AP high court DSG : ఏపీ హైకోర్టు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పదవీకాలం పొడిగింపు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు నియమితులైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎస్‌జీ) ఎన్.హరినాథ్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
హరినాథ్ డీఎస్‌జీగా 2020 మే 20న నియమితులయ్యారు. ఈ ఏడాది మే 20తో మూడేళ్లు పూర్తి కావడంతో మరో మూడేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. గతంలో ఈయన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు, హైకోర్టు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మొదలైన వాటికి స్టాండింగ్ న్యాయవాదిగా కూడా ఉన్నారు.
☛ AP, TS High Court New CJ'S : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు సీజేల నియామకం
Published date : 06 Jul 2023 07:00PM