Manish Sisodia: మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర రాజీనామా
ఫిబ్రవరి 28వ తేదీ రాష్ట్ర కేబినెట్‌లోని మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించారు. సిసోడియా పోర్ట్‌ఫోలియోలను రెవెన్యూ మంత్రి కైలాశ్ గహ్లోత్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్‌లకు కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆరోగ్య, పరిశ్రమల శాఖలకు మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో గత ఏడాది మే నుంచి తిహార్ జైలులో ఉన్నారు. శాఖలేవీ లేకుండానే ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. జైన్ కున్న శాఖలను కూడా సీఎం కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం కూడా అయిన సిసోడియాకే కేటాయించారు. దీంతో, ఢిల్లీ ప్రభుత్వంలోని 33 శాఖలకు గాను ఆర్థిక, తదితర 18 శాఖలను నిర్వహిస్తున్న సిసోడియా కేబినెట్‌లో అత్యంత కీలకంగా ఉన్నారు. మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరి 26న సీబీఐ సిసోడియాను కస్టడీలోకి తీసుకుంది.