Cochin University of Science and Technology: అమ్మాయిలకు పీరియడ్స్ సెలవులు
Sakshi Education
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. వినూత్న నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా విద్యార్థినులకు నెలసరి(పీరియడ్స్) సెలవులను ప్రకటించింది.
సాధారణంగా సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలంటే 75% అటెండెన్స్ ఉండాలి. అమ్మాయిలకు పీరియడ్స్ సెలవుల కింద 2% మినహాయింపు ఇవ్వడంతో 73% అటెండెన్స్ ఉన్నా పరీక్షలు రాసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల యూనివర్సిటీలోని 4,000 మంది విద్యార్థినులకు మేలు కల్గనుంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో ఈ నింబంధనను అమలు చేసే ఆలోచన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
Published date : 23 Jan 2023 04:04PM