Abhijit Sen: ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ మరణం
Sakshi Education
ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (72) మరణించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దేశంలోని అగ్రగామి నిపుణుల్లో సేన్ ఒకరు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, దిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీల్లో అభిజిత్‌సేన్ దశాబ్దాల పాటు అర్థశాస్త్రాన్ని బోధించారు. వ్యవసాయ వ్యయం, ధరలపై ఏర్పాటు చేసిన కమిషన్ల అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 2004 నుంచి 2014 వరకూ ప్రణాళికా సంఘం సభ్యుడిగా పని చేశారు. 2010లో పద్మభూషణ్ అవార్డు వరించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Sep 2022 07:15PM