Skip to main content

Rajya Sabha Chairman : వెంకయ్యకి ఘనంగా వీడ్కోలు

రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య  పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. ఈ సందర్భంగా ఆగస్టు 8న రాజ్యసభలో వెంకయ్య వీడ్కోలు కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు.
Rajya Sabha Chairman M Venkaiah Naidu's Farewell Speech
Rajya Sabha Chairman M Venkaiah Naidu's Farewell Speech

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.... పార్లమెంట్‌ ఎగువ సభ గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ జరుపుకుంటున్న సమయంలో.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని స్వతంత్ర భారతంలో జన్మించినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. 

Also read: Quiz of The Day (August 09, 2022): సముద్రం లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతకు, మహిళలకు, సమాజంలోని పీడిత తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని మోదీ ప్రశంసించారు. మాటల మాంత్రికుడిగా వెంకయ్య ప్రయోగించే చమత్కార పదజాలం, ఏకవాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని అన్నారు. వెంకయ్య మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం తనకు గర్వకారణమని తెలిపారు. పార్టీ, ప్రభుత్వం ఏ బాధ్యతలను అప్పగించినా వాటిని ఎంతో చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించి, తనలాంటి కార్యకర్తలందరికీ మార్గదర్శకంగా నిలిచారని వెంకయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. 

Also read: Weekly Current Affairs (International) Bitbank: బ్రిక్స్ గ్రూపింగ్‌లో చేరడానికి ఏ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి?
 
మాతృభాషపై అభిరుచి అభినందనీయం  
మాతృభాష పట్ల వెంకయ్య నాయుడి అభిరుచి అభినందనీయం, ఆదర్శనీయమని మోదీ కొనియాడారు. మాట్లాడిన ప్రతి సందర్భంలో మాతృభాషను ప్రోత్సహించడం, కాపాడుకోవాలని పిలుపునివ్వడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. వెంకయ్య హయాంలో రాజ్యసభ పనితీరు ఎంతగానో మెరుగుపడిందని, సభ్యుల హాజరు గణనీయంగా పెరిగిందని, ఎన్నో బిల్లులు విజయవంతంగా ఆమోదం పొందాయని గుర్తుచేశారు. వీడ్కోలు చెప్పేందుకు సభకు ఎంపీలంతా హాజరుకావడం వెంకయ్యపై ఉన్న గౌరవానికి సంకేతమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారతీయ భాషల పట్ల ఆయన చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు.   ఆయన మాటల్లో లోతైన నిగూఢార్థం ఉంటుందన్నారు. ఉప రాష్ట్రపతిగా యువత సంక్షేమం కోసం కృషి చేశారని, యువశక్తిపై ప్రధానంగా దృష్టి పెట్టారని వెల్లడించారు. తనకు తెలిసినంతవరకూ వెంకయ్య ప్రజా సేవ నుంచి పదవీ విరమణ చేయడం సాధ్యం కాదని మోదీ చెప్పారు. గతంలో పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారని                 ఉద్ఘాటించారు. 

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ గోల్డెన్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించిన భారతీయుడు ఎవరు?

వెంకయ్య భావోద్వేగం  
వెంకయ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారని,  ఏడాది వయసులో తల్లిని కోల్పోయారని టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రియన్‌ చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక నిమిషం పాటు చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. ఒత్తిడిలోనూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని వెంకయ్యను ప్రశంసించారు. సభ గౌరవాన్ని వెంకయ్య పెంచారని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ చెప్పారు. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
 
ఆత్మకథ రాయండి  
వెంకయ్య నాయుడి రాజకీయ జీవితం, అందించిన సేవలు అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రాజ్యసభ ఎంపీలు పేర్కొన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆత్మకథ(ఆటోబయోగ్రఫీ) రాయాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా సభ్యులందరినీ సమానంగా చూశారని, వివక్ష ప్రదర్శించలేదని పలువురు ఎంపీలు కొనియాడారు.   

Also read: Weekly Current Affairs (National) Bitbank: దేశంలో పూర్తిగా హైడ్రో మరియు సోలార్ పవర్‌తో నడిచే మొదటి విమానాశ్రయం ఏది?

రాష్ట్రపతి కావాలనుకోలేదు
రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. సోమవారం రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. చట్టసభలో అర్థవంతమైన చర్చలు, సంవాదాలు జరగాలని ప్రజలు ఆశిస్తారని గుర్తుచేశారు. అంతేతప్ప ఆందోళనలు, గొడవలు, అంతరాయాలను కోరుకోరని చెప్పారు. సభ గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులంతా కృషి చేయాలని సూచించారు. సభలో ఉన్నప్పుడు మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఉన్నత ప్రమాణాలను అనుసరించాలన్నారు. పదవీ విరమణ తర్వాత ఇంటికే పరిమితం కాబోనని, అన్నిచోట్లా తిరుగుతూ అందరితో భిన్న అంశాలపై మాట్లాడుతూనే ఉంటానని వెంకయ్య స్పష్టం చేశారు. రాజ్యసభపై గొప్ప బాధ్యతలు ఉన్నాయని, ఈ విషయాన్ని సభ్యులంతా సదా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్‌ చక్కగా పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. రాజ్యసభ చైర్మన్‌గా సభ గౌరవాన్ని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయతి్నంచానని, అందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని వెల్లడించారు. బీజేపీకి రాజీనామా చేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు.   

Also read: ICRA Ratings హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 10–12 శాతం వృద్ధి

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 09 Aug 2022 06:29PM

Photo Stories