Venugopal Dhoot: ఐసీఐసీఐ బ్యాంక్ రుణ మోసం కేసులో వీడియోకాన్ ధూత్ అరెస్టు
Sakshi Education
ఐసీఐసీఐ బ్యాంక్ రుణ మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను (71) సీబీఐ అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కేసు విషయంలో డిసెంబర్ 26న కొంత సేపు విచారణ చేసిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 23న అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌ల రిమాండ్‌పై విచారణ కోసం ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టడానికి కొద్ది గంటల ముందే ధూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ముగ్గురితో పాటు మరికొందరు నిందితులపై సీబీఐ త్వరలో చార్జిషీట్‌ను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ ధూత్.. దీపక్ కొచర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌తో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ వంటి సంస్థలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Published date : 27 Dec 2022 06:02PM