United Nations: ప్రస్తుతం ఐరాస ప్రధాన కార్యదర్శి పదవిలో ఎవరు ఉన్నారు?
2021, డిసెంబర్ వరకు అఫ్గాన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హితవు పలికారు. సెప్టెంబర్ 13న స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో జరిగిన విరాళాల సేకరణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గాన్ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్ ప్రకటించారు. ఐరాసకి చెందిన యూఎన్ హై కమీషనర్ ఫర్ రెప్యూజీస్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
చదవండి: అఫ్గానిస్తాన్ ప్రధానిగా ఎంపికైన తాలిబన్ ప్రతినిధి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తాలిబన్ల వశమైన అఫ్గానిస్తాన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందించాలి
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్
ఎక్కడ : విరాళాల సేకరణ సదస్సు, జెనీవా, స్విట్జర్‌ల్యాండ్
ఎందుకు : అఫ్గాన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు...