ఫిబ్రవరి 2021 జాతీయం
Sakshi Education
పుగలుర్–త్రిస్సూర్ పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు ప్రారంభం
320 కేవీ పుగలుర్(తమిళనాడు)– త్రిస్సూర్(కేరళ) పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఫిబ్రవరి 19న ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 5,070 కోట్లు వ్యయం చేశారు. రానున్న ఆరేళ్లలో దేశ సౌర విద్యుత్ సామర్థ్ధ్యం 13 రెట్లు పెరగనుందని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఫిబ్రవరి 19న ప్రధాని ఆన్‌లైన్ విధానంలో పాల్గొని, ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను పెంచేందుకు విద్యాసంస్థలు చేపట్టాల్సిన చర్యలపై 25 అంశాలతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని కోరారు. విశ్వభారతి యూనివర్సిటీని కోల్‌కతాలోని శాంతినికేతన్‌లో 1921, డిసెంబర్ 23న విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు.
ఎంసీఈఎంఈ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మధ్య ఒప్పందం
ఆర్మర్డ్ ట్రాక్డ్ రిపేర్ వాహనాల (ఏటీఆర్‌వీ) అంశంలో సమన్వయంతో పనిచేసేందుకు... సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ), సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒప్పందం చేసుకున్నాయి. ఫిబ్రవరి 19న కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఏటీఆర్‌వీలకు సంబంధించిన శిక్షణ, తయారీ, విడిభాగాల రూపకల్పన, సాంకేతిక అంశాలపై ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి.
స్విగ్గీతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంఓయూ
వీధి వ్యాపారుల ఆహార పదార్థాలకు ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి వినియోగదారులకు డెలివరీ చేయడానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల స్విగ్గీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫికెట్‌గల హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు స్వీకరించి ఆహారాన్ని డెలివరీ చేయడానికి మాత్రమే ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు అందుబాటులోకి ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సికింద్రాబాద్‌లోని ఎంసీఈఎంఈ, సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మధ్య ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎందుకు : ఆర్మర్డ్ ట్రాక్డ్ రిపేర్ వాహనాల (ఏటీఆర్‌వీ) అంశంలో సమన్వయంతో పనిచేసేందుకు...
నీతి ఆయోగ్ పాలక మండలి చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం 20న పునర్‌వ్యవస్థీకరించింది. పాలక మండలి చైర్మన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రతినిధులు పాలక మండలిలో ఫుల్‌టైమ్ సభ్యులుగా ఉంటారు. అండమాన్ నికోబార్ దీవులు, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తారు. సాధారణంగా దేశ ప్రధాని నీతి ఆయోగ్ చైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ రాజీవ్ కుమార్ ఉన్నారు.
ఆరో సమావేశం...
నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశం ఫిబ్రవరి 20న ఆన్‌లైన్ విధానంలో జరిగింది. కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. తద్వారా దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయొచ్చని అన్నారు.
దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరం
దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’ లో ఈ విషయం వెల్లడించింది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలిచాయి.
ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే నగరాలు..
ర్యాంకు నగరం
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభం
దేశ భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు చేసే, సైబర్‌వేదికగా జరిగే నేరాలపై ప్రజల భాగస్వామ్యంతో నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమౌతోంది. దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఇంటర్‌నెట్‌లో సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్ట్‌లపై కన్నేసి ఉంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి)ని కేంద్ర హోం మత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. ఇందులో వాలంటీర్లుగా పనిచేయాలని భావించేవారు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన...
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 24న ఆమోదముద్ర వేసింది. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పాలన విధించాలన్న పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సిఫారసు మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి అనుమతి తరువాత పుదుచ్చేరి అసెంబ్లీ రద్దవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : దేశ భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు చేసే, సైబర్‌వేదికగా జరిగే నేరాలపై ప్రజల భాగస్వామ్యంతో నిఘా పెట్టేందుకు
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం(మెతెరా స్టేడియం) ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 24న ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ‘‘ది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్’’లో ఈ ఉన్న ఈ స్టేడియాన్ని మొతెరా స్టేడియం అని పిలిచేవారు. తాజా దీనికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేశారు. స్టేడియంలోని రెండు ఎండ్‌లకు కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్, అదానీల పేర్లు పెట్టారు. రూ.800 కోట్లు ఖర్చుతో ఆస్ట్రేలియాకు చెందిన పాపులస్ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ మైదానంలో 1.32 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్
ఏ సంఘటన కారణంగా గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశారు?
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జరిగిన ‘చౌరీ చౌరా’ ఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 4న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అమరవీరుల స్మృతి చిహ్నంగా ప్రత్యేక తపాలా బిళ్ల(పోస్టల్ స్టాంపు)ను విడుదల చేశారు.
