Skip to main content

Bihu Dance: గిన్నిస్‌ రికార్డుల్లో బిహూ డ్యాన్స్‌

guinness world record assam bihu dance

ఈశాన్య రాష్ట్రం అస్సాం సంప్రదాయ నృత్యమైన బిహూ డ్యాన్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. గువాహటిలోని సరుసజై స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంప్రాదాయ వాయిద్యాలైన దోల్, తాల్, గోగోనా, టోకా, పెపా వంటి వాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Apr 2023 05:39PM

Photo Stories