IUCN: ఓఈసీఎమ్ గుర్తింపును పొందిన దేశంలోని తొలి పార్కు?
హరియాణ రాష్ట్రం, గురుగ్రామ్ జిల్లా, గురుగ్రామ్ నగర సమీపంలోని ఆరావళి బయోడైవర్సిటీ పార్కుకు ఓఈసీఎమ్(Other effective area-based conservation measures&OECM) గుర్తింపు లభించింది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం(ఫిబ్రవరి 2) సందర్భంగా ఫిబ్రవరి 2న ఈ గుర్తింపును అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఓఈసీఎమ్ గుర్తింపు పొందిన తొలి పార్కుగా ఆరావళి బయోడైవర్సిటీ పార్కు నిలిచింది. అంతగా రక్షితం కాకపోయినప్పటికీ.. గొప్ప జీవవైవిధ్యానికి మద్దతు ఇచ్చే ప్రాంతాలకు ఓఈసీఎమ్ గుర్తింపును ఇస్తారని హరియాణా బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ వినీత్ కుమార్ గార్గ్ తెలిపారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) సంస్థ... ఓఈసీఎమ్ గుర్తింపుని ఇస్తోంది.
ఆరావళి బయోడైవర్సిటీ పార్కు 390 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది పాక్షిక–శుష్క వృక్షసంపదను కలిగి ఉంది. ఇందులో 43,000 కంటే ఎక్కువ పొదలు, 101,000 చెట్లు మరియు 300 స్థానిక వృక్ష జాతులు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ పార్క్ మైనింగ్ సైట్ గా ఉండేది. స్థానిక జనాభాతో పాటు పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తల అపారమైన కృషితో ఇది నగర అడవిగా మార్చబడింది. ఆరావళిలను ఢిల్లీ పచ్చని ఊపిరితిత్తులుగా పరిగణిస్తారు.
చదవండి: లతా మంగేష్కర్ మ్యూజిక్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఓఈసీఎమ్ గుర్తింపును పొందిన దేశంలోని తొలి పార్కు?
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : ఆరావళి బయోడైవర్సిటీ పార్కు
ఎక్కడ : గురుగ్రామ్, గురుగ్రామ్ జిల్లా, హరియాణ
ఎందుకు : అంతగా రక్షితం కాకపోయినప్పటికీ.. గొప్ప జీవవైవిధ్యానికి మద్దతు ఇచ్చినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్