Former UP CM Mulayam Singh: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ కన్నుమూత
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ములాయం సింగ్ æ యూపీకి మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా, కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సొంతంగా సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ పనిచేశారు. ములాయం కుమారుడు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP