Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం
Sakshi Education
జమ్మూకశ్మీర్‌లో ఫిబ్రవరి 17వ తేదీ(శుక్రవారం) ఉదయం 5.01 గంటలకు భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం తూర్పు కత్రా నుంచి 97 కి.మీ దూరంలో సంభవించనట్లు తెలుస్తోంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. సిక్కిం రాష్ట్రంలోని యుక్సోమ్‌లో ఫిబ్రవరి 13 తెల్లవారుజామున 4.15 గంటలకు భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. కాగా నెల రోజుల కిందట కూడా దోడా, కిష్త్వార్‌లలో భూకంపం సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదు.
Published date : 17 Feb 2023 12:43PM