సహాయ నిరాకరణోద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. పోలీసులందరూ సజీవదహనం కావడంతో 19 మందిని బ్రిటన్ ప్రభుత్వం ఉరితీసింది. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12న నిలిపేశారు.
ప్రస్తుతం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
దేశ జనాభాలో 21.5 శాతం మంది కోవిడ్ ప్రభావానికి లోనయినట్లు మూడో సెరో సర్వేలో తేలింది. ఈ మూడో సర్వేను 2020, డిసెంబర్ 17– 2021, జనవరి 8వ తేదీల మధ్య చేపట్టినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ ఫిబ్రవరి 4న తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 700 గ్రామాలు/వార్డుల్లో ఈ సర్వే నిర్వహించినట్లు వివరించారు. జనాభాలో అత్యధికులు ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
13 నుంచి రెండో డోస్...
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి కోవిడ్–19 రెండో డోస్ వ్యాక్సినేషన్ మొదలవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇప్పటికే మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య కార్యకర్తలు 49,93,427 మందికి ఈ డోస్ అందుతుందన్నారు. ఈ డోస్ అందుకున్న కేవలం 0.18 శాతం మందిలో దుష్ప్రభావాలు కనిపించాయని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో 2021, జనవరి 16వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా ‘‘కోవిషీల్డ్’’, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ‘‘కోవాగ్జిన్’’ ఆరోగ్య కార్యకర్తలకు వేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశ జనాభాలో 21.5 శాతం మంది కోవిడ్ ప్రభావానికి లోనయ్యారు.
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్
2014 నుంచి దేశంలో నిషేధానికి గురైన యాప్‌ల సంఖ్య?
దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రజా నియంత్రణ రీత్యా 2014 నుంచి దేశంలో 296 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించినట్టు కేంద్ర కమ్యూనికేషన్, ఐటీశాఖ మంత్రి సంజయ్ ధోత్రి ఫిబ్రవరి 4న రాజ్యసభకు తెలిపారు. ‘‘ఐటీ యాక్ట్ 2000, సెక్షన్ 69 ఏ’’ని అనుసరించి యాప్‌లపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ఈ యాప్‌ల ద్వారా వ్యక్తుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం, మొబైల్‌లోని సమాచారం మొత్తాన్ని దేశం వెలుపలకు రహస్యంగా తరలించడం జరుగుతోందని కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు.
మయన్మార్‌లో ఫేస్‌బుక్‌పై నిషేధం
మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై నిషేధం విధించింది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం, ప్రియతమ నేత అంగ్‌సాన్ సూకీని ప్రభుత్వం గద్దెదించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉండటం, దేశంలో అల్లర్లు తలెత్తుతాయన్న అనుమానాల నేపథ్యంలో సైనిక పాలకులు ఈ చర్య తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2014 నుంచి నిషేధానికి గురైన యాప్‌ల సంఖ్య 296
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : కేంద్ర కమ్యూనికేషన్, ఐటీశాఖ మంత్రి సంజయ్ ధోత్రి
ఎక్కడ : దేశంలో
ఎందుకు : దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రజా నియంత్రణ రీత్యా
రోప్‌వేలను ఏ శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది?
రోప్‌వేలు, కేబుల్ కార్లు, ఇతరత్రా వినూత్న రవాణా సాధనాలను జాతీయ రహదారుల శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4న కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఇది దోహదపడగలదని మంత్రి పేర్కొన్నారు. రోప్‌వేలు... ఫ్రాన్స్‌లో 4,000, అమెరికాలో 2,000, స్విట్జర్లాండ్‌లో 1,500 ఉండగా, భారత్‌లో కేవలం 65 ప్రాజెక్టులే ఉన్నాయని.. వీటిల్లోనూ 22 మాత్రమే విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ రహదారుల శాఖ పరిధిలోకి రోప్‌వేలు, కేబుల్ కార్లు, ఇతరత్రా వినూత్న రవాణా సాధనాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ
ఎందుకు : రోప్‌వేలు, కేబుల్ కార్లు విస్కృతిని వేగవంతం చేసేందుకు
గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ఏ నగరంలో ఉంది?
గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు ఫిబ్రవరి 7న జరిగాయి. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా తపాలా బిళ్లను విడుదల చేశారు. 1960 ఏడాదిలో గుజరాత్ హైకోర్టును స్థాపించారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ హైకోర్టు ఉంది. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్ నాథ్ ఉన్నారు.
మోదీ ప్రసంగం–ముఖ్యాంశాలు...
ఏమిటి : ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా
ఏ సంస్థకు చెందిన కోబ్రా దళంలో తొలిసారిగా మహిళలు చేరనున్నారు?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) తొలిసారిగా తన కమెండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) కమెండో యూనిట్‌లో మహిళా కమెండోలను రంగంలోకి దించనుంది. ఈ కమెండోలు వేర్పాటువాదం, వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌లోని మొత్తం 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేసి వారికి కఠిన కమాండో శిక్షణ ఇస్తున్నారు.
ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఉన్న 246 బెటాలియన్లలో 208 ఎగ్జిక్యూటివ్, 6 మహిళల, 15 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్), 10 కోబ్రా, 5 సిగ్నల్స్, ఒక స్పెషల్ డ్యూటీ గ్రూప్, ఒక పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లు ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో మొదటి మహిళా బెటాలియన్ 1986లో ఏర్పడింది. ఇటీవల 88వ మహిళా బెటాలియన్ 35వ రైజింగ్ డే(ఫిబ్రవరి 6) సందర్భంగా కోబ్రా శిక్షణకు 34 మంది మహిళా జవాన్లను ఎంపిక చేశారు.
జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు?
కర్ణాటకలోని కొడగు జిల్లా కేంద్రం మడికెరిలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.50 కోట్లతో కొత్తగా నిర్మించిన దివంగత సైన్యాధికారి జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 6న ప్రారంభించారు. తిమ్మయ్య సాహసగాథలకు అద్దం పట్టేలా ఆయన జన్మించిన ఇల్లు ‘సన్నిసైడ్’నే మ్యూజియంగా మార్చారు.
ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం...
మడగాస్కర్ అడవిలో గుర్తించబడిన ఊసరవెల్లి ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం. దీని శాస్త్రీయ నామం ‘‘బ్రూకెసియా ననా’’. కాలుష్యం, అడవుల నరికివేత కారణంగా అరుదైన ఈ జాతి ఊసరవెల్లులు అంతరించిపోతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివంగత సైన్యాధికారి జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : మడికెరి, కొడగు జిల్లా, కర్ణాటక
ఎందుకు : తిమ్మయ్య సాహసగాథలకు గుర్తుగా
జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లుకు ఆమోదం
జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు–2021ను ఫిబ్రవరి 8న రాజ్యసభ ఆమోదించింది. జమ్మూకశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్‌ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెర్రిటరీ(ఏజీఎంయూటీ) క్యాడర్‌లో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
టైమ్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ఐఎస్‌బీ...
ది ఫైనాన్షియల్ టైమ్స్–గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. దేశంలోనే టాప్ 25లో స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థగా నిలిచింది. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది. 2020 ఏడాది ర్యాంకుల్లో 28వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు–2021కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : జమ్మూకశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్‌ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెర్రిటరీ(ఏజీఎంయూటీ) క్యాడర్‌లో విలీనం చేసేందుకు
ఏ జిల్లాను విభజించి విజయనగర అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు?
కర్ణాటక రాష్ట్రంలో గనులకు, హంపీ విజయనగర సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన బళ్లారి జిల్లాను రెండుగా విభజించారు. బళ్లారి నుంచి హొసపేట సహా పలు అసెంబ్లీ నియోజ కవర్గాలను వేరుచేసి విజయనగర అనే కొత్త జిల్లాను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 31వ జిల్లాగా విజయనగర అవతరించింది. కొత్త జిల్లాలో హొసపేటే (విజయనగర), కూడ్లిగి, హగరి బొమ్మనహళ్లి, కొట్టూరు, హువిన హడ గలి, హరపనహళ్లి తాలూకాలను చేర్చారు.
కర్ణాటక రాష్ట్ర రాజధాని: బెంగళూరు
కర్ణాటక ప్రస్తుత గవర్నర్: వాజుభాయ్ రుడాభాయ్ వాలా
కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి: బీఎస్. యడియూరప్ప
విజయనగర సామ్రాజ్యం...
విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు పాలించాయి. అవి.. సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు. వీరి పరిపాలనా కాలంలో సాహిత్యం, వాస్తు శాస్త్రం, శిల్పం మొదలైన కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. దీంతో విజయనగర రాజులకు చరిత్రలో ప్రముఖ స్థానం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బళ్లారి జిల్లాను విభజించి విజయనగర అనే కొత్త జిల్లా ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : బళ్లారి జిల్లా, కర్ణాటక
ఎందుకు : పరిపాలన సౌలభ్యం కోరకు
బిహార్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య?
బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఫిబ్రవరి 9న మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. మొత్తం 17 మంది కొత్త సభ్యులను కేబినెట్‌లో చేర్చింది. వీరి చేత బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా సభ్యులతో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరింది. బిహార్ అసెంబ్లీ స్థానాల ప్రకారం చూస్తే 36 మంది వరకూ మంత్రులు ఉండవచ్చు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు, 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
బిహార్ రాష్ట్రం....
రాజధాని: పాట్నా
శాసనసభ సీట్లు: 243
శాసనమండలి: 95
లోక్‌సభ సీట్లు: 40 (జనరల్–34, ఎస్సీ–6, ఎస్టీ–0)
రాజ్యసభ సీట్లు: 16
హైకోర్టు: పాట్నా హైకోర్టు
ముఖ్య భాషలు: హిందీ, ఉర్దూ,అంగిక, బోజ్‌పూరి, మగధి, మైథిలీ
ప్రధాన మతాలు: హిందూయిజం, ఇస్లాం, బుద్దిజం, క్రిస్టియానిటి.
మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు–2020కి ఆమోదం
దేశంలోని 12 ప్రధాన ఓడరేవులకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ‘‘మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు–2020’’కి ఫిబ్రవరి 10న రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఎగువ సభలో జరిగిన బ్యాలెట్ ఓటింగ్‌లో బిల్లుకి అనుకూలంగా 84 ఓట్లు వస్తే, వ్యతిరేకిస్తూ 44 మంది ఓటు వేశారు. ఈ బిల్లుని లోక్‌సభ 2020, సెప్టెంబర్‌లోనే ఆమోదించింది. 1963 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు.
బిల్లుపై చర్చ సందర్భంగా పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... ‘‘ప్రైవేటు రంగ పోర్టులతో ప్రభుత్వ రంగ పోర్టులు పోటీ పడాలంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ బిల్లు ద్వారా పోర్టులకు ఆ అధికారం వస్తుంది. ఇక అవి సర్వ స్వతంత్రంగా వ్యవహరించవచ్చు’’ అని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు–2020కి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : దేశంలోని 12 ప్రధాన ఓడరేవులకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు
కోర్టు తీర్పుల ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేయనున్న సంస్థ?
సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చే ఉత్తర్వులు పాటించడం వల్ల ఆర్థికంగా పడే ప్రభావాలపై అధ్యయనం చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. ఈ అధ్యయన బాధ్యతలను జైపూర్‌కి చెందిన ‘సీయూటీఎస్ ఇంటర్నేషనల్’కు అప్పగించింది. అధ్యయనం కోసం అయిదు కేసులు ఎంపికయ్యాయి. గోవాలో మోపా విమానాశ్రయంపై చర్చల నిలిపివేత, తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్ కాపర్ ప్లాంటు మూసివేత, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాల నిలిపివేత వంటివి ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ రాజీవ్ కుమార్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోర్టు తీర్పుల ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : సీయూటీఎస్ ఇంటర్నేషనల్
ఎందుకు : సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చే ఉత్తర్వులు పాటించడం వల్ల ఆర్థికంగా పడే ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు
దివంగత సీఎం జయలలిత స్మారక నిలయం ఎక్కడ ప్రారంభమైంది?
చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం ‘‘వేద నిలయం’’ స్మారక నిలయంగా మారింది. జయ జ్ఞాపకాలతో కూడిన వస్తు ప్రదర్శనతో రూపుదిద్దుకున్న జయ స్మారక నిలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి జనవరి 28న ప్రారంభించారు. సుమారు 48 ఏళ్లపాటు జయ వేద నిలయంలోనే నివసించారు. జయ ఇంటిని స్మారక నిలయంగా మారుస్తున్నట్లు 2017, ఆగస్టు 17న ప్రకటించారు.
70 దేశాలకు యూకే వైరస్
యాంటీబాడీస్ రక్షణ ప్రభావాన్ని తగ్గించి, వేగంగా విస్త్రుతంగా వ్యాప్తిచెందే యూకే కొత్త కరోనా వైరస్ 70 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలిసారి దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ కొత్త కరోనా వైరస్ వారం రోజుల్లోనే మరో 8 దేశాలకు వ్యాపించినట్టు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జయలలిత స్మారక నిలయం ప్రారంభం
ఎప్పుడు: జనవరి 28
ఎవరు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి
ఎక్కడ: పోయెస్‌గార్డెన్, చెన్నై, తమిళనాడు
పల్స్ పోలియో–2021
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 30న రాష్ట్రపతి భవన్‌లో పల్స్‌పోలియో–2021ను ప్రారంభించారు. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే–2021 సందర్భంగా జనవరి 31న దేశవ్యాప్తంగా ఉన్న 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనలో భాగంగా ‘జాతీయ పోలియో నిరోధక దినోత్సవాన్ని’ (నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డే) పాటిస్తున్నారు. 2021 పోలియో నిరోధక దినోత్సవాన్ని దేశంలో జనవరి 31న పాటిస్తున్నారు. 2021 సంవత్సరం సుమారు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. భారత్‌ను పోలియోరహిత దేశంగా 2014లో మార్చి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
అన్సారీ పుస్తకం...
భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి ‘‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్’’ పేరుతో రాసిన పుస్తకం విడుదలైంది. రాజ్యసభ చైర్మన్‌గా తన అనుభవాలు, మరికొన్ని అంశాలను గురించి ఈ పుస్తకంలో అన్సారీ వివరించారు.
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్చారు?
డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘‘కమలం’’గా మార్చాలని నిర్ణయించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని ఇటీవల ప్రకటించారు. డ్రాగన్ అనే పదం చైనాని స్ఫరింపజేస్తోందని, అందుకే ఈ పండుకి స్థానిక పేరుని పెట్టాలనుకున్నట్లు తెలిపారు. పోషకాల పరంగా ఇది అత్యంత విలువైన పండు అని రూపాని అన్నారు. ప్రధానంగా ఆసియా దేశాల నుంచి, దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ విరివిగా వాడుతున్నారు. 1990లనుంచీ భారత్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ పుట్టింది?
డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందినది. ఇది మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ’పితాహాయ’ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. వియత్నాంలో ‘థాన్ లాంగ్’ అని పిలుస్తారు. అంటే డ్రాగన్ కళ్లు అని అర్థం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్పు
ఎప్పుడు: జనవరి 29
ఎవరు: గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని
ఎందుకు: డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో
ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021 ఎక్కడ జరుగుతోంది?
కర్ణాటక రాష్టంలోని బెంగళూరు యలహంక వైమానిక స్థావరంలో 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ‘‘ఏరో ఇండియా–2021’’ జరుగుతోంది. ఫిబ్రవరి 3న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 5 వరకు జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సుమారు 78 విదేశీ కంపెనీలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
బెంగళూరులో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లోని తేజస్ కేంద్రంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘‘తేజస్‌మార్క్–2 యుద్ధ విమాన తయారీ కేంద్రం’’ ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. హెచ్‌ఏఎల్ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021
ఎప్పుడు: ఫిబ్రవరి 3, 4, 5
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ: యలహంక వైమానిక స్థావరం, బెంగళూరు, కర్ణాటక
ఎందుకు: రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన కోసం
83 తేజస్ యుద్ధ విమానాల కోసం ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది?
83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్‌సీఏ)లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ దిగ్గజ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో ఒప్పందం చేసుకుంది. హెచ్‌ఏఎల్ ఎండీ ఆర్.మాధవన్‌కు రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ వి.ఎల్.కాంతారావు ఒప్పంద పత్రాలను అందజేశారు. బెంగళూరులో జరుగుతున్న ‘‘ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021’’ సందర్భంగా ఫిబ్రవరి 3న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో.... ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం విలువ రూ.48వేల కోట్లు. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు.
తేజస్ యుద్ధ విమానాన్ని భారత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ), హెచ్‌ఏఎల్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. వయసు పైబడుతున్న మిగ్ –21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు... 1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) కార్యక్రమంలో భాగంగా రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003 ఏడాదిలో ఈ యుద్ధవిమానానికి అధికారికంగా ‘తేజస్‘ అని పేరు పెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో ఒప్పందం
ఎప్పుడు: ఫిబ్రవరి 3
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ: బెంగళూరు, కర్ణాటక
ఎందుకు: 83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్‌సీఏ)లను కొనుగోలు చేయడానికి
ప్రబుద్ధ భారత అనే మాస పత్రికను ఎవరు ప్రారంభించారు?
రామకృష్ణ పరమహంస బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్వామి వివేకానందుడు 1896 జూలైలో ‘‘ప్రబుద్ధ భారత(అవేకెన్‌డ్ ఇండియా)’’ అనే ఇంగ్లీషు మాస పత్రికను ప్రారంభించారు. ప్రబుద్ధ భారత 125 వార్షికోత్సవ వేడుకలను జనవరి 31న నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని మాయవతిలో ఉన్న అద్వైత ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... నిరుపేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
కృష్ –ఈ పురస్కారాలను ప్రదానం చేసిన సంస్థ?
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్‌లో భాగమైన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ (ఎఫ్‌ఈఎస్) తాజాగా వ్యవసాయ రంగంలో సృజనాత్మక విధానాలు అమలు చేసిన రైతులకు కృష్–ఈ చాంపియన్ పురస్కారాలు ప్రకటించింది. 4 కేటగిరీల్లో 10 జాతీయ అవార్డులు అందించింది.

- హైదరాబాద్
- బెంగళూరు
- పుణే
- ఢిల్లీ
- చెన్నై
- లక్నో
- కోయంబత్తూర్
- నెల్లూరు
- గుర్గావ్
- మంగళూరు

- భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు చేపట్టింది.
- దేశంలో 18,000 పైగా కోర్టులు కంప్యూటీకరించబడ్డాయి.
- వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కాన్ఫరెన్సింగ్‌లకు సుప్రీంకోర్టు అనుమతించడంతో దేశంలోని అన్ని కోర్టుల్లో ఆన్‌లైన్ విచారణలు సాధ్యమయ్యాయి.
- డిజిటల్ విభజనను తగ్గించడానికి హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో కూడా ఈ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నాం.
- దేశంలో తొలి లోక్ అదాలత్ గుజరాత్‌లోని జునాగఢలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది.
