Skip to main content

Unemployment: భారతదేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతే!!

భారతదేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది.
Growth of Unemployment Among Indian Youth   Youth Unemployment Statistics   Comparison of Youth Unemployment Rates in India   International Labour Organisation Report Highlights Grim Employment Scenario in India

నిరుద్యోగుల్లో 83 శాతం యువతే ఉన్నారని ఒక నివేదిక పేర్కొంది. ప్రాథమికోన్నత విద్య (సెకండరీ) లేదా ఆపై ఉన్నతవిద్య (హయ్యర్‌) అభ్యసించిన యువత నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. వీరి శాతం 2000లో 35.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 65.7 శాతానికి (నిరుద్యోగుల శాతం) పెరిగింది.

ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యుమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డీ) సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయిమెంట్‌ రిపోర్ట్‌ 2024లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. 2000– 2019 సంవత్సరాల మధ్య యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (అండర్‌ ఎంప్లాయ్‌మెంట్‌) తగ్గడం వంటివి భారీగా పెరగగా, కోవిడ్‌ సందర్భంగా మాత్రం కొంత తగ్గుదల నమోదైనట్టుగా ఈ నివేదిక పేర్కొంది.

2000– 2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం దాదాపు మూడింతలు (5.7 – 17.5 శాతం) పెరిగింది. 2022 నాటికి అది 12.4 శాతానికి తగ్గింది’ అని ఈ నివేదిక చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వయిజర్‌ వి.అనంత నాగేశ్వరన్‌ తెలిపారు. 

Madarsa Education Act: మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధం!!

2021లో మొత్తం జనాభాలో 27 శాతం ఉన్న యువత జనాభా 2036 నాటికి 23 శాతానికి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. 2015–16, 2019 మధ్యకాలంలో 10 మిలియన్లకు పైగా ఉద్యోగార్ధులు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోగా, వారిలో 64 శాతం మంది పురుషులు, 83 శాతం మంది 15-34 సంవత్సరాల వయస్సు ఉన్న‌ యువకులు అని నివేదిక పేర్కొంది. దేశంలో నిరుద్యోగ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, యువతే దేశానికి బలం కాబట్టి వారికి మరిన్ని ఉద్యోగవకాశాలను అందించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Online Gaming: ఈ–గేమింగ్‌ కట్టడిపై కేంద్రం కసరత్తు.. స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు యోచన

Published date : 01 Apr 2024 04:14PM

Photo Stories