Reunification: తైవాన్‌ను చైనాతో విలీనం చేస్తామని ప్రకటించిన నేత?
తైవాన్‌ను చైనాతో విలీనం చేసితీరతామని ఆదేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ మరోమారు స్పష్టం చేశారు. తైవాన్ విలీనం శాంతియుతంగా, ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అవసరం లేదంటూ పరోక్షంగా యూఎస్, జపాన్‌కు హెచ్చరికలు పంపారు. చైనా విముక్తి వార్షికోత్సవాల్లో జింగ్‌పింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తైవాన్‌కు అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఇందుకోసం తైవాన్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. తైవాన్ సార్వభౌమదేశంగా తనను తాను భావిస్తుండగా, చైనా మాత్రం అది తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతంగా భావిస్తోంది.
చదవండి: దక్షిణ చైనా సముద్రంలో ప్రమాదానికి గురైన జలాంతర్గామి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తైవాన్‌ను చైనాతో విలీనం చేస్తామని ప్రకటించిన నేత?
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్
ఎందుకు : తైవాన్ తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతమని...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్