Centre Govt: నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ కార్యాలయం ఎక్కడ ఉంది?
దేశంలో నదులపై ఆనకట్టల భద్రతా ప్రమాణాల నిర్వహణకు ఉద్దేశించిన జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ(నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటైంది. డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం కొత్త అథారిటీ ఫిబ్రవరి 18వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆనకట్టలకు సంబంధించి అంతరాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడం, ఆనకట్టల సంబంధిత విపత్తుల నివారణ తదితర బాధ్యతలను ఈ అథారిటీ నిర్వహిస్తుంది. ఇందులో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులుంటారు. అథారిటీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది.
చదవండి: 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ(నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : కేంద్ర జల్ శక్తి శాఖ
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : దేశంలో నదులపై ఆనకట్టల భద్రతా ప్రమాణాల నిర్వహణకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్