USS Connecticut: దక్షిణ చైనా సముద్రంలో ప్రమాదానికి గురైన జలాంతర్గామి?
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ‘యూఎస్‌ఎస్ కనెక్టికట్’ ప్రమాదానికి గురైంది. కనెక్టికట్ అక్టోబర్ 2న అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున దేనినో ఢీకొట్టిందనీ, ఈ ఘటనలో పలువురు నావికులు గాయపడ్డారని అక్టోబర్ 7న యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సబ్‌మెరీన్ కనెక్టికట్ సురక్షితంగానే ఉంది. అందులోని న్యూక్లియర్ ప్రొపల్షన్ ప్లాంట్, ఇతర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొంది.
మసీదులో మారణకాండ
పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో అక్టోబర్ 8న సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కె ప్రకటించింది. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు.
ఏమిటీ ఐసిస్–కె?
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో కార్యకలాపాలు సాగిస్తున్న కరడుగట్టిన భావజాలం ఉన్న ఉగ్రవాదులు కొందరు 2014లో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. పాకిస్తానీ తాలిబన్ ఫైటర్లు మొదట్లో ఈ గ్రూపులో చేరారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లో తొలిసారిగా వీరి కదలికలు కనిపించాయి. ప్రస్తుత అఫ్గానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, టర్క్‌మెనిస్తాన్‌లో భాగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఖొరాసన్ అని పిలిచేవారు. వీరి ప్రధాన కార్యాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. పాకిస్తాన్‌కి మాదకద్రవ్యాలు, అక్రమంగా మనుషుల్ని రవాణా చేయాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. ఈ ప్రాంతానికి గుర్తుగా వీరిని ఐసిస్–కె లేదంటే ఐఎస్–కె అని పిలుస్తారు. మధ్య, దక్షిణాసియాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమే వీరి లక్ష్యం.
చదవండి: పండోరా పేపర్స్‌ను ఎవరు బహిర్గతం చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణ చైనా సముద్రంలో ప్రమాదానికి గురైన జలాంతర్గామి?
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : యూఎస్‌ఎస్ కనెక్టికట్(అమెరికా)
ఎందుకు : అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున దేనినో ఢీకొట్టినందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్