Railway Printing Press: సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్ మూసివేత
Sakshi Education
సికింద్రాబాద్ లో 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో ఏర్పాటైన ప్రింటింగ్ ప్రెస్ ఇక గత చరిత్రగా మిగిలిపోనుంది. రైల్వే రిజర్వుడు, అన్రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ప్రింటింగ్ చేసే ఈ ప్రెస్‌ని మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సికింద్రాబాద్(దక్షిణ మధ్య రైల్వే)తోపాటు బైకులా–ముంబయి (మధ్య రైల్వే), హౌరా(తూర్పు రైల్వే), శకుర్బస్తీ–దిల్లీ(ఉత్తర రైల్వే), రాయపురం–చెన్నై(దక్షిణ రైల్వే) ప్రింటింగ్ ప్రెస్‌లను మూసివేయనుంది. ఈమేరకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 20 May 2023 06:43PM