Skip to main content

Hurriyat Conference: హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?

జమ్మూకశ్మీర్‌లోని అతివాద రాజకీయ పార్టీల సమాహారం ‘హురియత్‌ కాన్ఫరెన్స్‌’ తమ చైర్మన్‌గా మస్రాత్‌ ఆలమ్‌ భట్‌ (50)ను ఎన్నుకుంది.
Hurriyat Conference-Masarat Alam Bhat

కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా ఉన్న సయీద్‌ అలీ షా గిలానీ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌ ఎన్నిక జరిగింది. కాన్ఫరెన్స్‌ వైస్‌ చైర్మన్లుగా షబిర్‌ అహ్మద్‌ షా, గులాం అహ్మద్‌ గుల్జార్‌లు ఎన్నికయ్యారు. హురియత్‌ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగే వరకు ఈ నియామకాలు తాత్కాలికంగా ఉంటాయని సెప్టెంబర్‌ 7న కాన్ఫరెన్స్‌ స్పష్టం చేసింది.

తీహార్‌ జైల్లో...
కొత్తగా ఎన్నికైన మస్రాత్‌ ఆలమ్‌ భట్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నాడు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడంలో ఆయన పాత్ర ఉందనే అభియోగాలపై అరెస్టయ్యారు.

ప్రస్తుతం పీడీపీ చీఫ్‌గా ఎవరు ఉన్నారు?
పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీని సెప్టెంబర్‌ 7న జమ్మూకశ్మీర్‌ అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. తన కదలికలపై ఆంక్షలు విధించడం ‘కశ్మీర్‌లో శాంతి నెలకొందంటూ అధికారులు చేస్తున్న ప్రచారం అబద్ధమని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జమ్మూకశ్మీర్‌లోని అతివాద రాజకీయ పార్టీల సమాహారం  హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 7
ఎవరు    : మస్రాత్‌ ఆలమ్‌ భట్‌ 
ఎందుకు  : ఇప్పటివరకు హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా ఉన్న సయీద్‌ అలీ షా గిలానీ ఇటీవల కన్నుమూయడంతో...
 

Published date : 08 Sep 2021 07:28PM

Photo Stories