Skip to main content

Ramon Magsaysay Award: 64 ఏళ్ల తర్వాత దలైలామా చేతికి మెగసెసె పురస్కారం

Dalai Lama gets 1959 Ramon Magsaysay Award in person after 64 years

ప్రముఖ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా.. ఏప్రిల్‌ 26న వ్యక్తిగతంగా రామన్ మెగసెసె అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ఆయనకు 1959లో ప్రకటించారు. ఆయన తరఫున దలైలామా సోదరుడు 1959 పురస్కారాన్ని అందుకున్నారు. 64 ఏళ్ల తర్వాత రామన్ మెగసెసె ఫౌండేషన్ ప్రతినిధులు స్వయంగా హిమాచల్‌ప్రదేశ్‌ ధర్మశాలలోని దలైలామా నివాసానికి వచ్చి ఈ అవార్డును ఆయనకు బహూకరించారు.జీవన విధానం,సంస్కృతి ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన టిబెటన్ సమాజానికి నాయకత్వం వహించినందుకు దలైలామాకు ఈ అవార్డును అందించారు. ఇది దలైలామాకు వచ్చిన మొదటి అంతర్జాతీయ అవార్డు అని ఆ­యన కార్యాలయం తెలిపింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 09 May 2023 07:00PM

Photo Stories