INS Mormugao: విధుల్లోకి ఐఎన్‌ఎస్ మర్ముగావ్
ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. యుద్ధ నౌకల నిర్మాణం, అభివృద్ధిలో భారతదేశ నైపుణ్యానికి ఐఎన్‌ఎస్ మర్ముగావ్ ఒక తార్కాణమని పేర్కొన్నారు. భారత్‌ను నౌకా నిర్మాణాల హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశీయంగా నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకల్లో ఐఎన్‌ఎస్ మర్ముగావ్ ఒకటన్నారు. ప్రపంచంలో అధునాతన సాంకేతిక యుద్ధనౌకల్లో ఒకటని, నౌక నిర్మాణానికి 75 శాతానికిపైగా దేశీయ ముడిసరుకులే వాడినట్లు గుర్తుచేశారు.
Agni-5 Missile: అగ్ని–5 క్షిపణిని ప్రయోగం విజయవంతం
యుద్ధనౌక విశేషాలివీ..
☛ ఐఎన్‌ఎస్ మర్ముగావ్ యుద్ధనౌక పొడవు 163 మీటర్లు. వెడల్పు 17 మీటర్లు. బరువు 7,400 టన్నులు. గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు.
☛ ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను మోసుకెళ్లగలదు.
☛ 2021 డిసెంబర్ 19న జలప్రవేశం చేసింది.
☛ నౌకలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు ఉంటాయి.
☛ లక్ష్యాన్ని కచ్చితంగా గుర్తించే ఆధునిక నిఘా రాడార్ అమర్చారు.
☛ అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ సమర్థంగా పోరాడగలదు.
☛ నౌకకు గోవాలోని చారిత్రక రేవు నగరం మర్ముగావ్ పేరు పెట్టారు.
☛ ‘ప్రాజెక్టు15బీ’లో భాగంగా నిర్మిస్తున్న 4 ‘విశాఖపట్నం’ క్లాస్ డిస్ట్రాయర్స్‌లో ఇది రెండోది.
☛ ఐఎన్‌ఎస్‌మర్ముగావ్‌ను భారత నావికాదళంలో అంతర్భాగమైన వార్‌షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది.