UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం
Sakshi Education
ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షల చట్రం నుంచి మానవతా దృక్పథంతో చేసే సహాయాలను మినహాయించాలని భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.
మానవతా దృక్పథంతో సాయం చేస్తే పాకిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్రవాద సంస్థలు లాభపడతాయని పేర్కొంది. యూఎన్ అందించే ఆర్థిక సాయంతో ఆ ఉగ్ర సంస్థలు నిధుల సేకరణ, ఉగ్రవాదుల నియామకం చేస్తాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, ఐర్లాండ్‌లు సంయుక్తంగా డిసెంబర్ 9న ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిలో 14 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటెయ్యగా భారత్ దూరంగా ఉంది. భ్రద్రతా మండలికి భారత్ అధ్యక్షత వహిస్తుండటం తెలిసిందే. మండలి అధ్యక్షురాలు, యూఎన్‌లో భారత్ శాశ్వత సభ్యురాలు రుచిరా కాంబోజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మానవతా దృక్పథంతో చేసే సాయం నిధులు దుర్వినియోగమవడం, వాటితో ఉగ్ర సంస్థలు లబ్ధి పొందడం గతంలో చాలా చూశాం. పాకిస్తాన్‌లో కొన్ని ఉగ్ర సంస్థలు మానవతా సంస్థల ముసుగులో వాటిని సేకరించాయి’’ అన్నారు.
PSLV C54: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం
Published date : 12 Dec 2022 03:10PM