Covid-19: టీకాల పంపిణీలో 150 కోట్ల మైలురాయిని చేరుకున్న దేశం?
కోవిడ్–19 వ్యాక్సినేషన్‌లో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2022, జనవరి 7వ తేదీ నాటికి దేశంలో 150 కోట్ల డోసుల కోవిడ్ టీకా పంపిణీ పూర్తయింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం...
- దేశంలో కరోనా టీకా పంపిణీ 2021, జనవరి 16న ప్రారంభమైంది.
- కరోనా టీకా డోసుల సంఖ్య 2021, అక్టోబరు 21వ తేదీ నాటికి 100 కోట్లు దాటింది.
- ఇప్పటివరకు దేశంలో వయోజన జనాభాలో 91 శాతం మందికి పైగా కనీసం ఒక డోసు టీకా వేసుకున్నారు. 66 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారు. అర్హులైన కౌమారుల్లో 22% మందికి మొదటి డోసు అందింది.
- 2022, జనవరి 3వ తేదీ నుంచి మొదలైన వ్యాక్సినేషన్‌లో అర్హులైన 22 శాతం మంది బాలబాలికలు(టీనేజర్లు) టీకా వేయించుకున్నారు.
భారత్, నేపాల్ మధ్య వంతెనకు ఆమోదం
భారత్, నేపాల్ మధ్య వంతెన నిర్మాణానికి సంబంధించి ఇరు దేశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి జనవరి 7న కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఉత్తరాఖండ్‌లోని ధర్‌చులాలో మహకాళి నది మీదుగా ఇరుదేశాలను కలుపుతూ ఈ వంతెన నిర్మిస్తారు. విపత్తుల నిర్వహణలో పరస్పరం సహకరించుకోవడానికి టర్క్‌మెనిస్తాన్‌తో ఎంఓయూకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
చదవండి: భద్రతా వైఫల్యంపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022, జనవరి 7వ తేదీ నాటికి 150 కోట్ల కోవిడ్ టీకా పంపిణీ
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : కోవిడ్–19 నియంత్రణ కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్