసులోనే మరణించడంతో మియాకో అత్యంత వృద్ధురాలిగా నిలిచింది. మియాకో మృతితో సౌత్ జపాన్‌లోని ఫుకువొరాకు చెందిన 115 ఏళ్ల కానె టనక అత్యంత వృద్ధురాలిగా అవతరించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో అతిపెద్ద వయస్కురాలు కన్నుమూత
ఎప్పుడు : జూలై 27
ఎవరు : చియో మియాకో (117)
ఎక్కడ : కనగవా, జపాన్

ఇంగ్లిష్, అంతర్జాతీయ భాషలు’ పుస్తకావిష్కరణ
‘ఇంగ్లిష్, అంతర్జాతీయ భాషలు’ అనే అంశంపై ప్రచురించిన పుస్తకాన్ని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతాసిన్హా హైదరాబాద్‌లో జూలై 27న ఆవిష్కరించారు. దేశంలో ప్రజలు మాట్లాడే భాషలపై చేసిన సర్వేలో భాగంగా ఓరియంటల్ బ్లాక్ స్వాన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఇంగ్లిష్, అంతర్జాతీయ భాషలు’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూలై 27
ఎవరు : ఓరియంటల్ బ్లాక్ స్వాన్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : దేశంలో ప్రజలు మాట్లాడే భాషలపై చేసిన సర్వేలో భాగంగా

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఆర్కే జైన్
కృష్ణా బోర్డు నూతన చైర్మన్‌గా ఆర్కే జైన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై 31న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బోర్డులకు చైర్మన్‌గా ఉన్న హెచ్‌కే సాహూ జూలై 31న పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో కేంద్ర జల సంఘం బెంగళూరు రీజియన్‌లో పనిచేస్తున్న ఆర్కే జైన్‌ను ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణా బోర్డు నూతన చైర్మన్ నియామకం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : ఆర్కే జైన్

షార్ డెరైక్టర్‌గా పాండ్యన్
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డెరైక్టర్‌గా ఎస్.పాండ్యన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ జూలై 31న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పాండ్యన్ తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం షార్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న పి.కున్హికృష్ణన్‌ను బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్ డెరైక్టర్‌గా బదిలీచేశారు. యూఆర్‌రావు సెంటర్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం.అన్నాదురై జూలై 31న ఉద్యోగ విరమణ చేయటంతో ఆయన స్థానంలో కున్హికృష్ణన్‌ను నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్
ఎక్కడ : శ్రీహరికోట

ఏడీజీగా విజయ్‌కుమార్ రెడ్డి
Current Affairs కేంద్ర సమాచార శాఖ, తెలంగాణ ప్రాంతీయ అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి జూలై 18న బాధ్యతలు చేపట్టారు. దీంతో ‘రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా’ హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో’కు కూడా ఆయన అధిపతిగా వ్యవహరిస్తారు.
ఢిల్లీలోని డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)అదనపు డెరైక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై హైదరాబాద్ వచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రచురణల విభాగం, అడిషనల్ డెరైక్టర్ జనరల్ పరిధిలో పని చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సమాచారశాఖ ఏడీజీ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూలై 19
ఎవరు : తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి

వినోద రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రముఖుల్లో భారతీయలు
అంతర్జాతీయంగా వినోద రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న ప్రముఖుల్లో 12 మంది భారతీయలు చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల వినోద రంగాన్ని ప్రభావితం చేస్తున్న 500 మంది ప్రముఖులతో వెరైటీ మ్యాగజైన్ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో వాల్ట్‌డిస్నీ కంపెనీ చైర్మన్ రాబర్ట్ ఐగర్ అగ్రస్థానం దక్కించుకున్నారు.
జాబితాలో గల 12 మంది భారతీయులు

ముకేశ్ అంబానీ

వ్యాపారవేత్త

అనీల్ అంబానీ

వ్యాపారవేత్త

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు

ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నటి

కరణ్ జోహార్

దర్శకుడు

ఉదయ్ శంకర్

స్టార్ ఇండియా సీఈవో

సుభాష్ చంద్ర

ఎస్సెల్ గ్రూప్ చైర్మన్

ఆదిత్య చోప్రా

యశ్‌రాజ్ ఫిలిమ్స్ చైర్మన్

ఏక్తా కపూర్

బాలాజీ టెలీఫిలిమ్స్ జేఎండీ

పునీత్ గోయెంకా

జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో

సిద్ధార్థ్ కపూర్

ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వినోద రంగంలో 12 మంది భారతీయులు
ఎప్పుడు : జూలై 22
ఎవరు : వెరైటీ మ్యాగజైన్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

మార్స్‌పై కాలుమోపబోయే తొలి మహిళ
Current Affairs అరుణ గ్రహం(మార్స్)పై కాలుమోపబోయే తొలి మహిళగా అమెరికాకి చెందిన 17 ఏళ్ల అలెసా కార్సన్ రికార్డు నె లకొల్పనుంది. 2033లో నాసా చేపట్టే మార్స్ ప్రయోగం కోసం నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వైవల్‌లో అలెసా ప్రాథమిక శిక్షణ తీసుకుంటోంది. పద్దెనిమిది ఏళ్లు నిండిన వారినే నాసా వ్యోమగామి (ఆో్టన్రాట్)గా ప్రకటిస్తుంది కాబట్టి ప్రస్తుతం అలెసా ‘బ్లూ బెర్రీ’ అనే కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. ఈ ప్రయోగం ద్వారా మార్స్‌పై వనరుల అన్వేషణ, నీటి నమూనాల పరిశీలన, జీవజాతుల జాడలు వంటి అంశాలపై పరిశీలించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మార్స్‌పై కాలుమోపబోయే తొలి మహిళ
ఎప్పుడు : 2033
ఎవరు : అలెసా కార్సన్
ఎక్కడ : నాసా, అమెరికా
ఎందుకు : మార్స్ గ్ర హంపై పరిశీలన జరిపేందుకు

బ్రిటన్ ఎంపీ వీసాను రద్దు చే సిన భారత్
బ్రిటన్ ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా లాయర్ అయిన లార్డ్ అలెగ్జాండర్ కార్లైల్ వీసాను భారత ప్రభుత్వం రద్దు చేసింది. మీడియా సమావేశం ద్వారా భారత్-బంగ్లా సంబంధాల్లో సమస్యలను సృష్టించాలని చూస్తున్నారనే కారణాలతో బ్రిటన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కార్లైల్‌ను జూలై 13న వెనక్కి పంపించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ ఎంపీ వీసాను రద్దు చే సిన భారత్
ఎప్పుడు : జూలై 13
ఎవరు : అలెగ్జాండర్ కార్లైల్
ఎందుకు : భారత్-బంగ్లా సంబంధాల్లో సమస్యలను సృష్టిస్తున్నందున

ఫోర్బ్స్ జాబితాలో భారత సంతతి మహిళలు
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ జాబితాలో భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథీలకు చోటు దక్కింది. ఈ మేరకు అమెరికాలో స్వయం కృషితో అత్యంత ధనవంతులుగా ఎదిగిన 60 మంది మహిళల నాలుగో వార్షిక జాబితాను ఫోర్బ్స్ జూలై 12న ప్రకటించింది. అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవో, ప్రెసిడెంట్‌గా ఉన్న ఉల్లాల్ రూ.9,250 కోట్ల సంపదతో 18వ స్థానంలో నిలవగా ఐటీ సంస్థ సైన్‌టెల్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న సేథీ రూ.6,844 కోట్ల సంపదతో 21వ స్థానం సాధించింది.
ఈ జాబితాలో అమెరికా గృహ నిర్మాణ సంస్థ ఏబీసీ సప్లై సంస్థ చైర్మన్ డయానే హెన్డ్రిక్స్ రూ.33,547 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు.
మూడేళ్లకే రూ.6,164 కోట్ల విలువైన కాస్మెటిక్ వ్యాపారం చేసిన అమెరికా టీవీ స్టార్ కైలీ జెన్నర్(20) జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ జాబితాలో భారత సంతతి మహిళలు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథీ
ఎక్కడ : అమెరికాలో

ఆధ్యాత్మిక గురువు వాస్వానీ కన్నుమూత
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాధు వాస్వానీ మిషన్ అధిపతి దాదా జేపీ వాస్వానీ (99) పుణేలోని ఆశ్రమంలో జూలై 12న కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు కలిగిన ఆయన వాస్వానీ మిషన్ ద్వారా సామాజిక సేవ, బాలిక విద్య, జంతు సంరక్షణ లాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించేవారు.
1918 ఆగస్టు 2న పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో సింధి కుటుంబంలో జన్మించిన వాస్వానీ 150కిపైగా ఆధ్యాత్మిక పుస్తకాలను రాశారు. ఇందులో 50 పుస్తకాలను ఇంగ్లీషులో రాయగా సింధి భాషలో ఎక్కువగా రాశారు. ఆయన రచనలు మరాఠీ, హిందీ, కన్నడ, గుజరాతీ, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, మాండరిన్, జర్మనీ, పలు విదేశీ భాషల్లోకి అనువదించబడ్డాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కన్నుమూత
ఎప్పుడు : జూలై 12
ఎవరు : దాదా జేపీ వాస్వానీ(99)
ఎక్కడ : పూణె, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా

అత్యుత్తమ అధ్యక్షుడిగా ఒబామా
అమెరికాలో ఉత్తమ అధ్యక్షుడిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వే జూలై 13న ఈ వివరాలు వెల్లడించింది. 2008 నుంచి వరుసగా రెండుసార్లు ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామాను సర్వేలో 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. ఈ జాబితాలో 33 శాతంతో బిల్ క్లింటన్ రెండో స్థానం, 32 శాతంతో రొనాల్డ్ రీగన్ మూడో స్థానంలో నిలవగా 19 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాలో ఉత్తమ అధ్యక్షుడు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : బరాక్ ఒబామా
ఎక్కడ : ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అంబానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర జూలై 13న 1.6 శాతం పెరిగి రూ.1,099.80కి చేరుకోవండంతో అంబానీ సంపద 44.3 బిలియన్ డాలర్ల(దాదాపు 3.05 లక్షల కోట్లు)కు పెరిగి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. దీంతో ఈ జాబితాలో 44 బిలియన్ డాలర్లు(3.03 లక్షల కోట్లు) సంపదతో అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రెండవ స్థానంలో నిలిచాడు. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా అత్యంత ధనవంతుడు
ఎప్పుడు : జూలై 13
ఎవరు : ముకేశ్ అంబానీ
ఎక్కడ : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో

సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీయార్
మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘సెలెక్ట్ మొబైల్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ నియమితులయ్యారు. ఈ మేరకు రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సెలెక్ట్ ఫౌండర్ వై.గురు జూలై 13న తెలిపారు. 2019 జూలై నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 200 ఔట్‌లెట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2,500 మందికి ఉపాధి లభిస్తుంద ని వై. గురు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : జూనియర్ ఎన్టీయార్

ఫుట్‌బాల్ కోచ్ రహీమ్‌పై బయోపిక్
ప్రముఖ భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్‌పై బయోపిక్ రూపొందించనున్నారు. ఈ మేరకు ఎస్‌ఏ రహీమ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ నటించనున్నట్లు జూలై 13న చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, జోయ్ సేన్‌గుప్తా లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ద్వితీయార్ధంలో విడుదలయ్యే ఈ చిత్రం రహీమ్ కోచ్‌గా వ్యవహరించిన, భారత ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగంగా భావించే 1951-1962 మధ్య కాలం నేపథ్యంలో నడుస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన రహీమ్ శిక్షణలో 1951, 1962 ఆసియా క్రీడల్లో భారత జట్టు స్వర్ణ పతకాలు గెలుచుకుంది. అలాగే 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరింది. కొత్త తరం టెక్నిక్‌లతో ఆటగాళ్లను తీర్చిదిద్ది ‘రహీమ్ సాబ్’గా ప్రసిద్ధి చెందిన ఆయన 54 ఏళ్ల వయసులో 1963లో కన్ను మూశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఫుట్‌బాల్ కోచ్ పై బయోపిక్
ఎప్పుడు : జూలై 13
ఎవరు : సయ్యద్ అబ్దుల్ రహీమ్

అత్యంత సంపన్నుడిగా జెఫ్ బెజోస్
ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ నిలిచారు. ఈ మేరకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బ్లూమ్‌బర్గ్ జూలై 17న వెల్లడించింది. బెజోస్ సంపద మొత్తం విలువ జూలై 16 నాటికి 150 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10.25 లక్షల కోట్లు)కు చేరింది. ఈ జాబితాలో 95.5 బిలియన్ డాలర్లతో మెక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉండగా 83 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్‌బర్గ్ మూడో స్థానంలో ఉన్నాడు.
అలాగే ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మొత్తం సంపద విలువ జూలై 13 నాటికి 44.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే ధనిక కుటుంబం వాల్టన్ ఫ్యామిలీ మొత్తం ఆస్తి విలువ 151.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజీన్ 1982 నుంచి ఏటా ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాను ప్రచురిస్తుండగా ఇంతవరకు ఎవరి సంపద 150 బిలియన్ డాలర్లకు చేరలేదు.
బిలియనీర్స్ జాబితా-2018

ర్యాంకు

పేరు

సంపద విలువ (బిలియన్ డాలర్లలో)

దేశం

1

జెఫ్ బిజొస్

152

అమెరికా

2

బిల్‌గేట్స్

95.3

అమెరికా

3

మార్క్ జుకర్‌బర్గ్

83.8

అమెరికా

4

వారెన్ బఫెట్

79.2

అమెరికా

5

బెర్నార్డ్ ఆర్నాల్ట్

75

{ఫాన్స్

6

అమాంకియో ఒర్టెగా

74

స్పెయిన్

7

కార్లొస్ స్లిమ్

62.7

మెక్సికో

8

ల్యారీపేజ్

58.4

అమెరికా

9

సెర్జెయ్ బ్రిన్

56.9

అమెరికా

10

ల్యారీ ఎల్లిసన్

55.2

అమెరికా

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడు
ఎప్పుడు : జూలై 17
ఎవరు : జెఫ్ బెజోస్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్, సల్మాన్
అత్యధిక పారితోషికం అందుకుంటున్న 100 మంది సెలబ్రిటీలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో భారత్ నుంచి అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్‌లకు చోటు దక్కింది. ఈ జాబితాలో 40.5 మిలియన్ డాలర్ల పారితోషికంతో అక్షయ్‌కుమార్ 76వ స్థానంలో ఉండగా, 37.7 మిలియన్ డాలర్లతో సల్మాన్‌ఖాన్ 82వ స్థానంలో నిలిచారు.
ఫోర్బ్స్ జాబితాలో 285 మిలియన్ డాలర్ల పారితోషికంతో అమెరికన్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ మొదటిస్థానం పొందగా 239 మిలియన్ డాలర్లతో జార్జ్ క్లూనీ రెండో స్థానం, 166.5 మిలియన్ డాలర్లతో కిలీ జెన్నర్ మూడోస్థానం, 147 మిలియన్ డాలర్లతో జూడీ షెందిలిన్ నాలుగో స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటులు
ఎప్పుడు : జూలై 17
ఎవరు : అక్షయ్‌కూమార్, సల్మాన్ ఖాన్

ఎన్జీటీ చైర్మన్‌గా జస్టిస్ గోయల్
Current Affairs జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయయూర్తి జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై 6న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న గోయల్ జూలై 6న పదవీ విరమణ చేశారు. ట్రిపుల్ తలాక్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటు సహా పలు కేసుల్లో గోయల్ చరిత్రాత్మక తీర్పులిచ్చారు. 2017 డిసెంబర్‌లో జస్టిస్ స్వతంతర్ కుమార్ ఎన్జీటీ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం ఎన్జీటీకి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించలేదు.
పర్యావరణంతో పాటు అడవులు, సహజవనరుల పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ద్వారా 2010, అక్టోబర్ 18న ఎన్జీటీని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్జీటీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జూలై 6
ఎవరు : జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్

పాక్ మాజీ ప్రధాని షరీఫ్‌కు పదేళ్ల జైలు
పనామా పేపర్ల కుంభకోణంలో కేసుకు సంబంధించి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్‌లోని అవినీతి వ్యతిరేక కోర్టు జూలై 6న పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు 80 లక్షల పౌండ్ల (దాదాపు 73 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. అలాగే షరీఫ్‌తో పాటు కూతురు మరియంకు కూడా కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 20 లక్షల పౌండ్ల (దాదాపు 18 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. విచారణకు సహకరించని కారణంగా మరియం మరియు ఆమె భర్త మహ్మద్ సఫ్దార్‌కు చెరో ఏడాది జైలు శిక్ష పడింది.
2017లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుతో పదవీచ్యుతుడిగా మారిన నవాజ్ షరీఫ్ జూలై 25న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ మాజీ ప్రధానికి పదేళ్ల జైలు శిక్ష
ఎప్పుడు : జూలై 6
ఎవరు : నవాజ్ షరీఫ్
ఎందుకు : పనామా పేపర్ల కుంభకోణంలో భాగంగా

జస్టిస్ రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జూలై 7న రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టుకు సీజేగా నియమితులైన తొలి వ్యక్తి రాధాకృష్ణన్.
2013 మే 21న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా 2015 మే 6న పదవీ విరమణ చేశారు. అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా 2015 మే 5న జస్టిస్ దిలీప్ బి. బొసాలే బాధ్యతలు చేపట్టారు. 2016 జూలై 30న ఏసీజేగా నియమితులైన జస్టిస్ రమేశ్ రంగనాథన్ 23 నెలలపాటు ఆ పదవిలో కొనసాగి నిరాటంకంగా సుదీర్ఘ కాలంపాటు ఏసీజేగా పనిచేసిన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీజే బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూలై 7
ఎవరు : జస్టిస్ రాధాకృష్ణన్

ఏపీ విజిలెన్స్ డీజీగా సవాంగ్
విజయవాడ పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డెరైక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (అదనపు బాధ్యతలు) అనిల్‌చంద్ర పునితా జూలై 7న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విజిలెన్స్ విభాగంతోపాటు ప్రభుత్వ ఎక్స్-అఫిషియో ముఖ్యకార్యదర్శిగా కూడా సవాంగ్ వ్యవహరిస్తారు. సవాంగ్ 2015 ఆగస్టు 2న విజయవాడ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీ జీ నియామకం
ఎప్పుడు : జూలై 7
ఎవరు : డి. గౌతం సవాంగ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్
Current Affairs తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన త్వరలోనే బాధ్యతలు చేపడతారు. అలాగే పట్నా హైకోర్టులో జడ్జీగా ఉన్న అజయ్ కుమార్ త్రిపాఠీని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీజేఐ నియామకం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : జస్టిస్ రాధాకృష్ణన్

ఎస్‌బీఐ ఎండీ పదవికి శ్రీరామ్ రాజీనామా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మేనేజింగ్ డెరైక్టర్ బి.శ్రీరామ్ తన పదవికి జూన్ 28న రాజీనామా చేశారు. ఐడీబీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవోగా కేంద్ర ప్రభుత్వం శ్రీరామ్‌ను నియమించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 22న బాధ్యతలు చేపట్టిన ఆయన మూడు నెలలపాటు ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా రజనీష్ కూమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్ రాజీనామా
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : బి.శ్రీరామ్
ఎందుకు : ఐడీబీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవోగా నియమితులైనందుకు

ఆసియా క్రీడలకు ఎంపికైన అతిపిన్న వయస్కురాలు
ఆసియా క్రీడలకు ఎంపికైన అతిపిన్న వయస్కురాలిగా పుల్లెల గోపిచంద్ కుమార్తె 15 ఏళ్ల గాయత్రి గోపీచంద్ గుర్తింపు పొందింది. ఇటీవల ముగిసిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను గాయత్రికి ఈ అవకాశం దక్కిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ సీనియర్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించడం ఆమెకు ఇదే తొలిసారి. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా క్రీడలకు ఎంపికైన అతిపిన్న వయస్కురాలు
ఎప్పుడు : ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు
ఎవరు : గాయత్రి గోపీచంద్
ఎక్కడ : జకార్తా, ఇండోనేషియా

ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్
ఆంధ్రప్రదేశ్ నూతన డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా రామ్ ప్రవేశ్ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జూన్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. 2016 నవంబర్ 19 నుంచి ఏపీ అవినీతి నిరోధక శాఖ డీజీగా ఠాకూర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
1961 జూలై 1న జన్మించిన ఠాకూర్ ఐఐటీ కాన్పూర్ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. 1986 డిసెంబర్ 15న ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 2003లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఏఎస్‌ఎస్పీ మెడల్ సాధించారు. అలాగే పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ నియామకం
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : రామ్ ప్రవేశ్ ఠాకూర్

తొలి హిజ్రా న్యాయవాదిగా సత్యశ్రీ
దేశంలో తొలి హిజ్రా న్యాయవాదిగా 36 ఏళ్ల సత్యశ్రీ జూన్ 30న గుర్తింపు పొందారు. ఈ మేరకు చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన సత్యశ్రీ 11 ఏళ్ల తర్వాత బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం తీసుకున్నారు. 2014లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రాతిపదికన హిజ్రాలు సైతం లాయర్లుగా బార్ కౌన్సిల్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చని జాతీయ న్యాయ వ్యవహారాల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో సత్యశ్రీకి బార్ కౌన్సిల్ సభ్యత్వం లభించింది.
తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన సత్యశ్రీ జన్మతః బాలుడు కాగా చిన్నప్పుడే శరీరంలో స్త్రీగా మార్పులు ప్రారంభమవడంతో కుటుంబాన్ని వదిలి చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టులో పెరిగారు. 2007లో సేలం కేంద్రీయ లా కాలేజీ నుంచి లా పట్టా తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి హిజ్రా న్యాయవాది
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : సత్యశ్రీ
ఎక్కడ : భారతదేశంలో

ఎస్‌బీఐ ఎండీగా అరిజిత్ బసు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డెరైక్టర్‌గా అరిజిత్ బసు జూలై 2న బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కమర్షియల్ క్రెడిట్, ఐటీ తదితర విభాగాలకు ఉన్నతాధికారిగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఎస్‌బీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఆయన పనిచేశారు. ఎస్‌బీఐ బ్యాంక్ ఎండీగా ఉన్న బి. శ్రీరామ్‌ను ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవోగా నియమించడంతో ఆయన జూన్ 28న రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌బీఐ ఎండీగా నియామకం
ఎప్పుడు : జూలై 2
ఎవరు : అరిజిత్ బసు

మెక్సికో అధ్యక్షుడిగా ఆమ్లో ఎన్నిక
మెక్సికో నూతన అధ్యక్షుడిగా వామపక్ష నాయకుడు ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్(ఆమ్లో) జూలై 2న ఎన్నికయ్యారు. దీంతో మొక్సికో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి వామపక్ష నాయకుడిగా ఆమ్లో గుర్తింపుపొందాడు. ఈ మేరకు డిశంబర్‌లో ఆమ్లో అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. తాజాగా జరిగిన మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో ఆమ్లోకు 53 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ యాక్షన్ పార్టీ (పీఏఎన్), ఇన్‌స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ (పీఆర్‌ఐ)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దాదాపు గత శతాబ్ద కాలంగా పీఏఎన్, పీఆర్‌ఐలు మెక్సికోను పాలిస్తున్నాయి. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఆమ్లో 2014లో మొరెనా (నేషనల్ రీజనరేషన్ మూవ్‌మెంట్) పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన అనంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆమ్లో గెలిచారు.
1953లో జన్మించిన ఆమ్లో తొలిసారిగా 1976లో ప్రస్తుత అధికార పార్టీ పీఆర్‌ఐలో చేరారు. 1980లో మరో పార్టీలో చేరి గవర్నర్ సహా పలు ఎన్నికల్లో పోటీచేశారు. 2000లో మెక్సికో సిటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెక్సికో నూతన అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : జూలై 2
ఎవరు : ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్(ఆమ్లో)

యునెటైడ్ ఇండియా డెరైక్టర్‌గా విజయ్ శ్రీనివాస్
సాధారణ బీమా రంగంలోని యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డెరైక్టర్ అండ్ జనరల్ మేనేజర్‌గా కేబీ విజయ్ శ్రీనివాస్ జూలై 2న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, జనరల్ మేనేజర్‌గా శ్రీనివాస్ పనిచేశారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ మెంబర్‌గా ఉన్న ఆయన సేల్స్ ట్యాక్స్‌పై రాసిన పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : జూలై 2
ఎవరు : కేబీ విజయ్ శ్రీనివాస్

సెయిల్ సీఎండీగా సరస్వతి ప్రసాద్
స్టీల్ ఆథారీటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా సరస్వతి ప్రసాద్ జూలై 1న అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సెయిల్ సీఎండీగా ఉన్న పీకే సింగ్ పదవీ విరమణ పొందడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్టీల్ మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ప్రసాద్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెయిల్ సీఎండీ నియామకం
ఎప్పుడు : జూలై 2
ఎవరు : సరస్వతి ప్రసాద్

యూఎన్‌ఎంవోజీఐపీ చీఫ్‌గా జోస్ ఎలాడియో
యునెటైడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ (యూఎన్‌ఎంవోజీఐపీ) చీఫ్‌గా ఉరుగ్వే ఆర్మీ మాజీ అధికారి మేజర్ జనరల్ జోస్ ఎలాడియో అక్లెయిన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ జూలై 3న ఉత్తర్వులు జారీ చేశారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలను ఈ విభాగం పరిశీలిస్తుంది. ప్రస్తుతం యూఎన్‌ఎంవోజీఐపీ చీఫ్‌గా స్వీడన్‌కు చెందిన మేజర్ జనరల్ పెర్ గుస్తాఫ్ లోడిన్ ఉన్నారు. లోడిన్ పదవీకాలం రెండుళ్లు కాగా త్వరలో ఆయన పదవీకాలం పూర్తికానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్‌ఎంవోజీఐపీ చీఫ్ నియామకం
ఎప్పుడు : జూలై 3
ఎవరు : జోస్ ఎలాడియో అక్లెయిన్
Published date : 03 Aug 2018 05:28PM

Photo Stories