Indus Water: సింధు జలాల ఒప్పందాన్ని మారుద్దాం
ఈ ఒప్పందాన్ని సవరించాలంటూ పాకిస్తాన్‌కు భారత్ నోటీసులు పంపింది. ఒప్పందం అమలు విషయంలో పాక్ అనుసరిస్తున్న మొండి వైఖరిని భారత్ ఎండగట్టింది. సింధు నదీ జలాల ఒడంబడికకు సంబంధించిన కమిషనర్ల ద్వారా జనవరి 25న పాకిస్తాన్‌కు నోటీసులు పంపినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం అమలులో దశాబ్దాలుగా విభేదాలు సాగుతున్నాయి. ‘సింధు నదీ జలాల ఒప్పందం అమలుకు అడ్డంకి కలిగించేలా పాకిస్తాన్ చర్యలు ఉంటున్నాయి. నోటీసు అందుకున్న 90 రోజుల్లోగా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాల్సి ఉంటుంది. గత 62 ఏళ్లుగా నేర్చుకున్న పాఠాలతో ఒప్పందాన్ని సవరించుకొని ముందుకు సాగే అవకాశం లభిస్తుంది’’ అని ఆ వర్గాలు వివరించాయి.
Sikkim Govt: జనాభాను పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగినులకు వరాలు
ఏమిటీ ఒప్పందం?
భారత్, పాక్ సరిహద్దుల్లో పారే సింధు నదీ జలాల పంపిణీపై 1960లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సింధు ఉప నదుల్ని తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. సట్లెజ్, బియాస్, రావి తూర్పు నదుల జలాలను భారత్ వాడుకోవచ్చు. ఇక జీలం, చీనాబ్, సింధులను పశ్చిమ నదులుగా పేర్కొంటూ వాటిపై హక్కుల్ని పాక్‌కు కట్టబెట్టారు. అయితే పశ్చిమ నదుల్లో జల విద్యుత్, వ్యవసాయ అవసరాలకు నీటిని భారత్ కూడా వినియోగించుకునే హక్కు ఉంది. ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటైంది. 2017–2022 మధ్య అయిదు సార్లు సమావేశమైనా సమస్యలపై ఏకాభిపారయం కుదరలేదు. చివరికి భారత్ ఆ ఒప్పందాన్ని మారుద్దామంటూ పాక్‌కు నోటీసులు పంపింది.