Skip to main content

Electricity Purchase New Guidelines: విద్యుత్‌ కొనుగోలుపై కేంద్రం మార్గదర్శకాలు

ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు తొమ్మిదేళ్ల ముందుగానే విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించింది.
Electricity Purchase New Guidelines
Electricity Purchase New Guidelines

జల విద్యుత్‌ కొనాలంటే తొమ్మిదేళ్ల ముందు, థర్మల్‌కు ఏడేళ్ల ముందు, పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లకు ఐదేళ్లు, పవన విద్యుత్‌కు మూడేళ్లు, సౌర విద్యుత్‌కు రెండేళ్ల ముందు ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం వెల్లడించింది. 
2031 నాటికి రెట్టింపు వినియోగం..
రాష్ట్రంలో రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ ఆధారంగా రానున్న పదేళ్లలో వినియోగం ఎంత ఉంటుందో అంచనా వేయాలని కేంద్రం కోరింది. దీంతో.. 2031 నాటికి ఏపీలో ఇంధన వినియోగం రెట్టింపు అవుతుందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన 20వ ఎలక్ట్రిక్‌ పవర్‌ సర్వే (ఈపీఎస్‌) నివేదికలో ఇప్పటికే వెల్లడించగా, ఇటీవల జాతీయ విద్యుత్‌ ప్రణాళిక కమిటీ దానిని ధుృవీకరించింది.

ఇక రాష్ట్రంలో 2021–22 ఏడాదిలో విద్యుత్‌ వినియోగం 60,495 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 2031–32 నాటికి 1,21,798 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. దానికి తగ్గట్లుగా రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కూడా మరో 13,510 మెగావాట్లు పెరగనుంది. 

☛☛ Speacial kits for anganwaadi: అంగన్‌వాడీలరకు ప్ర‌త్యేక కిట్లు

ఇందులో భాగంగా.. థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్కేంద్రంలో 800 మెగావాట్లు అలాగే, ఈ నెలలోనే డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇంధన శాఖ, ఏపీ జెన్‌కో సన్నాహాలు చేస్తున్నాయి. 
ఇక 2030 నాటికి వినియోగించే విద్యుత్‌లో 50 శాతం పునరుత్పాదక విద్యుత్‌ ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. ఈ విషయంలోనూ రాష్ట్రం ముందంజలోనే ఉంది. వ్యవసాయానికి ఏకంగా ముప్పై ఏళ్ల పాటు పగటివేళలోనే 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరాను అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఇప్పటికే యూనిట్‌కు రూ.2.49 పైసల చొప్పున ఒప్పందం చేసుకున్నాయి.

సెకీ నుంచి తీసుకుంటున్న 7 వేల మెగావాట్ల విద్యుత్‌ సౌర విద్యుత్‌ కావడం విశేషం. దీంతోపాటు 44,250 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

☛☛ NRI's Fund Transfer: భారతీయులు స్వదేశానికి పంపిన డబ్బు ఎంతంటే?

Published date : 07 Jul 2023 05:35PM

Photo Stories