ఏమిటి : ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా
ఏ సంస్థకు చెందిన కోబ్రా దళంలో తొలిసారిగా మహిళలు చేరనున్నారు?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) తొలిసారిగా తన కమెండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) కమెండో యూనిట్‌లో మహిళా కమెండోలను రంగంలోకి దించనుంది. ఈ కమెండోలు వేర్పాటువాదం, వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌లోని మొత్తం 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేసి వారికి కఠిన కమాండో శిక్షణ ఇస్తున్నారు.
ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఉన్న 246 బెటాలియన్లలో 208 ఎగ్జిక్యూటివ్, 6 మహిళల, 15 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్), 10 కోబ్రా, 5 సిగ్నల్స్, ఒక స్పెషల్ డ్యూటీ గ్రూప్, ఒక పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లు ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో మొదటి మహిళా బెటాలియన్ 1986లో ఏర్పడింది. ఇటీవల 88వ మహిళా బెటాలియన్ 35వ రైజింగ్ డే(ఫిబ్రవరి 6) సందర్భంగా కోబ్రా శిక్షణకు 34 మంది మహిళా జవాన్లను ఎంపిక చేశారు.
జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు?
కర్ణాటకలోని కొడగు జిల్లా కేంద్రం మడికెరిలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.50 కోట్లతో కొత్తగా నిర్మించిన దివంగత సైన్యాధికారి జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 6న ప్రారంభించారు. తిమ్మయ్య సాహసగాథలకు అద్దం పట్టేలా ఆయన జన్మించిన ఇల్లు ‘సన్నిసైడ్’నే మ్యూజియంగా మార్చారు.
ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం...
మడగాస్కర్ అడవిలో గుర్తించబడిన ఊసరవెల్లి ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం. దీని శాస్త్రీయ నామం ‘‘బ్రూకెసియా ననా’’. కాలుష్యం, అడవుల నరికివేత కారణంగా అరుదైన ఈ జాతి ఊసరవెల్లులు అంతరించిపోతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివంగత సైన్యాధికారి జనరల్ కేఎస్ తిమ్మయ్య మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : మడికెరి, కొడగు జిల్లా, కర్ణాటక
ఎందుకు : తిమ్మయ్య సాహసగాథలకు గుర్తుగా
జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లుకు ఆమోదం
జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు–2021ను ఫిబ్రవరి 8న రాజ్యసభ ఆమోదించింది. జమ్మూకశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్‌ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెర్రిటరీ(ఏజీఎంయూటీ) క్యాడర్‌లో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
టైమ్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ఐఎస్‌బీ...
ది ఫైనాన్షియల్ టైమ్స్–గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. దేశంలోనే టాప్ 25లో స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థగా నిలిచింది. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది. 2020 ఏడాది ర్యాంకుల్లో 28వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు–2021కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : జమ్మూకశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్‌ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెర్రిటరీ(ఏజీఎంయూటీ) క్యాడర్‌లో విలీనం చేసేందుకు
ఏ జిల్లాను విభజించి విజయనగర అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు?
కర్ణాటక రాష్ట్రంలో గనులకు, హంపీ విజయనగర సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన బళ్లారి జిల్లాను రెండుగా విభజించారు. బళ్లారి నుంచి హొసపేట సహా పలు అసెంబ్లీ నియోజ కవర్గాలను వేరుచేసి విజయనగర అనే కొత్త జిల్లాను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 31వ జిల్లాగా విజయనగర అవతరించింది. కొత్త జిల్లాలో హొసపేటే (విజయనగర), కూడ్లిగి, హగరి బొమ్మనహళ్లి, కొట్టూరు, హువిన హడ గలి, హరపనహళ్లి తాలూకాలను చేర్చారు.
కర్ణాటక రాష్ట్ర రాజధాని: బెంగళూరు
కర్ణాటక ప్రస్తుత గవర్నర్: వాజుభాయ్ రుడాభాయ్ వాలా
కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి: బీఎస్. యడియూరప్ప
విజయనగర సామ్రాజ్యం...
విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు పాలించాయి. అవి.. సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు. వీరి పరిపాలనా కాలంలో సాహిత్యం, వాస్తు శాస్త్రం, శిల్పం మొదలైన కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. దీంతో విజయనగర రాజులకు చరిత్రలో ప్రముఖ స్థానం లభించింది.
వంశాలు | పాలనా కాలం |
సంగమ | క్రీ.శ.1336 – 1485 |
సాళువ | క్రీ.శ. 1486 – 1505 |
తుళువ | క్రీ.శ. 1505 – 1570 |
అరవీటి | క్రీ.శ. 1570 – 1646 |
ఏమిటి : బళ్లారి జిల్లాను విభజించి విజయనగర అనే కొత్త జిల్లా ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : బళ్లారి జిల్లా, కర్ణాటక
ఎందుకు : పరిపాలన సౌలభ్యం కోరకు
బిహార్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య?
బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఫిబ్రవరి 9న మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. మొత్తం 17 మంది కొత్త సభ్యులను కేబినెట్‌లో చేర్చింది. వీరి చేత బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా సభ్యులతో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరింది. బిహార్ అసెంబ్లీ స్థానాల ప్రకారం చూస్తే 36 మంది వరకూ మంత్రులు ఉండవచ్చు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు, 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
బిహార్ రాష్ట్రం....
రాజధాని: పాట్నా
శాసనసభ సీట్లు: 243
శాసనమండలి: 95
లోక్‌సభ సీట్లు: 40 (జనరల్–34, ఎస్సీ–6, ఎస్టీ–0)
రాజ్యసభ సీట్లు: 16
హైకోర్టు: పాట్నా హైకోర్టు
ముఖ్య భాషలు: హిందీ, ఉర్దూ,అంగిక, బోజ్‌పూరి, మగధి, మైథిలీ
ప్రధాన మతాలు: హిందూయిజం, ఇస్లాం, బుద్దిజం, క్రిస్టియానిటి.
మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు–2020కి ఆమోదం
దేశంలోని 12 ప్రధాన ఓడరేవులకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ‘‘మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు–2020’’కి ఫిబ్రవరి 10న రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఎగువ సభలో జరిగిన బ్యాలెట్ ఓటింగ్‌లో బిల్లుకి అనుకూలంగా 84 ఓట్లు వస్తే, వ్యతిరేకిస్తూ 44 మంది ఓటు వేశారు. ఈ బిల్లుని లోక్‌సభ 2020, సెప్టెంబర్‌లోనే ఆమోదించింది. 1963 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు.
బిల్లుపై చర్చ సందర్భంగా పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... ‘‘ప్రైవేటు రంగ పోర్టులతో ప్రభుత్వ రంగ పోర్టులు పోటీ పడాలంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ బిల్లు ద్వారా పోర్టులకు ఆ అధికారం వస్తుంది. ఇక అవి సర్వ స్వతంత్రంగా వ్యవహరించవచ్చు’’ అని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు–2020కి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : దేశంలోని 12 ప్రధాన ఓడరేవులకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు
కోర్టు తీర్పుల ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేయనున్న సంస్థ?
సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చే ఉత్తర్వులు పాటించడం వల్ల ఆర్థికంగా పడే ప్రభావాలపై అధ్యయనం చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. ఈ అధ్యయన బాధ్యతలను జైపూర్‌కి చెందిన ‘సీయూటీఎస్ ఇంటర్నేషనల్’కు అప్పగించింది. అధ్యయనం కోసం అయిదు కేసులు ఎంపికయ్యాయి. గోవాలో మోపా విమానాశ్రయంపై చర్చల నిలిపివేత, తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్ కాపర్ ప్లాంటు మూసివేత, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాల నిలిపివేత వంటివి ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ రాజీవ్ కుమార్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోర్టు తీర్పుల ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : సీయూటీఎస్ ఇంటర్నేషనల్
ఎందుకు : సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చే ఉత్తర్వులు పాటించడం వల్ల ఆర్థికంగా పడే ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు
దివంగత సీఎం జయలలిత స్మారక నిలయం ఎక్కడ ప్రారంభమైంది?
చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం ‘‘వేద నిలయం’’ స్మారక నిలయంగా మారింది. జయ జ్ఞాపకాలతో కూడిన వస్తు ప్రదర్శనతో రూపుదిద్దుకున్న జయ స్మారక నిలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి జనవరి 28న ప్రారంభించారు. సుమారు 48 ఏళ్లపాటు జయ వేద నిలయంలోనే నివసించారు. జయ ఇంటిని స్మారక నిలయంగా మారుస్తున్నట్లు 2017, ఆగస్టు 17న ప్రకటించారు.
70 దేశాలకు యూకే వైరస్
యాంటీబాడీస్ రక్షణ ప్రభావాన్ని తగ్గించి, వేగంగా విస్త్రుతంగా వ్యాప్తిచెందే యూకే కొత్త కరోనా వైరస్ 70 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలిసారి దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ కొత్త కరోనా వైరస్ వారం రోజుల్లోనే మరో 8 దేశాలకు వ్యాపించినట్టు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జయలలిత స్మారక నిలయం ప్రారంభం
ఎప్పుడు: జనవరి 28
ఎవరు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి
ఎక్కడ: పోయెస్‌గార్డెన్, చెన్నై, తమిళనాడు
పల్స్ పోలియో–2021
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 30న రాష్ట్రపతి భవన్‌లో పల్స్‌పోలియో–2021ను ప్రారంభించారు. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే–2021 సందర్భంగా జనవరి 31న దేశవ్యాప్తంగా ఉన్న 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనలో భాగంగా ‘జాతీయ పోలియో నిరోధక దినోత్సవాన్ని’ (నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డే) పాటిస్తున్నారు. 2021 పోలియో నిరోధక దినోత్సవాన్ని దేశంలో జనవరి 31న పాటిస్తున్నారు. 2021 సంవత్సరం సుమారు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. భారత్‌ను పోలియోరహిత దేశంగా 2014లో మార్చి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
అన్సారీ పుస్తకం...
భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి ‘‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్’’ పేరుతో రాసిన పుస్తకం విడుదలైంది. రాజ్యసభ చైర్మన్‌గా తన అనుభవాలు, మరికొన్ని అంశాలను గురించి ఈ పుస్తకంలో అన్సారీ వివరించారు.
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్చారు?
డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘‘కమలం’’గా మార్చాలని నిర్ణయించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని ఇటీవల ప్రకటించారు. డ్రాగన్ అనే పదం చైనాని స్ఫరింపజేస్తోందని, అందుకే ఈ పండుకి స్థానిక పేరుని పెట్టాలనుకున్నట్లు తెలిపారు. పోషకాల పరంగా ఇది అత్యంత విలువైన పండు అని రూపాని అన్నారు. ప్రధానంగా ఆసియా దేశాల నుంచి, దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ విరివిగా వాడుతున్నారు. 1990లనుంచీ భారత్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ పుట్టింది?
డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందినది. ఇది మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ’పితాహాయ’ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. వియత్నాంలో ‘థాన్ లాంగ్’ అని పిలుస్తారు. అంటే డ్రాగన్ కళ్లు అని అర్థం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్పు
ఎప్పుడు: జనవరి 29
ఎవరు: గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని
ఎందుకు: డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో
ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021 ఎక్కడ జరుగుతోంది?
కర్ణాటక రాష్టంలోని బెంగళూరు యలహంక వైమానిక స్థావరంలో 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ‘‘ఏరో ఇండియా–2021’’ జరుగుతోంది. ఫిబ్రవరి 3న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 5 వరకు జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సుమారు 78 విదేశీ కంపెనీలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
బెంగళూరులో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లోని తేజస్ కేంద్రంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘‘తేజస్‌మార్క్–2 యుద్ధ విమాన తయారీ కేంద్రం’’ ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. హెచ్‌ఏఎల్ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021
ఎప్పుడు: ఫిబ్రవరి 3, 4, 5
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ: యలహంక వైమానిక స్థావరం, బెంగళూరు, కర్ణాటక
ఎందుకు: రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన కోసం
83 తేజస్ యుద్ధ విమానాల కోసం ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది?
83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్‌సీఏ)లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ దిగ్గజ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో ఒప్పందం చేసుకుంది. హెచ్‌ఏఎల్ ఎండీ ఆర్.మాధవన్‌కు రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ వి.ఎల్.కాంతారావు ఒప్పంద పత్రాలను అందజేశారు. బెంగళూరులో జరుగుతున్న ‘‘ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021’’ సందర్భంగా ఫిబ్రవరి 3న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో.... ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం విలువ రూ.48వేల కోట్లు. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు.
తేజస్ యుద్ధ విమానాన్ని భారత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ), హెచ్‌ఏఎల్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. వయసు పైబడుతున్న మిగ్ –21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు... 1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) కార్యక్రమంలో భాగంగా రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003 ఏడాదిలో ఈ యుద్ధవిమానానికి అధికారికంగా ‘తేజస్‘ అని పేరు పెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో ఒప్పందం
ఎప్పుడు: ఫిబ్రవరి 3
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ: బెంగళూరు, కర్ణాటక
ఎందుకు: 83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్‌సీఏ)లను కొనుగోలు చేయడానికి
ప్రబుద్ధ భారత అనే మాస పత్రికను ఎవరు ప్రారంభించారు?
రామకృష్ణ పరమహంస బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్వామి వివేకానందుడు 1896 జూలైలో ‘‘ప్రబుద్ధ భారత(అవేకెన్‌డ్ ఇండియా)’’ అనే ఇంగ్లీషు మాస పత్రికను ప్రారంభించారు. ప్రబుద్ధ భారత 125 వార్షికోత్సవ వేడుకలను జనవరి 31న నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని మాయవతిలో ఉన్న అద్వైత ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... నిరుపేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
కృష్ –ఈ పురస్కారాలను ప్రదానం చేసిన సంస్థ?
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్‌లో భాగమైన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ (ఎఫ్‌ఈఎస్) తాజాగా వ్యవసాయ రంగంలో సృజనాత్మక విధానాలు అమలు చేసిన రైతులకు కృష్–ఈ చాంపియన్ పురస్కారాలు ప్రకటించింది. 4 కేటగిరీల్లో 10 జాతీయ అవార్డులు అందించింది.
Published date : 11 Mar 2021 12:27PM