President Murmu : తొలి జ్యుడీషియల్ నియామకం
Sakshi Education
జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 27న ఆమోదముద్ర వేశారు. ఉత్తర్వుపై సంతకం చేశారు. రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం ఇదే. ఆర్టికల్ 224 క్లాజ్ 1 ప్రకారం రాజేశ్ నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఆయన రెండేళ్లపాటు ఈ బాధ్యతల్లో ఉంటారు. జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టుకి మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 17 కాగా.. రాజేశ్ నియామకంతో ఆ సంఖ్య 15కి చేరింది. సుప్రీంకోర్టు సహా దేశంలోని 25 హైకోర్టుల్లో న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.
Also read: Monkey Pox : త్వరలో టీకా
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 28 Jul 2022 05:42PM