Floods: సీఎం ఇంటిని చుట్టుముట్టిన వరదలు.. క్షణక్షణం భయం.. భయం.!
Sakshi Education
దేశ రాజధాని ఢిల్లీని వరదలు చుట్టుముట్టాయి. హర్యాణా నుంచి భారీ ఎత్తున వరద దిగువకు ప్రవహిస్తూ ఉండడంతో ఢిల్లీ వద్ద యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం ఉదయం 9 గంటలకి నది నీటి మట్టం 208.51 మీటర్లకు చేరింది.
యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో భీకర వరదలు సంభవించాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అక్కడి ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
Become An IAS: ఐఏఎస్ కావాలనుకుంటున్నారా... అయితే ఇంటర్ నుంచి ఈ టిప్స్ ఫాలోకండి...
ఎగువప్రాంతంలో ఉన్న హత్నీకుండ్ నుంచి నిరంతరంగా వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని కేంద్ర జల కమిషన్ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుత వరద ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటివద్దకు చేరుకుంది. కశ్మీరీ గేట్ - మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం అరవింద్ కేజ్రీవాల్ నివాసం, అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. మరోవైపు సచివాలయంలోకి కూడా వరద చేరింది.
Published date : 13 Jul 2023 03:13PM