Kuno National Park: 70 ఏళ్ల తర్వాత భారత్ తిరిగొచ్చిన చీతాలు.. కునో నేషనల్ పార్కులో వదిలిన మోదీ
‘‘అవి మన అతిథులు. కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు.
‘మిషన్ చీతా’ పేరిట ఆఫ్రికాలోని నమీబియా నుంచి కేంద్రం రప్పించిన 8 చీతాలు ప్రత్యేక విమానంలో 10 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేసి సెప్టెంబర్ 17న గ్వాలియర్ చేరుకున్నాయి. అక్కడినుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లలో కునోకు తరలాయి.
Also read: Insurance: విపత్తుల్లోనూ బీమా ధీమా!.. వాహన, హోమ్ ఇన్సూరెన్స్‌తో పూర్తి రక్షణ
ఇలా తరలించారు...
నమీబియా నుంచి వచ్చిన 8 చీతాల్లో 3 మగవి కాగా 5 ఆడవి. వీటి వయసు 30 నుంచి 66 నెలలు. వాటికి మత్తు ఇంజక్షన్లిచ్చి ప్రత్యేక చెక్క బోన్లలో విమానంలో తరలించారు. 8,000 కిలోమీటర్ల సుదీర్ఘ ఖండాంతర ప్రయాణం కావడంతో వాంతులు చేసుకోకుండా ఖాళీ కడుపుతో తీసుకొచ్చారు. కునో పార్కులో ఎన్‌క్లోజర్లలోకి వదిలాక ఆహారమిచ్చారు. నెల రోజుల క్వారెంటైన్ అనంతరం మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్‌క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. తర్వాత స్వేచ్ఛగా వదిలేస్తారు. చీతాల ఉనికిని నిరంతరం ట్రాక్ చేసేందుకు వాటికి రేడియో ట్యాగింగ్ చేశారు. చివరిసారిగా 1947లో నేటి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోస్థానిక రాజు మూడు చీతాలను వేటాడాడు. అంతటితో భారత్‌లో వాటి కథ ముగిసిపోయింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP